Wednesday, April 14, 2010

మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని..

మీకు ఎప్పుడైనా

"ఈ ముద్దుల పాప [ఫోటో] అనారోగ్యముగా ఉంది.. ఈమెకి కిడ్నీ ఫెయిల్యూర్, ఆపరేషను కి ఆరు లక్షలు కావాలి..  అన్ని సైటులు ఒప్పుకున్నాయి.. మీరు చెయ్యాల్సినదల్లా ఈ మెయిల్ ని ఫార్వార్డ్ చెయ్యండి.. అలా చేస్తే ఆ పాప కి ఆ సైట్లవారు ఒక్కో ఫార్వార్డ్ కి పది పైసలవంతున వస్తుంది. మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని దయచేసి ఫార్వార్డ్ చెయ్యండి"

అని ఉంటుంది. ఆ మెయిల్ ని మనకు మానవత్వం ఉన్నదని అనిపించుకోవటానికి ఆ మెయిల్ ని ఫార్వార్డ్ చేస్తాము.. సాధారణముగా ఇలాంటి "విజ్ఞప్తులు" మెయిల్ ID లకి వస్తాయి. నిజానికి ఇలాంటి మెయిల్స్ (దాదాపు) అన్నీ వట్టి (ఫేక్) విజ్ఞప్తులే. ఎక్కడా అసలు వారు అంటే - అలాంటి పాపలు కాన్సరుతో ఉండరు. వారికి అలాంటి జబ్బులూ ఉండవు. వీరి "కష్టాన్ని" చూసి అన్ని సైట్లూ అలా పది పైసలు ఇస్తామని అంగీకారం తెలపవు. వారికేమి లాభం! అలా చేస్తే. ఆ మధ్య గూగుల్ వాడే ప్రకటించాడు - ఇలాంటివి నమ్మొద్దని, అవన్నీ అబద్ధాలేనని. సరే ఆ సంగతి అలా ఉంచుదాం!

ఒకసారి ఈ మెయిళ్ళని ఒకసారి బాగా పరిశీలించండి. అసలు ఆ పాప ఏ దేశానికి చెందినది? తల్లి తండ్రులు ఎవరు? వారు ఏ ఊర్లో ఉంటారు? వాళ్ళు ఇప్పుడు ఏ హాస్పిటల్ లో ఉన్నారు? వారికి సాయం చెయ్యాలనుకుంటే వారి మెయిల్ ID గానీ, ఫోన్ నంబర్ కానీ, అడ్డ్రెస్ కానీ, హాస్పిటల్ అడ్రెస్ కానీ, డాక్టర్ ఫోన్ నంబర్ గానీ, వారు ఎక్కడ ఉంటారో ఆ అడ్రెస్ కానీ లేవే! అసలు పాపకి వచ్చిన జబ్బు గురించిన డిటైల్డ్ వివరాలు ఏవీ ఆ మెయిల్ లో ఉండవు. నిజమే అయితే అలా పెట్టడానికి ఏమి ఇబ్బంది.?  విరాళాలు పంపేవాళ్ళు వెంటనే ఆ నంబర్స్ కి ఫోన్ చేసి నిజమని తెలుసుకొని ఇంకా గొప్పగా సాయం చేస్తారుగా! ఈ మధ్య టీవీ ఛానల్స్ లలో కూడా ఇలాంటివి బాగానే చూపుతున్నారు. అలా చూపినప్పుడు ఎంత రెస్పాన్సు వస్తుందో అందరికీ తెలిసిన విషయమే! ఇలా  పది పైసలు ప్లాను ఎందుకు? కిడ్నీ మార్పిడి ఒక్కో ప్రదేశములో ఒక్కో రేటు అవుతుంది. అమెరికాలో నైతే భాగా ఎక్కువ గానూ, ఇండియా లో నైతే ముంబై లో ఒక రేటు.. హైదరాబాద్ లో ఒకరేటు, వైజాగ్ లో ఇంకో రేటు, అనకాపల్లిలో మరొక రేటు లో జరుగుతుంది. వారు ఎక్కడ మారుస్తారో చెప్పనప్పుడు ఎంత ఖచ్చితముగా ఆరు లక్షలు అంటే ఎలా నమ్మాలి? సరే అదంతా పోనీయండి. ఇక అసలు సంగతికి వస్తే..

