Friday, July 29, 2016

పొడుపు కథలు - 31


ఎందరెక్కినా విరగని బల్ల.. ఏమిటదీ..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : అరుగు  

Wednesday, July 27, 2016

[తెలుగుబ్లాగు:22376] యూనికోడ్ లో ౠ Roo in Unicode

దయచేసి తెలుగులో అవగ్రహం ऽ యూనికోడ్ లో టైపింగ్ ఎలా చేయాలో తెలుపగలరా?
అలాగే RU దీర్ఘ ఋకారాంతం టైపింగ్ ఎలా చేయాలో తెలుపగలరా? అనే ప్రశ్నకు నా సమాధానం.. 



మీరడిగిన సందేహానికి - యూనికోడ్ లో తప్పక సమాధానం ఉంది. కాకపోతే యూనికోడ్ లోని తెలుగుని - పద్యాల వంటి వాటికి అంతగా నాకు అవసరం లేకపోవడం వల్ల నేనెన్నడూ ఉపయోగించలేదు.. ఇప్పుడు మీకోసమని ప్రయత్నించాను. ఈ యూనికోడ్ ని ఆపిల్ తరహాలోనో, మరే ఇతర క్రొత్త పద్ధతిలోనో టైపింగ్ చేసుకోవచ్చేలా సులభమైన పద్ధతిని తెలుసుకున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే : యూనికోడ్ తెలుగు తప్ప మరే ఇతర పద్ధతుల్లో (ఆపిల్, ఇంస్క్రిప్ట్ పద్ధతులు) నేనెప్పుడూ వాడలేదు. అంటే అవి ఎందులోనో తక్కువ అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.. అలాని అనిపించినట్లు ఉంటే క్షమించాలి. నేను మొదటగా నేర్చుకున్నదీ యూనికోడ్ ఫోనెటిక్ టైపింగే. అదే అలవాటయిపోయి దాన్నే ఇంకా వాడుతూనే ఉన్నాను. నాకున్న తెలుగు టైపింగ్ అవసరాలు యూనికోడ్ ( ఫోనెటిక్ Phonetic ) లో తీరిపోతున్నాయి కాబట్టి ఆ ఇతర పద్ధతుల్లోకి గత పదేళ్లుగా ఎన్నడూ వెళ్ళలేదు.. (ఈమధ్యే MS paint అవసరాలకోసం వెళ్లాలనిపిస్తున్నది.)

నేను ఇప్పుడు చెబుతున్న ఈ క్రొత్త పద్ధతిని వాడి, అలా కూడా ఎలా టైపింగ్ చేసుకోవచ్చునో అందరికీ తెలియచేయగలరు. ఇది కాస్త పెద్దగా అయిననూ, ఇక్కడే మీకు చెబుతున్నాను. గ్రూప్ లోని మిగతా వారికి కూడా ఉపయోగపడుతుందని.. 

# ముందుగా మీరు గూగుల్ ట్రాన్స్లిటరేషన్ సాఫ్ట్వేర్ ని ఈ లింక్ https://www.google.com/inputtools/windows/  నుండి డౌన్లోడ్ చేసి, మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోండి. 

# మీ సిస్టం లో అది ఇన్స్టాల్ అయ్యాక - సిస్టం ట్రే లో - సమయం / తేదీ ప్రక్కగా EN అని కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఆ సాఫ్ట్ వేర్ మీ సిస్టంలో ఇన్ స్టాల్ అయ్యిందని అర్థం. ఈ క్రింది ఫోటోలో  ఎర్ర వృత్తంలో చూపినట్లుగా EN అని కనిపిస్తున్నది. 



# ఇప్పుడు ఆ EN ని నొక్కితే మీరు కోరుకున్న భాషని (తెలుగు) ఎన్నుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. అందులో క్రిందన ఉన్న తెలుగుని క్లిక్ చేసి, ఎంచుకోండి. అప్పుడు సిస్టం ట్రే లో EN స్థానాన TE ( పటంలో 1 ) మారుతుంది. ఇలా వస్తే - తెలుగులో  టైపు చేసుకోవడానికి మీ కీబోర్డ్ సిద్ధముగా ఉందని అర్థం. 


