Tuesday, July 20, 2010

Digital Camaras

మీరు డిజిటల్ కెమరా కొనదలచుకున్నారా.. అయితే అందులో ఎక్కువ మెగా పిక్సెల్ ఉన్నదే తీసుకోండి. ఇప్పుడు మీకు మార్కెట్లో 12 మెగా పిక్సెల్ వి లభిస్తున్నాయి. 8, 10 మెగా పిక్సెల్ వీ కూడా దొరుకుతున్నాయి. మీ స్వంతము కోసమైతే 12 మెగా పిక్సెల్ వి తీసుకోండి. దీనివలన మీకు కొద్దిగా లాభం ఏమిటంటే - ఫోటో క్లారిటీ బాగా ఉంటుంది. ఆ ఫోటోని పెద్దగా ప్రింట్స్ వేసుకోవాల్సివచ్చినప్పుడు అప్పుడు బాగా ఉపయోగపడుతుంది.(కాని అలా జన్మలో ప్రింట్స్ వేయించము - అది వేరే సంగతి). ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి 20 మెగా పిక్సెల్ వీ కూడా వచ్చాయి. అవి చాలా ఖరీదు. అంత రేటు పెట్టి తీసుకొనే అవసరం ఏముంటుంది మీకు - మీరు గనుక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితేనే తప్ప.

నేను నా పిల్లల కోసమని, ఒక డిజిటల్ కెమరా కొన్నాను అని చెప్పానుగా. దాని తాలూకు, ఈ కేమరాల గురించీ, ఇంకొన్ని అనుభవాలూ, ఆసక్తికర విషయాలూ.. ఈ టపాలో చెప్పాలని అనుకుంటున్నాను. ఇదంతా నా స్వానుభవాలు. నేను చెప్పే కోణానికీ, మీ ఆలోచనాలకీ పొంతన ఉండకపోవచ్చు. అది వేరే విషయం. ఒక్కో విషయం మీద ఒక ఒక్కో పెద్ద టపా కూడా వ్రాసేయవచ్చు. కాని క్లుప్తముగా చెబుతాను. అయినా ఇది చాలా పెద్దగా అవబోతున్నదనీ తెలుసు.

ఫిలిం కెమరా ఎందుకు కొనొద్దు, డిజిటల్ కేమరానే ఎందుకు కొనాలి? అని అంటే - రీలు పెట్టి తీసే కెమరా మామూలుది.. పాత టేక్నాలజిది. డిజిటల్ కెమరా క్రొత్త టెక్నాలజీది. రీలుకేమరా కొని రీలువేసి, క్రొత్త బ్యాటరీలు వేసి, ఫొటోస్ తీసాక, డెవలపింగ్ కీ. ప్రింటింగ్ కీ ఇచ్చి చూసుకునేసరికి బోలడంత సమయం వృధా.. అదే డిజిటల్ అయితే కేవలం బ్యాటరీలు వేసుకుంటే సరి.

రీలు లెక్కలు: రీలు 85 రూపాయలు + బ్యాటరీలు 20 రూపాయలు + డెవలపింగ్ కి 20 రూపాయలు. మొత్తం 125 రూపాయలు / (36 + ఆ చివర రెండు, ఈ చివరన రెండూ కలిపి మొత్తం) 40 ఫొటోస్ = మూడు రూపాయల పన్నెండు పైసలకి ఒక ఫోటో నెగటివ్ (అదనము ) అవుతుంది. ప్రింట్లకి డిజిటల్ కీ, రీలుకీ ఒకే ధర.

కాకపోతే రీలు ఫోటో మన్నిక చాలా తక్కువ. డిజిటల్ కి ఎక్కువ మన్నిక.

రీలువి స్థలం బాగా ఆక్రమిస్తాయి. డిజిటల్ వి అయితే చిన్నసైజులో ఒదిగిపోతాయి.

డిజిటల్ వి అయితే మళ్ళీ ఎడిట్ (కలర్, బ్రైట్, డార్క్, సైజ్..) చేసుకోవచ్చు. రీలువి చేసుకోవాలంటే దాన్ని మళ్ళీ డిజిటల్ కి మార్చి, మార్పులు చేసి.. మళ్ళీ నెగటివ్ గా మార్చాలి...

