నిజానికి నాకు ఆ స్కానర్ వల్ల ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు కొంటున్న కారణం కూడా ఏమిటంటే - మా పిల్లల చేతి వ్రాతలూ, వారు వేసే పిచ్చి / అందమైన బొమ్మలూ, వారి నోట్సూ, స్కూల్ రిపోర్ట్స్, పరీక్ష పేపర్ల సమాధాన పత్రాలనీ.. ఇలా అన్నీ స్కాన్ చేసి ఒక DVD లోకి నింపుదామని. వారు పెద్దయ్యాక వారి చిన్నప్పటి చేతివ్రాతలూ, బొమ్మలూ చూసి ఆనందిస్తారని - అనుకొని ఈపనిలోకి దిగటం. నిజానికి ఇలా స్కాన్ చేసి దాన్ని సిస్టమ్ లోకి ఎక్కించటం, ఆ ఫోటోని ఒక ఫోల్డర్ లోకి వెయ్యటం, ఆ ఫోటో గురించి డిటైల్స్ వ్రాయటం.. అబ్బో! చాలా పని ఉంటుందని తెలుసు.. కాని తప్పదుగా.. నా పిల్లల అనుభూతులని నేనేగా పదిలముగా దాచి ఉంచి, తిరిగి ఇచ్చేది! ఇష్టమైన పనిని చేస్తే ఎంత కష్టమైనా చాలా ఈజీగా అనిపిస్తుంది. అందుకే వారికోసం చేయబోతున్నాను. నిజానికి ఈ ఆలోచన నాకీమధ్యే వచ్చింది. అదెలా అంటే:
ఆర్కుట్ లోని ఒక మిత్రురాలు తన చిన్నప్పటి తన అందమైన చేతివ్రాతనీ, పెన్సిల్ తో వేసిన బొమ్మలనీ, స్కెచ్చులతో వేసిన అందమైన బొమ్మలూ, వాటర్ కలర్స్ ఉపయోగించిన పెయింటింగులను పెట్టారు. నాకెందుకో ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. నావి అలా (తెలీక) దాచుకోలేక పోయాను. నావి సరే.. సగం జిందగీ గడిచిపోయింది.. వారివన్నా అలా DVD లో దాచుదామని ఆలోచనతో ఈ స్కానర్ కొనాలన్న ఆలోచన. బహుశా నేను ఆ స్కానర్ ఈ సంవత్సరములో జూన్ నెలలో కొంటానేమో. అప్పుడే ఎందుకు అంటే! - అప్పుడు నాకూ కాస్త సమయం వీలు ఉంటుంది. కొన్నాక వారివి అన్నీ స్కాన్ చేసి DVD లో దాచుతాను. పిల్లల బొమ్మలు చూస్తుంటే నవ్వొస్తున్నది.. ఆ నవ్వులు కలకాలం నిలవాలన్నది నా ఈ చిన్ని ప్రయత్నం. అలాంటి వాటిల్లో ఒక "అద్భుత సృష్టిని" ఇక్కడ మీకు చూపుతాను.. ఇది LKG తరగతి లో వేసినది. అప్పుడు వేసిన దానిని ఇన్ని సంవత్సరాలు కాపాడాను. ఒకవేళ నేను, వారు పెద్దయ్యాక అందించేలోగా చెదలు పట్టి పాడయితే! తేమ వల్ల చెడిపోతే.? అందుకే వారి కోసం స్కానర్ ని కొనబోతున్నాను. అలాగే స్కానర్ వల్ల ఇంకో అద్బుత ఆలోచన కూడా వచ్చింది. చాలా మందికి ఉపయోగపడే విషయం అది. దానికో బ్లాగు పెట్టి అందులో పోస్ట్ చేస్తాను. ఆ వివరాలు వీలైనంత తొందరలో చెబుతాను.
1 comment:
Baagundi..
Post a Comment