Tuesday, November 16, 2010

ఈ స్క్రాప్ ని పదిమందికీ పంపండీ..

చాలా రోజుల క్రిందట జరిగిన విషయం ఇదీ!.. ఒకసారి ఒక సోషల్ సైట్ మిత్రుడు నాకు ఒక స్క్రాప్ పంపాడు. అందులో - సాయి దేవుడి గురించి కొంత ఉపోద్ఘాతం ఉండి, చివరగా - ఈ స్క్రాప్ ని పదిమందికి పంపండీ, మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.. అన్నాడు. నాకెందుకో అతని మాటలు రుచించలేదు. నిజానికి ఉన్న కాస్తంతలో నేనో మంచి భక్తుడినే.. కాని ఇలా దేవుళ్ళ మీది అభిప్రాయాలని రుద్దటం నాకెందుకో నచ్చలేదు. అలానీ ఊరుకో బుద్ధీ కాలేదు. ఏమి చెయ్యాలో ఆలోచించాను. కాసేపట్లో ఒక ఐడియా వచ్చింది. 'వాటన్ ఐడియా సర్జీ!' అని అనుకున్నాను.

వెంటనే అతనికి స్క్రాప్ పెట్టాను.. "అన్నయ్యా!.. మీ స్క్రాప్ చూశాక - నాకు చాలా సంతోషం వేసింది. పంపినందులకు చాలా కృతజ్ఞతలు.. నేనూ సాయి భక్తుడినే!. కాని - ఇది నిజమా అని కాస్త అనుమానముగా ఉంది. మీరు మరేమీ అనుకోకండీ.. నేను దీన్ని పదిమందికీ పంపించలేను.. ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే - వారిని దైవ సంబంధమైన మొహమాట చర్యలతో, ఇబ్బంది పెట్టలేను. అలా స్క్రాప్స్ ని పంపించి, నానుండి వారిని దూరం చేసుకోలేను. మీరు ఏమీ అనుకోకపోతే - ఆ పదీ స్క్రాప్స్ మీకే పంపిస్తాను. దయుంచి స్వీకరించండీ.. ధన్యవాదములు.." అని నమస్కార బాణం లాగా ఒక స్క్రాప్ పంపాను.

ఆ తరవాత అతను పంపించిన స్క్రాప్ ని కాపీ చేశాను. అతని స్క్రాప్ బుక్ లో స్క్రాపులు గా పేస్ట్ చేశాను.. అలా ఒకదాని తరవాత ఒకటీ.. మొత్తం పది స్క్రాప్స్ పంపాను. ఆ పేజీలోని స్క్రాప్స్ అన్నీ ఇవే!.. ఆతర్వాత నా మనసుకి చాలా ఊరట కలిగింది. హమ్మయ్య..! ఈరోజు ఒక అనుకోకుండా దేవుడికి మ్రొక్కు / ఋణం (?) తీర్చుకున్నాను - అనీ. దేవుడే అలా నాకు స్క్రాప్స్ పంపమని ఆలోచనని ఇచ్చాడా!.. అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చును. స్క్రాప్ ని కాపీ చేసి, ఒకసారి అంటే పంపిస్తారు, రెండోసారి పంపిస్తే స్పామ్ క్రిందకి వచ్చి పోస్ట్ కాదుగా.. అలా పదీ ఎలా పంపారూ - అని మీలో సందేహం ఉండొచ్చు. దానికి సమాధానం చాలా సింపుల్. అలాంటి ఇబ్బంది రాకుండా - ఆ స్క్రాప్ లో (క్షమించాలి.. చెప్పలేను.. చెప్పాక అందరూ ఇబ్బంది పడటం మొదలవుతుంది.) అంతే!..

అతను ఎలా రిసీవ్ చేసుకున్నాడా అని మీకు సందేహమా..! ఎలా అయినా తీసుకోనీ - అనుకుని ముందే నిర్ణయించుకున్నాను. ఒక్కడి వల్ల పదిమందినీ వదులుకోలేను. పదిమంది కోసం ఒక్కడిని వదులుకోవడం తెలివైన నిర్ణయం కదూ.. ఆ తరవాత మా ఇద్దరి మధ్య స్క్రాప్స్ తగ్గాయి. ఒక సుముహూర్తాన - నా ఫాన్స్ లిస్టు నుండి వెళ్ళిపోయాడు. అయినా నాకేం బాధ లేదు. వెళ్ళేవారు వెళుతూనే ఉంటారు.... వచ్చేవారు వస్తూనే ఉంటారు.. అని నేననుకుంటాను. మీరేమంటారూ?.

4 comments:

tankman said...

కత్తి లాంటి ఐడియా రాజ్ గారు , అలాగే..ఈ ఈమెయిలు పదిపందికి పంపితే...యాహూ వాడు Rs. 1 ఇస్తా అన్నాడు, help that little kid లాంటివి కూడా వస్తుంటాయి, వాటికి కూడా ఈ ఐడియా బాగా పని చేస్తుంది....మంచి సలహా ఇచ్చారు ...thankyou

Raj said...

యాహూ, గుగూల్ వాడు అలా ఎప్పుడూ ఇవ్వడు అండీ.. అవన్నీ ఫేక్.. నిజమనుకొని చేసేరు.. టోకుగా ఈమెయిల్ ID లన్నీ అవతలి వారికి అందించినట్లవుతుంది. ఇక మీకు స్పాం మెయిల్స్ తో బాక్స్ నిండిపోతుంది.. అవతలివారూ మిమ్మల్ని తిట్టుకుంటారు. వారు మిమ్మల్ని బ్లాక్ లిస్టు లో పెట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్త. మొన్నే ఇద్దరినీ అలా నా మెయిల్ బాక్స్ - బ్లాక్ లిస్టు లో పెట్టాను.

tankman said...

inkollaki pampinchakarledu raj garu...manaki mail pampinchinavallake...ade mail oka 10 sarlu forward cheste chalu....ippudu ante yahoo messenger vadakam taggindi kani...2 yrs back naa yahoo messenger lo offline msgs anni ilantive undevi....

Raj said...

అవునా..

Related Posts with Thumbnails