Wednesday, October 30, 2019
Sunday, August 18, 2019
Thursday, August 15, 2019
Monday, August 12, 2019
Wednesday, July 24, 2019
Friday, July 12, 2019
Wednesday, May 15, 2019
Friday, May 10, 2019
Thursday, May 9, 2019
Sunday, May 5, 2019
Good Morning - 764
మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చును., కానీ ఏ పని చెయ్యకుండా ఆనందాన్ని పొందలేము.
అవును.. మనం రోజువారీ చేసే పనుల్లో ఆనందం ఉండకపోవచ్చు.. కారణం - చేసిన పనిని పదేపదే చేస్తుండటం వల్ల ఒక విధమైన నిర్వేదనకి గురి కావొచ్చు.. దానివల్ల చేస్తున్న పని పట్ల అంతగా అంకితభావం చూపెట్టలెం. పలితంగా ఆ పనిలో ఆనందం అంతగా దొరకకపోవచ్చు. కానీ - ఆ పనే అని కాదు.. అసలు ఏ పనీ చెయ్యకుండా సోమరిగా ఉంటూ ఆనందాన్ని పొందగలుగుతాం అనుకోవడం వెర్రి భ్రమ.
Thursday, May 2, 2019
Tuesday, April 30, 2019
Monday, April 29, 2019
Sunday, April 28, 2019
Monday, April 15, 2019
Sunday, April 14, 2019
Good Morning - 758
ఒక చిన్ని చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులని చేస్తుంది.
కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులని ఇస్తుంది.
కనుక మీ విలువైన జీవితాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించండి.
అవును.. మన మొహం మీదున్న చిన్న చిరునవ్వు ఎదుటివారిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. క్రొత్తవారు కూడా మనకు స్నేహితులయ్యేలా చిరునవ్వు చేస్తుంది. కానీ కోపం మాత్రం మనకి ఎందరినో శత్రువులని ఇస్తుంది. ఫలితంగా మనకి మనం అనేకానేక చిక్కులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకే మన విలువైన ఈ జీవితాన్ని - ఆనందముతో సాగిపోయేలా - చిరునవ్వు ముఖంతో పలకరించండి. ఈ చిన్ని చర్య వలన జీవితం మరెంతో అందముగా, ఆనందముగా, అద్భుతంగా ఉంటుంది.
Sunday, March 31, 2019
Sunday, March 24, 2019
Sunday, February 17, 2019
Ink pen
పైన ఫోటోలో ఉన్నది ఒక పెన్. పెన్ అంటే ఇప్పటిలా వాడే జెల్ మరియు బాల్ పాయింట్ పెన్ కాదు. ఇంక్ / సిరా / శాయి పెన్. శాయి అంటే సిరా అని మరొక పేరు. పల్లెటూరి జనాలు ఎక్కువగా ఈ పదాన్ని వాడేవాళ్ళు. ఇప్పటి తరం వాళ్ళకి ఆ పెన్ గురించి అస్సలే తెలియదు. వారికోసం అని ఈ పోస్ట్. ఆ పెన్నులో రిఫిల్ అంటూ ఉండేది కాదు. పైన ఉన్న స్టీల్ క్యాప్ ని తీస్తే, క్రిందన ఒక చివర పాళీ / Nib ఉన్న పెన్ను ఉండేది. దాన్ని పట్టుకునే దగ్గర - రెండు చివర్లో గట్టిగా వ్యతిరేక దిశల్లో త్రిప్పితే - లోపల ఒక గొట్టం లాగా కనిపించేది. అందులో ద్రవరూపంలో ఉండే సిరాని / ఇంకుని జాగ్రత్తగా పోసేడి వాళ్ళం. అలా పోశాక మూతని బిగించి, ఒకసారి విదిలించి, ఇక వ్రాత పని మొదలెట్టే వాళ్ళం.
పైన ఉన్న పెన్ రెండు మోడల్స్ లలో దొరికేది. అప్పట్లో ఆ పెన్ రూపాయికి మరియు రూపాయిన్నరకి ( Rs.1.50 ) వచ్చేది. ఈ రూపాయి పెన్ లో ఆ పెన్ లో సిరా ఎంత ఉందో చూసుకోనేలా ఒక పారదర్శక ప్లాస్టిక్ ( Transparent ) భాగం ఉండేది. అందులోంచి ఆ పెన్ లో ఉన్న సిరా చక్కగా అగుపించించేది. దానివలన ఆ సిరా వల్ల మనం ఎంతగా వ్రాసుకొనే వాళ్ళమో ఒక అంచనాకి వచ్చే వాళ్ళం.
ఇక రూపాయిన్నర ఖరీదు పెన్ లో ఈ ట్రాన్స్ప రెంట్ ప్లాస్టిక్ భాగంతో పాటూ - ఆ బుడ్డి వెనకాల ఒక ఇంకు పిల్లర్ లాంటి ఆకారంలో ఒక రబ్బరు తిత్తి ఉండేది. పెన్ పాళీని సిరా బుడ్డిలో ఉంచి, వెనకాల ఉన్న ఈ తిత్తిని నొక్కితే - ఆ పెన్ లో ఉన్న గాలి బయటకి వెళ్ళిపోయి, ఆ తిత్తి సరి అయ్యే క్రమంలో ఆ పెన్ లోకి ఇంకు నీ పీల్చేది.( Sucking ) అలా ఆ పెన్ లోకి సిరాని నింపడం చాలా తేలిక అయ్యేది. కాస్త స్థోమత గల వాళ్ళందరూ వీటినే ఎక్కువగా వాడేవాళ్ళు. అప్పట్లో ఈ ఇంకు ని చేతి క్రింది పని వారే నింపి, పెన్ ని వ్రాత పనికి సిద్ధముగా ఉంచే వాళ్ళు. ఈ పెన్ మాడల్ రాక ముందు పెన్ లోకి నేరుగా సిరా బుడ్డితో సిరాని వంపుతూ... కారి చేతులూ, పేపర్లూ, నోట్సూ, టేబులూ, నేలా, వేసుకున్న దుస్తులూ.. పాడయ్యేవి. అలాంటి ఇబ్బందిని ఈ పెన్ తొలగించింది. ఇలాంటి సిస్టం ఉన్నమరొక పెన్ - Hero పెన్. ఇది చైనా తయారీ. దీని గురించి ఇంకో టపాలో తెలుసుకుందాం.
ఈ పెన్ కి పాళీలు మొదట్లో బంగారు వర్ణములో వచ్చేవి. వీటి ప్రభావం చివరల్లో స్టీలు రంగులో కూడా వచ్చాయి. ఇవి ఇదు పైసల నుండి పావలా వరకు ఉండేవి. అప్పట్లో ఈ పాళీలని ( NIB ) పత్తీలని అని కూడా అనేవాళ్ళు. దానితో ఈ పెన్ లని పత్తి పెన్ లని అనేవాళ్ళు. ఈ పత్తికి / పాళీ కి చివరన ఒక పాయింట్ ఉండేది. కాస్త లావుగా వ్రాయాలంటే పాళీ ని గట్టిగా వత్తితే ముందు భాగం కాస్త సందు వచ్చి, కాస్త లావుగా వ్రాసేది. ఒక్కోసారి ఇలా వత్తితే పెన్ పాళీ విరిగేది కూడా. పెన్ క్రిందన పడ్డప్పుడు కూడా పెన్ ములికి ( పాళీ ) విరిగేది కూడా.
ఇక ఇంకు నింపాక వెంటనే వీటితో అంటే ఈ సిరా పెన్ లతో వ్రాయటం కష్టం అయ్యేది. అందుకు కారణం - ఆ సిరాలో కాస్త గాలి చేరి, ఆ గాలి బుడగ వ్రాసేటప్పుడు ఆ పాళీ లోకి వచ్చి, ఇంకు ని ప్రవహించనీయకుండా చేసేది. అంటే Air Lock / ఎయిర్ లాక్ అయ్యేది అన్నమాట. అలాంటి సమయాల్లో పెన్ ని విదిలించే వాళ్ళు. అప్పుడు ఆ సిరా ఆ ఎయిర్ / గాలిని తోసుకుంటూ వచ్చి, కాస్త బయటపడేది. ఇలా పడటం ఒక్కోసారి ఎదుటి వ్యక్తుల మీదో, బట్టల మీదో పడేది అన్నమాట. వీటి వల్ల ఇదొక ఇబ్బంది అన్నమాట.
పై ఇబ్బందిని తొలగించటానికి ఆ తరవాత కనుకున్నదే - ఇంకు పిల్లరు. ఇది ప్లాస్టిక్ తో చేసి, వెనకాల ఒక చిన్న గాలి బుడగ తిత్తి ఉండేది, దాని సహాయాన ముందు భాగాన్ని సిరా బుడ్డిలో ఉంచి, వెనకాల భాగాన్ని నొక్కితే అందులోని గాలి బయటకి పోయి, ఆ స్థానాన, ఇంకు చేరేది. అప్పుడు ఆ పిల్లరు లోని ఇంకుని పెన్నులోకి పెట్టి వత్తితే - ఆ ఇంకు పెన్ లోకి సురక్షితముగా వెళ్ళేది.