# అలా తెరచినప్పుడు ( చిత్రములో 2 ) లా ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది. అందులోని బాణం గుర్తుమీద కర్సర్ ని ఉంచితే అది మూవ్ Move గుర్తు చూపిస్తుంది. రెండవదైన తె మీద కర్సర్ తో నొక్కితే - వచ్చే ఆప్షన్ వల్ల English కూ, తెలుగుకీ వెనువెంటనే మారవచ్చును. 

# మూడవదైన కీబోర్డ్ గుర్తు ( చిత్రములో 3 ) మీద నొక్కితే - ఇప్పుడు మీకు అవసరమయ్యే ఒక తెలుగు అక్షరాల టూల్ బాక్స్ తెరచుకుంటుంది. దీని లోని అచ్చులూ, హల్లులూ, గుణింతాల వల్ల కొన్ని ప్రత్యేక అక్షరాలూ, పదాలు వ్రాయవచ్చును. దీనితోనే మీరు కావాలనుకున్న అక్షరాలని ( నేరుగా ) పొందవచ్చును. 

# చిత్రములో 4 వద్ద నున్న నాలుగు చతురస్రాల గుర్తుని నొక్కితే ( ఇది డిఫాల్ట్ గా ఉంటుంది ) ఆ ప్రత్యేక తెలుగు అక్షరాల టూల్ బాక్స్ తెరచుకుంటుంది. ఇందులోనే మీకు కావలసిన  ఇక్కడే దొరుకుతుంది. ఇందాక టైప్ చేసిన ఆ అక్షరం - ఆ బాక్స్ లో దిగువ కుడి మూలన ( చిత్రములో ) ఉంది. దాన్ని మౌస్ కర్సర్ సహాయన నొక్కితే ఆ అక్షరం నేరుగా మీకు లభిస్తుంది. అలాగే నేను ఇక్కడ ఇందాక వాడాను. 

# అదే కాకుండా ఇంకో రకముగా కూడా ఆ బాక్స్ ని వాడి ఆ  ని నేరుగా పొందొచ్చు. ఎలా అంటే : ఆ బాక్స్ లోని  ( బాక్స్ లో నాలుగవ లైనులోని ఆరవ అక్షరం ) ని అలా ఎంచుకున్నాక, అదే బాక్స్ లోని ( ఐదవ లైనులో చివరన ఉన్న) కొమ్ముని మళ్ళీ ఎంచుకుంటే, ఇప్పుడు వచ్చిన అక్షరం బు అవుతుంది. ఇప్పుడు దీనికి ఆ బాక్స్ లోని ( ఆరవ లైనులోని మొదటి దాన్ని అంటే ) కొమ్ము దీర్ఘాన్ని దీనికి జత చేస్తే - ఇప్పుడు మీకు కావలసిన  ని యూనికోడ్ లోనే పొందవచ్చును. ఇలా ప్రయత్నిస్తే బహుశా అన్ని అక్షరాలూ పొందొచ్చు - అని అనుకుంటున్నాను. 

# ఇదే ౠ కి మరో కొమ్ముని కూడా జత చెయ్యవచ్చు - ఇది ఎందుకు చెబుతున్నానూ అంటే - ఇది ఎంత యూజర్ ఫ్రెండ్లీ కీ బోర్డ్ User friendly key board అని చూపెట్టటానికి. రుజువుగా ఇదిగో..  బుుుు ఇలా కూడా వ్రాయవచ్చును. ఇప్పుడైనా నమ్మగలరా? 

# చిత్రములో 5 వద్ద చూపినట్లుగా కీ బోర్డ్ గుర్తుని మౌస్ కర్సర్ సహాయాన నొక్కితే ఆపిల్, ఇంస్క్రిప్ట్ కీబోర్డ్ లాంటిది తెరచుకుంటుంది. యూనికోడ్ లో దీన్ని నేనెప్పుడూ వాడలేదు. కనుక దీని గురించి నాకు అంతగా తెలీదు. కారణం - పద్యాల తెలుగులో వ్రాసేందుకు నాకెప్పుడూ అవసరం ఏర్పడలేదు కాబట్టి. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఆ కీబోర్డ్ చిత్రం కూడా ఇక్కడ చూపిస్తున్నాను. 



