Friday, December 31, 2010

Youtube నుండి వీడియోల డౌన్లోడ్.

మీకందరికీ నూత సంవత్సశుభాకాంక్షలు.

మీకు నాకు చెప్పే విషేష్ కి ధన్యవాదములు బదులుగా - యూ ట్యూబ్ నుండి వీడియోలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతాను.. అనుకోకుండా తెలుసుకున్న ఈ విషయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేసి నేను నేను ఎన్నో వీడియోలు యూ ట్యూబ్ లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ క్రింది పద్దతులని ఆచరించి మీరూ అలా చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది కూడా. ఒక్క యూ ట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ యే కాకుండా, వాటిని ప్లే కూడా చేసుకోవచ్చు, వాటిని కత్తిరించి చిన్నగా చేసుకోవచ్చును. వేరే ఫార్మాట్స్ కి సులభముగా మార్చుకోవచ్చును. అన్నీ ప్లే చేసుకోవచ్చును. అన్నింటికన్నా మించి ఇది ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

మీకు ఎక్కడైనా బొమ్మలు అర్థం కాకుంటే ఆ ఫోటోల మీద డబల్ క్లిక్ చెయ్యండి..

ముందుగా మీరు ఈ రియల్ ప్లేయర్ లింక్ మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు మీరు ఆ సైటు లోకి వెళతారు. అప్పడు ఆ సైటు ఇలా మీకు కనపడుతుంది.


ఇప్పుడు ఓపెన్ చేశారు కదా.. ఓకే. ఇప్పుడు ఆ క్రింది బొమ్మలో చూపించినట్లుగా, ఎర్రరంగు వృత్తాకారము (1) వద్దకి రండి. అక్కడ ఉన్న Real Player - Basic Player ని నొక్కండి.  


ఇప్పుడు వచ్చే దాంట్లో ఎర్రరంగులో ఉన్న Download Now (2) వద్ద నొక్కండీ. నొక్కారా..!! 


అలా నొక్కగానే మీకు Save (3) ఆప్షన్ గల ఒక మెనూ వెంటనే ప్రత్యక్షం అవుతుంది.  అక్కడ ఆ SAVE ఆప్షన్ ని నొక్కండి. మీరు మీ సిస్టం లో ఎక్కడ SAVE చెయ్యాలో నిర్ణయించుకొని సేవ్ చెయ్యండి. అప్పుడు 585 KB సైజులోని ఒక ఫైల్ మీ సిస్టం లో SAVE అవుతుంది.


ఇప్పుడు ఆ ఫైల్ ని వెదికి, దాన్ని ఓపెన్ చెయ్యండి. ఇప్పుడు దాన్ని RUN (4) చెయ్యండి. చేశారా?.. 


ఇప్పుడు ఇలా మీ సిస్టం లో REAL PLAYER ఇన్స్టాల్ అవటానికి ప్రిపేర్ (5) అవుతుంది.  


ఇప్పుడు కాసేపట్లో ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ (6) దగ్గర ఉన్న ACCEPT ని నొక్కండి. 


అలా నొక్కగానే - ఇలా ఇంటర్నెట్ లో నుండి ఆ సాఫ్ట్వేర్ మీ సిస్టం లోకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. బ్రాడ్ బ్యాండ్ ఆయితే (ఇండియాలో ఆయితే 256 kbps) అదంతా జరగటానికి 16 నుండి 18 నిముషాలు పడుతుంది. స్పీడ్ బాగా ఉంటే ఇంకా త్వరగానే అవుతుంది. అదంతా అయ్యేవరకు వేచి చూడండి.  


అలా 100 % శాతం పూర్తయ్యాక ఇలా ఇంకో మెనూ ఓపెన్ అవుతుంది. అందులో (7) వద్ద నున్న REAL PLAYER PLUS వద్ద సెలెక్ట్ చెయ్యండి. మళ్ళీ (8 వద్ద) Continue అవండి.. 


అలా కంటిన్యూ అయ్యారుగా.. ఇప్పుడు ఇంకొకటి పాపప్ విండో వస్తుంది. అందులో (9 వద్ద) మీ ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ టైపు చేసి, మళ్ళీ పాస్ వర్డ్ మళ్ళీ టైపు చేసి, (10 వద్ద) Next step వద్ద నొక్కండి.  


ఇప్పుడు మీ డెస్క్టాప్ మీద ఇలా రియల్ ప్లేయర్ (11) లా కనిపిస్తుంది.. వచ్చింది కదూ.. OK 


ఇప్పుడు మీరు యూ ట్యూబ్ సైటు http://www.youtube.com/ ఓపెన్ చెయ్యండి. అందులో మీకు నచ్చిన ఒక పాటని, లేదా వీడియో ని ఓపెన్ చెయ్యండి. చేశారా. ఆ వీడియో బఫరింగ్ అయ్యి బొమ్మ వచ్చేదాకా ఆగండి. అలా వీడియో స్టార్ట్ అయ్యాక ఆ వీడియో మీద మీ మౌస్ కర్సర్ ని తీసుకరండి. తీసుకొచ్చారా.. OK . అలా మీరు కర్సర్ ని తీసుకరాగానే మీకు ఆ వీడియో పైన కుడి మూలన Download this video అని (12 న వద్ద ) కనిపిస్తుంది. కనిపించిందా? దాన్ని నొక్కండి. 


ఇప్పుడు ఆ వీడియో మీద ఇలా డౌన్లోడ్ బాక్స్ కనిపిస్తుంది. కనిపించిందా.? అలాగే టాస్క్ బార్ లో కూడా, సిస్టం ట్రే లో కూడా కనిపిస్తుంది. ఇక దాన్ని అలాగే వదిలెయ్యండి. మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన ఆ వీడియో (డిఫాల్ట్ గా ఆయితే) My డాకుమెంట్స్ > My Videos > Realplayer Downloads లో కనిపిస్తాయి. ఇక ఆ వీడియోలను మీరు ప్లే చేస్తూ, చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. 


మీకు ఈ నూతన సంవత్సర కానుకగా మీకు ఇది ఇస్తున్నాను.. నేను చూసిన వాటిల్లో, మరియు వాడుతున్న దానిలో - దీనికన్నా మించి యూ టూబ్ వీడియోలని డౌన్లోడ్ చెయ్యటానికి యే సాఫ్ట్వేర్ కనిపించలేదు. అంత బాగా నచ్చేసింది. మీకూ తెగ నచ్చేస్తుందని అనుకుంటాను. ఒక్క యూ ట్యూబ్ లోనివే కాకుండా ఇంటర్నెట్ లోని అన్ని వీడియోలూ దీని ద్వారా కాపీ చేసుకోవచ్చును..


మరొకసారి ఆ  లింక్ : రియల్ ప్లేయర్

మీకు మరొక్కసారి
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2011

మీ స్పందనని ఆశిస్తున్నాను..

Saturday, December 18, 2010

Athadu - Adaraka badule cheppeti

చిత్రం : అతడు
సంగీతం : మణిశర్మ
పాడినవారు : విశ్వ
రచన : విశ్వ
**************
అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే
అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే

తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే
అతడే - అతడే - అతడే

ఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే అతడే
ఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే అతడే
పెనుతుఫాను తలొంచి చూసే, పెను నిప్పు కణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే, పెను నిప్పు కణం అతడే

వాహువా వావా వా వ వ్వు వ్వా (కోరస్)

లైఫ్ హాస్ మేడ్ ఇట్ స్ట్రాంగర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్దర్
హి గాట్ టూ థింక్ అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైజర్
దిస్ వరల్డ్ హాస్ మేడ్ హిమ్ యే ఫైటర్

వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి
వన వన వనన వే వన వయ వెయి వన
వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి

వన వన వనన వే వన వయ వెయి వన
వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి

వన వన వనన వే వన వయ వెయి వన
హో హొ హొ హొ..
హో హొ హొ హొ
హో హొ హొ హొ

కాలం నను తరిమిందో, శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే, సమరం లో గెలిచేస్తా
హు యే హొ, హొ యే హొ
నే పెళపెళ ఉరుమై ఉరుముతూ, జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ, జడివానై నే కలబడతా!
హు యే హొ,
పెనుతుఫాను తలవంచి చూసే, హో హొ హొ హొ
తొలినిప్పు కణం అతడే - అతడే - అతడే

డబ డబ దేరిరా డబిన్నం, డబ డబ దేరిరా డబిన్నం,
డబ డబ దేరిరా డబిన్నం, ల ల ల ల ల ల లా..
హిస్ స్మైల్ ఈజ్ ఆల్, ఈజ్ టేకెన్ ఆల్

చుట్టూ చీకటి ఉన్నా, వెలిగే కిరణం అతడు
తెగబడే అల యెదురైతే, తలపడే తీరం అతడు
హొ యే హొ 

పెను తుఫాను తలొంచి చూసే, హొ యే హొ
తొలి నిప్పు కణం అతడే, హొ యే హొ

తన యదలో పగ మేల్కొలుపుతూ, ఒడిదుడుకుల వల చేధించుతూ,
ప్రతి నిత్యం కదనం జరుపుతూ, చెలరేగే ఓ శరమతడు

లైఫ్ హాస్ మేడ్ ఇట్ స్ట్రాంగర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్దర్
హి గాట్ టూ థింక్ అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైజర్
దిస్ వరల్డ్ హాస్ మేడ్ హిమ్ యే ఫైటర్

Wednesday, December 15, 2010

నేను వేసిన గోరింటాకు ఫోటోలు

ఇది నేను సరదాగా వేసిన - గోరింటాకు ఫోటోలు. పెద్దగా చూడాలీ అంటే ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి.






బాగున్నాయా.. ?

Wednesday, December 8, 2010

Naalona shivudu galadu..

తనికెళ్ళ భరణి చాలా గొప్ప రచయిత, సాహిత్యకారుడూ, సినీ నటుడూ, గొప్ప శివ భక్తుడూ, రంగస్థల నటుడూ.. ఇలా ఎన్నెన్నో పాటవాలు గలవాడు. మొన్న మొన్న అనుకోకుండా భరణి గారి విరచిత "నాలోన శివుడు గలడు.." అనే భక్తి గేయాల సంపుటిని వినడం జరిగింది. ఆహా!ఎంత అత్యద్భుతముగా ఉన్నాయి అవి!.. వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటంత అద్భుతముగా పాడటం జరిగింది. తను ఇంత అద్భుతముగా - చిన్ని చిన్ని పదాలతో, నోటికి తేలికగా పాడుకునేగలిగే ఉండేట్లుగా ఉన్న పదాలతో, పామరులకు సైతం సులభముగా అర్థమయ్యే విధముగా ఉన్న ఈ గేయాన్ని ఒకసారి చూడండి.

మహా శివుడి గురించి - మనల్ని ఒక చిన్నపిల్లాడిని చేసి, ముద్దుగా చేసి "ఇలారా తమ్మీ శివుడంటే .." అన్నట్లుగా చెబుతూ ఈ గేయములో భక్తి, లాలింపూ, కరుణా, వేడుకోలు, విషాదం, విరుపులూ, సునిశిత హాస్యం, చమత్కారం.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో. తోడుకున్నవాడికి తోడుకున్నంత. అసలు ఈ పాటని విశ్లేషించే సామర్థ్యం నాకు లేదేమో అనిపిస్తుంది.