ఒక్కోసారి ఈ ఇంకు పిల్లర్ లేని స్థానంలో - సిరా బుడ్డి సహాయాన నేరుగా ఇంకు ని పోసి, అప్పుడు మూత కాస్తంత బిగించి, పెన్ ని నిలువుగా, పాళీ ని సిరా బుడ్డిలోకి వచ్చేలా నిలబెట్టి, పెన్ కి మూత బిగించే వాళ్ళు. అలా చేస్తే - ఆ పెన్ లోని గాలి మాయమై. ఎక్కువైన సిరా కూడా బయటకు వచ్చేది. ఈ క్రమంలో ఆ పెన్ సిరా కాలువ శుభ్రం అయ్యి, పెన్ సాఫీగా వ్రాసేది.
ఈ బిగించే కార్యక్రమం ఎక్కువగా చేతులతో అయ్యేది.. బలం సరిపోనప్పుడు - నోటిలోని పళ్ళతో బిగించి, తిప్పెడి వాళ్ళు. ఒక్కోసారి అప్పుడు సిరా కారి, నోరంతా సిరామయం అయ్యేది. ఆ పెన్ ని పక్కన పెట్టి, నోరుని పుక్కిలించి, కడిగేవాళ్ళు.
ఇవీ నా ఇంకు పెన్ జ్ఞాపకాలు.
Sunday, February 10, 2019
Good Morning - 755
నా జీవితం పై స్థాయిలోనే ప్రారంభమై, ఆ స్థాయిలోనే అక్కడే ఉండిపోవడం కన్నా - క్రింది స్థాయిలో ప్రారంభమై, క్రమంగా నాకై నేను పేర్చుకున్న మెట్టు పైనుంచి - పై స్థాయికి వెళ్ళి, అక్కడితోనే ఆగిపోక, ఆకాశాన్నే నా హద్దుగా చేసుకొని జీవితాంతం ఎక్కుతూనే ఉండాలని కోరుకుంటాను. ఎక్కుతూ, ఎదుగుతూ - ఎదుగుతూ ఎక్కడం నా ధ్యేయం కావాలి.
Friday, February 1, 2019
Sunday, January 27, 2019
Friday, January 18, 2019
LED Tube lights
https://achampetraj.blogspot.com/2019/01/electronic-choke-tube-lights.html తరువాయి భాగం
LED ట్యూబ్ లైట్స్ - ఇప్పుడు ఎక్కువ చోట్ల వాడటం మొదలయ్యింది. ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్స్ తరవాత వచ్చిన చక్కని విద్యుత్ కాంతి దీపాలు. మొదట్లో ఇవి పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ షాప్స్ లలో లేదా ఆన్లైన్ అంగళ్ళలో మాత్రమే లభించేవి. అప్పట్లోనే ఒక ట్యూబ్ లైట్ తెచ్చాను. వాటి ధర బయట వేయి రూపాయలుగా, ఆన్లైన్ లో ఏడువందల యాభై చిల్లరలో దొరికేవి.
అప్పట్లో వాటి గురించి అంతగా అవగాహన లేదు.. ఏమిటి ? ఎలా ? ఎందుకు? అనేలా. వాడితే బాగుంటాయేమో అనుకొని వాడా.. కానీ అప్పట్లో టెక్నాలజీ ఇప్పట్లో ఉన్నంత అభివృద్ధిలో లేదు. ఆ LED ట్యూబ్ లైట్ నుండి వచ్చే కాంతి - మామూలు ట్యూబ్ లైట్ కాంతి అంతగా కూడా లేదు. ఒక సెట్ లో రెండు LED ట్యూబ్ లైట్స్ వచ్చేవి. ఆ రెండూ వాడితే ఒక మామూలు ట్యూబ్ లైట్ వెలుతురు అన్నంతగా ఉండేది. అప్పట్లో వాటి గురించి అంతగా టెక్నికల్ గా ఎదగలేదు. ఇప్పుడు చాలా కొద్దిగా తెలుసుకున్నాను. అవి మీకేమైనా ఉపయోగపడతాయని ఇప్పుడు చెప్పడం.
ధర : : మొదట్లో బాగా ఎక్కువ ధరలో ఇవి మార్కెట్లలోకి వచ్చినా ఇప్పుడు చాలా అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయల్లో దొరుకుతున్నాయి. వీటి వల్ల మామూలు ట్యూబ్ లైట్స్ సెట్స్ ధరలు బాగా పడిపోయి, వందా యాభై లలో దొరుకుతున్నాయి. ఒకవేళ మీ మామూలు / ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ పాడయితే - ఇదే మంచి తరుణం అనుకోని వెంటనే ఆ ట్యూబ్ సెట్ ని మార్చేసి, ఈ LED ట్యూబ్ కి మారిపోవడం చాలా మంచి పని చెప్పవచ్చు. నేనైతే అంత సమయం తీసుకోలేదు.. దాదాపు పది ట్యూబ్ లైట్స్ ని తీసేసి, కొంత సమయం తీసుకొని, ఎంచక్కా ఈ LED మారిపోయా.. అంతగా టెంప్ట్ అయ్యా..
ఇక్కడ ఒక చిన్న షాపింగ్ చిట్కా చెప్పబోతున్నా - అన్ని ట్యూబ్ సెట్స్ ఒకేసారి తీసుకొనే బదులు - కొంతకాలం అంతరం ఇస్తూ - అప్పుడొకటి, ఇప్పుడొకటి అనేలా కొంటే - తక్కువ ధరా, ఎక్కువ మన్నిక ఉన్నదీ, ఎక్కువ వెలుతురు ఉన్నదీ, మరింత అనుకూలమైన ఆకారంలో, అందమైన రూపం లో ఉన్నదీ.. దొరుకుతుంది. ఇలా ఒక్క ట్యూబ్ సెట్స్ అనే కాదు. అన్ని వస్తువులూ ఒకేసారి కొనవద్దు. కొంత గ్యాప్, అంగడీ / దుకాణం మారిస్తే చాలా అద్భుత ఫలితం దొరుకుతుంది. నేనిలాగే కొనడం మొదలెట్టాను. ఫలితంగా మంచి షాపింగ్ ఫలితాన్ని పొందుతున్నాను. ఒకే ఒక దుకాణంలో నేను కొనుగోలు చేస్తాను అని చెప్పుకోవడం గొప్పగా ఉండొచ్చు కానీ - వారు చాలా చాలా అవకాశాల్ని కోల్పోతారు..
ఆకారం / బరువు : ఈ సెట్ల బరువు చాలా తక్కువ. సాంప్రదాయ ట్యూబ్ లైట్స్ సెట్ల కన్నా - ఎలక్ట్రానిక్ సెట్స్ చాలా తక్కువ బరువు అనుకుంటే - ఈ LED సెట్లు మరీ తక్కువ బరువు. అలాగే వాటి కన్నా కొద్దిగా తక్కువ పొడవు, మరింత సన్నగా ఉంటాయి. ఇంత సన్నగా ఉన్న ట్యూబ్ నుండి - గదికి సరిపడే వెలుతురు వస్తుందా ? అనే ఆలోచన కలగటం సహజం. కానీ చాలా బాగా వెలుతురు వస్తుంది. మరొక విషయం కూడా గమనించవచ్చు - అందమైన గదికి దీని అమరిక వల్ల మరింత అందమూ, వెలుతురు వల్ల ఆ గదిలోని వస్తువులు మరింత ప్రకాశవంతముగా కనిపిస్తాయి.
మన్నిక / వారంటీ : ఇవి చాలా మన్నికనిస్తాయి. కనీసం ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వారంటీ వాటికి ఉంటుంది. ఈ సమయంలో ఆ సెట్ పాడయితే - దాన్ని రిపేర్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఎక్కడైతే కొన్నామో అక్కడే ఇచ్చేస్తే - ( బిల్ చూసి, గడువు మించకుండా ఉన్నట్లయితే ) వెంటనే చెక్ చేసి, మరొక ట్యూబ్ లైట్ ఇస్తారు. ఈ సదుపాయం వల్ల మనకు డబ్బు ఆదా అవుతుంది. ఇక్కడ మీకు మరొక చిట్కా - ఈ సదుపాయాన్ని వాడుకోవాలి అనుకుంటే - ఎంచక్కా స్థానికంగా కొనడమే మంచిది. అదే ఆన్లైన్ గానీ / దూరముగా ఉన్న పట్టణం నుండి కొన్నట్లయితే - అక్కడికి వెళ్ళి గానీ / పార్సెల్ చేసి గానీ ఇంకొకటి పొందాల్సి వస్తుంది. ఇది వ్యయ ప్రయాసతోటి కూడుకున్నది. మరొకటి వచ్చేవరకూ అంతవరకూ దాన్ని వాడిన గది చీకట్లో ఉంచలేం కదా.. అందుకే కొన్ని వస్తువులను స్థానికముగానే కొనాల్సి ఉంటుంది.
వెలుగు : ఈ LED ట్యూబ్స్ చాలా ప్రకాశవంతముగా వెలుగుని ఇస్తాయి. కాంతిని కొలిచే కెల్విన్ తాపమానం ( Kelvin Temparature ) లో చెప్పాలీ అంటే ఇవి 6500k ప్రకాశవంతం గా ఉంటాయి. క్యాండిల్ / మైనం వత్తి 1000k వెలుగునిస్తే - సూర్యుడు 5500k ప్రకాశవంతాన్ని ఇస్తాడు. అంటే ఎరుపు / ఆరెంజ్ రంగు నుండి క్రమక్రమంగా పసుపులోకి మారి ఆతర్వాత తెలుపుగా మారుతుంది. మామూలు విద్యుత్ దీపం లేత పసుపు రంగులో వెలుతురునిస్తాయి. ట్యూబ్ లైట్ వెలుతురులో తెల్లని బట్టలను చూసేదానికన్నా - ఈ LED దీపాల వెలుతురులో మరింత తెలుపుగా కనిపిస్తాయి. అందుకే వ్యాపార సంస్థలు వీటిని బాగా వాడుతున్నాయి. మిగతా అన్నింటికన్నా - ఒక వాట్ విద్యుత్ కి - చాలా ఎక్కువ / దాదాపు ఒక వంద లూమెన్స్ ( కాంతిని కొలిచే ప్రమాణం ) ని ఇస్తాయి. ఇదే వీటిల్లో కీలకమైన అంశం.
లూమెన్స్ : ల్యూమెన్స్ Lumens అనేది ఈ విద్యుత్ కాంతి పరికరములలో చాలా ప్రధాన అంశం. అస్సలు ఈ పోస్ట్ లో చెప్పాల్సింది అంతా దీని గురించే. LED సాంకేతికత విషయాల్లో అన్నింటికన్నా ఎక్కువ పట్టించుకోవాల్సిందీ ఈ విషయమే. లూమెన్స్ అనేది ఒక విద్యుత్ కాంతి పరికరము నుండి వచ్చే వెలుతురు ఎంత మొత్తంలో వస్తుందో దీనిని ప్రమాణముగా చెబుతారు. మామూలుగా ఇప్పుడు వచ్చే LED కాంతి పరికరాలు ఒక వాట్ విద్యుత్ ని ఉపయోగించుకొని 100 లూమెన్స్ కాంతిని ఇస్తాయి. అంటే 20w వాట్ల LED ట్యూబ్ మనకు 2000 లూమెన్స్ వెలుతురుని ఇస్తాయన్నమాట. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత కాంతిని ఇస్తాయన్నమాట.
ఎలాగూ ఈ లూమెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా.. మరింత వివరముగా చెబుతాను.
ఈ లూమేన్స్ ని మనం అస్సలు విలువ / అంచనా కట్టలేం. వీటిని నిర్దారించాలంటే - తగిన పరికరాలు అవసరం. సదరు కంపనీ వాళ్ళే వీటిని ముద్రిస్తారు. వీటిని తెలుసుకోవటానికి ఆయా విద్యుత్ కాంతి పరికరాల మీద వచ్చే డబ్బా / కార్టన్ / ప్యాకేజ్ మీద ఉన్న వివరాలే ముఖ్యమైన సమాచారం. కొనేటప్పుడు "ఏదో ఒకటి.. అన్నీ అంతేలే.." అంటూ కొంటే మీరే మీకు తగిన వస్తువు తీసుకోలేక పోతున్నారు అని అర్థం.
గుర్తింపు లేని కంపనీలు / ఇతర దేశాల నుండి బల్క్ గా దిగుమతి చేసుకోబడిన వాటి మీద ఈ వివరాలు అస్సలు ఉండవు. ఇలాంటి కంపనీల కవర్ల మీద చాలా ఎక్కువగా లూమేన్స్ ఉన్నట్లు ప్రచురిస్తాయి. కానీ అవి వాస్తవంలో అబద్హాలు - మనం మోసపోయాం అని వాటి వాడుకలో తెలుస్తుంది. తిరిగి వాపస్ ఇవ్వాలంటే - పాడేసిన కవర్. దూరాభారాలు / తగిన సమయం / ఓపిక.... ఇత్యాది కారణాల వల్ల ఇవ్వలేక పోతాం. అలా కొద్దిగా మానసిక అశాంతికి గురి అవుతాం. ఇక్కడ మీకో చిన్న టిప్ ఇస్తాను.