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బ్లాగు సరిపోదనుకుంటా. ఇక పాయింటుకి వస్తాను.

నేను దాదాపు సంవత్సరంన్నర క్రిందట డిజిటల్ కెమరా కొన్నప్పుడు దాని వెల 11,800 రూపాయలు + 2GB మెమొరీ కార్డు 450 రూపాయలు. మొత్తం 12,250 రూపాయలు. ఇప్పుడు ఇదే కెమరా మెమొరీ కార్డుతో 7,000 రూపాయల్లోనే వస్తుంది. అంటే సంవత్సరన్నర కాలములో నా కెమరా మాడల్ విలువ (12,250 - 7,000) 5,250 రూపాయలు తరుగుదల ( Depriciation ) చెందింది అన్నమాట. ఈ సంవత్సరమున్నర  కాలములో నేను దాదాపు ఆరువేల ఫోటోలు తీశాను.. అలాగే చాలా వీడియోలు కూడా. ఇప్పుడు నేను లాభమా, నష్టమా చూస్తే - 5,250 తరుగుదల / 6,000 ఫోటోలు  = ఒక్కొక్కటి  ఫోటో  కేవలం  ఎనభైఏడు పైసలకి  పొందానన్నమాట! అంటే నా కెమరా ద్వారా నేను బాగానే పొందానన్నమాట! అదే నా మిత్రుడు కెమరా దాదాపు అదే ధరకి కొన్నాడు. మహా అంటే 500 ఫోటోలు కూడా మించలా. అతనికి పైలెక్కనే చూస్తే ఒక్కో ఫోటో పదిరూపాయలన్నర అవుతున్నది. (బ్యాటరీలు రెండింటికీ కామన్ అనుకుంటే).

 ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే! - ఏది కొన్నా, ఏమి చేసినా దాని నుండి ఫలితాన్ని, అతి తక్కువ ఖర్చులో పొందగలగాలి. మా దూరపు బంధువు ఒకరు డబ్బులు మిగుల్చుకుంటానని - ఒక రూములో, నిండు వేసవిలో, మధ్యాహ్నం పూట తనే సెమ్ (సున్నం లాంటిది) పెయింట్ వేశాడు. మహా అంటే 100-150 కూలి రూపాయలు మిగిలిఉండొచ్చు.  కాని ఎండవేడికి, సెమ్ వేడికీ ఆరోగ్యం పాడయి, రెండున్నర వేలు బొక్క పెట్టించుకున్నాడు.  అతనికి ఇంకేమి మిగిలింది.? అందుకే తక్కువ ఖర్చులో అత్యుత్తమ ఫలితాన్ని పొందాలి.

హబ్బో! ఇప్పటికే చాలా పెద్దగా అయ్యిందే! ఇక ముఖ్యమైన పాయింట్లు అలాగే మిగిలిపోయాయి. ఇక అవే చెబుతానేం!.. 

డిజిటల్ జూమ్ కన్నా ఆప్టికల్ జూమ్ ఎక్కువగా ఉన్న కెమరాని తీసుకోవాలి.
డిజిటల్ కెమరా కొన్నప్పుడు మామూలు బ్యాటరీల మాడల్, మొబైల్ ఫోన్  బ్యాటరీ లాగా రెండు మోడల్స్ ఉంటాయి. రెండింటికీ తేడా ఏమీ ఉండదు. సెల్ బ్యాటరీ సెల్లులు ఉండే కేమరాకీ, AA సైజు నికెల్ కాడ్మియం బ్యాటరీలు వాడే కేమరాకీ తేడా ఏమీ ఉండదు. ఒక ఉపయోగం / అదనపు ఫీచరు తేడాగా ఉంటుంది. అదేమిటంటే AA సైజు బ్యాటరీల కెమరా కొంటే ఎక్కడికైనా వెళ్ళితే, ఫోటోలు తీసాక చార్జింగ్ అయిపోతే, కిరాణా షాపుల్లోనో, వీధి చివర కోట్లల్లోనో ఈ AA సైజు మామూలు బ్యాటరీలు కొని వెంటనే కెమరాలో వేసుకొని, మన పని చేసుకోవచ్చును. ఇదొక్కటే వెసులుబాటు అంతే!.. అన్నట్టు ఈ ఆ బ్యాటరీల వల్ల కెమరా బరువుకూడా పెరుగుతుందండోయ్.. మిగతా అన్నీ మామూలే!

రీచార్జ్ సెల్స్ వాడండి. ఇవి ఎక్కువ మన్నికనీ, చాలా పొదుపునీ ఇస్తాయి. అవి నికెల్ కాడ్మియం తో చేస్తారు. లీథియం అయాన్ తో చేసిన బ్యాటరీల కన్నా కొద్దిగా బరువుగా ఉంటాయి. కంపనీలు వారు ఇలా AA సైజులో లిథియం అయాన్ బ్యాటరీలు ఎందుకు చెయ్యరో అని అనుకుంటాను. - బహుశా ఖరీదు ఎక్కువ అవుతుందని కాబోలు.

అలాగే కెమరా చార్జర్ ఒకటి కొనుక్కోండి. అలాగే ఇంకో రెండు ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్ లు కొనుక్కోండి. ఒకటి బ్యాటరీ అయిపోగానే వెంటనే ఇంకోటి వాడుకోవచ్చు.

మీరు AA బ్యాటరీలు కొనదలచుకుంటే 2500mAH లేదా 2800mAH నంబర్ బ్యాటరీలు కొనుక్కోండి. ఇవి ఎక్కువసేపు మీ కెమరాకి పవర్ ని ఇస్తాయి. వీటిని  చార్జర్లో ఏడు గంటలు చార్జ్ చేస్తే సరిపోతుంది.

కెమరా పౌచ్ ఒకటి తప్పని సరిగా ఉంచుకోవాలి. కాస్త గట్టిగా ఉండి కెమరాకి రక్షణ కల్పించేలా ఉండాలి. కెమరా ఒక్కటే పట్టేలా కాకుండా బ్యాటరీ సెల్లూ, ఐపాడ్ పెట్టుకునేలా పౌచ్ లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి 250 రూపాయల నుండి మొదలవుతాయి. ఈ పౌచ్ ని బెల్ట్ సహాయముతో పాంట్ భాగములో బిగించుకుంటే వాడకానికి తేలికగా ఉంటుంది.

కెమరాని వాడేటప్పుడు కెమరాకి ఉన్న స్ట్రాప్ తప్పనిసరిగా చేతికి తోడిగించుకోన్నాకనే కేమరానే వాడటం మొదలెట్టాలి. లేకపోతే ఆ కెమరా పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది ఆ స్ట్రాప్ వేసుకోకుండానే ఫోటోలు తీస్తుంటారు.

కెమరా లోని ఆప్షన్లు అన్నీ బాగా తెలుసుకోండి. కేమరాతో వచ్చే బుక్-లెట్ చదవండి. అవసరమైతే మిత్రుల సహాయం తీసుకోండి. ఇంకా కావాలంటే నెట్లో వెదకండి.

ఫోటో తీయటానికి బటన్ ని నొక్కుతామే.. అలా పూర్తిగా నొక్కక సగం మాత్రమే నొక్కితే చాలా లాభాలు ఉన్నాయి.
  1. సగం మాత్రమే నొక్కగానే AF బీం అనే ఎర్రని లేజర్ కాంతి ఫోటో తీసే వస్తువు మీద పడుతుంది. అది పడ్డ చోటు ఆ ఫోటోకి సెంటర్ ప్లేస్ అని భావించాలి.
  2. అలా రావటానికి కెమరా సెట్టింగులలో ఆ AF బీం ఆన్ లో పెట్టుకోవాలి.
  3. అలా ఆ బీం లైట్ రాగానే ఫోటో దిగేవారికి ఒక ఇండికేషన్ గా ఉండి, స్టడీగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
  4. అంతలోగా ఆ కేమరాలోని చిన్ని మోటారు లెన్స్ ని అడ్జస్ట్ చేస్తుంది. అంటే స్పష్టముగా ఫోటో రావటానికి లెన్స్ ని సిద్ధం చేస్తుందన్న మాట!
  5. అప్పుడు ఆ నాబ్ ని పూర్తిగా నొక్కాలి. అలా నొక్కి వెంటనే - అంటే టైపు కీ నొక్కినట్లుగా కాకుండా, ఒకటి, రెండు సెకనులు ఉండేలా నొక్కి ఉంచాలి. దాని వల్ల కెమరా షేక్ కాదు. ఫోటోలూ బాగుంటాయి. ఈ టెక్నిక్ ఎక్కువగా  రీల్  కేమరాలకి  తప్పనిసరి.  డిజిటల్ కెమరాలకీ కూడా వాడాలి.