ఇక మీ సందేహాలు తీరాయని నేను అనుకుంటున్నాను  

తాజా కలం :: పైన పోస్ట్ లో వ్రాసిన ప్రతి తెలుగు అక్షరమూ గూగుల్ వారి యూనికోడ్ ని ఉపయోగించి వ్రాసినదే అని గమనించగలరు. 


Sunday, July 24, 2016

[తెలుగుబ్లాగు:22383] టైపింగ్ సందేహాలు

కావలసిన అక్షరాలను బోల్డ్ చెయ్యడం, అండర్ లైన్ చెయ్యడం ఎలా? 

మనం సాధారణముగా మన బ్లాగుల్లో పోస్ట్స్ వ్రాసేటప్పుడు - కొన్నిచోట్ల ఏదైనా పదం / వాక్యం / పేరా కాస్త కొట్టొచ్చినట్లుగా కనపడాలీ అంటే వెంటనే మనకు తట్టేది - దాన్ని బోల్డ్ BOLD లో ఉంచాలని. ఈ బోల్డ్ అంటే - మనం పోస్ట్ చేసిన అక్షరాలు / ఎంచుకున్న టపా కాస్త లావుగా కనిపిస్తాయి అంతే. దీన్ని వల్ల లాభం ఏమిటంటే ఆ పదం / వాక్యం / పేరా కాస్త ఐ క్యాచీగా Eye catchy ఉండి, తొందరగా ఆకర్షిస్తుంది. అలాగే U కూడా.. ఇదీ ఒక టూల్. దీన్ని వాడటం వలన మనం ఎంచుకున్న పదం / వాక్యం / పేరా అంతా అండర్ లైన్ తో కనిపిస్తుంది. ఇవి ఎలాగో కాస్త వివరముగా చూద్దాం..

కావలసిన అక్షరాలని బోల్డ్ Bold చెయ్యటం, అండర్ లైన్ చెయ్యటం అన్నది - బ్లాగ్ పోస్ట్ వ్రాసే పైన టూల్ బార్ Tool Bar లో ఉంటాయి. వీటిని తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ క్రింది ఫోటో చూస్తే మీకు ఆ టూల్ బార్, అందులోని టూల్స్ మీకు కనిపిస్తాయి.

ఈ ఆకుపచ్చ గడిలో ఉన్నవి టూల్స్. వీటి సహాయన బ్లాగ్ పోస్ట్స్ ని రూపొందించవచ్చు లేదా మార్చవచ్చును. రకరకాల మార్పులూ, చేర్పులూ వీటివల్ల సాధ్యం. ప్రతీ టూల్ / బొత్తాం Button వాటికి కేటాయించిన నిర్దుష్ట పనిని చెయ్యటానికి వీలుగా అవి సిద్ధముగా ఉంటాయి. ఈ టూల్స్ ఒక్కో గుర్తులో ఉండి, గుర్తుపెట్టుకొని వాడటానికి వీలుగా ఉంటాయి. పైన ఆకుపచ్చ గడిలో ఉన్న టూల్స్ అన్నింటినీ కలిపి టూల్స్ బార్ Tools Bar అని అంటారు. 

పైన ఉన్న టూల్స్ బార్ లోని టూల్స్ గురించి ఒక్కోదాని గురించి విడివిడిగా ఎపుడైనా తెలుసుకుందాం. ఇప్పుడు పదాలు బోల్డ్ గా, అండర్ లైన్ గా రావటం ఎలాగో తెలుసుకుందాం. 

పై చిత్రంలో  1  వద్ద చూపెట్టిన B బొత్తాం - బోల్డ్ BOLD కి సంబంధించినది. 
  2  వద్ద చూపెట్టిన U బొత్తాం - అండర్ లైన్ Under line కి సంబంధించినది. 

Bold : 

B అనే టూల్ నొక్కి పోస్ట్ బాడీలో మనం విషయం వ్రాస్తే - అలా నొక్కినప్పటి నుండీ టైప్ చేసే విషయం అంతా బోల్డ్ గా ( కాస్త లావుగా ) వస్తుంది.  
అలానే కాకుండా మరో పద్ధతిలో కూడా చెయ్యవచ్చు. మనం బ్లాగులో చెప్పాలనుకున్న విషయం అంతా టైప్ చేసి, ఒకసారి ప్రూఫ్ సరిచూసుకొన్నాక - మనం వ్రాసిన టపాలో ఎక్కడెక్కడ అలా బోల్డ్ గా రావాలో ఆ మేటర్ ని మౌస్ కర్సర్ Mouse Cursor సహాయాన మార్క్ చేసుకోవాలి. ( ఇలా చేస్తే ఆ మేటర్ నీలిరంగులో కనిపిస్తుంది ). అప్పుడు టూల్ బార్ లోని B ని నొక్కితే - ఆ మార్క్ చేసినందంతా బోల్డ్ గా మారిపోతుంది. ఈ రెండో పద్ధతిని ఎన్నుకోవడం చాలా సులభముగా ఉంటుంది. 


Under line :  

U ఇదీ పైన చెప్పినట్లుగానే చెయ్యాలి. ముందే ఆ బటన్ ని నొక్కి అండర్ లైన్ లో విషయాన్ని టైపింగ్ చేసుకోవచ్చు. లేదా టైపింగ్ అంతా పూర్తయ్యాక - మనకు కావలసిన మాటర్ ని పైన చెప్పినట్లుగానే మార్క్ చేసుకొని, టూల్ బార్ లోని  U  టూల్ ని ఎన్నుకొంటే, ఆ విషయాన్ని అండర్ లైన్ లోకి ఇలా మార్చుకోవచ్చును.  కావాలంటే ఈ క్రిందనున్న ఫోటోని చూడండి.  



Wednesday, July 20, 2016

Quiz


ప్రతిరోజూ శుభ్రముగా ఉతికి, ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకొనే అతను వారం రోజుల చొక్కాలని ప్రతి సోమవారం ఉదయాన లాండ్రీకి వేస్తాడు. వాటిని అతడు సరిగ్గా వారం రోజుల తరవాత లాండ్రీ వారి వద్ద నుండి తీసుకుంటాడు. అతడు ప్రతిరోజూ ఒక ఉతికి, ఇస్త్రీ చేసిన చొక్కా వేసుకోవాలనుకుంటే అతడికి వారానికి ఎన్ని చొక్కాలు కావాలి ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

Answer :


Tuesday, July 19, 2016

Good Morning - 608


మనం నివసిస్తున్న ప్రపంచం మన ఆలోచనల ఫలితమే. 
మన ఆలోచనలు మారకపోతే, ప్రపంచమూ మారదు. 

Thursday, July 14, 2016

Good Morning - 607


మత సామరస్యం అంటే ఇలా ఉంటే కూడా బాగుంటుంది.. ( గూగుల్ నుండి సేకరించిన ఫోటో ఇది ) 

Sunday, July 10, 2016

Facebook Friend request - Mark as Spam

సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ Facebook లో మనకి ఎందరెందరో స్నేహితులు అవుతుంటారు. మనకి స్నేహితులు కావాలీ అంటే మన ఫేస్ బుక్ అకౌంట్ శుభ్రముగా, మంచి పోస్ట్స్ తో కూడి ఉండాలి. అప్పుడు మనతో స్నేహానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆ వివరాలు ఏమిటో తరవాత చెప్పుకుందాం.. అంతలోగా ఎవరైనా మనకి స్నేహితులు అవటానికి మాటిమాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ( ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకోక రిజెక్ట్ చేస్తే ) విసుగు తెప్పిస్తుంటారు. ఇక వారంతే అనుకొని చాలామంది వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోవడమో, లేక అలాగే అట్టి పెట్టడం చెయ్యటమో చేస్తారు. వచ్చిన ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని అలాగే అట్టి పెట్టేస్తే - మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ పెట్టలేడు సరికదా - ఇంకో లాభం ఏమిటంటే మనకు ఒక ఫాలోవర్ దొరుకుతాడు. అలా చేస్తే ఆ ఫాలోవర్ లిస్టు పెరిగి - " అబ్బో వీరికి ఇంత ఫాలోయింగ్ ఉందా?.." అని ఈర్ష్యగా ఫీలవుతుంటాం.. 

ఒక్కోసారి వద్దనుకున్నవారు మాటి మాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే - వారిని బ్యాన్ BAN చెయ్యకుండా - వారి వద్దనుండి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వద్దనుకుంటే ఇలా చెయ్యండి. 

చ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని తీరుబాటుగా పరిశీలించండి. వారు ప్రొఫైల్ వివరాలు - వారి కవర్ ఫోటో క్రిందన ఉన్న - About అబౌట్ లో చూడండి. ఏమైనా వివరాలు ఉన్నాయా అనీ.. 

తరవాత వారి ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారిని చూడండి. ( చెత్త ప్రొఫైల్స్, అశ్లీల దృశ్యాల ప్రొఫైల్ పిక్స్ గల తన మిత్రులు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ) 

టైం లైన్ లోని పోస్ట్స్ ని గమనించండి. వాటి ఫ్రీక్వెంట్స్ Freequents, వాటిలోని సత్తానీ, ( వచ్చిన లైక్స్ ని పట్టించుకోకండి. అమ్మాయిల పోస్ట్స్ కి అవి ఎక్కువగానే ఉంటాయవి ) వాటికి వచ్చిన కామెంట్స్, ఆ కామెంట్స్ కి వారిచ్చిన రిప్లైస్ Replies ని గమనించండి. 

వారి ఫోటో ఆల్బమ్స్ ని పరిశీలించండి. 

చివరిగా వారు లైక్ చేసిన పేజెస్ Pages ని ఒకసారి సింహావలోకం చెయ్యండి. అందులో వారు చేసిన లైక్ చేసిన పేజెస్ - వారి ప్రస్తుత మనస్తత్వాన్ని చూపిస్తాయి. 

అప్పుడు వద్దనుకున్న ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వారు - ఇక వారి వద్ద నుండి మళ్ళీ రిక్వెస్ట్స్ రావొద్దు అనుకుంటే ఇలా ఈ క్రింది ఫోటోలో చూపినట్లు చెయ్యండి. 

1. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోకుండా Delete  చెయ్యండి.  
2. అప్పుడు ప్రొఫైల్ కవర్ ఫోటో మీద - రిక్వెస్ట్ రిమూవ్డ్ Request Removed అని కనిపిస్తుంది. దాని ప్రక్కనే మార్క్ ఆజ్ స్పాం Mark as spam అని వస్తుంది. మీరు దాన్ని గనుక నొక్కితే ( ఇక్కడ - If you tick 'Mark as Spam', this person will not be able to send you any more friend requests ) చాలు. వారింక మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పెట్టలేరు. 






Friday, July 8, 2016

దిల్^సుఖ్ – ఇది లేఖిని లో ‘దిల్‌సుఖ్’ గా

[తెలుగుబ్లాగు:22373] నమస్తే!,

దిల్^సుఖ్ – ఇది లేఖిని లో దిల్‌సుఖ్ గా నిలబడుతోంది.  కానీ Microsoft Indic Language Input Tool తో టైప్ చేస్తున్నప్పుడు దిల్సుఖ్గానే ఉంటోంది.  ఇక్కడ వేరే ప్రత్యామ్నాయం ఉన్నదా, దయచేసి తెలుపగలరు. పొల్లు తర్వాత అక్షరం సంయుక్తాక్షరంగా అయిపోతోంది.  సలహా ఇవ్వగలరు. 

వేరే ప్రత్యామ్నాయాలు లేవు.. మీరు ఉదాహరించినట్లుగానే సాగాలి. 

మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ ఇన్పుట్ టూల్ అయినా, గూగుల్ వాడి లిప్యంతరమైనా ఒకటే.. ఇవి యూనికోడ్ ని ఆధారం చేసుకొని ఏర్పరచిన పరికరములు. వాటిల్లో పొల్లు తరవాత అక్షరం సంయుక్తాక్షరం గా మారిపోతుంది. రెండు పదాలని మధ్యన స్పేస్ వాడి వేరుచేసి, సేవ్ చేసుకొని, ఆ తర్వాత ఎడిట్ చేసి, స్పేస్ తొలగించిననూ ఆ రెండుపదాలు కలసిపోయి - మీరు చెప్పినట్లుగా దిల్సుఖ్ గానే మారుతుంది. వాటిల్లో అలాగే వస్తుంది. అందుకే అలాంటి పదాలని ఆ టూల్స్ వాడేవారు విడివిడిగానే ( దిల్ సుఖ్ ) వ్రాస్తున్నారు. 

