ఒక చిన్ని చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులని చేస్తుంది.
కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులని ఇస్తుంది.
కనుక మీ విలువైన జీవితాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించండి.
అవును.. మన మొహం మీదున్న చిన్న చిరునవ్వు ఎదుటివారిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. క్రొత్తవారు కూడా మనకు స్నేహితులయ్యేలా చిరునవ్వు చేస్తుంది. కానీ కోపం మాత్రం మనకి ఎందరినో శత్రువులని ఇస్తుంది. ఫలితంగా మనకి మనం అనేకానేక చిక్కులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకే మన విలువైన ఈ జీవితాన్ని - ఆనందముతో సాగిపోయేలా - చిరునవ్వు ముఖంతో పలకరించండి. ఈ చిన్ని చర్య వలన జీవితం మరెంతో అందముగా, ఆనందముగా, అద్భుతంగా ఉంటుంది.
No comments:
Post a Comment