DVD రైటర్ లో CD పెట్టాక ఆ CD బఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఆ CD లోని డాటాని రైటర్ లోని లేజర్ కాంతి పుంజము ఆ CD లోని డాటాని చదువుతూ ఉంటుంది.
ఆ CD లోని డాటా చదవటానికి పది నుండి పదిహేను సెకన్ల కన్నా ఎక్కువ సమయం తీసుకోదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సమయం తీసుకున్నట్లు మీకు అనిపిస్తే - ఎజేక్ట్ బటన్ వాడి ఆ CD ని తీసి పరిశీలించండి. ఏమైనా స్క్రాచేస్ వచ్చాయా అని.
ఒకవేళ స్క్రాచేస్ వచ్చినట్లుంటే - ఆ CD ని మళ్ళీ రీడ్ చేసేందుకు ఆ డ్రైవ్ లో పెట్టే సాహాసం చెయ్యకండి. కొన్ని క్రొత్తగా ఉండొచ్చు.. అది కాపీ చేసిన CD అయినా - దాని మాతృక CD మాత్రం గీతలు పడి ఉండవచ్చు. అలాంటి CD నుండి కాపీ చేస్తే - ఆ డాటా ఎర్రర్ ఈ CD లోకి కూడ మారుతుంది.
అలా ఈ CD ని మీ సిస్టం కి ఉన్న రైటర్ లో పెడితే - బఫర్ టైం ఎక్కువ తీసుకొని, మీ రైటర్ ఇక DVD CD లని రీడ్ చేసుకోవు. మామూలు CD లని ప్లే మరియు రికార్డింగ్ చెయ్యగలగుతాయి. ఒక్కోసారి DVD లను ప్లే మాత్రమే చేస్తాయి. రికార్డింగ్ మాత్రం చెయ్యలేవు. వారంటీ ఉంటే - ఓకే. లేకుంటే క్రొత్తగా ఇంకో DVD రైటర్ కొనాల్సిందే.
ఇలా ఒక DVD రైటర్ ని నేను పోగొట్టుకున్నాను. మీరూ అలా చెయ్యకండీ. పది పదిహేను సెకనుల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంటే - ఇక ఆ సీడీని తీసెయ్యండి. మళ్ళీ ఎప్పుడూ ఆ సీడీ ని వాడి మీ రైటర్ ని పాడుచేసుకోకండీ.
Wednesday, December 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment