Sunday, July 24, 2016

[తెలుగుబ్లాగు:22383] టైపింగ్ సందేహాలు

కావలసిన అక్షరాలను బోల్డ్ చెయ్యడం, అండర్ లైన్ చెయ్యడం ఎలా? 

మనం సాధారణముగా మన బ్లాగుల్లో పోస్ట్స్ వ్రాసేటప్పుడు - కొన్నిచోట్ల ఏదైనా పదం / వాక్యం / పేరా కాస్త కొట్టొచ్చినట్లుగా కనపడాలీ అంటే వెంటనే మనకు తట్టేది - దాన్ని బోల్డ్ BOLD లో ఉంచాలని. ఈ బోల్డ్ అంటే - మనం పోస్ట్ చేసిన అక్షరాలు / ఎంచుకున్న టపా కాస్త లావుగా కనిపిస్తాయి అంతే. దీన్ని వల్ల లాభం ఏమిటంటే ఆ పదం / వాక్యం / పేరా కాస్త ఐ క్యాచీగా Eye catchy ఉండి, తొందరగా ఆకర్షిస్తుంది. అలాగే U కూడా.. ఇదీ ఒక టూల్. దీన్ని వాడటం వలన మనం ఎంచుకున్న పదం / వాక్యం / పేరా అంతా అండర్ లైన్ తో కనిపిస్తుంది. ఇవి ఎలాగో కాస్త వివరముగా చూద్దాం..

కావలసిన అక్షరాలని బోల్డ్ Bold చెయ్యటం, అండర్ లైన్ చెయ్యటం అన్నది - బ్లాగ్ పోస్ట్ వ్రాసే పైన టూల్ బార్ Tool Bar లో ఉంటాయి. వీటిని తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ క్రింది ఫోటో చూస్తే మీకు ఆ టూల్ బార్, అందులోని టూల్స్ మీకు కనిపిస్తాయి.

ఈ ఆకుపచ్చ గడిలో ఉన్నవి టూల్స్. వీటి సహాయన బ్లాగ్ పోస్ట్స్ ని రూపొందించవచ్చు లేదా మార్చవచ్చును. రకరకాల మార్పులూ, చేర్పులూ వీటివల్ల సాధ్యం. ప్రతీ టూల్ / బొత్తాం Button వాటికి కేటాయించిన నిర్దుష్ట పనిని చెయ్యటానికి వీలుగా అవి సిద్ధముగా ఉంటాయి. ఈ టూల్స్ ఒక్కో గుర్తులో ఉండి, గుర్తుపెట్టుకొని వాడటానికి వీలుగా ఉంటాయి. పైన ఆకుపచ్చ గడిలో ఉన్న టూల్స్ అన్నింటినీ కలిపి టూల్స్ బార్ Tools Bar అని అంటారు. 

పైన ఉన్న టూల్స్ బార్ లోని టూల్స్ గురించి ఒక్కోదాని గురించి విడివిడిగా ఎపుడైనా తెలుసుకుందాం. ఇప్పుడు పదాలు బోల్డ్ గా, అండర్ లైన్ గా రావటం ఎలాగో తెలుసుకుందాం. 

పై చిత్రంలో  1  వద్ద చూపెట్టిన B బొత్తాం - బోల్డ్ BOLD కి సంబంధించినది. 
  2  వద్ద చూపెట్టిన U బొత్తాం - అండర్ లైన్ Under line కి సంబంధించినది. 

Bold : 

B అనే టూల్ నొక్కి పోస్ట్ బాడీలో మనం విషయం వ్రాస్తే - అలా నొక్కినప్పటి నుండీ టైప్ చేసే విషయం అంతా బోల్డ్ గా ( కాస్త లావుగా ) వస్తుంది.  
అలానే కాకుండా మరో పద్ధతిలో కూడా చెయ్యవచ్చు. మనం బ్లాగులో చెప్పాలనుకున్న విషయం అంతా టైప్ చేసి, ఒకసారి ప్రూఫ్ సరిచూసుకొన్నాక - మనం వ్రాసిన టపాలో ఎక్కడెక్కడ అలా బోల్డ్ గా రావాలో ఆ మేటర్ ని మౌస్ కర్సర్ Mouse Cursor సహాయాన మార్క్ చేసుకోవాలి. ( ఇలా చేస్తే ఆ మేటర్ నీలిరంగులో కనిపిస్తుంది ). అప్పుడు టూల్ బార్ లోని B ని నొక్కితే - ఆ మార్క్ చేసినందంతా బోల్డ్ గా మారిపోతుంది. ఈ రెండో పద్ధతిని ఎన్నుకోవడం చాలా సులభముగా ఉంటుంది. 


Under line :  

U ఇదీ పైన చెప్పినట్లుగానే చెయ్యాలి. ముందే ఆ బటన్ ని నొక్కి అండర్ లైన్ లో విషయాన్ని టైపింగ్ చేసుకోవచ్చు. లేదా టైపింగ్ అంతా పూర్తయ్యాక - మనకు కావలసిన మాటర్ ని పైన చెప్పినట్లుగానే మార్క్ చేసుకొని, టూల్ బార్ లోని  U  టూల్ ని ఎన్నుకొంటే, ఆ విషయాన్ని అండర్ లైన్ లోకి ఇలా మార్చుకోవచ్చును.  కావాలంటే ఈ క్రిందనున్న ఫోటోని చూడండి.  



No comments:

Related Posts with Thumbnails