లేఖిని, క్విల్ ప్యాడ్, యంత్రం, ఆపిల్, ఇంస్క్రిప్ట్, స్వేఛ్చ.. మొదలగునవి వాటిల్లో ఇలాంటి పదాలని మనం అనుకున్నట్లుగా వ్రాసుకోవచ్చును. యూనికోడ్ లా కాకుండా వీటి టైపింగ్ కాస్త ఎక్కువగా ( షిప్ట్ కీ మొదలగు సహాయక మీటలని ) వాడాల్సి ఉంటుంది. కానీ మనం అనుకున్నట్లుగా వీటివల్ల ( దిల్‌సుఖ్ ) వ్రాయగలుగుతాం. ఇలాంటి పదాలని యూనికోడ్ పరికరాల వల్ల వ్రాయలేము. 

ఈ యూనికోడ్ పరికరాలని వాడిన నాకు కొద్ది సంవత్సరాల క్రితం వరకూ - " పాఠం " అన్న పదం వ్రాయటం ఎంత ప్రయత్నించినా కుదిరేది కాదు. ఆ ఒక్క పదం కోసం వేరేవాటిని తెరచి, ఆ పదాన్ని టైపు చేసుకొని, తెలుగులోకి వచ్చినదాన్ని కాపీ చేసుకొని నా బ్లాగ్ కోసం పేస్ట్ చేసుకొని వాడుకొనేవాడిని. ఇప్పుడు ఆ పదం యూనికోడ్ లో నేరుగా టైప్ చేస్తే (paatham) వచ్చేస్తున్నది. ఇలాంటివి బగ్స్ ఇంకా కొన్ని ఈ యూనికోడ్ లలో (ఇక్కడా యూనికోడ్ లలో అంటూ విడి విడిగా వ్రాశాను. గమనించగలరు. కలిపివ్రాస్తే వేరుగా - యూనికోడ్లలో - అని వస్తుంది ) అభివృద్ధి చెయ్యాల్సి ఉంది. 

- అచ్చంపేట్ రాజ్. 



Wednesday, July 6, 2016

[తెలుగుబ్లాగు:22161] బ్లాగ్ ని రిజిస్టర్ చేసుకోవాలా ?

[తెలుగుబ్లాగు:22161నమస్కారం సోదరులకు 

గూగుల్ బ్లాగ్ కు ఒక పేరు పెట్టినతరువాత దానిని రిజిస్టర్ చెయాల ? చేయకపోతే అట్టి బ్లాగ్ నేమ్ రిజిస్టర్ చెసిఉన్నదని ఎలా తెలుసుకోవాలి
ఎందుకంటే
మా స్నేహితుడు ఒక బ్లాగ్ కు తను ఒక పేరు పెట్టినవెంటనే బ్లాగ్ పేరు రిజిస్టర్ చేసియున్నాము పేరు తీసి వేయాలి మెయిల్ ఎవరో పంపారు
వేరొక పేరు నిర్ణయిస్తే దానికి  ఇలాగే జరుగుతుందేమో అని అనుమానం
అసలు బ్లాగ్ నేమ్ ఎలా రిజిస్టర్  చేస్తారు దయచేసి తెలుపగలరు - అనే ఈ 6-January-2014 న అడిగిన ప్రశ్నకి నా జవాబు ఇచ్చాను. ఆ సమాధానాన్ని కాస్త అభివృద్ధి / జత చేసి - ఇప్పుడు మీకోసం.. ( అలాగే నా ఈ బ్లాగ్ లో Blog tips లేబుల్ లో ఒక టపాగా చేరుస్తున్నాను )



