https://achampetraj.blogspot.com/2018/12/fluorescent-tube-light-starter.html తరువాయి భాగం :
ఎలక్రానిక్ చోక్ గల ట్యూబ్ లైట్ సెట్ అమర్చాక ఇక - స్విచ్ వెయ్యగానే అలా ట్యూబ్ లైట్ రావటం మొదలైంది. మామూలు ట్యూబ్ లైట్ సెట్ల కనా ఇవి చాలానయం. కొద్దిగా ఖరీదైననూ మన్నికా, సులభ వాడకం మూలాన ఇవి బాగా ఆకట్టుకున్నాయి. వీటి సాంకేతికత వల్ల ట్యూబ్ పట్టే మీద ఉండే స్టార్టర్ మాయం అయ్యింది. అలాగే రెండు, మూడు సార్లు ఫ్లిక్ అయ్యి నెమ్మదిగా వెలిగే బాధ తొలగింది. అలాగే లో వోల్టేజీ ఇవి చక్కగా వెలుగుతుంటాయి, స్టార్ట్ అవుతాయి కూడా. అంతకు ముందు తరం ట్యూబ్ లైట్స్ మాత్రం అలా ఉండేవి కావు. కాసింత వోల్టేజీ తగ్గితే మినుకు మినుకు మంటూ వెలగటం, మరీ తగ్గితే అస్సలు వెలగక పోవటం లాంటివి జరిగేవి.
పాత తరం ట్యూబ్ లైట్స్ లో ఉండే స్టార్టర్ పాడయితే - ఆ స్టార్టర్ ని తీసేసి, ఆ స్టార్టర్ హోల్డర్ లోని రెండు పాయింట్స్ మీద - రెండు చివర్ల మీదున్న ప్లాస్టిక్ తొడుగుని తీసేసిన మామూలు చిన్న ఎలక్ట్రికల్ వైరు ముక్కతో ఆ రెండు పాయింట్స్ నీ స్పార్క్ వచ్చేలా రాపిడి చేసేవాడిని. అలా చేస్తే ఒక్కోసారి ట్యూబ్ లైట్ వెలిగేది. అంటే స్టార్టర్ కాస్త నలుపులోకి మారి సరైన రేటింగ్లో కరెంట్ ఫ్లిక్ ని ఇవ్వలేకపోతున్నది అన్నమాట.. లేదా కాస్త వోల్టేజీ తగ్గిందన్న కారణం వల్ల అలా అవుతుంది. ఇలా చేస్తున్న క్రమంలో ఎన్నోసార్లు నాకు కరెంట్ షాక్ తగిలింది కూడా.
పాతతరం ట్యూబ్ లైట్స్ ని కేవలం వాటి చోక్ మార్చటం ద్వారా ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ గా మార్చుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉండే ఈ కనెక్షన్ ఒకసారి చూస్తే మనమూ చేసుకోవచ్చు. వీటిల్లో అంతా బాగుంది కానీ ఒకే ఒక లోపం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. వీటిని సేపరేటుగా తెచ్చుకొని, పాత ట్యూబ్ కి ఎక్కించి, వాడుకుందాం అనుకుంటే - వీటిని ఆ ట్యూబ్ ఇనుప పట్టీకి బిగించుకోవడానికి ఎలాంటి రంధ్రాలు, టేపులు, తీగలు పెట్టి చూడటానికి అందముగా ఉండేలా చేసుకోరాదు. కరెంట్ టేపు ద్వారానో, తీగల వల్ల గానీ, రెండు వైపులా జిగురున్న థర్మాకోల్ టేప్ సహాయాన గానీ, కేబుల్ టైస్... వల్లనో ఆ పట్టీకి బిగించుకోవాలి. కానీ రెండు స్క్రూలు సహాయన ఆ పట్టీకి బిగించుకొనే అవకాశం చాలా చోక్స్ లలో లేదు. ఇదొక్కటే లోపం. కొన్నింటిలో ఉన్నా - కంపనీ కంపనీకి వేరు వేరు సైజుల్లో రంధ్రాలు ఇవ్వటంతో - అన్ని సెట్లకూ అడ్జస్ట్ అవవు. ఈ లోపం సరిదిద్దేలోగా ఆధునికముగా వచ్చిన LED ట్యూబ్స్ కారణాన ఇవీ కనుమరుగయ్యే సమయం ఆసన్నమయ్యింది.
ఈ ఎలక్రానిక్ చోక్స్ వల్ల మరిన్ని ఉపయోగాలు ఏమిటంటే :

- మినుకు మినుకుమంటూ ట్యూబ్ లైట్స్ వెలగవు.
- స్విచ్ వేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెలుగు వస్తుంది.
- లో వోల్టేజీలో కూడా చక్కగా పనిచేస్తుంది.
- స్టార్టర్ బాధ తప్పుతుంది. దాని ఖర్చూ ఉండదు.
- ట్యూబ్ లైట్ రూల్ మన్నిక బాగా ఉంటుంది. ఏళ్లకు ఏళ్ళు గా మనుగడ వచ్చి, ట్యూబ్ లైట్స్ మాటిమాటికీ కొనాల్సిన బాధ తగ్గుతుంది.
- సాంప్రదాయ బరువైన ( అల్యూమినియం వైండింగ్ ) చోక్స్ కన్నా వీటి బరువు చాలా తక్కువ. ఫలితముగా పట్టీని బలంగా బిగించుకోవాల్సిన అవసరం లేదు.
- ఇవి కరెంట్ ని చాలా తక్కువ వాడుకుంటాయి. కరెంట్ బిల్లూ కాస్త తక్కువగానే ఉంటుంది. అల్యూమినియం చోక్స్ దాదాపు 10 నుండి 15 వాట్లు / గంటకు అదనముగా వాడుకుంటాయని ఒక అంచనా. ఇదే విద్యుత్ వృధా అనుకోకుండా - ఒకవేళ ఇంకొక బల్బ్ రూపంలో వాడితే ఈ 10 - 15 వాట్లు గల బల్బ్ వల్ల గదికి మరింత వెలుగుని ఇవ్వవచ్చు.
- అందరికన్నా వీటిని మరొక పద్ధతిలో కూడా వీటిని బాగా వాడుకున్నాను. అందరి ఇళ్ళల్లో మామూలు సెట్లు ఉన్న రోజుల్లో - వారి ట్యూబ్స్ ఒకవైపు కాలిపోయి / నల్లగా అయ్యి వేలిగేవి కావు. వాటిని బయట పడేసేవాళ్ళు. నేను మాత్రం అలా పడేసే వాటిని ఈ ఎలక్ట్రానిక్ చోక్స్ సెట్లలో అమర్చి మరొక కొంతకాలం / మూడు నుండి పన్నెండు నెలలు వాడుకొనే వాడిని. ఇలా వాడుకోవచ్చన్నది చాలా మందికి తెలీదు. ఎవరైనా వాడుకుంటారని ఈ టిప్ చెబుతున్నాను. కాకపోతే - రెండు వైపులా నల్లబడినవి మాత్రం మళ్ళీ పనిచెయ్యవు. ఒకవైపు నల్లగా మారినివి మరికొంత కాలం ఈ పద్ధతిలో భేషుగ్గా వాడుకోవచ్చు.
No comments:
Post a Comment