మనం చిన్నప్పుడు వ్రాసుకోవటానికి పెన్సిల్ వాడేవాళ్ళం. ఇప్పుడు పెన్ ని వాడుతున్నాం. పెన్సిల్ వాడుతున్నప్పుడు - మన తప్పులని రబ్బర్ తో తుడిపేసే వాళ్ళం. ఇప్పుడు అలా చెయ్యలేం.. జీవితం అంతే!.
అవును.. చిన్నప్పుడు మనం ఏదైనా వ్రాయటానికి పెన్సిల్ వాడేవాళ్ళం. పెన్సిల్ తో కాస్త బాగా వ్రాయటం వచ్చాక పెన్ ని వాడేవాళ్ళం. పెన్సిల్ తో వ్రాస్తున్నప్పుడు ఏదైనా పదాలు / అక్షరాలు తప్పుగా వ్రాస్తే - దాన్ని తుడిచివేయటానికి రబ్బర్ ని వాడేవాళ్ళం. ఆ తరవాత సరియైన పదాన్ని / అక్షరాన్ని వ్రాసేవాళ్ళం కదూ.. కానీ జీవితం విషయంలో అలా కుదరదు. చేసిన తప్పులని. పొరబాట్లని ఏమాత్రం తుడిచివేయానికి కుదరదు. కానీ చేసిన తప్పులని - సమీక్షించుకొని ఎక్కడ తప్పు చేశామో తెలుసుకొని, ఆ తప్పుని సరిచేసుకొని ( క్షమాపణ / నష్టపరిహారం / నష్ట పరిహార చర్యలు ) అవకాశం తప్పక ఉంటుంది. అది మాత్రం మరచిపోవద్దు.
No comments:
Post a Comment