మనం ఇంటర్నెట్ నుండి ఫోటోలు, పాటలు, సాఫ్ట్వేర్ లూ.. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవి జిప్ ( ZIP ) ఫార్మాట్ లో వస్తాయి. వాటిని అందులోంచి ఓపెన్ చేసుకోవాలంటే ఈ సాఫ్ట్వేర్ తప్పనిసరి. అలాగే కొన్ని పాటలని, ఫోటోలని భద్రముగా పంపాలంటే కూడా ఈ సాఫ్ట్వేర్ అవసరము. ఈ సాఫ్ట్వేర్ ని వాడటం చాలా తేలిక.
ఇప్పుడు అప్లోడ్ ఎలా చేస్తామో / ZIP ఫార్మాట్ కి ఎలా మార్చాలో చూపిస్తాను.
ముందుగా మీరు ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి.
మీరు ఇంటర్నెట్ ద్వారా ఎవరికైనా ఫొటోస్, పాటలు.. పంపాలనుకుంటే ముందుగా ఒక ఫోల్డర్ లోకి మీరు పంపాలనుకున్నవి వేయండి.
ఆ తర్వాత వచ్చే ఈ బాక్స్ లోని RAR లేదా ZIP ని ఎంచుకొని, OK నొక్కాలి. నేను ఇక్కడ RAR ఎన్నుకున్నాను.
ఇప్పుడు ఇలా ఆ ఫోల్డర్ సేవ్ అవుతుంది.
మీరు అనుకుంటే - ఒక ఫైల్ ని రహస్యముగా కూడా పంపొచ్చు. అది ఎలా అంటే!..
యే ఫైల్ పంపాలని అనుకుంటున్నారో ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఆ వచ్చే మెనూ లో Add to archive క్లిక్ చేసాక ఒక బాక్స్ వస్తుందిగా.. అందులో మీదనున్న Advance (1) మీద క్లిక్ చేసి Set Password (2) ని నొక్కండి.
ఆ తరవాత ఇలా ఇంకో బాక్స్ వస్తుంది.
అందులో (3) అన్న దగ్గర ఏదైనా పాస్ వర్డ్ ని పెట్టి.. ( ఉదా: 12345 )
(4) గడిలో కూడా అదే పాస్ వర్డ్ ని టైపు చెయ్యండి.
(5) వ నంబర్ గడిలో క్లిక్ చెయ్యండి.
ఆ తరవాత (6) అయిన OK ని నొక్కండి.
ఇప్పుడు (7) ని అయిన OK నొక్కండి.
చివరిగా ఇలా ఫైల్ ఎంక్రిప్ట్ ( encrypt ) పద్దతిలో SAVE అవుతుంది.
మీరు దీన్ని మెయిల్స్ ద్వారా నిశ్చింతగా పంపించొచ్చు. దీన్ని అందుకున్న వారికి ఇంకో మెయిల్లో పాస్ వర్డ్ ని పంపించండి.. లేదా ఫోన్ చేసి చెప్పండి. అప్పుడు వారు దాని సహాయముతో ఈ ఎంక్రిప్ట్ ఫైల్ ని ఓపెన్ చేసుకుంటారు.
అదెలా అంటే: మీరు పాస్ వర్డ్ వారికి తెలియ చేసారుగా. ఇప్పుడు.. ఆ ఫైల్ ని ఎలా బయటకి తీయాలంటే! ముందుగా ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి. వచ్చే మెనూ లోంచి అందులో Extract files ని ఎంచుకోండి.
ఇప్పుడు ఇలా వస్తుంది.. (1) దగ్గర OK ని నొక్కండి.
అలా నొక్కాక పాస్ వర్డ్ ని అడిగే పాపప్ విండో వస్తుంది. అందులో ఆ పాస్ వర్డ్ ని ఎంటర్ చెయ్యండి.
ఇలా... (3) దగ్గర పాస్ వర్డ్ ఎంటర్ చేసి, (4) వద్ద OK నొక్కండి. అంతే! ఆ ఎంక్రిప్ట్ ఫైల్ వచ్చేస్తుంది..
చాలా ఈజీగా.. సేఫ్ గా ఉంది కదూ!..
Download for testing -> Trail version : WINRAR
Size: 1.18MB
1 comment:
7-zip అన్న software సుమారుగా ఈ పనులన్నీ చేస్తుంది ....ఇంకా అది ఫ్రీ ఫ్రీ ఫ్రీ ...
Post a Comment