వస్తువు తయారీ సంస్థ చిరునామా ఏదో చిన్నగా - LED Industries, Delhi - 10 అన్నట్లు కాకుండా, వివరముగా ( రోడ్ పేరు, ఏరియా పేరు, పోస్టల్ కోడ్, కస్టమర్ కేర్ నంబర్... ) ఉన్నట్లయితే వాటిని నమ్మవచ్చు. అవి లేని సంస్థల వివరాలని నమ్మి మోసపోవద్దని నా సూచన. ఒకసారి కొన్నాక చాలా కాలం మన్నిక వస్తాయి - కానీ వెలుతురు తక్కువగా ఉండి, వాటిని వాడే కాలమంతా ఏదోలా అనిపిస్తుంది.
వీటిల్లో గొప్ప బ్రాండెడ్ వస్తువులే బాగుంటాయి అని అనుకోవద్దు.. ఒక్కోసారి మామూలుగా ఎప్పుడూ వినని బ్రాండ్ లూ కూడా బాగుంటాయి. కాకపోతే కంపనీ అన్ని వివరాలు + లూమెన్స్ వివరాలు ఉంటే - పరిశీలించి కొనొచ్చు.
మొదట్లో కొన్న ఒక ట్యూబ్ అమెజాన్ సంస్థలో కొన్నాను. కానీ అప్పుడు ఈ లూమేన్స్ గురించి తెలీదు. రెండు LED ట్యూబ్ లైట్స్ వాడితే ఒక సంప్రదాయ ట్యూబ్ వెలుతురుని ఇచ్చాయి / ఇస్తున్నాయి. అంటే అంత తక్కువ కాంతిని వాటివల్ల పొందుతున్నాను. కానీ నేను కొన్నప్పుడు అవే మంచి బ్రాండ్స్. రెండు సంవత్సరాల క్రిందట మరొకటి స్థానికముగానే కొన్నాను. అక్కడ 20w ట్యూబ్ వాడుతున్నాను. ఈ LED ట్యూబ్ వాటికన్నా బాగా కనిపించింది. చిన్న ట్యూబ్ కీ దీనికి తేడా ఎందుకూ అని అంత పరిశీలన చెయ్యలేదు. ఒక పది రోజుల క్రిందట - మామూలు ట్యూబ్ బాగున్న స్థానంలో - ఏదో క్రొత్త కంపనీ LED ట్యూబ్ బిగించి వాడాను.
ఆశ్చర్యం. ఆ ట్యూబ్ కన్నా ఈ LED ట్యూబ్ వెలుతురు మరింత చాలా బాగా ప్రకాశవంతం గా ఉంది. అస్సలు ఆ పెద్దగదిలో రెండు ట్యూబ్ లైట్స్ వాడాల్సింది. 40w + 40w = 80w/గంట ని వాడాల్సింది.. కానీ ధైర్యం చేసి, ఈ ఎన్నడూ పేరు వినని Make in India కంపనీ అయిన ఒక సంస్థ ( అడ్రెస్స్ పూర్తిగా ఉంది ) ట్యూబ్ ని కొన్నాను. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం - ఈ ట్యూబ్ - 28w - హా.. నిజమే. క్రొత్తగా వస్తున్నాయి. మార్కెట్లో ఉన్న 20w LED ట్యూబ్ ల కన్నా ఇవి 8w వాట్లు ఎక్కువ. ఫలితం - మరో 800 లూమెన్స్ కాంతిని అదనముగా అదే పరికరం ద్వారా పొందుతాను ( 28w x 100 = మొత్తం 2800 Lumens ) మరొక విద్యుత్ కాంతి పరికరం బిగించాల్సిన అవసరం లేదు. అందువల్ల దీనికే మొగ్గు చూపాను.
దాన్ని బిగించి వాడి చూశాను. అంతకు ముందున్న ఎలక్ట్రానిక్ ట్యూబ్ కన్నా మరింత వెలుగు.. అవాక్కయ్యావా ? అన్నట్లు. నిజమే.! రెండు ట్యూబ్స్ వాడే చోట్ల ఒక్క ట్యూబ్ తోనే సరిపోయింది. అదీ చాలా వెలుతురుతో. ఈ కాంతిలో తెలుపురంగు మరింత కాంతితో కనిపించసాగింది.
మా గదిలో రెండు సంప్రదాయ ట్యూబ్స్ = 40w + 40w = 80w
( - ) ఒక LED ట్యూబ్ 28w
------------------------------------------
( 80w - 28w ) = 52w/ hour మిగులు అన్నమాట
రోజుకి నాలుగు గంటలు వాడినట్లయితే = 52 x 4 = 208w మిగులు
అదే నెలకి అయితే = 208w x 30 రోజులు = 6240w = 6.240kwh
యూనిట్ వెల Rs. 5 అనుకుంటే
6.240kwh x 5 = Rs. 31.20 మిగులుతుంది.