బ్లాగ్ ఓపెన్ చేశాక,దాన్ని రిజిస్టర్ చేసుకోవాలా : అవసరం లేదండీ.. బ్లాగ్ పేరు అనేది మీ ఇష్టం. మీరు యే పేరు అయిన పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఆ పేరు ఇంతకు ముందే వాడుకలోగానీ, ఎవరైనా ఆ పేరున బ్లాగ్ తెరచి ఉంచితే అపుడు మార్చుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - భవిష్యత్తులో ఒకే పేరు మీద ఉన్న బ్లాగుల్లో ఏదైనా ప్రఖ్యాతి చెందినప్పుడు, ఆ బ్లాగ్ ని ఇతరులు చేరుకోవాలని చూసినప్పుడు సాంకేతిక సమస్యలు / కన్ప్యూజన్ ఏర్పడే ప్రమాదం ఉందని - యూనిక్ పేరుని ఎన్నిక చేసుకోమని సూచన బ్లాగర్ / వర్డ్ ప్రెస్ /.... వారి దగ్గర నుండి సూచన వస్తుంది. ఒక బ్లాగ్ పేరు గాంచినది అయితే, అలాంటి పేరుగల ( పోలిక ఉన్న ) బ్లాగ్ ఉన్నట్లయితే - ఆ బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగా ఉంటుంది. ఇలాంటివి బ్లాగుల్లో తక్కువే కానీ సైట్లలో చాలానే ఉన్నాయి. వారేమి చెయ్యకుండానే మన బ్లాగ్ ఖ్యాతి వల్ల వారి బ్లాగ్ కి వీక్షకులు పెరుగుతారు. తద్వారా వారు ఒక స్థాయికి చేరుకోగానే - గూగుల్ వారి ప్రకటన రూపములో ఆడ్ సెన్స్ వల్ల వారు ఆదాయం పొందుతారు. ఇలాంటి ఆదాయం మన తెలుగు భాష బ్లాగులకి అవకాశం లేదు. 

మీ బ్లాగ్ పేరుని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరము లేదు. బ్లాగ్ అనేది ఉచితముగా నిర్వహించుకోవచ్చు. మీరు ఏదైనా సైట్ ని అంతర్జాలములో నిర్వహించాలీ అనుకుంటే అప్పుడు ఆ సైట్ ని, కొంత డబ్బు కట్టి, మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ఉచితముగా కూడా మన పేరు మీద సైట్స్ నిర్వహించుకోవచ్చును.. అది వేరే విషయం ) 

చేయకపోతే అట్టి బ్లాగ్ నేమ్ రిజిస్టర్ చెసిఉన్నదని ఎలా తెలుసుకోవాలి : మీ బ్లాగ్ ని క్రియేట్ చేస్తున్నప్పుడే ఏమి పేరు ఉండాలో అడుగుతుంది. అప్పుడు మీరు టైప్ చేసిన పేరు ఇంతకు ముందే ఆ పేరుతో ఏదైనా బ్లాగ్ పేరు ఉంటే - ఆల్రెడీ ఆ పేరు వాడుకలో ఉంది - అని సూచన వస్తుంది. అప్పుడు ఇంకో పేరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా అభ్యంతర సూచన రానంతవరకూ మార్చి, సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పేరు ఆ బ్లాగ్ వారు మీకు కేటాయించినట్లే ! 

మా స్నేహితుడు ఒక బ్లాగ్ కు తను ఒక పేరు పెట్టినవెంటనే బ్లాగ్ పేరు రిజిస్టర్ చేసియున్నాము పేరు తీసి వేయాలి మెయిల్ ఎవరో పంపారు అలా మెయిల్ పెట్టిన వారికి తిరిగి మెయిల్ పెట్టండి.. వారి బ్లాగ్ లింక్ ఇవ్వమని అడగండి. ఆ లింక్ ద్వారా ఆ బ్లాగ్ కి వెళ్ళి, మీ బ్లాగ్ పేరుతో పోల్చుకోండి. సరిపోతే మార్చుకోవాలో వద్దో, లేదా ఏదైనా మార్పు చెయ్యటమో మీరు మీకుగా ఆలోచించుకోండి. 

వేరొక పేరు నిర్ణయిస్తే దానికి  ఇలాగే జరుగుతుందేమో అని అనుమానం అన్నీ మీరే అనుమానించుకుంటూ ఉంటే అక్కడే ఆగిపోతారు. 

