బిగ్ బాస్ సీజన్ 2 కి వోటింగ్ చెయ్యడం ఎలా?
How to voting to BIG BOSS Telugu season 2
స్టార్ మా టీవీలో ప్రస్తుతం ప్రసారం అవుతున్న - అత్యంత ప్రాచుర్యం పొందిన " బిగ్ బాస్ " కార్యక్రమం లోని పోటీదారులకు ఎలా వోటింగ్ చెయ్యాలో మీకు ఇప్పుడు తెలియ చేస్తున్నాను. చాలామంది వేరే వేరే సైటుల్లోని ఇలాంటి వోటింగ్ లలో పాల్గొని, వోటింగ్ అయ్యాక అప్పటికప్పుడు ఎవరికి ఎంత శాతం వోటింగ్ వచ్చింది అని తెలుసుకొని ఆనందపడుతున్నారు. కానీ అది నిజం కాదు. ఈ విషయం గత బిగ్ బాస్ సీజన్ 1 లో తెలిసింది. అప్పుడు కొన్ని సైట్స్ వ్యూయర్ షిప్ పెంచుకొని, ఆడ్స్ / ప్రకటనలు పెంచుకొని ఆదాయాలు పొందాయి. ఆ సీజన్ చివరిలో జూనియర్ ఎన్టీయార్ ప్రకటన వల్ల అప్పుడు నిజం తెలిసి, అధికార సైట్లో వోటింగ్ చేశారు. అందువల్ల ఆ సీజన్ చివరిలో వోటింగ్ శాతం బాగా పెరిగింది.
నిజానికి బిగ్ బాస్ అధికారిక సైటులోని వోటింగ్ మనం వెయ్యటమే కానీ, ఎవరికి ఎన్ని వోట్లు పడ్డాయి, వారికి వచ్చిన వోటింగ్ శాతం ఎంత అనీ, ఎవరికి తక్కువ వోట్లు పోలయ్యాయి / పడ్డాయి అన్నదీ... తదితర ఇవేవి వివరాలు బయటకు తెలీవు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే :
ఇక వోటింగ్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.
ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. అవి :
ముందుగా ఆన్లైన్ లో గూగుల్ సెర్చ్ ఇంజన్ ని ఓపెన్ చెయ్యాలి. సెర్చ్ బాక్స్ లో BIGG BOSS TELUGU VOTE అని ఇంగ్లీష్ లో పెద్ద అక్షరాలలో అయినా సరే, చిన్న అక్షరాలలో అయినా సరే టైప్ చెయ్యాలి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో అయినా బిగ్ బాస్ తెలుగు వోట్ ని ఎన్నుకొని ఎంటర్ చెయ్యాలి.

- మనం వోటింగ్ వెయ్యటం వరకే మన పని.
- ఎవరికి ఎన్ని వోట్లు వెయ్యాలో అది మన ఇష్టం.
- మనం వోట్లు వేస్తేనే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. లేకుంటే లేదు.
- మనకు ఏదైనా లింక్ ఇచ్చి, అది నొక్కి వచ్చిన సైటు కి వెళ్లి వోటింగ్ చెయ్యండి అనే విజ్ఞప్తులు ఏవీ రావు. ఒకవేళ వస్తే అది అధికారిక సైటు కాదని గమనించండి.
- వోటింగ్ వెయ్యగానే ఇక ఆ సైటు నిర్ణీత సమయం వరకు అంటే తరవాతి వోటింగ్ టైమింగ్ వరకు - మళ్ళీ వోటింగ్ చెయ్యటానికి కుదరదు. కానీ ఆ సైటు మనకి కనిపిస్తూనే ఉంటుంది, ఎవరికి ఎన్ని వోట్లు వేశామో కూడా కనిపిస్తూనే ఉంటుంది కూడా.
- అలాగే ఎవరికీ ఎన్ని వోట్లు వచ్చాయో ఏమీ కనిపించదు. అంటే మనం వోటింగ్ చెయ్యటం వరకే మన పని.
- ఇలా వోటింగ్ లో పాల్గొంటే మనకేమీ రివార్డ్స్ / పాయింట్స్ / బహుమతులు గానీ రావు. ఇన్ని వోట్లు వేస్తే లేదా మీరు వోట్లు వేసిన వారు గెలిస్తే మీకు ఫలానా బహుమతి వస్తుంది అనీ ఊరింపులు ఏమీ ఉండవు అని కూడా తెలుసుకొని ఉండాలి.
ఇక వోటింగ్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.
ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. అవి :
- 1. బిగ్ బాస్ పోటీదారుల / కంటెంస్టెంట్స్ కి ఇచ్చిన ప్రత్యేక ఫోన్ నంబర్స్ కి లాండ్ ఫోన్ లేదా మొబైల్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం.
- 2. ఆన్ లైన్ పద్దతిలోఒక ప్రత్యేక సైట్లోకి వెళ్లి వోటింగ్ చెయ్యడం.
ముందుగా ఆన్లైన్ లో గూగుల్ సెర్చ్ ఇంజన్ ని ఓపెన్ చెయ్యాలి. సెర్చ్ బాక్స్ లో BIGG BOSS TELUGU VOTE అని ఇంగ్లీష్ లో పెద్ద అక్షరాలలో అయినా సరే, చిన్న అక్షరాలలో అయినా సరే టైప్ చెయ్యాలి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో అయినా బిగ్ బాస్ తెలుగు వోట్ ని ఎన్నుకొని ఎంటర్ చెయ్యాలి.
అప్పుడు మీకు ఇలా క్రింది విధముగా ఆ సైట్ కనిపిస్తుంది. ఈ షో లో పాల్గొనే వారు 16 మంది అయినా, ఇక్కడ మాత్రం కేవలం ఆరుగురు (6) మాత్రమే కనిపిస్తారు. ( త్వరలో మారుస్తారని అనుకుంటున్నాను ) మనకు నచ్చిన వారు / వోట్ వెయ్యాలని అనుకుంటున్న వారు ఆ లిస్టు లో ఉన్నారేమో ఒకసారి చూసుకోవాలి.
ఇక్కడ ఉదాహరణకు : నూతన్ నాయుడు ని ఎంచుకున్నాను. తన ఫోటో ప్రక్కన ఉన్న ( ఎర్రని వృత్తములో చూపిన విధముగా ) త్రిభుజాకారాన్ని / బాణం గుర్తుని నొక్కాలి.
అలా క్లిక్ చెయ్యగానే - తనకు ఇచ్చే పాయింట్స్ / స్కోర్ / వోట్స్ వేసేందుకు వీలుగా తన ప్రొఫైల్ వస్తుంది. తన ప్రక్కన - కుడి పై మూలన తనకు ఇచ్చిన వోట్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ 0 వోట్స్ ఉంటుంది. వోట్లు వేశాక మనం ఎన్ని వేశామో తెలిపే సంఖ్య అక్కడ నీలిరంగులో కనిపిస్తుంది. తన ఫోటో క్రిందన ఎర్రని వృత్తములో చూపిన నీలిరంగు చుక్కని మౌస్ సహాయాన - ఆ ప్రక్కన గీత వెంబడి జరపాలి / డ్రాగ్ చెయ్యాలి / స్లైడ్ చెయ్యాలి. మనం ఎన్ని వోట్లు వెయ్యాలని అనుకుంటున్నామో అంత సంఖ్య వచ్చేవరకూ జరపాలి.
ఆ గీత చివరిలో సిమెంట్ రంగులో మనకు ఎన్ని వోట్లు ఉన్నాయో తెలుపుతుంది. ఇప్పుడే మొదలెట్టాం కాబట్టి మనకు యాభై ( 50 ) వోట్లు ఉన్నాయని చూపిస్తుంది.
ఇప్పుడు తనకు ఇరవై వోట్లు ఇద్దామని అనుకుందాం. కుడి పైమూలన నీలిరంగులో ఆ సంఖ్య కనిపించేవరకూ ఆ నీలిరంగు చుక్కని జరపాలి. ఇప్పుడు మనం తనకు ఎన్ని వోట్లు వేశామో తెలుస్తుంది. ఇక మిగతావారికి వోట్లు వెయ్యాలని అనుకుంటే / లేదా అక్కడితోనే ఆపెయ్యాలని అనుకుంటే క్రిందన కుడి క్రింది మూలన ఉన్న- క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపిన CONTINUE కంటిన్యూ బటన్ ని నొక్కాలి.
అప్పుడు ఇలా క్రింది విధముగా వస్తుంది. తన ప్రక్కన మనం వేసిన వోట్లు ఎన్నో తెలుస్తాయి. అలాగే ఇక మిగతావారికి వోట్లు వెయ్యాలని అనుకుంటే వారి ఫోటోల / పేర్ల ప్రక్కన ఉన్న బాణం గుర్తుని ఇంతకు ముందు తెలియచేసిన విధముగానే నొక్కి వోట్లు వెయ్యాలి.
ఇక మిగతా వోట్లు ఎవరికీ వెయ్యను, ఇక్కడితో ముగిస్తాను అని మీరు అనుకుంటే క్రిందన - ఎడమ దిగువగా ఉన్న VOTE అనే బటన్ ని నొక్కాలి.
ఇక మిగిలిన వోట్లూ వేస్తానూ అనుకుంటే - మిగతావారికి ఎదురుగా ఉన్న బాణం గుర్తుని నొక్కి, వారి దిగువగా ఉన్న నీలిరంగు చుక్కని - ప్రక్కగా జరిపి వెయ్యాలనుకున్న వోట్లు వెయ్యాలి.
ఇలా మీకున్న యాభై వోట్లనీ వేసేయ్యాలి. ఇక్కడ చూపిన కంటెంస్టెంట్స్ ప్రొఫైల్స్ వి ఎంచుకున్నాను అంటే కేవలం ఉదాహరణ కోసం ఎలా వోటింగ్ చెయ్యాలో చూపెట్టడానికి వాడుకోబడ్డాయే కానీ వీరికే ఇలా వెయ్యాలనీ, అలా వారిని మాత్రమే ఎన్నుకోవాలని కాదు.. అని గమనించ ప్రార్థన.
ఇలా ఇద్దరికి 42 వోట్లు గనక వేస్తే - ఇక మిగిలిన ఆ ఎనిమిది వోట్లు మిగిలాయని - వేరే కంటెంస్టెంట్ ని ఎంచుకున్నప్పుడు ఇలా దిగువగా చూపబడిన చిత్రములో ఎర్రని వృత్తములో చూపినట్లుగా - అగుపిస్తాయి.
ఇలా మీ 50 వోట్లని మీకు నచ్చినవారికి ఒక్కరికే - ఒకటి నుండి యాభై వరకు వేయవచ్చును. లేదా ఒక్కొక్కటీ వేయవచ్చును. అది మీ ఇష్టం.
ఇలా మీకున్న ( అన్ని ) వోట్లని వేశాక - అప్పటికీ మీరు వేసిన వోట్లు వారికి చెందినట్లుగా భావించరాదు. కేవలం మీరు అలా వారికి ఎంచారు / ఇచ్చారు / పంచారు అన్నట్లు. కానీ అది వోట్లు వేసినట్లు కాదు. ఈ క్రింది ఫోటోలో మాదిరిగా వచ్చిన VOTE అనే బటన్ నొక్కేవరకూ - వోట్లు వేసినట్లు కాదు. దాన్ని నొక్కితేనే మీ వోట్లు పరిగణలోకి / లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది.
అలా VOTE అనే బటన్ నొక్కాక - ఇలా ఈ క్రింది విధముగా THANK YOU FOR VOTING అని కనిపిస్తుంది. ఇక్కడితో మీ వోటింగ్ క్రియ పూర్తయినట్లు భావించాలి.
క్రింది ఫోటోలోని ఎర్రని వృత్తములో SHARE అనే బటన్ ని చూపాను. దాన్ని నొక్కితే - ఆ వోటింగ్ ప్రక్రియని మీ ఫేస్ బుక్ / ట్విట్టర్ స్నేహితులు అనుసరించేలా ఒక లింక్ లాగా మీ టైం లైన్ మీద చూపించవచ్చును.
పైన చూపిన బాక్స్ లో ఏదైనా ఎన్నుకున్నాక క్లిక్ చేస్తే మీకు - ఈ క్రింది విధముగా కనిపిస్తుంది.
అలా SUBMITTED సబ్మిటేడ్ అని వచ్చాక - దీనితో వోటింగ్ ప్రక్రియ సంపూర్ణముగా ముగిసినట్లు.
మీరు ఒక ఈమెయిల్ ఐడీ తో కేవలం యాభై వోట్లు మాత్రమే - అదీ ఒకరోజుకి మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇంకా ఎక్కువ వోట్లు వెయ్యాలీ అనుకుంటే - వేరే మెయిల్ ఐడీ తో మళ్ళీ లాగిన్ అయ్యి వోటింగ్ చెయ్యాలి. అది మీ ఓపిక, మీ అభిమానం.
గమనిక : శనివారాన సాయంత్రం నుండీ -
ఆదివారం రోజంతా
సోమవారంన సాయంత్రం దాకా ఈ వోటింగ్ లింక్ తెరచుకోదు..
No comments:
Post a Comment