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన గల శివుడు నీలోన గల శివుడు - లోకమ్ములేలగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - లోకమ్ములేలగలడు
కోరితే శోకమ్ముబాపగలడు ..

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - గంగపైకెత్తగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన గల శివుడు నీలోన గల శివుడు - గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో - పండగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు  - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ - మూయగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - సగము పంచీయగలడు
తిక్కతో - అసలు తుంచేయగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు - నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు


ఈ పాటను కూడా వినండి.  అసలు ఆ చివరి వాక్యం ఉంది చూడండి.. నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు అనీ.. అది అన్నింటికన్నా హైలెట్. ఒకే లైనుని, గంభీరముగా, కరుణ తో, దయతో, కాస్త హాస్య స్పూరకముతో, విరుపులూ, చేణుక్కులతో - శంకరా బహరణం లో శంకర శాస్త్రి "అమ్మా" అనే పదాన్ని ఎవరు ఎలా అతారో చేబుతాడుగా.. అలా ఒకే ఒక వాక్యాన్ని ఐదు రసాలలో చెప్పటం ఈ భరణి గారికే చెందుతుంది..

Wednesday, December 1, 2010

DVD CD - బఫరింగ్

DVD రైటర్ లో CD పెట్టాక ఆ CD బఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఆ CD లోని డాటాని రైటర్ లోని లేజర్ కాంతి పుంజము ఆ CD లోని డాటాని చదువుతూ ఉంటుంది.

ఆ CD లోని డాటా చదవటానికి పది నుండి పదిహేను సెకన్ల కన్నా ఎక్కువ సమయం తీసుకోదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సమయం తీసుకున్నట్లు మీకు అనిపిస్తే - ఎజేక్ట్ బటన్ వాడి ఆ CD ని తీసి పరిశీలించండి. ఏమైనా స్క్రాచేస్ వచ్చాయా అని.

ఒకవేళ స్క్రాచేస్ వచ్చినట్లుంటే - ఆ CD ని మళ్ళీ రీడ్ చేసేందుకు ఆ డ్రైవ్ లో పెట్టే సాహాసం చెయ్యకండి. కొన్ని క్రొత్తగా ఉండొచ్చు.. అది కాపీ చేసిన CD అయినా - దాని మాతృక CD మాత్రం గీతలు పడి ఉండవచ్చు. అలాంటి CD నుండి కాపీ చేస్తే - ఆ డాటా ఎర్రర్ ఈ CD లోకి కూడ మారుతుంది.

అలా ఈ CD ని మీ సిస్టం కి ఉన్న రైటర్ లో పెడితే - బఫర్ టైం ఎక్కువ తీసుకొని, మీ రైటర్ ఇక DVD CD లని రీడ్ చేసుకోవు. మామూలు CD లని ప్లే మరియు రికార్డింగ్ చెయ్యగలగుతాయి. ఒక్కోసారి DVD లను ప్లే మాత్రమే చేస్తాయి. రికార్డింగ్ మాత్రం చెయ్యలేవు. వారంటీ ఉంటే - ఓకే. లేకుంటే క్రొత్తగా ఇంకో DVD రైటర్ కొనాల్సిందే.

ఇలా ఒక DVD రైటర్ ని నేను పోగొట్టుకున్నాను. మీరూ అలా చెయ్యకండీ. పది పదిహేను సెకనుల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంటే - ఇక ఆ సీడీని తీసెయ్యండి. మళ్ళీ ఎప్పుడూ ఆ సీడీ ని వాడి మీ రైటర్ ని పాడుచేసుకోకండీ.

Sunday, November 28, 2010

Girls awaiting you..

చాలామంది తమ మెయిల్ బాక్స్ వచ్చిన మెయిల్స్ అన్నింటినీ ఓపెన్ చేస్తూ ఉంటారు.. తమకి వచ్చిన ప్రతి మెయిల్ లో ఏదో ఉందని అనుకుంటూ ఓపెన్ చేస్తారు.. (ఏమి ఉంటుందో మీకు చివరలో తెలుస్తుంది.) అందులో ఏమున్నదో తెలుసుకోవడం చాలా సాధారణ ఆసక్తే. కాని కొన్ని మెయిల్స్ మాత్రం అన్ని మెయిల్స్ లా ఉండవు. అవి సంథింగ్ డిఫరెంట్. వీటి గురించి చెప్పే ముందు, కొన్ని విషయాలు చెబుతాను.

నా బ్లాగ్ లోనే ఒకసారి చెప్పాను - మీకు మానవత్వం ఉంటే ఈ మెయిల్ ని..  అనే లింక్ పోస్ట్ కి వెళ్లి చదవండి. పనిలో పనిగా అలాగే కామెంట్స్ చూడండి. అలా వారు మన మెయిల్ ID పంపాక మన మెయిల్ బాక్స్ కి ఏదో ఒక మెయిల్ వస్తుంది. "..వీరి పరిస్థితి ఇలా ఉంది.. వీరికి ఇలా అయ్యింది.. అది బాగు కావాలంటే ఇంత డబ్బు కావాలి.. మీరు ఈ మెయిల్ ని మీ మిత్రులకి పంపితే చాలు.. గూగుల్ వాడు ఒక్కో మెయిల్ కి మాకు కొంత ఆర్ధిక సహాయం చేస్తాడు.. మీకు హృదయమే ఉన్న మనుష్యులు ఆయితే (?) మీరు మీ మెయిల్ లిస్టు లోని అందరికీ పంపండీ.." - అని అందులో ఉంటుంది. ఇలాని కాదు ఇలా సహాయం చెయ్యమనీ, చూడమనీ ఎన్నో రకాలు ఉంటాయి. 

అది నిజమే అని అమాయకముగా అందరికీ పంపిస్తుంటారు.. అలా నా మెయిల్ ID నీ, ఏదో పుణ్య కార్యక్రమం చేసినట్లు - అందరికీ పంపారు కూడా. ఇంకా పంపుతూనే ఉన్నారు కూడా.. ఏమి చేస్తాం.. చదువుకొని కూడా లోకజ్ఞానం అబ్బని అమాయకులు (మూర్ఖులు) - అని అనుకోవాలి వారిని. అలా చేసిన "విశాల హృదయ పుణ్య కార్యక్రమానికి" ఆహ్వానం అందుకొని, నాకు ఎన్నో మెయిల్స్ వచ్చాయి. ఆయా సైట్ల ఫిల్టర్స్ వల్ల అవి - స్పామ్ బాక్స్ లోకి వెళ్ళిపోయాయి. అందులో అన్నీ మనసుని ఊరించి ఓపెన్ చేయించే మెయిల్స్. క్రిందన ఉన్న ఈ మెయిల్ బాడీ చూడండి. అందులో ఒక సైట్ లింక్ తప్ప మరేం లేదు. ఇలాంటిదే ఒక మెయిల్ వస్తే - అప్పట్లో తెలీక ఓపెన్ చేశా.. బూతుబొమ్మల సైటు అది. ఆ సైట్ లోని మాల్వేర్స్ నా సిస్టం లో తిష్ట వేశాయి. ఫలితముగా నా సిస్టం చాలా స్లో గా నడవటం మొదలెట్టింది. అంటి వైరస్ అప్డేట్ చేసినా, టెంపరరీ ఫైల్స్ అన్నీ తీసేసినా, అనుమానిత ఫైల్స్ అన్నీ తీసేసినా, కూకీస్ అన్నీ తొలగించినా.. ఊహు.. లాభం లేదు. సిస్టం హాంగ్ అవటం మొదలెట్టింది. నా సిస్టం నుండి ఎంత డాటా హ్యాక్ అయ్యిందో? చివరికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల - చాలా రోజులకి సమస్య తీరింది. అన్ని రోజులూ నెట్  కి రావాలంటేనే  - విసుగు. ఏదైనా సైట్ ఓపెన్ అవ్వాలంటే - అది ఓపెన్ అయ్యేలోపు టీ ఈజీగా త్రాగేయవచ్చు. అంతగా స్లో అన్నమాట.. అలాగే ఈ క్రింది మెయిల్ కూడా అటువంటివే.. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి.. 


అలాగే - మీకు "ఒకటి" పంపిస్తే కొరియర్ వాపస్ తిరిగి వచ్చింది. అందులో మీకు ఏమి పంపామో - అటాచ్మెంట్ ఫైల్ ఓపెన్ చేసి చూడండి - అని ఉంటుంది. అది డౌన్ లోడ్ చేసుకుంటే - ఇక నుండి సిస్టం లో శాశ్వతముగా తిష్ట వేసుకొనే మాల్వేర్స్ డౌన్ లోడ్ అవుతాయి. మొదట్లో నేనూ నమ్మలేదు. కాని పై అనుభవం వల్ల నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు మీరూ నమ్ముతారు. అది ఎలాగో ఈ క్రింది ఫోటో చూడండి. అలాగే ఈ మెయిల్ వస్తే కొద్ది రోజులాగి, ఓపెన్ చేశా. అంతలోగా అంటి వైరస్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుందిగా. అలా ఆ మెయిల్ బండారం బయటపడింది. మీరూ చూడండి. సరిగా కనిపించకపోతే పెద్దగా చూడటానికి ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి.


అందుకే తస్మాత్ జాగ్రత్త!!

ఈ చదువుకున్న మూర్ఖులు చేసిన పుణ్య కార్యక్రమం వల్ల ఇంకో అపకారం కూడా జరిగిపోతుంది.. అదేమిటంటే - అలా వారు ఆ సానుభూతి మెయిల్స్ మళ్ళీ పంపటం వల్ల మిత్రులకు ద్రోహం చేసినవారూ అవుతారు. దీన్ని రెండు రకాలుగా చెబుతాను.

మొదటి రకం :  ఇందులో - ఎవరో స్వార్థపరుడు ఒక మెయిల్ ID ని క్రొత్తగా సృష్టించుకొని, ఈ సింపతీ మెయిల్ ని తన మెయిల్ బాక్స్ లోని అందరికీ (మిత్రులకి) కూడా పంపిస్తాడు. వాళ్ళందరూ అందులో ఎమున్నదీ, నిజమేనా, ఆధారాలు ఉన్నాయా? అని ఏవీ ఆలోచించకుండా "విశాల దృక్పథా మనసుతో" తమ మంచి మనసుకి నిదర్శనం కి గుర్తుగా, అదో మహాద్భాగ్యం అన్న భావనతో అందరికీ ఆ మెయిల్ ని పంపిస్తారు. ఆ మెయిల్ ID లలో ఈ స్వార్థపరుడి మెయిల్ ID కూడా ఉంటుంది. - ఎలా అంటే వీడూ వారికి ఫ్రెండ్ / తెలిసిన వాడే అయి ఉంటాడు.  ఎవరైనా మిత్రులవి సోషల్ వర్కింగ్ సైట్లకి ఆడ్ రిక్వెస్ట్ పంపాలన్నా, ( ఆ మిత్రులు - వారికి ఆడ్ రిక్వెస్ట్  పంపాలంటే వారి మెయిల్ ID ఖచ్చితముగా తెలిసి ఉండేలా సెట్టింగ్స్ పెడుతూ ఉంటారు.) ఒక ఈ మెయిల్ ID ని, అక్కడ పోస్ట్ చేస్తూ పోతారు. అందులో ఉన్న అన్ని మెయిల్స్ ID ని అలా టెస్ట్ చేస్తుంటే ఏదో ఒకటి తగులుతుంది. ఇక వారికి కష్టాలు మొదలవుతాయి. దానికి కారణం, మూలమూ ఈ "విశాల మనసు గల మూర్ఖులే." వీరు చేసిన ఒక చిన్నపని ఎదుటివారిని ఎన్ని అవస్థలకు గురిచేస్తుందో. మన మిత్రులని మనమే ఇబ్బందులకి గురిచేసి, అవతలి వారికి లాభం చేస్తున్నామని వీరు అనుకోని మూర్ఖులు.

రెండో రకం : ఇలా మెయిల్ ID లు తెలిశాక - అప్పుడు ఆయా మెయిల్ ID ల ద్వారా వారి అక్కౌంట్స్ ఓపెన్ చెయ్యటానికి ప్రయత్నిస్తారు. పాస్ వర్డ్ చేధించటానికి ఆధునిక పాస్ వర్డ్ బ్రేకర్స్ ద్వారా ప్రయత్నిస్తారు. 
ఆరు అక్షరాల పాస్ వర్డ్ ని ఇప్పుడున్న ఆధునిక సాఫ్ట్ వేర్ లతో మూడు గంటల్లో, 
ఏడు అక్షరాల పాస్ వర్డ్ ని ఎనిమిది గంటల్లో, 
ఎనిమిది అక్షరాల పాస్ వర్డ్ ని మూడు రోజులల్లో "బ్రేక్" చేయవచ్చును. ఇది పాత పద్ధతి. 

ఇక క్రొత్త ఆధునిక పద్దతిలో ఆయితే - ఒక లింక్ పంపిస్తారు పైన ఉన్న ఫోటో లో లాగా. అది ఓపెన్ చేస్తే - ఒక ఫైల్ డౌన్ లోడ్ అయ్యి, అంటి వైరస్ ని ఆపేసి మన సిస్టం లో తిష్ట వేస్తుంది. మనం చేసే అన్నీ పాస్వర్డ్ లతో సహా "కీ లాగర్స్" లాగా పనిచేస్తుంది. ఏదైనా బ్యాంక్ అక్కౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు అవతలివారికి ఆ సైటూ, పాస్ వర్డూ, లాగిన్ ID అన్నీ వారికి తెలిసిపోతుంది. ఇంకేం.. అంతా మామూలే. దర్జాగా దోచేసుకుంటారు. 

ఇప్పుడు చెప్పండి.. అలాంటి మెయిల్స్ మీకు వస్తే వాటిని - మీలో ఎవరైనా మీ మిత్రులకి మళ్ళీ పంపగలరా?

Friday, November 26, 2010

Orange - Sidnee nagaram

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : సురేంద్ర కృష్ణ, కేదారనాథ్ పరిమి
సంగీతం : హరీస్ జయరాజ్
గానం : కారుణ్య
అడిషనల్ వాయిస్ : రనినా రెడ్డి
************************

సాకీ :
ఊల ఊలల్లా అలా చూస్తేనే చాలా
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా
చాలా లవ్లీగా ఇలా రేపావు గోల
మదే సీ లోన సర్ఫింగ్ చేస్తుందిలా

పల్లవి :
సిడ్నీ నగరం చేసే నేరం - ఇన్నాళ్ళూ నిన్ను దాచుంటుంది.
సిగ్గే పడుతూ తప్పే తెలిసీ - ఈరోజైనా చూపించింది.
దిసీజ్ ద టైం టూ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ - ఓ మై లవ్
వెల్కం టూ మై హర్ట్ - ఐయాం ఇన్ లవ్
ఐయాం ఇన్ లవ్ - యు ఆర్ ఇన్ మై లవ్  // సిడ్నీ నగరం  //

చరణం 1: 
సాగర తీరాన ఉదయం లా - ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిమిషం  - సునామీలా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే - ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే - ఓ లావా లాగా లోలో పొంగిందే
ఇవ్వాళే రాలే పాత బాదే - నిన్ను చూడ
నిన్నుచూడ - నిన్నుచూడ - నిన్నుచూడ

చరణం  2:
ఈ లేత అల్లర్లే లాగాయిలా - నీలా విడి పాదం ఆడిందిలా 
ఆ ఏడు రంగుల్ని మార్చానిలా - నాలో తాజా ప్రేమే ఆరెంజ్ లా
అప్పుడే పుట్టిన పాపలా - నువు కొంతకాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాసలో - నువు చల్లగాలి చల్లినావుగా
ఇవ్వాళే వాలే కొత్త మాయే - నిన్ను చూడ // ఊల //  // సిడ్నీ నగరం //

Rowdeelaku rowdeelu - Teesko kokokola

చిత్రం : రౌడీలకు రౌడీలు (1971)
రచన : ఆరుద్ర
సంగీతం : సత్యం
గానం : ఎల్లార్ ఈశ్వరి.
******************

పల్లవి :
తీస్కో కోకోకోలా - ఏస్కో రమ్ము సారా
చూస్తే మజా - గుటకేస్తే  నిషా
కలిపికొట్టు మొనగాడా // తీస్కో కోకోకోలా //

చరణం 1 :
మతి చెడితే.. హా.. మందుంది.
మనసైతే  - నేనున్నా
మతి చెడితే.. హా.. మందుంది.
మనసైతే - నేనున్నా
రెండూ కైపిస్తే - రేయి భలే హాయీ
హే.. మగాడా.. నువ్వు బిగించు నీ సగం
సగం తెగింపు లో సుఖం లేదురా. // తీస్కో కోకోకోలా //

చరణం 2 :
ఈ... ఊరించే ఒంపులు - ఉడుకేత్తే సొగసులు
ఊరించే హా... ఒంపులు ఉడుకేత్తే - హా... సొగసులు.
జతగా నేనుంటా - జలసా చేయిస్తా
కులాసా ఒక తమాషా
ఈ... ఒమర్ ఖయ్యామ్ సరాగమే పసందని రా... ఈ.. // తీస్కో కోకోకోలా //

Thursday, November 18, 2010

My Photography - Mallela thertham

ఇదే ఆ జలపాతం మడుగు.

జలపాతం.

నా మిత్రుడు. 

వచ్చిన పర్యాటకులు 

జలపాతం 

జలపాతం 

అక్కడ ఉన్న శివాలయం. 

జలపాతం 

వచ్చిన పర్యాటకులు. 

జలపాతం కి దారి. 

జలపాతం 

జలపాతం 

జలపాతం  ఉన్న లోయ. 


ఇక వీడియో చూడండి. ఇందులో అన్ని వివరాలూ ఉంటాయి. వీడియోగ్రఫీ కూడా నాదే..

Wednesday, November 17, 2010

DIGITAL CAMARAS టపాకి వచ్చిన కామెంట్స్

నా బ్లాగు లోని DIGITAL CAMARAS అనే టపాకి నిన్న మారిషస్ నుండి సృజన అనే అమ్మాయి కొన్ని కామెంట్స్ ని వ్రాశారు. అందులో వారు తీసుకున్న డిజిటల్ కెమరాకి - వాడకములో వచ్చిన సందేహాలను కామెంట్స్ రూపముగా నన్ను అడిగారు. నేనూ కొన్నింటికి సమాధానం ఇచ్చాను. నిజానికి నేనూ మామూలుగా ఇష్టపడి పిచ్చి, పిచ్చి ఫొటోస్ తీసిన వాడిని నేను. నాకంటూ ఒక ఫోటో స్టూడియో గానీ, స్టూడియో లో పనిచేసిన అనుభవం గానీ లేవు. ఫోటోగ్రాఫర్లతో కలసి పనిచేసిన సందర్భాలూ లేవు. అయినా తను నన్ను అడిగిన ప్రశ్నలకి, నా మిడి మిడి జ్ఞానం తో కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చాను. ఇంకా కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇస్తుండగా - నాకో ఐడియా వచ్చింది. వీటినే ఒక టపాగా వ్రాస్తే ఎలా ఉంటుందీ అని? అలా వ్రాయటం నూతన ప్రక్రియ అనీ, ఆ సమాధానాలూ ఒక టపాలాగా వ్రాస్తే ఎక్కువ మందికి ఉపయోగ పడుతుందనీ (నేనూ ఏమైనా నేర్చుకోవచ్చనీ) అనుకొని తను వ్రాసిన ప్రశ్నలను ఇక్కడ పేస్ట్ చేస్తూ, వాటికి సమాధానాలూ ఇక్కడే ఇస్తున్నాను. ఆ కామెంట్ల లో వ్రాస్తే ఎక్కువమందికి ఇవన్నీ ఉపయోగపడకపోవచ్చనీ, ఇక్కడ వ్రాస్తే ఇంకా వివరముగా చెప్పోచ్చనీ  చెబుతున్నాను.

ముందుగా ఆ సృజన గారికి ధన్యవాదములు. ఎందుకంటే తను తనకొచ్చిన సందేహాలను కామెంట్ల రూపముగా పెట్టడం, అనానిమస్ గా కామెంట్స్ వ్రాయక, తన పేరుతో నిర్భీతిగా అడగటం మూలాన - తనకు అన్నీ వివరముగా చెప్పాలనిపిస్తున్నది. ఆమె ప్రశ్నలకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే, అలా ధైర్యముగా అడిగినందులకు ఆమెని అభినందిస్తున్నాను.. (అందరూ క్లాప్స్ కొట్టండీ!... క్లాప్స్..)

ప్రశ్న : sir..
memu oka 6mnths back digitalcam theesukunnamu..adi vadina konnirojulake..foto theesina ventane card error ani vasthundhi..format cheska kuuda same problem repeat avuthundhi..and mobile loni card theeis vesina same problem vasthundhi..deenigurinchi thelisthe dayachesi theliyacheyyandi..
Tuesday, November 16, 2010 2:47:00 PM
 
జవాబు : ముందుగా నా బ్లాగ్ చూసి, నన్ను ప్రశ్న అడుగుతున్నందులకు ధన్యవాదములు..


1. మీరు మీ మెమొరీ కార్డ్ ని ఒకసారి పరిశీలనగా చూడండి. ఆ కార్డ్ ప్రక్కన చిన్న నాబ్ ఉంటుంది. దాన్ని పొరబాటున లాక్ మోడ్ లో ఉంచి ఉండొచ్చు. దాన్ని సరిచెయ్యండి.

2. అప్పటికీ అది ఓకే అయి ఉంటే ఆ కార్డ్ ని ఇంకో కంప్యూటర్ కి అనుసంధానం చేసి, చెక్ చెయ్యండి. అందులో ఏమైనా పొరబాటులు ఏమైనా తేలవచ్చు.

3. మీరు అడాప్టర్ + మెమొరీ కార్డ్ వాడుతున్నట్లయితే దానికీ లాక్ ఉంటుంది. దాన్నీ సరి చెయ్యండి.

4. అడాప్టర్ లలో - చాలా అడాప్టర్ పిన్స్ సరిగా కనెక్ట్ అవవు. మార్కెట్లో దొరికే ఆడాప్టర్స్ దాదాపు అన్నీ వేస్ట్. నేను ఇంకో అడాప్టర్ కోసం కనీసం 20 కి పైగా చెక్ చేశాను. అన్నీ కనెక్టింగ్ ప్రాబ్లెమ్స్. అంటే మెమొరీ కార్డ్ ఎర్రర్ అని వస్తుంది.

5. ఆ మెమొరీ కార్డ్ లాక్ అవచ్చు. ఎలాగంటే - కార్డ్ నుండి సిస్టం కి ఫొటోస్ ఎక్కిస్తున్నప్పుడు కరెంట్ పోవటం వల్లనో, లేదా పద్ధతి ప్రకారం దాన్ని సిస్టం నుండి తొలగించటం లో జరిగిన పొరబాటు వల్లనో, డాటా ట్రాన్స్ఫర్ సమయములో కార్డ్ ని లాగేయటం వల్లనో... ఏదో జరిగి ఆ కార్డ్ పని చెయ్యకపోవచ్చు.అప్పుడు కార్డ్ ఒక్కోసారి లాక్ అవుతుంది. ఇంకో కార్డ్ తో ప్రయత్నించి చూడండి.

6. మెమొరీ కార్డ్ ని కెమరా స్లాట్ పెట్టే దగ్గర, మీరు కార్డ్ త్రిప్పి పెట్టినా - పని చేయ్యకపోవచ్చును.

7. మెమొరీ కార్డ్ పెట్టె స్లాట్ లో పిన్స్ కార్డ్ పెట్టేటప్పుడు సరిగా కనెక్టింగ్ కాకపోవచ్చును. అంటే కేమరాలోని పిన్స్ కాస్త లూజుగా ఉండొచ్చు.

8. కొని ఆరు నెలల అయ్యిందని అంటున్నారుగా.. వారంటీ ఉంటుంది. అది కొన్న షాపులో అడగండి. సర్వీస్ సెంటర్ కి పంపి బాగు చేసి ఇస్తారు.

ప్రశ్న : card error vachi previous foto delete ayipothundhi..ravatledhu..and meeku handy cams gurinchi kuuda thelisthe cheppandi..vati resolutions and edi baguntundho..
Tuesday, November 16, 2010 5:40:00 PM

జవాబు : సృజన గారూ మీ రెండో కామెంట్ కి సమాధానం : మీ మెమొరీ కార్డ్ సైజు ఎంతో (2GB యా 4GB) మీరు చెప్పలేదండీ.. బహుశా మీరు ఆ కేమరాతో వచ్చిన శాంపిల్ (32MB లాంటి సైజుది. అన్ని కెమరాలకీ వాటితో ఇలాంటి మెమొరీ కార్డ్ ని ఇస్తారు. బహుశా మీరు వాడుతున్నది ఇదే కావచ్చునేమో) మెమొరీ కార్డ్ వాడుతున్నారు అనుకుంటా.. అందులో కొన్ని ఫొటోస్ మాత్రమె పడుతాయి. అంటే నాలుగు నుండి ఆరు ఫొటోస్ వరకు. అది ఫోటో సైజుని, రిజల్యూషన్ ని బట్టి ఉంటుంది. అలా దానినే వాడినట్లయితే - కొన్ని ఫోటోస్ వచ్చాక కార్డ్ ఎర్రర్ అని వచ్చి, పాత ఫొటోస్ డిలీట్ అవుతుంటాయి. ముందుగా మీ కెమరా లో ఉన్నది ఇదేనా అన్నది పరిశీలించండి.

ఒకవేళ - మీ కెమరాలో ఉన్నది ఎక్కువ మెమొరీ కార్డ్ అంటే 4GB లాంటివి అయితే - నాకు సరిగ్గా కారణం తెలీదండీ.. అలా ఎందుకు అవుతుందో. ఒకసారి సర్వీస్ సెంటర్ వద్దకి తీసుకేళ్ళండీ..

హాండీ క్యాం ల గురించి నాకేం ఎక్కువగా తెలీదండీ!.. నేను తీసుకుందామని అనుకున్నాను. నాకు డిజిటల్ కేమరాలోని వీడియో సరిపోతున్నదని తీసుకోలేదండీ! మొదట్లో వీడియో ముక్కలు ముక్కలుగా తీయటం ఇష్టం లేక (చూడటానికి ముక్కలు ముక్కలుగా చూడటం ఇష్టం లేక), వీడియోలు తీయలేదండీ.. తరవాత విండోస్ మూవీ మేకర్ - సాఫ్ట్ వేర్ గురించి తెలిసి ఇప్పుడు వీడియోలు బాగా తీస్తున్నాను. ఆ సాఫ్ట్ వేర్ గురించి త్వరలోనే వీలు చూసుకొని ఈ బ్లాగులో టపా వ్రాస్తాను. ఇప్పుడు ఆ డిజిటల్ కెమరా సరిపోతున్నదని, హ్యాండీ క్యాం తీసుకోలేదండీ.. పెద్ద పెద్ద వీడియోలు తీయాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే - ఇవి - హ్యాండీ క్యాం బాగా ఉపయోగపడతాయి.

అయినా తెలిసినవి చెబుతున్నాను. ఆ హాండీ క్యాం లలో ఇప్పుడు హార్డ్ డిస్క్ లతో వస్తున్నాయి. అందులో మార్కెట్లో సోనీ 40GB హార్డ్ డిస్క్ స్పేస్ ఉన్నది పదిహేను వేలకి వస్తున్నది. ఇండియా మార్కెట్లో 40GB, 80GB హార్డ్ డిస్క్ తో ఉన్నవి దొరుకుతున్నాయి. వాటిలో ఇందులో ఆప్టికల్ జూం 60x లేదా ఆ పైన ఉన్నవి తీసుకోవాలి. ఆప్టికల్ జూమ్ ఎక్కువగా ఉంటే - దూరం లోనివి, జూమ్ చేసి షూట్ చేసినప్పుడు క్లారిటీ బాగుంటుంది. అలాగే HD వీడియో (High Defination) క్లారిటీ ఆప్షన్ ఉంటే మనం వీడియో తీసింది చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ వీడియో లోంచి ఫొటోస్ తీసుకున్నా స్పష్టముగానే ఉంటాయి. డిజిటల్ క్లారిటీ రెండువేలు (2000x) ఉన్నా అది ఎక్కువగా క్లారిటీ ఉండదు. ఆ డిజిటల్ తో తీసిన వీడియోని LCD, LED, HD టీవీల్లో వాటిల్లో చూసుకున్నప్పుడు ఆప్టికల్ అంత స్పష్టత రాదు. టచ్ స్క్రీన్ ప్యానల్ చాలా చాలా బెస్ట్.  అలాగే డాల్బీ 5.1 సరౌండ్ సిస్టం బెస్ట్.  ఈ హ్యాండీ క్యాం వల్ల ఇబ్బంది ఏమిటంటే - దాన్ని ఉపయోగించటం తెలిసిన వారు తక్కువ. సృజన గారూ.. దాన్ని మీరే వాడటం ఎలాగో నేర్చుకున్నారు అనుకోండి. దానితో తీసే వీడియోలలో మీరు మాత్రం కనపడరు. ఇది ప్రతి హ్యాండీ క్యాం ఓనర్ల బాధ అది. మీలాగా తీసేవారు మీకు తోడుగా ఎవరైనా ఉంటే - కొనుక్కోవటం బెస్ట్.  చిన్న చిన్న వీడియోలకి అంటే పదిహేను నిముషాల వీడియో కి డిజిటల్ కెమరా బెస్ట్ - అని నా అబిప్రాయం.

ప్రశ్న : sir, మీ బ్లాగ్ ఈరోజే చూసాను..చాలా మంచి విషయాలు రాస్తున్నారు...ఆల్బం లొ పెట్టిన ఫొటొస్ కొన్ని ఇయర్స్ తర్వాత పాడవుతాయి కదా .. అంటే album లో పెట్టిన ఫొటొస్ కి ఆ గమ్ అంటుకొని వాటి కలర్ యెల్లొ గ అవుతున్నయి..అలా పాడయిన వాటిని మల్లి బాగు చెయ్యడానికి ఎమైనా చిట్కా తెలిస్తె చెప్పండి.
Tuesday, November 16, 2010 5:54:00 PM
 
జవాబు : నా బ్లాగ్ చూసినందులకి ధన్యవాదములు. ఇలాగే మళ్ళీ మళ్ళీ నా బ్లాగ్ చూడాలని కోరుకుంటున్నాను.
ఆల్బంలో ఫొటోస్ పెట్టకూడదు అండీ.. ముఖ్యముగా ప్లాస్టిక్ సంబంధ ఆల్బమ్స్ లలో అసలు ఫొటోస్ ని పెట్టకూడదు. ఈ విషయం చాలా మందికి తెలీదు. నా ఫొటోస్ కూడా చాలా పాడయ్యాయి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉన్నవి వాడేటట్లయితే - వాటిల్లో జిగురు ఉండకూడదు. ఫొటోస్ పెట్టే ముందు హ్యాండ్ టిస్యూ పేపర్లతో ప్రతి కవరునీ పైనా, లోపలా తుడిచి, ఆ ఫోటోతో బాటూ కాస్త ఆ పేపరూ ఆ ఫోటో వెనకాల పెట్టి ఉంచాలి. అలా అయితే వాటికి తేమ తగిలే అవకాశాలు తక్కువ. ఇంత ఓపిక మనకేక్కడివీ.. నిజానికి ఫోటో ప్రింట్స్ కి కాస్త పొడి వాతావరణం ఉండాలి. ఆల్బమ్స్ లలో ఫొటోస్ కి అతికేందుకై ఉండే జిగురూ, దాని ఘాడమైన వాసన వల్ల ఫొటోస్ చాలా తొందరగా పాడవుతాయి. అయినా చాలా మంది ఆల్బమ్స్ ఎక్కడో మూలన పెట్టి, ఆ ఆల్బమ్స్ మీద ఎన్నో బరువు వస్తువులని పెడతారు. ఫలితముగా గాలి ఆడక ఫొటోస్ పాడవుతాయి. అలా గాకుండా నిలువుగా ఆ ఆల్బమ్స్ ని పెడితే పాడయ్యే అవకాశాలు కాస్త తగ్గుతాయి. అందుకే ఆ ఆల్బం లలో ఉంటే వెంటనే తీసేసి గాలికి ఆరపెట్టండి.

మీ ఆల్బమ్స్ పసుపు వర్ణములోకి మారాయిగా. వాటిని ఏమీ చేయ్యరాదండీ.. వాటిని బ్లాక్ అండ్ వైట్ లోనికి మార్చి రంగులు వెయ్యాలి. అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ పసుపు వర్ణములోకి మారిన ఫొటోస్ నెగటివ్ లు ఎక్కడున్నాయో తెలుసుకొని మళ్ళీ ప్రింట్స్ తీయించండీ.. స్టూడియో ఆయితే తేదీ చెప్పండి. మళ్ళీ ప్రింట్స్ వేసిస్తాడు. పనిలో పనిగా ఫొటోస్ నేగెటివ్స్ గానీ, స్టూడియో వద్ద మీ ఫోటోస్ తాలూకు నేగెటివ్స్ ఉంటే - వాటిని డిజిటల్ రూపములోకి మార్చి CD లోనికి బర్న్ చేయించుకోండి. నేనూ చాలా రోజుల క్రిందట ఇలాగే దాదాపు ముప్ఫై రీళ్ల నేగెటివ్స్ ని డిజిటల్ చేయించాను. వాటి గురించిన కథా కమామీషు ని కూడా ఇందులోనే - అంటే ఈ బ్లాగ్ లోనే పోస్ట్ చేశాను - చూడండి. ముందుగా ఆ ఆల్బం నుండి ఆ ఫొటోస్ తీసెయ్యండి. అలాగే వాటిని స్కాన్ చేయించి ఒక CD లోకి కాపీ చెయ్యండి. కనీసం ఆ ఫేడ్ అయినట్లున్న ఫొటోస్ అయినా మిగులుతాయి. లేకుంటే ఇంకా పాలిపోయి.. చూడటానికి ఇంకేం కనిపించవు.

ప్రశ్న : thanq sir..memu mauritius lo untunnamu..aa cam ni memu dubai airport lo konnamu..olumpus 14megapixel...konni fotos theesaka madyalo carderror vasthaundhi..adi vachinappudu previous ga theesina foto ravatledhu..
Tuesday, November 16, 2010 6:01:00 PM

జవాబు : మీరు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి. కాస్త విలువైనవి మనకు దగ్గరలోని సిటీ లోనే కొనాలి. మీరు మారిషస్ లో ఉంటూ దుబాయి లో కొంటే - అక్కడ ఏమైనా మోసం జరిగినా దుబాయికి వెళ్లి షాప్ అతన్ని అడగలేరుగా.. ఒకవేళ అడిగినా మీదే పొరబాటు అనొచ్చు. ఈ పని కోసం అక్కడికి వెళ్లి వచ్చే ఖర్చుల్లో - ఇంకో రెండు, మూడు కొని వారికీ వీరికీ ఇస్తే, మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అదే దగ్గర సిటీ లో కొంటే ఏమైనా అడగొచ్చు. ఫోరం లోకి వెళ్ళొచ్చు. ఇప్పటికైనా మీకు ఆ ఒల్యంపస్ వారి వెబ్ సైట్ కి వెళ్లి మీకు అందుబాటులోని సర్వీస్ సెంటర్లని వెదకండి. ఆ అడ్రస్ తెలుసుకొని వారికీ కాల్ చేసి, వారి వద్దకి తీసుకెళ్ళండి. లేదా వారి ఈ http://www.olympus-imaging.co.in/cs/servicecentre/ లోకి వెళ్లి, మీకు అందుబాటులో ఉన్న అడ్రెస్ కి కాల్ చేసి తీసుకువెళ్ళండి. మీకు కొచ్చిన్, లేదా ముంబాయి దగ్గరగా ఉండొచ్చు.

మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చాను అని  అనుకుంటున్నాను. మీరు సమాధానం పడినారు అని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేకున్నా - మీ అవసరం, నా బ్లాగ్ పోస్ట్ కోసం, ఏదో నాకు తెలిసినది నలుగురికీ చెప్పాలీ అని తాపత్రయం వల్లనో ఇదంతా చెప్పాను.

Tuesday, November 16, 2010

ఈ స్క్రాప్ ని పదిమందికీ పంపండీ..

చాలా రోజుల క్రిందట జరిగిన విషయం ఇదీ!.. ఒకసారి ఒక సోషల్ సైట్ మిత్రుడు నాకు ఒక స్క్రాప్ పంపాడు. అందులో - సాయి దేవుడి గురించి కొంత ఉపోద్ఘాతం ఉండి, చివరగా - ఈ స్క్రాప్ ని పదిమందికి పంపండీ, మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.. అన్నాడు. నాకెందుకో అతని మాటలు రుచించలేదు. నిజానికి ఉన్న కాస్తంతలో నేనో మంచి భక్తుడినే.. కాని ఇలా దేవుళ్ళ మీది అభిప్రాయాలని రుద్దటం నాకెందుకో నచ్చలేదు. అలానీ ఊరుకో బుద్ధీ కాలేదు. ఏమి చెయ్యాలో ఆలోచించాను. కాసేపట్లో ఒక ఐడియా వచ్చింది. 'వాటన్ ఐడియా సర్జీ!' అని అనుకున్నాను.

వెంటనే అతనికి స్క్రాప్ పెట్టాను.. "అన్నయ్యా!.. మీ స్క్రాప్ చూశాక - నాకు చాలా సంతోషం వేసింది. పంపినందులకు చాలా కృతజ్ఞతలు.. నేనూ సాయి భక్తుడినే!. కాని - ఇది నిజమా అని కాస్త అనుమానముగా ఉంది. మీరు మరేమీ అనుకోకండీ.. నేను దీన్ని పదిమందికీ పంపించలేను.. ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే - వారిని దైవ సంబంధమైన మొహమాట చర్యలతో, ఇబ్బంది పెట్టలేను. అలా స్క్రాప్స్ ని పంపించి, నానుండి వారిని దూరం చేసుకోలేను. మీరు ఏమీ అనుకోకపోతే - ఆ పదీ స్క్రాప్స్ మీకే పంపిస్తాను. దయుంచి స్వీకరించండీ.. ధన్యవాదములు.." అని నమస్కార బాణం లాగా ఒక స్క్రాప్ పంపాను.

ఆ తరవాత అతను పంపించిన స్క్రాప్ ని కాపీ చేశాను. అతని స్క్రాప్ బుక్ లో స్క్రాపులు గా పేస్ట్ చేశాను.. అలా ఒకదాని తరవాత ఒకటీ.. మొత్తం పది స్క్రాప్స్ పంపాను. ఆ పేజీలోని స్క్రాప్స్ అన్నీ ఇవే!.. ఆతర్వాత నా మనసుకి చాలా ఊరట కలిగింది. హమ్మయ్య..! ఈరోజు ఒక అనుకోకుండా దేవుడికి మ్రొక్కు / ఋణం (?) తీర్చుకున్నాను - అనీ. దేవుడే అలా నాకు స్క్రాప్స్ పంపమని ఆలోచనని ఇచ్చాడా!.. అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చును. స్క్రాప్ ని కాపీ చేసి, ఒకసారి అంటే పంపిస్తారు, రెండోసారి పంపిస్తే స్పామ్ క్రిందకి వచ్చి పోస్ట్ కాదుగా.. అలా పదీ ఎలా పంపారూ - అని మీలో సందేహం ఉండొచ్చు. దానికి సమాధానం చాలా సింపుల్. అలాంటి ఇబ్బంది రాకుండా - ఆ స్క్రాప్ లో (క్షమించాలి.. చెప్పలేను.. చెప్పాక అందరూ ఇబ్బంది పడటం మొదలవుతుంది.) అంతే!..

అతను ఎలా రిసీవ్ చేసుకున్నాడా అని మీకు సందేహమా..! ఎలా అయినా తీసుకోనీ - అనుకుని ముందే నిర్ణయించుకున్నాను. ఒక్కడి వల్ల పదిమందినీ వదులుకోలేను. పదిమంది కోసం ఒక్కడిని వదులుకోవడం తెలివైన నిర్ణయం కదూ.. ఆ తరవాత మా ఇద్దరి మధ్య స్క్రాప్స్ తగ్గాయి. ఒక సుముహూర్తాన - నా ఫాన్స్ లిస్టు నుండి వెళ్ళిపోయాడు. అయినా నాకేం బాధ లేదు. వెళ్ళేవారు వెళుతూనే ఉంటారు.... వచ్చేవారు వస్తూనే ఉంటారు.. అని నేననుకుంటాను. మీరేమంటారూ?.

Monday, November 15, 2010

Orange - Nenu neevantoo..

చిత్రం : రెంజ్ (2010) 
సంగీతం : హరీస్ జయరాజ్. 
పాడినవారు : నరేష్ అయ్యర్.
రచన : వనమాలీ.
********************
పల్లవి :
నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా - ఓ గర్ల్  
నువ్వే లేకుంటే ( లిజన్ గర్ల్ )
ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా - నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే - సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ.. ఓ.. ఓ..

నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా ఓ


చరణం 1 : 
నిజాయితి ఉన్నోడిని నిజాలనే అన్నోడినీ
అబద్ధమే రుచించని అబ్బాయినీ
ఒకే ఒక మంచోడినీ
రోమాన్స్ లో పిచ్చోడినీ
పర్లేదులే ఒప్పేసుకో - సరే అనీ

ముసుకేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తే కాదన్నా పోరాడేదే నా ప్రేమ ఓ.. ఓ..
నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా ఓ


చరణం 2 :
తిలోత్తమా తిలోత్తమా - ప్రతిక్షణం విరోదమా
ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ గ్రహాలకే వలేసినా - దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూడలేవమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా - నా ముందు పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడే
లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ.. ఓ..

నేను నువ్వంటు వేరై ఉన్నా
నా కీ వేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే - వింతగా
నా కోసం నేనే వెతికేంతగా ఓ


నువ్వే లేకుంటే 
ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా - నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే - సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ.. ఓ.. ఓ..

Sunday, October 31, 2010

యోధానుయోధులు

నాకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ వారి నుండి ఒక హాల్ టికెట్ వచ్చింది.. నేను గ్రూప్ 1 మెయిన్స్ కి ఎంట్రన్స్ కి సెలెక్ట్ అయ్యానని. అదీ పరీక్షా తేదీకి కేవలం పందొమ్మిది రోజుల ముందు. అప్పుడు నాకున్న పరిస్థితులు చాలా భయంకరమైనవి. నా హితులు  అందరూ నీవు వ్రాయాలని బాగా కోరటముతో నేనూ ప్రిపేర్ అయ్యాను. నేను నిర్ణయించుకొని, స్టడీ పుస్తకాలు కొనేసరికి ఇంకో రెండు రోజులు కరిగిపోయాయి. అయినా సరే బాగా కష్టపడి చదివా.. సమయం తక్కువ అయిననూ దాదాపు ఎంత కష్టపడాలో అంతగా కష్టపడ్డాను. జనరల్ స్టడీస్ ఎంత పెద్ద సబ్జెక్ట్.. అయినా మాక్జిమం కవర్ చేశా..

పరీక్ష సమయం ఆసన్నమయ్యింది. మొత్తం నాలుగు పేపర్లు. రోజుకో పరీక్ష. ఎండాకాలము లో మధ్యాహ్నం పూట ఈ పరీక్ష. నాలుగు రోజుల్లో నాలుగు పేపర్లు, నాలుగు సెంటర్లలో పరీక్షలు. ఉన్నవి పదిహేడు రోజులు. అంటే ఒక్కో పేపర్ కి మిగిలినవి నాలుగు రోజులు అన్నమాట. ఏమి సరిపోతుంది. సిలబస్ ఏమో చాలా..

నాకు సాధ్యమైనంత వరకూ కష్టపడి చదివా. పరీక్ష రోజున ఎక్జాం సెంటర్ కి వెళ్లాను.

అక్కడ కొద్దిమంది నాకంటే ముందే చేరుకొని, లావాటి పుస్తకాలను ముందర వేసుకొని బాగా చదువుకుంటున్నారు. కొద్దిమందికి సోడా బుడ్డి కళ్ళద్దాలు, నెరిసిన జుట్టు, చింపిరి జుట్టు, మామూలు ఇంట్లో వాడే దుస్తులూ వేసుకొని సైంటిస్ట్ ల కన్నా తీక్షణముగా చదువుకుంటున్నారు. ఆడవారికైతే కళ్ళ క్రింద నలుపు వలయాలు. వారిని చూస్తుంటే నా గుండె లో దడ. ఏమి చేస్తాం. ఇక నేను మెయిన్స్ పాస్ అవుతానని నమ్మకం పోయింది. పరీక్ష సమయం అవుతున్న కొద్దీ వచ్చేవారిని చూస్తుంటే - ఒక్కొక్కరూ జెమ్స్ లాగా, యోధానుయోదుల్లా ఉన్నారు. ఏమి చేస్తాం. అంతదూరం వచ్చాక వ్రాయక తప్పదు.

పరీక్షలు మొదలయ్యాయి.. పేపర్ ఈజీగా ఉంది.. దాదాపు నేను చదివినవే వచ్చాయి. బాగానే స్కోర్ చేశా. నా అంచనా ప్రకారం మొదటి రెండు పేపర్లలో ఎనభై శాతం పైగా మార్కులు సంపాదించగలను అని అంచనాకి వచ్చాను. మిగతా రెండు పేపర్లలో ఒకదాంట్లో సరిగా ప్రిపరేషన్ కాక దెబ్బ తిన్నాను. అందులోనే పాస్ మార్కులు రావటం కష్టం.  నాలుగో పేపర్లో సమస్యని విశ్లేషించి వ్రాయాలి. అప్పట్లో అంతగా నాకు పాటవం లేక ఏదో మమ: అనిపించాను. ఏదో ఎక్కడో జరిగితే గానీ ఇంటర్వ్యూ కి  వెళ్ళను అన్న నమ్మకం కలిగింది.

నా పోటీదారులని చూశాను. అందరూ నేను బాగా వ్రాశాను, నేను బాగా వ్రాశాను అని ముచ్చటించుకున్న మాటలు విని మరింత నమ్మకం కోల్పోయాను. బయటకు వస్తూ గోడకి అతికిన పరీక్ష వ్రాసిన అభ్యర్థుల సంఖ్యని చూశా. నాలుగువందల నలభై - ఇందులో కనీసం నాలుగు వందల మంది వ్రాశారే అనుకున్నా.. అంత పోటీని ఆ సెంటర్ లో ఉంటే మిగతా సెంటర్ల పరిస్థితి? మిగతా పరీక్షలప్పుడు కూడా దాదాపు ఇంతేమంది అభ్యర్థులు. ఇక నాకు ఇంటర్వ్యూ చాన్స్ రాదనీ, మా సెంటర్ వారికే ఎవరో ఒకరికి వస్తుందని డిసైడ్ అయ్యాను. ఆ పరీక్ష వ్రాసే లిస్టు లోని వ్రాసే మొదటి అభ్యర్థి నంబర్ నాదే.. 

చివరకి పేపర్లో రిజల్ట్ వచ్చింది. మా సెంటర్లో ఎవరూ ఇంటర్వ్యూ కి సెలెక్ట్ కాలేదు. అప్పుడు అనుకున్నాను - పైకి అందరూ యోధానుయోదుల్లా కనపడినా లోపల అందరూ మనలాంటి వారే. వారికీ మన అంతగా తెలివితేటలు ఉన్నాయని అనుకోవాలి గానీ, వారిని అతిగా ఊహించుకోవద్దని - అనే జీవన పాఠం తెలుసుకున్నాను.  

Thursday, October 28, 2010

మన్మధ - కాదన్న ప్రేమే అవునన్నా ప్రేమే

చిత్రం పేరు : మన్మధ
గేయరచన : వేటూరి
పాడినవారు : యువన్ శంకర్ రాజా
******************
పల్లవి:
కాదన్న ప్రేమే అవునన్నా ప్రేమే -
ఎవరెమన్న ఏమనుకున్న నేనే నీవన్నా
తోడైన ప్రేమే నీడేన ప్రేమే -
ఈడే జోడే గువ్వే గూడె నీలోనే ఉన్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో -
ఘుమ ఘుమ అంత ప్రేమే అనుకున్నా
ఈ వయసుల్లో వీచే గాలుల్లో
సరిగమ అంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో -
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాప లాగా కళ్ళల్లో దాచానో -
నా గుండె నీకే - ఇల్లల్లె చేసానో నా ప్రేమా.. // కాదన్న ప్రేమా //

చరణం 1:
పూల మనసులో గాలి ఎరుగదా
నిన్ను పరిచయం చేయాలా?
మేఘమాలలో మెరుపు తీగవై
నీవు పలికితే ప్రణయాలా..
శతకోటి కాంతలొస్తే - భూమికే పులకింతా
ఒక చూపు చాలదా - మనసు దోచిన జోలగా
నిను తలచి వేచిన వేళా
పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కదా - బాధాయినా
తండ్రి నీవే అయి పాలించు
తల్లి నీవే అయి లాలించు
తోడు నీడవై నను నడుపు
గుండెల్లో కొలువుండే  || నా చిట్టి ప్రేమ || || కాదన్నా ||

చరణం 2:
నీవు తప్ప నాకు ఎవరు లేరులే
ప్రాణమివ్వనా నీ కోసం
ఆశ లాంటి నీ శ్వాస తగిలితే
బతికుండదా నా ప్రాణం
నీ మోము చూడకా
నా కనులు వాలవే
విరహవేళలో పగలు చీకటై పొయెనే
తన: మన: ప్రాణాలన్నీ  నీకు నే ఆర్పిస్తాలే
నీ కొరకు పుడితే చాలు మళ్లీ - మళ్లీ
చెలియ నీ పేరు పక్క ఇలా
రాసిననులే - నా పేరే
ఆది చెరిగిపోకుండా గొడుగు వలె
నేనుంటే నానంటాలే || నా చిట్టి ప్రేమా || || కాదన్న ప్రేమే || 

Monday, October 25, 2010

పోనా

ఒకసారి వేరే ఊరిలో ఉన్న మిత్రుడిని కలవటానికి వెళ్ళాల్సివచ్చింది. వెళ్లాను. సాదరముగా ఆహ్వానం లభించింది. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక అలా ఔటింగ్ కి వెళ్ళాము. వాడి క్రొత్త బండి నడపమని కీస్ ఇచ్చాడు. వాడు వెనకాల కూర్చున్నాడు.

ఒక చిన్న హోటల్ వద్ద ఆపాడు. అది చూడటానికి చాలా చిన్నది. కారు షేడ్డులా ఉండే - ఇంకా చెప్పాలంటే అంతకన్నా తక్కువ స్థాయి హోటల్. ఏంట్రా వీడు దీనిలోకి పట్టుకొచ్చాడు అనుకున్నాను. ఇంకా మంచి హోటల్స్ అంటూ ఏమీ లేవా?.. అని మనసులో అనుకున్నాను. వాడు నా భావాలు అవేమీ పట్టించుకోకుండా ఆ హోటల్ లోనికి దారి తీశాడు. కూర్చోవటానికి ఇబ్బందిగా ఉండే పాతకాలం నాటి - జాయింట్లు లూజయిన కుర్చీలూ, ఈగలు వాలుతున్న బెంచీలు చూసి మనసులో ఈ హోటల్ కి పట్టుకోచ్చావేమిట్రా అంటూ వాడిని తిట్టుకున్నాను. వాడు మాత్రం నా భావాలు ఏమీ పట్టించుకోకుండా మామూలుగానే ఉన్నాడు.

ఆ చాయ్ చేసేవాడు రాగానే మావాడు ఏమి ఆర్డర్ చెబుతాడా అని ఎదురుచూశాను. ఏం కావాలి సార్ అన్న హోటల్ వాడి ప్రశ్నకు నా స్నేహితుడు " దో పోనా.." అన్నాడు. వాడు అర్థమయ్యినట్లు, తీసుకరావటానికి వెళ్ళిపోయాడు.

నాకు మాత్రం అర్థం కాలేదు - ఏమిటా అని. వీడు పోనా అని చెప్పటమేమిటీ? వాడు ఏమీ మాట్లాడకుండా సరేనంటూ తలూపి వెళ్లిపోవటమేమిటీ - నాకేం అర్థం కాలేదు. అసలు ఈ పోనా అంటే ఏమిటీ? బుర్ర బ్రద్దలు అవుతుండగా - ఈ ప్రశ్నని వాడినే అడిగా. గీతలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు, శ్రీకృష్ణుడిలా చిద్విలాసముగా నవ్వి, "నీవు నిమిత్తమాత్రుడివి. ఆర్డర్ చేసింది నేనూ, బిల్ కట్టేది నేనూ, త్రాగేవాడివి నీవూ.." అన్న స్టైల్లో నావంక చూసి నవ్వాడు. అంతే కాని జవాబు చెప్పలేదు.

నా అనుమానం పటాపంచాలు చెయ్యటానికి ఆ హోటల్ వాడు పోనా పట్టుకోచ్చేశాడు. ఏమిటా అని చూస్తే వాడి చేతుల్లో రెండు కప్పులు. ఒహొ!.. పోనా అంటే టీ నా? అనుకున్నాను. మా ముందు పెట్టి వెళ్లిపోయాడు. మామూలు టీ నేనా? ఇంత బిల్డప్ దేనికో అనుకున్నాను.

టీ ని చూశాను. టీ అనే ద్రవం మీద ఏమిటో తెల్లగా, ముద్దగా ఉంది. ఏమిటబ్బా అని చూశాను. "అది పాల మీద ఉండే మలాయ్" అన్నాడు నా నేస్తం.  ఆ హోటల్ వాడు ఇచ్చిన స్పూన్తో నా మిత్రుడు ఆ టీ కప్పు లో కలియత్రిప్పాడు. నేనూ అలాగే చేశాను. అడుగున ఉన్న చక్కెర అందులో కలసిపోవడం మొదలయ్యింది. అంటే కప్పులో కాస్త చక్కెర వేసి, ఆ తరవాత చిక్కటి పాలతో చేసిన టీ పోసి, ఆపైన కాస్త పాల మీగడ వేస్తారన్నమాట.

మొదటిసారిగా ఆ పోనా ని త్రాగా. ఆహా!. ఏమి రుచి. ఏమిటో అనుకున్నాను. ఆ రుచి ఆస్వాదనలోనే  ఆ కప్పు పోనా అయిపోయింది. ఇంకోటి త్రాగుతావారా? అని మా ఫ్రెండ్ అడిగితే ఊ అన్నాను. ఇంకో రెండు కప్పులు తెప్పించాడు..ఆ రెండు కప్పులూ నేనే త్రాగా. ఆలా నా జీవితములో ఒక క్రొత్త రుచిని చవిచూశాను. అలా అక్కడున్నంత సేపూ ఆ పోనానే త్రాగాను. మా వూరికి వచ్చాక, ఎక్కడికన్నా వెళ్ళినపుడు ఆ పోనా కోసం ట్రై చేశాను కాని ఎక్కడా దొరకలేదు. కొన్ని హోటల్స్ లలో అడిగితే అదేమిటీ అన్నట్లు మొఖాలు పెట్టారు. వెతకగా వెతకగా ఇరానీ హోటల్స్ లలో మాత్రమే దొరుకుతుందని తెలుసుకున్నాను. మీరూ ఒకసారి త్రాగటానికి ప్రయత్నించండి.

Saturday, October 23, 2010

Khaleja - Meeti meeti dhunupa bajaye..

చిత్రం : మహేష్ ఖలేజా (2010)
రచన : సీతారామ శాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : హేమచంద్ర, శ్వేత
********************
సాకీ :
మీఠీ మీఠీ ధునుప బాజాయే - రాధాకే మన్ కో లుభాయే
గోపీ బోలే గిరిధర్ నందలాల - నందలాల
మీఠీ మీఠీ ధునుప బాజాయే - రాధాకే మన్ కో లుభాయే
గోపీ బోలే గిరిధర్ నందలాల - నందలాల
గోపీ బోలే గిరిధర్ నందలాల - నందలాలా

పల్లవి :
పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా
పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా
నువు చేరి నడి ఎడారి - నందనమై విరిసిందా
తనలో ఆనందలహరి - సందడిగా ఎగసిందా
నడచిన ప్రతిదారి నదిగా మారి - మురిసినదా ముకుందా
కాలం నేను మరచి జ్ఞాపకాల్లో - జారిపోయిందా
లోకం గోకులంలా మారిపోయి - మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా - నీ చెంత చేరిందా గోవిందా
// పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా //
 
చరణం 1 :
ఈ భావం నాదేనా - ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది - నా వల్లనా
అది నావెంట వస్తుంది - ఎటు వెళ్ళినా
మనసులో ముంచైనా - మురిపించేనా మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం ఉన్న మౌనం - ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం - ఆలకించిందా
ఊరంతా ఊగిందా - నీ చెంత చేరిందా గోవిందా
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్
జుమో రే జుమో రే జుమో రే ఓ గిరిధర్ (3)
యారో మురళీ భాజావే గిరిధర్ గోపాల
బజాకే మన్ కో చురాలే గిరిధర్ నందలాల..

చరణం 2 :
నా చూపే చెదిరిందా - నీ వైపే తరిమిందా
చిన్ని క్రిష్నయ్య పాదాల సిరిమువ్వల
నన్ను నీ మాయ నడిపింది - నలువైపులా
అలజడి పెంచైనా అలరించైనా లలనను ఈ వేళ
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి - నన్ను రమ్మందా
ఎదలో వేణుగానం - ఊయలూపి ఊహ రేపిందా
ఊరంతా ఊగిందా - నీ చెంత చేరిందా గోవిందా
// పిలిచే పెదవుల పైనా - నిలిచే మెరపు నువ్వేనా //

Sunday, October 17, 2010

నా చిన్నప్పటి దసరా జ్ఞాపకాలు.

నాచిన్నప్పుడు దసరా పండుగ అంతా బాగానే జరిగింది.. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మీకోసం.

నా చిన్నప్పుడు బట్టల షాపులో బట్టలు కొని, టేలరుకి అబ్బాయికి ఇచ్చి వాటికి కొలతలు ఇచ్చి, దసరా రేపు అనగా ఈరోజే అతడి వద్దనుండి తెచ్చుకునేవాడిని. ఒక్కోసారి రద్దీ మూలముగా దసరా రోజునే కుట్టి మరీ ఇచ్చేసేవాడు. ఏంచేస్తాం.. ఓపికగా ఎదురుచూసి కుట్టించుకొని మరీ ఇంటికి వచ్చేవాడిని. ఎందుకో మా నాన్న గారు ఆరోజు మమ్మల్ని ఏమీ అనెడివారు కాదు. (రోజూ ఏదో అనెడివారు అని కాదు.) ఆ రోజున మాకంతా స్వేచ్చగా ఉండేడిది. క్రొత్త బట్టలు తెచ్చి దేవుడి వద్ద పెట్టేడి వాళ్ళం. ఆరోజు మటన్ మరియు బిర్యానీ తో బాటూ కొన్ని పిండివంటలూ చేసుకొని, అవి తిన్న తరవాత ఎప్పుడు క్రొత్త బట్టలు వేసుకున్టామా అని ఎదురు చూపులు.

ఆ క్రొత్త బట్టలు వేసుకునేటప్పుడు మా మొఖాల్లో దీపావళి కాంతులే. మా నెత్తిన ఉన్న చింపిరి తలని, మా అంతట మేముగా దువ్వీ దువ్వీ, ఏదో హీరోలా ఉందా అంటే ఉందా అన్నట్లు దువ్వేడివాళ్ళం. క్రోత్తబట్టలు వేసుకొని, వాటిని టక్ చేసి.. (అది టక్ కూడా కాదు.. అలాని మా ఫీలింగ్.) చేతికో పాత వాచీని పెట్టి - అదే లేటెస్ట్ మాడల్ అన్నట్లుగా మాటి మాటికీ చేతిని ఊపుతూ ఉండేడి వాడిని. చెవిలో కాస్త అత్తరు సీసాలో ముంచిన కాస్త దూదీ ని తీసుకొని కాస్త వంటికీ, కాస్త బట్టలకీ రాసి, మిగిలిన దూదిని సాయబు వలె చెవిలో పెట్టుకోనేవాడిని.. అప్పట్లో అదో పెద్ద ఫ్యాషన్ - అలా పెట్టుకోవటం. ఇప్పుడు ఉన్న స్ప్రే బాటిళ్ళు చాలా ఖరీదూ, అరుదు కూడా..

సాయంత్రం ఊరిజనం అంతా అలా ఊరి బయటకి వెళ్ళేవారు.. ఒకదగ్గర అంటే - ఊరి బయటే పాండవులు తమ అజ్ఞాత వాసములో తమ ఆయుధాలని దాచి ఉంచిన శమీ చెట్టు సంతతికి చెందిన ఒక శమీ చెట్టు ఉండేడిది. అక్కడికి అందరమూ చేరుకోనేడివారము. ఆ చెట్టుకి మూడు సార్లూ ప్రదక్షిణ చేసుకొని.. (కొందరు ఐదుసార్లూ) మ్రొక్కెడివారిమి. ఆ చెట్టుకున్న ఆకులనీ, కొమ్మల్నీ "బంగారము" గా భావించి, కాస్త తెంపు కొని, జేబుల్లో నింపుకొని ఆనందముగా అక్కడి నుండి బయలుదేరేవాల్లము. అక్కడే ఉన్న ఆరుబయలు ప్రదేశములో కూర్చొని, ఆకాశము వంక చూస్తూ ఉండేడివాల్లము.

అలా చూడటం ఎందుకు అంటే - ఆ రోజున పాలపిట్ట ని చూడాలని. పాండవులు మహాభారత యుద్ధం గెలిచాక వస్తుంటే ఈ పాలపిట్టనే శుభసూచకముగా ఎదురువచ్చింది. అందుకే ఆ రోజూ పాలపిట్ట చూడాలని ఎదురుచూపులు. ఒక పాలపిట్ట కనిపిస్తే అందరూ చప్పట్లు కొట్టేవారు. అరిచే వారూ - అందరూ దాన్ని చూడాలని. కాని అసలు ఆ పిట్ట ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. కొన్ని సంవత్సరాల క్రిందట నుండి చూడటం జరుగుతున్నది. మీకూ ఆ పిట్ట ఎలా ఉంటుందో ఆ ఫోటో చూపిస్తున్నాను.. చూడండి. దశమి / దసరా రోజున ఈ పాలపిట్ట ని చూస్తే అంతా శుభమే జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది.


అలా ఆ పాలపిట్టని చూసి, దానికి మోకరిల్లి.. చీకటి పడుతుండగా ఇంటికి వచ్చేడివాళ్ళం. రాగానే ఇంట్లోని పెద్దలకి పాదాభివందనాలు చేసేడివాళ్ళం. అలాగే పూర్వికులకీ అలాగే నమస్కరించేడి వాళ్ళం. ఆ తరవాత వచ్చిన అతిదులకీ స్వీట్లూ, నీరూ పంచి బయటపడేవాళ్ళం. అక్కడి నుండి బయలుదేరి మిత్రుల ఇంటింటికీ వెళ్లి, మిత్రుల అమ్మానాన్నలకి "బంగారం" ఇచ్చి దండాలు పెట్టి, మిత్రులని ఆప్యాయతగా కౌగిలించుకోనేడివాళ్ళం. అలా రాత్రంతా అందరి మిత్రుల ఇళ్ళకూ వేల్లెడివారం. ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండున్నర అయ్యేది.

ఇవీ కాసిన్ని చిన్నప్పటి - నా దసరా మధుర జ్ఞాపకాలు.

Monday, October 11, 2010

ఒక కామెంటు - ఒక మిత్రుడు దొరకటం.

మనం చేసే కొన్ని విషయాలు ఎక్కడెక్కడో లింకులు కలుస్తూ ఉంటాయి.. అలాని ఒకసారి వాటిని పరిశీలనగా చూస్తే చాలా గమ్మత్తుగా, విచిత్రముగా తోస్తూ ఉంటాయి. ఈమధ్యే జరిగిన అలాంటి చక్కని ఉదాహరణ ఇప్పుడు మీకు తెలియచేయబోతున్నాను.

నాకున్న కొద్దిపాటి సమయములో నా సోషల్ వర్కింగ్ సైట్లూ, చాట్లూ, మెయిల్సూ, మధ్య మధ్యలో నాకు ఇది కావాలంటూ విజ్ఞప్తులు, నాలుగైదు కమ్యూనిటీలు + నా బ్లాగ్ ఇవన్నీ చూడటానికే సమయం సరిపోవటం లేదు. అప్పుడప్పుడూ గ్రూపు నుండి నా ఫలానా బ్లాగ్ చూడమంటూ విజ్ఞప్తులు. కాస్త వీలు చూసుకొని, కాస్త సమయములో ఆ బ్లాగు చూస్తాను. చెప్పాగా - సమయం ఎక్కువగా ఉండదని. అయినా నేను ఇప్పటివరకూ చూసిన బ్లాగులు మహా అంటే ఇరవై లోపే అంటే ఏమాత్రం అతియోశక్తి కాదేమో.! ఆ బ్లాగులు చూస్తానా.. అక్కడ మాత్రం ఒక విషయాన్ని మాత్రం మరచిపోను.

అది ఏమిటని అంటారా? - అదే విషయం చెప్పబోతున్నాను. - నేను చూసిన బ్లాగులలో నాకు నచ్చిన ఏదైనా ఒక పోస్ట్ లో తప్పకుండా ఒక కామెంట్ వ్రాస్తుంటాను. అది అభినందిస్తో, లేక వివరముగా విశ్లేషిస్తో, తగు కారణములు చూపుతూ (అందులో ప్రావీణ్యం ఉంటేనే సుమా) కామెంట్స్ ని మాత్రం తప్పకుండా పెడుతూ ఉంటుంటాను.  (ఇంతవరకూ చెడుగా, నిందా పూర్వకమైన కామెంట్లని ఎవరికీ పెట్టలేదు.) ఒకసారి సూచనలు చేస్తూ పెట్టిన కామెంట్, ఒక పెద్దాయన్ని సోషల్ వర్కింగ్ సైట్లో నన్ను ఆయనకీ మిత్రునిగా చేసింది. అదే విషయం మీకు ఇప్పడు చెప్పబోతున్నాను అన్నమాట.

నా బ్లాగు చూడమంటూ వచ్చిన విజ్ఞప్తిని చూసి, సరదాగా ఆ బ్లాగ్ ఓపెన్ చేశాను. అది ఓపెన్ అయ్యేలోగా ఇంకో టాబ్ లో నా పని చేసుకుంటూ ఉండిపోయాను. నా పని అయిపోయాక అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నప్పుడు, అప్పుడు గమనించాని ఈ బ్లాగుని. పూర్తిగా చూశాను.. ఏదో బ్లాగ్ పెట్టాలన్న ఉబలాటమే కాదు.. వీలైనంత ఎక్కువగా చెప్పాలని వారి ఆశ ఉన్నట్లుంది. కాని అక్కడ మూడు పోస్టింగ్స్ కన్నా ఎక్కువగా లేవు. సమయం వీలుకాక వ్రాయలేదేమో అని అనుకున్నాను. పేజి డిజైన్ నుండీ టపాల లోని కనీస మర్యాదలూ (వ్యాకరణ దోషాలు) చాలా లోపించాయి. వాటిని మార్చండి అంటూ చిన్నగా కామెంట్ పెట్టాను. సాధారణముగా కామెంట్ పెట్టాక రెండు, మూడు రోజుల తరవాత ఆ టపాని సందర్శిస్తాను.. ఎవరైనా ప్రతిగా కామెంట్ పెట్టారా అని.. అక్కడ వేరే కామెంట్ ఏమీ లేదు. ఇక ఆ విషయమే మరచిపోయాను.

ఒక సోషల్ వర్కింగ్ సైట్లో నా మిత్రురాలి స్క్రాప్ బుక్ లో నా స్క్రాప్ వాసినప్పుడు, అంతకు ముందే ఒకాయన వ్రాసిన స్క్రాప్ కనిపించింది. నాగురించి చిన్నగా ఆయన ఏదో వ్రాశారు.. కాస్త కుతూహలం కలిగింది. కొద్దిరోజులు గమనించాను. ఏమీలేదు.. కాని ఆయన తెలుగు టైపింగ్ తో మాటవిరుపు మాటలూ నన్నెంతో ఆకట్టుకున్నాయి. నా మిత్రురాలిని అడిగా నేను ఆయనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుదామని అనుకుంటున్నాను అనీ.

మంచివారు, పంపండి... అని సమాధానం ఇవ్వటం - నేను రిక్వెస్ట్ పంపటం - ఆయన అంగీకరించటం - ఈ సంవత్సరం ఆగస్ట్ పదమూడున : ప్రతిగా "it is my preivilage to have your ' friend's request. I think you are known to me . నా ' (బ్లాగ్ పేరు ) ' తెలుగు బ్లాగు కు కొన్ని సలహాలు ఇచ్చినట్లు గుర్తు ! ఈ విధంగా మీ స్నేహితుల చిట్టా లో కి ఎక్కినందుకు సంతోషం !.." అని నాకు పంపించటం. ఆ బ్లాగుకి నేనెప్పుడు వెల్లానబ్బా?.. వెళ్లి ఉండవచ్చు. కాని అంతగా బాగా గుర్తుంచుకున్నారే అని అనుకున్నాను. అదే విషయాన్ని నేను ఆయన్ని అడిగితే లింక్ ఇచ్చారు.. ఒహొ.. అప్పటిదా అని అనుకున్నాను. అంటే అప్పుడు నేను వ్రాసిన కామెంట్ వ్రాసిన బ్లాగ్ ఓనరు నా మిత్రురాలికి సోషల్ సైట్లో ఫ్రెండ్ అన్న మాట!. అలా అలా మాటలు కుదిరాయి. ఇప్పుడు చక్కని మిత్రులం.

కాని - నిజానికి ఆయన నాకన్నా అన్నింట్లో చాలా పెద్దమనిషి, పై చేయి వారూనూ.. కాని ఎందుకో అంతగా సరిగా మాట్లాడకపోవటం గమనించాను. నా బ్లాగ్ ఉన్నంత లుక్కు ఆయనది లేదని కావచ్చును.. లేదా మరేదైనా కావచ్చును. ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మేమిద్దరం చక్కదిద్దుకోవాలి.

Thursday, October 7, 2010

Indipendence days.

కొన్ని దేశాల బానిసత్వం నుండి స్వాత్రంత్ర్య పొందినప్పటి
దినోత్సవ సంవత్సరాలూ, తేదీలు..

660 BCE - జపాన్
221 BCE - China
301 CE - San Marino
843 CE - France
976 CE - Austria
10th Century CE - Denmark
1001 - Hungary
1143 - Portugal
1206 - Mongolia
1238 - Thailand
1278 - Andorra
August 1, 1291 - Switzerland
1419 - Monaco
15th Century - Spain
1502 - Iran
June 6, 1523 - Sweeden
January 23, 1579 - Netherlands
1650 - Oman
May 1, 1707 - United Kingdom
January 23, 1719 - Liechtenstein
1768 - Nepal
July 4, 1776 - United States of America
January 1, 1804 - Haiti
July 20, 1810 - Colombia
Sept. 16, 1810 - Mexico
Sept. 18, 1810 - Chile
May 14, 1811 - Paraguay
July 5, 1811 - Venezuela
July 9, 1816 - Argentina
July 28, 1821 - Peru
Sept. 15, 1821 - Costa Rica
Sept. 15, 1821 - El Salvador
Sept. 15, 1821 - Guatemala
Sept. 15, 1821 - Honduras
Sept. 15, 1821 - నికారాగు
May 24, 1822 - Ecuador
Sept. 7, 1822 - Brazil
August 6, 1825 - Bolivia
August 25, 1825 - Uruguay
1829 - Greece
October 4, 1830 - Belgium
1839 - Luxembourg
February 27, 1844 - Dominican Republic
July 26, 1847 - Liberia
March 17, 1861 - Italy
July 1, 1867 - Canada
January 18, 1871 - Germany
May 9, 1877 - Romania
March 3, 1878 - Bulgaria
1896 - Ethiopia
June 12, 1898 - Philippines
January 1, 1901 - Australia
May 20, 1902 - Cuba
November 3, 1903 - Panama
June 7, 1905 - Norway
Sept. 26, 1907 - New Zealand
May 31, 1910 - South Africa
November 28, 1912 - Albania
December 6, 1917 - Finland
November 11, 1918 - Poland
December 1, 1918 - Iceland
August 19, 1919 - Afghanistan
December 6, 1921 - Ireland
February 28, 1922 - Egypt
October 29, 1923 - Turkey
February 11, 1929 - Vatican City
Sept. 23, 1932 - Saudi Arabia
October 3, 1932 - Iraq
November 22, 1943 - Lebanon
August 15, 1945 - Korea, North
August 15, 1945 - Korea, South
August 17, 1945 - Indonesia
Sept. 2, 1945 - Vietnam
April 17, 1946 - Syria
May 25, 1946 - Jordan
August 14, 1947 - Pakistan
August 15, 1947 - India
January 4, 1948 - Burma
February 4, 1948 - Sri Lanka
May 14, 1948 - Israel
July 19, 1949 - Laos
August 8, 1949 - Bhutan
December 24, 1951 - Libya
November 9, 1953 - Cambodia
January 1, 1956 - Sudan
March 2, 1956 - Morocco
March 20, 1956 - Tunisia
March 6, 1957 - Ghana
August 31, 1957 - Malaysia
October 2, 1958 - Guinea
January 1, 1960 - Cameroon
April 4, 1960 - Senegal
May 27, 1960 - Togo
June 30, 1960 - Congo, Republic of the
July 1, 1960 - Somalia
July 26, 1960 - Madagascar
August 1, 1960 - Benin
August 3, 1960 - Niger
August 5, 1960 - Burkina Faso
August 7, 1960 - Cote d'Ivorie
August 11, 1960 - Chad
August 13, 1960 - Central African Republic
August 15, 1960 - Congo, Dem. Rep. of the
August 16, 1960 - Cyprus
August 17, 1960 - Gabon
Sept. 22, 1960 - Mali
October 1, 1960 - Nigeria
November 28, 1960 - Mauritania
April 27, 1961 - Sierra Leone
June 19, 1961 - Kuwait
January 1, 1962 - Samoa
July 1, 1962 - Burundi
July 1, 1962 - Rwanda
July 5, 1962 - Algeria
August 6, 1962 - Jamaica
August 31, 1962 - Trinidad and Tobago
October 9, 1962 - Uganda
December 12, 1963 - Kenya
April 26, 1964 - Tanzania
July 6, 1964 - Malawi
Sept. 21, 1964 - Malta
October 24, 1964 - Zambia
February 18, 1965 - Gambia, The
July 26, 1965 - Maldives
August 9, 1965 - Singapore
May 26, 1966 - Guyana
September 30, 1966 - Botswana
October 4, 1966 - Lesotho
November 30, 1966 - Barbados
January 31, 1968 - Nauru
March 12, 1968 - Mauritius
Sept. 6, 1968 - Swaziland
October 12, 1968 - Equatorial
June 4, 1970 - Tonga
October 10, 1970 - Fiji
March 26, 1971 - Bangladesh
August 15, 1971 - Bahrain
Sept. 3, 1971 - Qatar
November 2, 1971 - United Arab Emirates
July 10, 1973 - Bahamas
Sept. 24, 1973 - Guinea-Bissau
February 7, 1974 - Grenada
June 25, 1975 - Mozambique
July 5, 1975 - Cape Verde
July 6, 1975 - Comoros
July 12, 1975 - Sao Tome and Principe
Sept. 16, 1975 - Papua New Guinea
November 11, 1975 - Angola
November 25, 1975 - Suriname
June 29, 1976 - Seychelles
June 27, 1977 - Djibouti
July 7, 1978 - Solomon Islands
October 1, 1978 - Tuvalu
November 3, 1978 - Dominica
February 22, 1979 - Saint Lucia
July 12, 1979 - Kiribati
October 27, 1979 - Saint Vincent and the Grenadines
April 18, 1980 - Zimbabwe
July 30, 1980 - Vanuatu
January 11, 1981 - Antigua and Barbuda
Sept. 21, 1981 - Belize
Sept. 19, 1983 - Saint Kitts and Nevis
January 1, 1984 - Brunei
October 21, 1986 - Marshall Islands
November 3, 1986 - Micronesia, Federated States of
March 11, 1990 - Lithuania
March 21, 1990 - Namibia
May 22, 1990 - Yemen
April 9, 1991 - Georgia
June 25, 1991 - Croatia
June 25, 1991 - Slovenia
August 20, 1991 - Estonia
August 21, 1991 - Kyrgyzstan
August 24, 1991 - Russia
August 25, 1991 - Belarus
August 27, 1991 - Moldova
August 30, 1991 - Azerbaijan
Sept. 1, 1991 - Uzbekistan
Sept. 6, 1991 - Latvia
Sept. 8, 1991 - Macedonia
Sept. 9, 1991 - Tajikistan
Sept. 21, 1991 - Armenia
October 27, 1991 - Turkmenistan
November 24, 1991 - Ukraine
December 16, 1991 - Kazakhstan
March 3, 1992 - Bosnia and Herzegovina
January 1, 1993 - Czech Republic
January 1, 1993 - Slovakia
May 24, 1993 - Eritrea
October 1, 1994 - Palau
May 20, 2002 - East Timor
June 3, 2006 - Montenegro
June 5, 2006 - Serbia
February 17, 2008 - Kosovo
Related Posts with Thumbnails