మెమొరీ కార్డులు మరీ ఎక్కువ సామర్థ్యం లోనివి అంటే 8GB, 16GB లాంటి కార్డులు వాడకండి. ఇవి చాలా ధర. అలాగే సగం అయ్యాక - ఫోటో తీస్తుంటే సేవ్ అవటానికి సమయం బాగా తీసుకుంటుంది. ముఖ్యముగా మల్టీ షాట్స్ తీస్తుంటే అప్పడు ఈ ప్రాబ్లెం బాగా ఫేస్ చెయ్యాల్సివస్తుంది. మామూలుగా 4GB సరిపోతుంది. 2GB కూడా ఫరవాలేదు.

మెమొరీ కార్డు ఫోటోలతో ఫుల్ అవగానే దాన్ని లాక్ చేసెయ్యండి. ఇదిగో ఇలా... పసుపు వర్ణములో బాణం గుర్తు చూపానే అక్కడ ఉన్న చిన్న నాబ్ ని గోటితో క్రిందకి అనండి. అలాగే లాక్ లో ఉంచి ప్లే చేసుకోవచ్చు. డెలీట్ మాత్రం చెయ్యరాదు.  అంటే పొరబాటుగా ఎవరూ తీసేయ్యరు అన్నమాట. మళ్ళీ ఆ లాక్ ని పైకి జరిపేదాకా ఇక అందులోని డాటాని డిలీట్ గానీ, ఎడిట్ గానీ చేయలేము. ఇది బాగుంది కదూ!. కాని ఈ విషయం చాలా మందికి తెలీదు.





మీరు ఇంకా చాలా ఫొటోస్ దిగగలరు, తీసేవి ఉన్నాయి అనుకుంటే ముందుగానే అదనపు మెమొరీ కార్డులని కొనుగోలు చెయ్యండి. ఇంత పెద్దవి కాకుండా ఇప్పుడు మైక్రో SD కార్డులు అని వస్తున్నాయి. ప్రక్క ఫోటోలో చూడండి. అవి ఆ పెద్ద వాటి పరిమాణములో సగం కన్నా తక్కువ సైజులో ఉంటాయి. వీటి ధర కూడా చాలా తక్కువే. 2GB మెమొరీ కార్డు కేవలం రెండు వందల ఇరవై రూపాయలకి దొరుకుతుంది. ఇవి కొంటే లాభాలు ఏమిటంటే అతి తక్కువ సైజులో బ్యాగులో ఒదిగిపోతాయి. కెమరాలో వాడనప్పుడు వీటిని మొబైల్ ఫోన్ లలో శుభ్రముగా వాడుకోవచ్చును. సిస్టమ్ లోని ఏవైనా ఫైల్ లని ఇందులో తాత్కాలికముగా దాచుకోవచ్చును. "బాగుంది!.. వీటిని ఆ డిజిటల్ కేమరాలలో ఎలా వాడుతారు.." అనుకుంటున్నారా? శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అని ఊరికే అన్నారా! ఆ పెద్దసైజు మెమొరీ కార్డ్ సైజులో "SD కార్డ్ షూ" అని దొరుకుతుంది. (ఇక్కడ క్రింద ఫోటో పెట్టాను చూడండి.) ఇది యే మొబైల్ షాప్ లలో అయినా దొరుకుతుంది. ధర ఇరవై రూపాయల వరకూ ఉంటుంది. దానిలో ఈ చిన్న మెమొరీ కార్డ్ పెట్టి మన పని చేసుకోవచ్చు. అది నిండగానే అది తీసేసి, అందులో ఇంకో మెమొరీ కార్డ్ పెట్టి పని కొనసాగించొచ్చు. ఫోటోలు తీయనివి, ఫోటోలు  తీసినవి అంటూ రెండు చిన్న కవర్లు లలో ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఎటైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఇలా నాలుగైదు మెమొరీ కార్డులతో వెళతాను.

టూర్ కి వెళ్ళినప్పుడు మొదటగా గుర్తుంచుకోవాలసింది ఏమిటంటే - అన్నీ నచ్చినవి ఫోటో తీస్తూ పోవటమే! ఇంటికి తిరిగి వచ్చాక అవి ఉంచటమా, డెలీట్ చేసేయ్యటమా అనేది తీరుబాటుగా డిసైడ్ చేసుకోవచ్చు. ఒక స్టిల్ తీయలేదని మళ్ళీ టూర్ కి వెళ్ళలేముగా.. అందుకే అన్నీ తీసుకోవాలి. తీరుబడిగా ఎడిట్ చేసుకోవాలి అనేది నా పద్ధతి.  

ఇవీ అంటే ఇన్ని మెమొరీ కార్డులు అయిపోయాయే అనుకుందాము. అప్పుడు దగ్గరలోని మొబైల్ షాప్ కి వెళ్లి అందులో ఒక మెమొరీ కార్డు కొని వాడుకోవటమే!.. ఇక్కడొక గమనిక. ఇలా క్రొత్తగా కొన్నప్పుడు దాన్ని కెమరాలో పెట్టి ఫార్మాట్ (ఈ ఆప్షన్ అన్ని కెమరాలలో ఉంటుంది) చెయ్యాలి ఇలా ఎందుకు అంటే అందులో ఏమైనా వైరస్ ప్రోగ్రామ్స్ ఉంటే మనం తీసిన ఫొటోస్ కి పట్టి, ఉన్న ఫొటోస్ అన్నీ గోవిందా.. గోవిందా.. అందుకే ఫార్మాట్ తప్పక చెయ్యాలి అనేది. ఈ ఫార్మాట్ కేవలం ఐదారు సెకనుల్లో అయిపోతుంది. అంతే!

కొంతమంది మధ్యలో కనపడిన బోర్డులని చదువుతూ ఉంటారు. అందులో కావలసినది ఎంచుకొని వెంటనే ముందుకు వెళ్ళరు. అలా చదువుతూ ఉండే బదులు ఆ బోర్డుని ఫోటో తీసుకుంటే, దారిలో జూమ్ చేసుకొని చదువుకోవచ్చు. సమయం వృధా కాదు. అలాంటి ఒక ఫోటో చూపిస్తాను. అది నిజమని మీరే ఒప్పుకుంటారు. ఈ క్రింది ఫోటోలో ఒక ఆలయములో ఎన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయో చెప్పారు. అవన్నీ చదివి గుర్తుపెట్టుకోలేముగా.. ఇలా ఒక ఫోటో తీసుకున్నామే అనుకోండి. జూమ్ చేసుకొని, ఒక్కొక్కటే చూసి, ఎక్కడికి వెళ్ళాలో త్వరగా నిర్ణయించుకోవచ్చు. కావాలంటే మీరు ఇప్పుడు ఈ క్రింది ఫోటో మీద రెండుసార్లు క్లిక్ చెయ్యండి. నేను చెప్పిన పాయింటు మీకు త్వరగా అర్థం అవుతుంది.

ఒకరే - అందముగా దిగాలనుకుంటున్నారా? అయితే.. కేమరాలోని మల్టీ షాట్స్ ఆప్షన్ ని ఎన్నుకోండి. అప్పుడు క్రొత్త మెమొరీ కార్డ్ వేసుకోండి. తొందరగా సేవ్ అవుతుంది. లైటింగ్ బాగుంటే మీ పని చాలా సులువుగా ఉంటుంది. అలా తీసిన షాట్ల నుండి నచ్చినవి ఉంచుకొని మిగతావి డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వల్ల చాలా అందమైన ఫొటోస్ తీయవచ్చు.

చివరిగా ఫోటోలని సిస్టం కి ఎక్కించి, ఆ ఫోటోలని ఫోటో ఎడిటర్ల సహాయముతో అందముగా అంటే కలరూ, బ్రైట్, సైజూ, క్రాప్, డార్క్, ఇలాంటివి అన్నమాట - మార్చాలి. అప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయి. ఇందుకు ఎన్నోసాఫ్త్వేర్స్ ఉచితముగా లభిస్తాయి. ఇంకొన్నింటిలో ఆన్లైన్లో వెళ్లి అక్కడే ఎడిట్ చేస్కొని ఫోటోలని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా వచ్చిన వాటికి రినెమ్ (Rename) ద్వారా సీరియల్ నంబర్స్ వేసుకొని.. ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవచ్చు. ఆ ఫోటో ప్రాపర్టీస్ కి వెళ్లి ఆ ఫోటో గురించి డిటైల్స్ వ్రాసుకోవాలి. అంతా అయ్యాక అన్ని ఫొటోస్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి అందులో Read Only ఆప్షన్ ని ఎంచుకుంటే సరి. ఇక శాశ్వతముగా మధురానుభూతులు మిగిలిపోతాయి.

ఇంకా చెప్పొచ్చు.. కాని నేను PHD చేయటం లేదుగా.. ఓకే.  

8 comments:

srujana said...

sir..
memu oka 6mnths back digitalcam theesukunnamu..adi vadina konnirojulake..foto theesina ventane card error ani vasthundhi..format cheska kuuda same problem repeat avuthundhi..and mobile loni card theeis vesina same problem vasthundhi..deenigurinchi thelisthe dayachesi theliyacheyyandi..

srujana said...

card error vachi previous foto delete ayipothundhi..ravatledhu..and meeku handy cams gurinchi kuuda thelisthe cheppandi..vati resolutions and edi baguntundho..

Raj said...

ముందుగా నా బ్లాగ్ చూసి, నన్ను ప్రశ్న అడుగుతున్నందులకు ధన్యవాదములు..

1. మీరు మీ మెమొరీ కార్డ్ ని ఒకసారి పరిశీలనగా చూడండి. ఆ కార్డ్ ప్రక్కన చిన్న నాబ్ ఉంటుంది. దాన్ని పొరబాటున లాక్ మోడ్ లో ఉంచి ఉండొచ్చు. దాన్ని సరిచెయ్యండి.
2. అప్పటికీ అది ఓకే అయి ఉంటే ఆ కార్డ్ ని ఇంకో సిస్టం లో చెక్ చెయ్యండి. అందులో ఏమైనా పొరబాటులు ఏమైనా తేలవచ్చు.
3. మీరు అడాప్టర్ వాడుతున్నట్లయితే దానికీ లాక్ ఉంటుంది. దాన్నీ సరి చెయ్యండి.
4. అడాప్టర్ లలో చాలా అడాప్టర్ పిన్స్ సరిగా కనెక్ట్ అవవు. మార్కెట్లో దొరికే ఆడాప్తర్స్ అన్నీ వేస్ట్. నేను ఇంకో అడాప్టర్ కోసం కనీసం 20 కి పైగా చెక్ చేశాను. అన్నీ కనెక్టింగ్ ప్రాబ్లెమ్స్. అంటే మెమొరీ కార్డ్ ఎర్రర్ అని వస్తుంది.
5. ఆ మెమొరీ కార్డ్ లాక్ అవచ్చు. ఎలాగంటే - కార్డ్ నుండి సిస్టం కి ఫొటోస్ ఎక్కిస్తున్నప్పుడు కరెంట్ పోవటం వల్లనో, లేదా పద్ధతి ప్రకారం దాన్ని సిస్టం నుండి తొలగించటం లో జరిగిన పొరబాటు వల్లనో, డాటా ట్రాన్స్ఫర్ సమయములో కార్డ్ ని లాగేయటం వల్లనో... ఏదో జరిగి ఆ కార్డ్ పని చెయ్యకపోవచ్చు.అప్పుడు కార్డ్ ఒక్కోసారి లాక్ అవుతుంది. ఇంకో కార్డ్ తో ప్రయత్నించి చూడండి.
6. మెమొరీ కార్డ్ ని కెమరా స్లాట్ పెట్టే దగ్గర, మీరు కార్డ్ త్రిప్పి పెట్టినా - పని చేయ్యకపోవచ్చును.
7. మెమొరీ కార్డ్ పెట్టె స్లాట్ లో పిన్స్ కార్డ్ పెట్టేటప్పుడు సరిగా కనెక్టింగ్ కాకపోవచ్చును. అంటే కేమరాలోని పిన్స్ కాస్త లూజుగా ఉండొచ్చు.
8. కొని ఆరు నెలల అయ్యిన్దంతున్నారుగా.. వారంటీ ఉంటుంది. అది కొన్న షాపులో అడగండి. సర్వీస్ సెంటర్ కి పంపి బాగు చేసి ఇస్తారు.

srujana said...

sir,
మీ బ్లాగ్ ఈరోజే చూసాను..చాలా మంచి విషయాలు రాస్తున్నారు...ఆల్బం లొ పెట్టిన ఫొటొస్ కొన్ని ఇయర్స్ తర్వాత పాడవుతాయి కదా .. అంటే album లో పెట్టిన ఫొటొస్ కి ఆ గమ్ అంటుకొని వాటి కలర్ యెల్లొ గ అవుతున్నయి..అలా పాడయిన వాటిని మల్లి బాగు చెయ్యడానికి ఎమైనా చిట్కా తెలిస్తె చెప్పండి.

srujana said...

thanq sir..memu mauritius lo untunnamu..aa cam ni memu dubai airport lo konnamu..olumpus 14megapixel...konni fotos theesaka madyalo carderror vasthaundhi..adi vachinappudu previous ga theesina foto ravatledhu..

Raj said...

సృజన గారూ మీ రెండో కామెంట్ కి సమాధానం :
మీ మెమొరీ కార్డ్ సైజు ఎంతో (2GB యా 4GB)మీరు చెప్పలేదండీ.. బహుశా మీరు ఆ కేమరాతో వచ్చిన శాంపిల్ (32MB లాంటి సైజుది.) మెమొరీ కార్డ్ వాడుతున్నారు అనుకుంటా.. అందులో కొన్ని ఫొటోస్ మాత్రమె పడుతాయి. అలా దానినే వాడినట్లయితే - కొన్ని ఫోటోస్ వచ్చాక కార్డ్ ఎర్రర్ అని వచ్చి, పాత ఫొటోస్ డిలీట్ అవుతుంటాయి. ముందుగా మీ కెమరా లో ఉన్నది ఇదేనా అన్నది పరిశీలించండి.
ఒకవేళ - మీ కెమరాలో ఉన్నది ఎక్కువ మెమొరీ కార్డ్ అయితే - నాకు సరిగ్గా కారణం తెలీదండీ.. అలా ఎందుకు అవుతుందో. సర్వీస్ సెంటర్ వద్దకి తీసుకేల్లండీ..

Raj said...

హాండీ క్యాం ల గురించి నాకేం తెలీదండీ!.. నేను తీసుకుందామని అనుకున్నాను. నాకు డిజిటల్ కేమరాలోని వీడియో సరిపోతున్నదని తీసుకోలేదండీ! అయినా తెలిసినవి చెబుతున్నాను. ఆ హాండీ క్యాం లలో ఇప్పుడు హార్డ్ డిస్క్ లతో వస్తున్నాయి. అందులో మార్కెట్లో 40GB హార్డ్ డిస్క్ స్పేస్ ఉన్నది పదిహేను వేలకి వస్తున్నది. ఇండియా మార్కెట్లో 80GB, 120GB హార్డ్ డిస్క్ తో ఉన్నవి దొరుకుతున్నాయి. ఇందులో ఆప్టికల్ జూం 1000x లేదా ఆ పైన ఉన్నవి తీసుకోవాలి. పెద్ద పెద్ద వీడియోలు తీయాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమె - ఇవి బాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న వీడియోలకి అంటే పదిహేను నిముషాల వీడియో కి డిజిటల్ కెమరా బెస్ట్ - అని నా అబిప్రాయం.

Raj said...

మిగిలిన సమాధానాలకు ఈ లింక్ చూడండి.. http://achampetraj.blogspot.com/2010/11/digital-camaras.html

Related Posts with Thumbnails