బ్లాగ్ పేరు వేరు, బ్లాగ్ అడ్రెస్ వేరు. క్రొత్తలో కొద్దిగా తికమకగా ఉన్నా, రెండూ వేరు వేరు. ( బ్లాగ్ విజిబిలిటీ ఆప్షన్ ని ఎన్నుకుంటే - ఈ రెండూ గూగుల్ సర్చ్ లో కనిపిస్తాయి ) మీకు మరింతగా అర్థం అవ్వాలీ అంటే - నా బ్లాగ్ పేరు My VALUABLE LESSONS అని ఉంటుంది. కానీ నా బ్లాగ్ అడ్రెస్ (URL) మాత్రం  www.achampetraj.blogspot.in గా ఉంటుంది. ఇలా అడ్రెస్, బ్లాగ్ పేరూ వేరు వేరుగా కూడా ఉండవచ్చును. బ్లాగ్ పేరు అనేది మీ బ్లాగ్ యొక్క పేరు.. అది మీ ఇష్టమైనది పెట్టుకోవచ్చును. కాకపోతే వేరేవారి బ్లాగ్ పేరులకి దగ్గరగా ఉంటే గందరగోళంగా ఉండి, ఆ తరవాత కొన్ని చిక్కులు ఏర్పడతాయి. అప్పుడు మీరే మార్చుకోవాల్సి వస్తే - అప్పటిదాకా ఆ బ్లాగ్ కి వచ్చిన ఆదరణాన్ని కోల్పోవాల్సివస్తుంది. అంటే బ్లాగ్ పేరు ని అందరిలోకి తీసుకెళ్లాలీ అంటే ఆ పేరుని పరిచయం చెయ్యటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. 

బ్లాగ్ పేరుని ఎవరికైనా మెయిల్ చేస్తే / చెబితే - వారు ఆ పేరు మీదుగా నేరుగా ఆ బ్లాగ్ కి వెళ్ళలేరు. గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్ లలో టైపు చేసి, వచ్చిన వాటిల్లో ఈ బ్లాగ్ పేరుకి సరియైన లింక్ చూసి, తెరవాల్సి ఉంటుంది. కాస్త పేరున్న బ్లాగ్స్ కి దగ్గరగా ఒక అక్షరం తేడాతో చాలా సైట్స్ కనిపిస్తుంటాయి. వాటిల్లో వెదికి తెరవాల్సి ఉంటుంది. ఇలా పోలిక అబద్దపు సైట్స్ లేకుంటే ఆ పేరుతో ఆ సైట్ / బ్లాగ్ కి నేరుగా వెళ్ళొచ్చును. 

అదే లింక్ / URL ద్వారా అయితే ఆ లింక్ మెయిల్ చేసినప్పుడు - అది నీలిరంగులోకి మారి లింక్ గా పనిచేస్తుంది. దాన్ని పొందినవారు - దాన్ని క్లిక్ చేస్తే - ఆ సైట్ / బ్లాగ్ లాంటి ఎన్ని  పోలిక సైట్స్ ఉన్నా - ఎక్కడికైతే వెళ్లాలని లింక్ ఇచ్చామో అక్కడికే వెళ్ళుతారు. ఇదీ URL వల్ల లాభం. ఇది నిజమా కాదా తెలుసుకోవటానికి క్రింద మరియు పైన నా బ్లాగ్ లింక్ పెట్టాను. నొక్కి చూడండి. 

URL అంటే  Universal Resource Locator అని అర్థం. ఇది 1994 లో టిమ్ బెర్నర్స్ లీ   Tim Berners-Lee వరల్డ్ వైడ్ వెబ్ World wide web (WWW) కోసమని తయారుచేశారు. దీనివల్ల బ్లాగ్ అడ్రెస్ / సైట్ అడ్రస్ ని తేలికగా చేరుకోవచ్చును. దీనికి ఉదాహరణగా నా బ్లాగ్ అడ్రెస్ ని మరొకసారి ఇస్తున్నాను - www.achampetraj.blogspot.in 

- అచ్చంపేట్ రాజ్. 


Saturday, July 2, 2016

Good Morning - 606


మీరు ఆనందముగా ఉండండి - 
మనుష్యులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు..
దుఃఖంలో ఉంటే వాళ్ళే వెనుదిరిగి పోతారు. 
మీ ఆనందం పూర్తిగా వారికి కావాలి. 
కానీ మీ కన్నీళ్ళు వారికి అక్కరలేదు. 
సంతోషముగా ఉండండి. మీకేందరో స్నేహితులు దొరుకుతారు, 
దిగులుగా ఉంటే వాళ్ళందరినీ పోగొట్టుకుంటారు. 
మీరు అందించే అమృతాన్ని ఎవ్వరూ వద్దనరు. 
కానీ - విషాన్ని మట్టుకు మీరొక్కరే త్రాగాలి. 
ఇదే సగటు మనిషి జీవితం. !! 

Related Posts with Thumbnails