ఈ ట్యూబ్ ధర నేను Rs. 320 పెట్టి కొన్నాను ( 20w వి Rs. 230 నుండి Rs. 260 వరకూ లభిస్తున్నాయి )
దాదాపు పది నెలల్లో ఆ ట్యూబ్ కి అయిన ఖర్చు మొత్తాన్ని తిరిగి పొందుతున్నాను అన్నమాట.
ఈ లెక్కలు - భారీ బంగ్లాల్లో, ఆఫీసుల్లో బాగా పనికివస్తాయి. మామూలుగా అయితే అంత ఆదా కనిపించదు. వెలుతురు కోసమైతే కొనక తప్పదు.
ఇక్కడ ప్రధానముగా గమనించాల్సింది - పైన చెప్పిన టిప్స్ ని పాటించాను.. మళ్ళీ వాటిని గుర్తుచేస్తున్నాను..

- ఒక వస్తువు మార్కెట్లోకి రాగానే వెంటనే కొనవద్దు.
- ఆ వస్తువు గురించిన వివరాలు తెల్సుకోవాలి.
- పేరొందిన కంపనీ అని చూడాల్సి వచ్చినా ఒక్కోసారి అరుదుగా మామూలు కంపనీల వస్తువులు బాగుంటాయి.
- ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనవద్దు.
- కంపనీ వివరాలు లేనివి అస్సలు కొనవద్దు.
- ఆ వస్తువు సాంకేతిక వివరాలు వివరాలు లేకుంటే వాటి జోలికి వెళ్ళక పోవడమే మంచిది.
- ఎప్పుడూ ఒకే అంగడి / షాప్ లో కొనవద్దు. వాటిని మారుస్తుంటే - మనకు ఎన్నో క్రొత్తవి దొరుకుతాయి అలాగే క్రొత్త విషయాలూ తెలుస్తాయి.
Wednesday, January 9, 2019
Monday, January 7, 2019
Electronic choke tube lights
https://achampetraj.blogspot.com/2018/12/fluorescent-tube-light-starter.html తరువాయి భాగం :
ఎలక్రానిక్ చోక్ గల ట్యూబ్ లైట్ సెట్ అమర్చాక ఇక - స్విచ్ వెయ్యగానే అలా ట్యూబ్ లైట్ రావటం మొదలైంది. మామూలు ట్యూబ్ లైట్ సెట్ల కనా ఇవి చాలానయం. కొద్దిగా ఖరీదైననూ మన్నికా, సులభ వాడకం మూలాన ఇవి బాగా ఆకట్టుకున్నాయి. వీటి సాంకేతికత వల్ల ట్యూబ్ పట్టే మీద ఉండే స్టార్టర్ మాయం అయ్యింది. అలాగే రెండు, మూడు సార్లు ఫ్లిక్ అయ్యి నెమ్మదిగా వెలిగే బాధ తొలగింది. అలాగే లో వోల్టేజీ ఇవి చక్కగా వెలుగుతుంటాయి, స్టార్ట్ అవుతాయి కూడా. అంతకు ముందు తరం ట్యూబ్ లైట్స్ మాత్రం అలా ఉండేవి కావు. కాసింత వోల్టేజీ తగ్గితే మినుకు మినుకు మంటూ వెలగటం, మరీ తగ్గితే అస్సలు వెలగక పోవటం లాంటివి జరిగేవి.
పాత తరం ట్యూబ్ లైట్స్ లో ఉండే స్టార్టర్ పాడయితే - ఆ స్టార్టర్ ని తీసేసి, ఆ స్టార్టర్ హోల్డర్ లోని రెండు పాయింట్స్ మీద - రెండు చివర్ల మీదున్న ప్లాస్టిక్ తొడుగుని తీసేసిన మామూలు చిన్న ఎలక్ట్రికల్ వైరు ముక్కతో ఆ రెండు పాయింట్స్ నీ స్పార్క్ వచ్చేలా రాపిడి చేసేవాడిని. అలా చేస్తే ఒక్కోసారి ట్యూబ్ లైట్ వెలిగేది. అంటే స్టార్టర్ కాస్త నలుపులోకి మారి సరైన రేటింగ్లో కరెంట్ ఫ్లిక్ ని ఇవ్వలేకపోతున్నది అన్నమాట.. లేదా కాస్త వోల్టేజీ తగ్గిందన్న కారణం వల్ల అలా అవుతుంది. ఇలా చేస్తున్న క్రమంలో ఎన్నోసార్లు నాకు కరెంట్ షాక్ తగిలింది కూడా.
