ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్నదే కాడ మల్లి చెట్టు. దీన్ని పున్నాగ పూలు, ఖేచరీ మల్లి అనికూడా అంటారు. ఖేచరి అంటే తాంత్రిక పూజల్లోని పదం. నాలుకను బాగా బయటకి చాపిన దానికన్నా ఇంకా ఎక్కువ బయటకి చాపితే ఎలా కనపడుతుందో (కుక్క నాలిక లాగా) - ఈ పూల కాడ కూడా అలా పొడుగ్గా ఉంటుందని ఆ పేరు వచ్చిందని నా చిన్నప్పటి జ్ఞాపకం. అసలు ఆ పూవే నా చిన్నప్పటి జ్ఞాపకం.
నేను నా హై స్కూల్ చదువు చదివేటప్పుడు నేను చదివే స్కూల్ చాలా ఊరిబయట ఉండెడిది. బహుశా 3 కి.మీ.ల దూరం. రోజూ నడుచుకుంటూ వెళ్ళేవాడిని. స్కూల్ కి ఇవతల ఈ చెట్టు ఉండెడిది. చలికాలంలో పొద్దున్నే స్కూల్ కి వెళ్ళేవాడిని. ఆ చెట్టు చుట్టూరా ఆ పూలు పడి ఉండేవి. పోనీ ఎక్కి తెంపుదామంటే చాలా పొడవుగా ఉండెడిది. ఆ పూలని ఏరేడివాల్లము. మా పూల ఏరటం ని చూసి ఆ చెట్టుకూ తమాషాగా అనిపించేదిదో గాని, గాలికి ఒక్కో పూవునూ కిందకి వదిలేసేది. ఆ పూలని గాలిలో అందుకోవాలని ఎంతగానో కష్టపడేవాళ్ళం.. మిగతా పిల్లలూ పోటీకి రావటముతో చిన్న, చిన్న పేచీలు వచ్చెడివి.. స్కూల్ బెల్ వినపడగానే అవన్నీ వదిలేసి తుర్రుమని పరిగెత్తడం.. నిజముగా ఆవో మధుర క్షణాలు.. ఇప్పుడు రహదారి విస్తరణలో ఆ చెట్టుని కొట్టేసారు.. కాని నా స్మృతిలోంచి ఎవరూ కొట్టేయలేదు.. నిజానికి ఇన్ని రోజులకి ఇది గుర్తుకువచ్చిందంటే కారణం - నా స్నేహితురాలు. తన ఫోటోలలో ఈ ఫోటో కనపడి.. ... గుర్తుకొచ్చింది.
4 comments:
ఆకాశ మల్లె
బొడ్డు మల్లె
కూడా ఇవేననుకుంటాను.
మేము నివసించిన ఒక ఇంటి వాకిలి గోడకి ఈ చెట్టువుండేది. మీలా స్కూళ్ళనుండి వెళ్ళే పిల్లలతో పాటుగా లోపల్నుండీ బయట నుండీ కూడా పూలు పోగేసి వాటి కాడలతోనే జడ అల్లిక మాదిరిగా మాల అల్లేదాన్ని. అలా అలా ఒక ఐదారు మూరలు అల్లాక మెడలో వేసుకుని హరికథ చెప్పేవారిని అనుకరిస్తూ ఆటలు. ఈ పూలచెట్టు చూడగానే మదిలో మెదిలిన జ్ఞాపకం.
బొడ్డు మల్లి ఇది కాదు అండి అది వేరే గా ఉంటుంది. ఈ పూల చెట్టు మేము ఉన్న ఇంటి చివర ఇంట్లో ఉండేది... రోజు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళే అప్పుడు దారి అంతా భలే వాసన ... అప్పుడప్పుడు వాటికి స్కూల్ బాగ్ లో వేసుకుని వెళ్ళే వాళ్ళం బాగ్ వాసన వస్తుంది అని.. ముందరే వెళ్తే మాత్రం అప్పుడప్పుడు అమ్మాయిల డెస్క్ ల మీద పోసే వాళ్ళం ఎవరో పోసారో తెలీకుండా
It is also called "aakasha malle" and "jooka malle" as it looks like jooka or hangings of ear rings.
Post a Comment