ఈరోజు ఇంటిలోని హాల్ గదిలోనికి క్రొత్త LED ట్యూబ్ లైట్ పట్టీ తెచ్చాను. అప్పటివరకూ హాల్ గదిలో - గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ ని తీసేసి ఇది అమర్చాల్సి వచ్చింది. ఆ కథాకమామీషు ఇప్పుడు..
1998 సంవత్సరములో Anchor ఆంకర్ కంపనీ క్రొత్త ట్యూబ్ లైట్ కంప్లీట్ సెట్ తెచ్చి అమర్చాను. అప్పట్లో ఈ ట్యూబ్ లైట్ ఉండటమే ఒక హోదాగా ఉండేది. అప్పట్లో ఈ మొత్తం సెట్ ధర 400 రూపాయలు ( ఇప్పుడు అయితే మరీ చవక అయ్యాయి ) అప్పట్లో ఈ ట్యూబ్ లైట్స్ వెలిగించాలంటే స్టార్టర్స్ తప్పనిసరి. ఈ స్టార్టర్స్ ధర మూడు రూపాయల నుండి పదిరూపాయల వరకూ ఉండేవి. ఈ పది రూపాయలవి దాంట్లో సిరామిక్ లేదా ప్లాస్టిక్ తో కప్పిన కెపాసిటర్ ఉండేది. స్విచ్ వెయ్యగానే ఈ స్టార్టర్ సహాయాన ట్యూబ్ వెలిగేది. ఇప్పటికీ ఇలాంటి ట్యూబ్ వాడుతున్నారు.. త్వరలోనే వీటికి కాలం చెల్లబోతున్నది.
ఇక ఈ ప్రక్కన ఉన్నది ఆ స్టార్టర్ లోని చిన్న బల్బ్. ఇది వెలిగే ఆ ట్యూబ్ లైట్ ని వెలిగిస్తుంది. ఇది కనపడకుండా పైన అల్యూమినియం డబ్బా లాంటిదో, లేక ప్లాస్టిక్ డబ్బాలోనో ఉంటుంది. ఇది ఇలా స్పష్టముగా ఉంటేనే ఆ స్టార్టర్ బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటివి స్టార్టర్స్ వాడుతున్న వారికి ఒక టిప్ చెబుతున్నాను.. స్విచ్ వెయ్యగానే 20 సెకన్లలోగా టూబ్ లైట్ వెలిగిందా ఓకే! ఒకవేళ వెలగకపోతే వెంటనే స్విచ్ ని ఆఫ్ చెయ్యండి. ఇలా చేస్తే ట్యూబ్ మరియు స్టార్టర్ మన్నిక పెరుగుతుంది. ఇపుడైతే వోల్టేజీ సరిగానే ఉంటునది కాబట్టి త్వరగానే వెలుగుతున్నాయి.
ఈ ప్రక్కగా ఉన్న ఫోటోలో - స్టార్టర్ లోని బల్బ్ స్విచ్ వెయ్యగానే ఇలా లేత వంకాయ రంగులో వెలుగుతుంది. అలా వెలగటం వల్ల వచ్చిన స్పార్క్ Spark వల్ల ట్యూబ్ వెలుగుతుంది.
1998 సంవత్సరములో Anchor ఆంకర్ కంపనీ క్రొత్త ట్యూబ్ లైట్ కంప్లీట్ సెట్ తెచ్చి అమర్చాను. అప్పట్లో ఈ ట్యూబ్ లైట్ ఉండటమే ఒక హోదాగా ఉండేది. అప్పట్లో ఈ మొత్తం సెట్ ధర 400 రూపాయలు ( ఇప్పుడు అయితే మరీ చవక అయ్యాయి ) అప్పట్లో ఈ ట్యూబ్ లైట్స్ వెలిగించాలంటే స్టార్టర్స్ తప్పనిసరి. ఈ స్టార్టర్స్ ధర మూడు రూపాయల నుండి పదిరూపాయల వరకూ ఉండేవి. ఈ పది రూపాయలవి దాంట్లో సిరామిక్ లేదా ప్లాస్టిక్ తో కప్పిన కెపాసిటర్ ఉండేది. స్విచ్ వెయ్యగానే ఈ స్టార్టర్ సహాయాన ట్యూబ్ వెలిగేది. ఇప్పటికీ ఇలాంటి ట్యూబ్ వాడుతున్నారు.. త్వరలోనే వీటికి కాలం చెల్లబోతున్నది.
Tube light starters |
ఇవే ట్యూబ్ లైట్ స్టార్టర్స్
ఇక ఈ ప్రక్కన ఉన్నది ఆ స్టార్టర్ లోని చిన్న బల్బ్. ఇది వెలిగే ఆ ట్యూబ్ లైట్ ని వెలిగిస్తుంది. ఇది కనపడకుండా పైన అల్యూమినియం డబ్బా లాంటిదో, లేక ప్లాస్టిక్ డబ్బాలోనో ఉంటుంది. ఇది ఇలా స్పష్టముగా ఉంటేనే ఆ స్టార్టర్ బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటివి స్టార్టర్స్ వాడుతున్న వారికి ఒక టిప్ చెబుతున్నాను.. స్విచ్ వెయ్యగానే 20 సెకన్లలోగా టూబ్ లైట్ వెలిగిందా ఓకే! ఒకవేళ వెలగకపోతే వెంటనే స్విచ్ ని ఆఫ్ చెయ్యండి. ఇలా చేస్తే ట్యూబ్ మరియు స్టార్టర్ మన్నిక పెరుగుతుంది. ఇపుడైతే వోల్టేజీ సరిగానే ఉంటునది కాబట్టి త్వరగానే వెలుగుతున్నాయి.
ఇదేమో - స్టార్టర్ లోని బల్బ్ కి అదనముగా ఉండే కెపాసిటర్ టైపు. దీనివలన మరింత ఎక్కువగా సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా మరింత త్వరగా ట్యూబ్ లైట్ ని వెలిగిస్తాయి. ఆ తెల్లగా ఉన్నదే కెపాసిటర్. అలాకాకుండా గోధుమ రంగులో గుండ్రముగా, బద్దలా ఉండే కెపాసిటర్స్ కూడా ఉన్న స్టార్టర్స్ ఉన్నాయి. నాకైతే ఇవన్నీ అనుభవ రూపేణా తెలుసుకున్నవి.
ఇక ఈ ప్రక ఫోటోలోలాగా స్టార్టర్ బల్బ్ నల్ల బడిందీ అంటే ఇక ఆ స్టార్టర్ ని మార్చాల్సిన సమయం వచ్చినట్లే.. దాన్ని అలాగే ఇంకా వాడుతుంటే - ట్యూబ్ లైట్ మీద ప్రభావం చూపి - ఎక్కువసార్లు ఫ్లాష్ లు వచ్చేలా చేసి, ట్యూబ్ లైట్స్ చివర్లు నల్లగా అయ్యేలా చేస్తుంది. ఫలితముగా ట్యూబ్ మరియు స్టార్టర్ కూడా మార్చాల్సి వస్తుంది. పది రూపాయల మార్పు ఆలస్యమైతే - యాబై రూపాయల ట్యూబ్ వల్ల జేబుకి చిల్లు పడుతుంది. ఇది చాలామందికి తెలీదు అనే ఇంత వివరముగా వ్రాశాను. ఎవరైనా ఇలాగే వాడుతూ ఉంటే స్టార్టర్స్ ని త్వరగా మార్చుకోండి. ( నేనైతే ఆ స్టార్టర్ కవర్ ని తీసేసి, అలాగే దాని స్థానములో ( స్టార్టర్ హోల్డర్ లో ) బిగించి వాడేవాడిని. అందుకే ఇంతబాగా తెలుసుకొని చెప్పగలుగుతున్నాను.
కొన్ని స్టార్టర్స్ లలో ఇలాంటి బల్బ్స్ కూడా ఉంటాయి. బల్బ్ లోని తీగ చుట్టూరా ఇలాంటి తెల్లని / లేత నీలి రంగు / లేత వంకాయరంగు లోని విద్యుత్ మెరుపుని స్పష్టముగా చూడవచ్చు.
ఆ తరవాత వీటిల్లో మార్పులు వచ్చాయి. ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. వచ్చిన మొదట్లో వీటి ఖరీదు - మొత్తం సెట్ 700 ఏడువందల రూపాయల్లో ఉండేది. అప్పట్లో ఉన్న గ్రామ్ బంగారు మారకం విలువ ప్రకారం అప్పటి ఆ 700 ని ఇప్పట్లోకి ఉన్న విలువలోకి మారిస్తే ఈ క్రొత్త ఎలక్రానిక్ ఛోక్ ట్యూబ్ సెట్ ధర ఆరేడు వేల ( 6,000 - 7,000 ) వరకూ ఉండేది అన్నమాట. అందుకే అప్పట్లో అవి ఎవరికీ తెలీకుండా - చరిత్రలోకి చేరిపోయాయి. నేను కొందామనుకున్నా వాటి లభ్యత నాకు కుదరలేదు.. కానీ ఇతరుల ఇళ్ళల్లో చూశాను.
ఆ తరవాత ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. 200 రూపాయల ధరలో ఉన్నప్పుడు ఒక ఛోక్ తీసుకవచ్చి, మొదట్లో చెప్పిన - తీసేసిన ట్యూబ్ సెట్ కి నేనే బిగించాను. అది చాలా రోజులు పనిచేసింది.. ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది కూడా. దీనివల్ల స్విచ్ వెయ్యగానే ట్యూబ్ లైట్ వెంటనే - ఆలస్యం ఏమీ లేకుండానే వెలగటం మొదలయ్యింది. అలాగే లో వోల్టేజీ ఉన్నా చక్కగా పనిచెయ్యటం చవి చూశాను. వీటి హవా చాలా ఏళ్ళు కొనసాగింది. ఇప్పుడిప్పుడే వీటి అమ్మకాలు తగ్గుతున్నాయి - అదీ LED ట్యూబ్ లైట్స్ రాకతో.. ఇవీ చరిత్రలో కలిసిపోయే రోజు త్వరలోనే ఉంది కూడా. ఈ క్రొత్తగా తీచ్చిన LED ట్యూబ్ గురించి మరొక పోస్ట్ లో వివరముగా మాట్లాడుకుందాం.. ఆ పోస్ట్ పెట్టాక ఇక్కడ లింక్ కూడా ఇస్తాను.
-----> తరవాయి భాగం