నేనూ మొదట్లో నమ్మాను.. ఆ తరవాత తెలిసింది - అవన్నీ (దాదాపు) అబద్దమే అని. మెయిల్ ID కి ఇలాంటివి ఫోటోతో (వేరేవారివి ఫోటో) సహా పంపుతారు. అందుల్లోనే మాల్వేర్ని ఆడ్ చేస్తారు! JPEG ఫోటోలో ఇలా పెట్టడం చాలా తేలిక. దాన్ని మన మెయిల్ బాక్స్ లో ఉంచుకుంటే మనవన్నీ రహస్యాలు అది నెట్ ద్వారా అవతలి వ్యక్తికి చేరేస్తాయి. ఫార్వార్డ్ చేస్తే అన్ని మెయిల్స్ ID లు హోల్ సెల్ గా ( భూమి గుండ్రముగా ఉండును - అన్నట్లు ) వారికి అందుతాయి. ఇక అప్పుడు స్పామ్ మెయిల్స్ మొదలవుతాయి.. మీకొచ్చే మెయిల్ బాక్స్ లో మీకు కావాల్సిన మెయిల్స్ చెక్ చేసుకోవాలంటే - చచ్చేంత విసుగు వచ్చేలా వందల సంఖ్యలో ఉంటాయి. మీకు అవసరమయ్యే మెయిల్స్ వీటి మధ్యలో ఎక్కడో ఉంటుంది. విసుగొచ్చి డెలీట్ చేస్తే అదీ పోతుంది. అది ఎలాంటిదో తెలీక (జీవితాన్ని మలుపు త్రిప్పే - ఉద్యోగములో జాయిన్ అవమనే మెయిల్ ఉంటే) అదీ గోవిందా.. అప్పుడు మన జిందగీ బర్బాద్.. ఆ పాపకి సాయం ఏమిటో కాని మనం కూడా తరవాతి జీవితానికి అలా డబ్బులకి అడుక్కోవాల్సి ఉంటుంది. మీకు ఇంకో కోణం తెలుసా.. ఆ మధ్య ఒక నైజీరియన్ ని హైదరాబాద్ లో కోటిన్నర రూపాయల ఫ్రాడ్ కేసులో సైబర్ పోలీస్ పట్టితే అతని వద్ద ఐదు వేలకి పైగా ఈమెయిలు ID లు దొరికాయి. ( బహుశా అందులో నాదీ ఉండి ఉండొచ్చు..)

ఇంతగా ఎలా చెబుతున్నా! అని మీ సందేహం అయితే - నేనూ అలాంటి బాధితున్నే! వారానికి నా జిమెయిల్ ID కి 70 కి పైగా అబద్ధాల స్పాం మెయిల్స్ వస్తున్నాయి.. అందులో ఒకొక్కటి చూస్తూ డిలీట్ చేయాల్సివస్తున్నది.. ఎంత సమయం వృధానో చూడండి. ఒక చిన్ని ఫార్వార్డ్ ఎంత కష్టాన్ని తెస్తుందో.. అందుకే అలాంటివాటి గురించి పట్టించుకోకండి.. వివరాలు అన్నీ ఉండి, నమ్మదగినది అని అనిపించినప్పుడు మాత్రమే - ఫార్వార్డ్  చేయండి.  - ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి. నా అనుభవం చెప్పాను..

