నిజానికి ఇది చిన్న విషయం. ఎంత చిన్నది అంటే ఓస్! ఇంతేనా.. అనుకునేలా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పేదిచూసాక ఓస్! ఇంతేనా.. అనుకుంటారు. మీది విండోస్ XP కదా.. అయితే ఓకే!
ఇపుడు మీ ఆల్బంలో ఒక ఫోటో 90 డిగ్రీలలో తిరిగి ఉన్నదని అనుకుందాము. అంటే ఇలా క్రింది ఫోల్డర్ లో ఉన్న ఫోటోలో మాదిరిగా అన్నమాట! ఈ ఫోటోని చూడాలి అనుకుంటే మనం మెడ ఎడమకో, కుడికో వంచి ఆ ఫోటోని చూస్తాము కదూ..
చాలామంది ఇలాగే ఫొటోస్ ఉంచేసి, తమ అవసరాల మేరకు అలాగే ...అప్లోడ్ చేస్తూ ఉంటారు. చూసేవారిది వారి బాధ.. అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అ ఫోటో ని యే సాఫ్ట్వేర్ అవసరం లేకుండా ఎలా సరి చెయ్యాలో ఇప్పుడు పద్దతులు చెబుతాను. ఫాలో అయిపోండి.
1. మీది విండోస్ XP అయితే ముందుగా ఆ ఫోటో మీద right click చెయ్యండి.
2. అలా నొక్కగా వచ్చే మెనూ బాక్స్ లో Open with ని ఎంచుకోండి.
3. దాని మీద నొక్కగా వచ్చే మరో చిన్న మెనూలో Windows Picture and Fax Viewer అని ఉంటుంది. దాన్ని ఎంచుకోండి. ఈ ఆప్షన్ అన్ని XP లలో ఉంటుంది.
చేశారు కదూ!.. ఇప్పుడు మీకు ఇలా ఒక ప్రోగ్రాం ఓపెన్ అవుతుంది. అది ఇలా, క్రింది దాని మాదిరిగా ఉంటుంది.
4. ఇక్కడ మీరు ఈ ఫోటోలో అడుగు భాగాన, ఎర్రని వృత్తములో చూపినట్లు అక్కడ మీకు రెండు బటన్లు కనిపిస్తాయి. అందులో మొదటిది - సవ్య దిశనూ (Clock wise), ఇంకోటి అపసవ్య దిశనూ (Anti clock wise) చూపిస్తున్నాయి.
ఈ రెండు బటన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని, నొక్కుతూ ఉంటే మన ఫోటో సరియైన దిశలో మారుతుంది. అంటే క్రింది ఫోటో లాగా మారుతుంది. ఇప్పుడు మనం ఆ ఫోటోని మెడలు వంచకుండానే చూడొచ్చు.
ఇలాగ సరియైన స్థితికి వచ్చేదాకా నొక్కాక, ఇప్పుడు 5 నంబర్ ఉన్న క్లోజ్ బటన్ వద్ద నొక్కితే, ఆ ప్రోగ్రాం ముగిసిపోతుంది.
ఇప్పుడు ఆ ఫోటో మీ ఆల్బం లో ఇలా కనపడుతుంది.
చాలా తేలికగా ఉంది కదూ.. నిజం చెప్పాలంటే ఇది నా ముందు టపాలో చెప్పినట్లు స్వంతముగా నేర్చుకున్నదే! ఇంతకన్నా తక్కువ లోనే పని కావాలి అనే వారికోసం ఇంకో పద్దతీ ఉంది. అది ఇంకా చాలా సింపుల్. తిరిగి ఉన్న ఫోటో మీద రైట్ క్లిక్ చేశారుగా. అప్పుడు ఒక మెనూ వస్తుందని చెప్పానుగా.. అందులో ఈ క్రింద ఫోటోలో ఎర్రరంగు వృత్తములో చూపినట్లుగా అక్కడ ఏదో ఒకటి ఎన్నుకొని, సరియైన యాంగిల్ వచ్చే వరకూ నొక్కుకుంటూ వెళ్ళటమే. ఇది చాలా ఇంకా ఈజీగా ఉంది కదూ.
వావ్! బాగుంది కదూ.. ఇంకేం! మీ ఫొటోస్ అన్నీ సరిచేయ్యటం మొదలెట్టేయండి.
No comments:
Post a Comment