పాతతరం ట్యూబ్ లైట్స్ ని కేవలం వాటి చోక్ మార్చటం ద్వారా ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ గా మార్చుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉండే ఈ కనెక్షన్ ఒకసారి చూస్తే మనమూ చేసుకోవచ్చు. వీటిల్లో అంతా బాగుంది కానీ ఒకే ఒక లోపం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. వీటిని సేపరేటుగా తెచ్చుకొని, పాత ట్యూబ్ కి ఎక్కించి, వాడుకుందాం అనుకుంటే - వీటిని ఆ ట్యూబ్ ఇనుప పట్టీకి బిగించుకోవడానికి ఎలాంటి రంధ్రాలు, టేపులు, తీగలు పెట్టి చూడటానికి అందముగా ఉండేలా చేసుకోరాదు. కరెంట్ టేపు ద్వారానో, తీగల వల్ల గానీ, రెండు వైపులా జిగురున్న థర్మాకోల్ టేప్ సహాయాన గానీ, కేబుల్ టైస్... వల్లనో ఆ పట్టీకి బిగించుకోవాలి. కానీ రెండు స్క్రూలు సహాయన ఆ పట్టీకి బిగించుకొనే అవకాశం చాలా చోక్స్ లలో లేదు. ఇదొక్కటే లోపం. కొన్నింటిలో ఉన్నా - కంపనీ కంపనీకి వేరు వేరు సైజుల్లో రంధ్రాలు ఇవ్వటంతో - అన్ని సెట్లకూ అడ్జస్ట్ అవవు. ఈ లోపం సరిదిద్దేలోగా ఆధునికముగా వచ్చిన LED ట్యూబ్స్ కారణాన ఇవీ కనుమరుగయ్యే సమయం ఆసన్నమయ్యింది.
ఈ ఎలక్రానిక్ చోక్స్ వల్ల మరిన్ని ఉపయోగాలు ఏమిటంటే :

- మినుకు మినుకుమంటూ ట్యూబ్ లైట్స్ వెలగవు.
- స్విచ్ వేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెలుగు వస్తుంది.
- లో వోల్టేజీలో కూడా చక్కగా పనిచేస్తుంది.
- స్టార్టర్ బాధ తప్పుతుంది. దాని ఖర్చూ ఉండదు.
- ట్యూబ్ లైట్ రూల్ మన్నిక బాగా ఉంటుంది. ఏళ్లకు ఏళ్ళు గా మనుగడ వచ్చి, ట్యూబ్ లైట్స్ మాటిమాటికీ కొనాల్సిన బాధ తగ్గుతుంది.
- సాంప్రదాయ బరువైన ( అల్యూమినియం వైండింగ్ ) చోక్స్ కన్నా వీటి బరువు చాలా తక్కువ. ఫలితముగా పట్టీని బలంగా బిగించుకోవాల్సిన అవసరం లేదు.
- ఇవి కరెంట్ ని చాలా తక్కువ వాడుకుంటాయి. కరెంట్ బిల్లూ కాస్త తక్కువగానే ఉంటుంది. అల్యూమినియం చోక్స్ దాదాపు 10 నుండి 15 వాట్లు / గంటకు అదనముగా వాడుకుంటాయని ఒక అంచనా. ఇదే విద్యుత్ వృధా అనుకోకుండా - ఒకవేళ ఇంకొక బల్బ్ రూపంలో వాడితే ఈ 10 - 15 వాట్లు గల బల్బ్ వల్ల గదికి మరింత వెలుగుని ఇవ్వవచ్చు.
- అందరికన్నా వీటిని మరొక పద్ధతిలో కూడా వీటిని బాగా వాడుకున్నాను. అందరి ఇళ్ళల్లో మామూలు సెట్లు ఉన్న రోజుల్లో - వారి ట్యూబ్స్ ఒకవైపు కాలిపోయి / నల్లగా అయ్యి వేలిగేవి కావు. వాటిని బయట పడేసేవాళ్ళు. నేను మాత్రం అలా పడేసే వాటిని ఈ ఎలక్ట్రానిక్ చోక్స్ సెట్లలో అమర్చి మరొక కొంతకాలం / మూడు నుండి పన్నెండు నెలలు వాడుకొనే వాడిని. ఇలా వాడుకోవచ్చన్నది చాలా మందికి తెలీదు. ఎవరైనా వాడుకుంటారని ఈ టిప్ చెబుతున్నాను. కాకపోతే - రెండు వైపులా నల్లబడినవి మాత్రం మళ్ళీ పనిచెయ్యవు. ఒకవైపు నల్లగా మారినివి మరికొంత కాలం ఈ పద్ధతిలో భేషుగ్గా వాడుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)