తాజాకలము:  ఇలా మెయిల్స్ వచ్చినప్పుడు: అందులో ఇలా సహాయం చేయమని లేదా ఈ దేవుడి / దేవత ఫోటోని మీ మిత్రులకి 10 మందికి పంపు.. నీవు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఉంటుంది. అలా వాటిని పంపడములో ముఖ్యలక్ష్యము ఏమిటంటే ఇ-మెయిల్స్ ID లని సంపాదించడం! అలా సేకరించటానికి అలా దేవుళ్ళ / దేవతల ఫొటోస్ పెడతారు. లేదా మంచం మీదున్న పాపల ఫొటోస్ పంపుతారు. తెలీక అలా పంపిన ఇ-మెయిల్ ని మన మెయిల్ లిస్టులోని అందరినీ ఆడ్ చేస్తూ అందరికీ ఫార్వార్డ్ చేస్తుంటారు. (అందరికీ ఇ-మెయిల్ పంపటానికి స్టాంపులంటూ, SMS అంటూ ఏమైనా డబ్బుల ఖర్చు ఏమీ లేదుగా ) చివరికి అటు తిరిగి ఇటు తిరిగి (మొబైల్ లో ఉండే పాము ఆట గురించి తెలుసుగా.. అన్నిటినీ మింగుతూ పెద్దగా అవుతుంది అలాగే ఇదీ) చివరకు మొదట పంపినవాడిని చేరుతుంది. కావాలంటే ఈ క్రింది ఫోటో చూడండి. సరిగా కనపడకుంటే ఫోటో మీద నొక్కండి. ఫోటో లోని ఇ-మెయిల్ ID లన్నిటినీ కనపడకుండా చేశాను. వారి ఫోన్ నంబర్స్ కూడా..



అన్ని మెయిల్ అడ్రస్లు ఉన్న ఈ ఫోటో లో A నుండి H వరకే ఉంటే - మొత్తం మెయిల్స్ ID లు ఎంత పొడవు దూరం వరకూ ఉన్నాయో ఊహించండి. అందులో అల్ఫాబెటికల్ ఆర్డర్లో H వరకు మాత్రమే ఉన్నాయి. ఇక I నుండి Z వరకి ఉన్న ఈ-మెయిల్ IDలు ఎన్ని ఉంటాయో ఊహించండి. అది సరే! ఇలా సేకరించిన వాడికి ఏమి లాభం అనుకుంటున్నారా? కోటివిద్యలూ కూటికోసమే అన్నట్లు - ఇదో క్రొత్త బిజినెస్. ఇలా, అలాగే  ఎక్జిబిషన్ దగ్గర ఫోన్ నంబర్స్ సేకరించి కొన్ని మార్కెటింగ్ సంస్థలకి ఒక్కో అడ్రెస్ కి రెండురూపాయలకు అమ్ముకుంటారు. ఈ విషయం అబద్దం కాదు నిజమే! ఆ మధ్య ఈనాడు దినపత్రికలో చదివాను. ఆ మార్కెటింగ్ సంస్థలు అడ్రెస్లూ, ఫోన్ నంబర్లూ, ఈ-మెయిల్ ID లూ  తీసుకొని... వారి మార్కెట్ చేసుకుంటాయి. నాకీమధ్య రియల్ ఎస్టేటు, క్లబ్బుల, భీమా సంస్థల నుండి ఆఫర్లు వస్తే ఎలా తెలుసబ్బా అని పరిశోధిస్తే ఇవన్నీ తెలిసాయి. 

9 comments:

kvsv said...

informative గా వుందండీ...thank you

tankman said...

E-mails మాత్రమే కాదు రాజ్ గారు , ఈ మధ్య sms లు కూడా వస్తున్నాయి !!!

sairam said...

nice suggestion

examstime said...

manchi information..kanisam idi chusina vallaina alochinchali...even i got many mails like this..like
lottery,and help like this...i dont even read second line also
i just delete them

వేణూశ్రీకాంత్ said...

మంచి వివరాలు అందించారు రాజ్. ఈ మధ్య మీరు కోట్లు గెలుచుకున్నారు మీ వివరాలు పంపండి అంటూ మొబైల్ ఫోన్ కు SMS లు కూడా ఎక్కువగా వస్తున్నాయి అని విన్నాను.

Raj said...

అవును.. వస్తున్నాయి.. ముందు కొంత డబ్బు కట్టమంటారు ప్రాసెస్ కోసమని.. ఆ తరవాత ఇంకొంత కట్టమంటారు.. ఇలా చాలా డబ్బు కట్టేసేయగానే ఆచూకీ ఉండకుండా బిచాణా ఎత్తేస్తారు..

DARPANAM said...

మీరు అందించిన ప్రతి సమాచారం చాలా
విలువైనది.సైటుకి సార్ధక నామధేయం పెట్టారు
రాజ్ గారూ

యశోదకృష్ణ said...

valuable information and nice suggestion. thank you very much.

Raj said...

మీ అందరికీ కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails