చాలా రోజులకి నేను బ్లాగ్ కి వచ్చాను కదూ! ఈ మధ్య ఓ మంచి పని చేశాను.. అందులోనే చాలా బిజీగా ఉండిపోయాను.. ఇంకా ఆ పని నెల రోజులు పట్టేలా ఉంది.. అదేమిటో, దాని కథాకమామీషు ఇప్పుడు చెబుతాను.
నా మిత్రులు దార్ల వేణు శ్రీకాంత్ యొక్క బ్లాగ్ చూసాను.. అందులోని హెడ్డింగ్ లైను "నా జ్ఞాపకాలని నేను మరచిపోకముందే పదిలపరచుకోవాలి.." చాలాకాలం వెంటాడింది.. నా బ్లాగ్ లోనే "మీ పిల్లలకి మీరే ఇవ్వగలిగే అందమైన కానుక. " అని ఒకటుంది చూడండి.. అందులో కొనసాగింపుగా చివర్లో రాసాను చూడండీ! - ఇంకా ఎలా దీన్ని అద్భుతముగా ఇవ్వాలో అని ఆలోచిస్తున్నా అని..
ఆ మధ్య ఇల్లు సర్దుతుంటుంటే పాతవి నెగటివ్ లు కనిపించాయి.. వాటిని డిజిటల్ కి మార్చవచ్చా? అని తెలుసుకున్నాను. మారుస్తారుట.. ఇంకేం! రెండు, మూడు చోట్ల అడిగాను.. కావని, తెలియదని అన్నారు.. ఇలా కాదని గూగుల్ వాడి సహాయముతో అంతర్జాలం లో వెదికితే ఆ మిషన్ నాలుగువేల డాలర్లు ఉంది.. అంటే ఓ ఇరవై వేలు.. మళ్ళీ ఎవరు చేస్తారని వెదుకులాట.. కూకటపల్లి లో ఒకడు దొరికాడు.. కాని వందకి ఒక రీలు / నెగెటివ్ స్ట్రిప్ అన్నాడు.. రేటు తగ్గదని చెప్పాడు.. ఇంకా వేరే వాడికోసం వెదుకులాట! చివరికి మా బంధువులతో వేదికిస్తే ఓ చోట ఒక షాప్ అతను చేస్తాను అన్నాడు. ఎన్ని ఉన్నాయని అంటే ఓ ఇరవై రీళ్ళు అన్నాను. రీలుకి వందచేప్పి ఆఖరికి అరవై కి ఫిక్స్ అయ్యాడు. ఇంటికి వచ్చి వెదికితే మొత్తం రీళ్ళు - ముప్పై రెండున్నాయి. మళ్ళీ బేరం చేశా.. ఆఖరికి నలభై ఐదుకి సెటిల్ అయ్యింది.. అంటే పద్నాగువందల నలభై రూపాయలు.. ఈబేరం వల్ల పదిహేడువందల అరవై రూపాయలు మిగులు..
రీలు రూపములోని మధుర జ్ఞాపకాలని డిజిటల్ రూపములోనికి మార్చి ఇచ్చాడు.. ఒక్కో ఫోటో 1800*౧౨౦౦ రిజల్యూషన్, 500-600KB ల సైజులో సిడి రూపములోనికి మార్చి మూడు రోజుల్లో ఇచ్చాడు. ముందు జాగ్రత్తగా మూడు CD లలో చేసిచ్చాడు.. వాటిని సిస్టమ్ లోనికి ఎక్కించాను.. రెండు, మూడు రోజులుగా నా గత జ్ఞాపకాలని ఒక్కొక్కటీ చూస్తూ చాలా ఆనందించాను, విశ్లేషించుకున్నాను.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.. ఇంకా నయం! వాటిని ఇంకా అలాగే వదిలేస్తే తేమ వచ్చి నేగేటివ్స్ పాడయ్యిపోయేవి అన్నీ! కాని నా అదృష్టం వల్ల రెండు రీళ్ళు మాత్రమే తేమ వల్ల పాడయ్యాయి.. ప్రస్తుతం ఆ ఫోటోల ప్రోపెర్టీస్ లోనికి వెళ్లి ఆ రీలు నంబరూ, ఆ ఫోటో సీరియల్ నంబరూ, యే గ్రూపుకి చెందిందో ఆ గ్రూపు పేరూ, ఆ ఫోటోలోని వారి పేర్లూ, సందర్భమూ, తేదీ, సమయం అన్నీ రాస్తున్నాను.. ఇప్పటివరకూ మూడింటికి అలా రాసాను.. ఇంకా చాలా మిగిలే ఉన్నాయి.. ఇవన్నీ ముగిసాక మళ్ళీ నాఫొటోలు - నా ఫోల్డరు లోనికి, పిల్లలవి - పిల్లల ఫోల్డరు లోనికి సార్టింగు చెయ్యాలి.. మొత్తానికి నా పిల్లలు పెద్దవారయ్యాక నేను పడిన శ్రమ ఏమిటో వారికి తెలియాలనుకుంటున్నాను.
ఆ ఫోటోల వివరాలు రాస్తున్నపుడు ఎంత కష్టం అవుతున్నదో! ఎందుకో దీన్ని కష్టం అనాలనిపించటం లేదు! ఇష్టముతో కూడిన సుఖమైన కష్టం అనిపిస్తున్నది ఇప్పుడు!.. అప్పుడు వారెవరు, వారి పేరు, ఊరు, భందుత్వం.. యే ఫంక్షన్లో అలా కలిసారు, ఎందుకు.. ఆ ఫోటోలో మిగతా ఉన్నవారి పేర్లూ... అన్నీ ఆ ఫోటో ప్రోపెర్టీస్ కామెంట్స్ లో రాస్తున్నాను.. రేపు ఈ ఫోటోలు వేరే వారి దగ్గరికి చేరినా వారికి ఆ ఫోటోలో ఉన్నా సంగతి అంతా అందులో కనపడాలని నా చిన్ని ప్రయత్నం. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో! నా పిల్లలకి ధీరుభాయి అంబాని లాగా ఏమీ ఇచ్చినా, ఇవ్వకున్నా ఇచ్చినది మాత్రం గొప్పగా ఇవ్వాలనుకుంటున్నాను..
No comments:
Post a Comment