నేనూ మా నాన్న - ప్రతీ పరీక్ష ఫలితం తరవాత..
పరీక్షా ఫలితాల సమయాన ప్రతివారికీ అదో టెన్షన్.. వ్రాసిన పరీక్ష ఫలితం ఎలా ఉంటుందో అనీ.. బాగా చదివి వ్రాసిన వారికి - మంచి మార్కులూ / ర్యాంక్ / గరదు వస్తుందో, లేదో అని టెన్షన్. మామూలుగా వ్రాసినవారూ, చీటీలు చూసి వ్రాసినవారూ, కాపీ కొట్టినవారూ మాత్రం ఫలితాల రోజున మామూలుగా ఉండరు.. మార్కులు ఎలా వస్తాయో అనీ, వాటిని చూసి, తలితండ్రులు ఏమంటారో అనీ.. అదో టెన్షన్.. మార్కులు తక్కువ వచ్చాయన్న బాధ కన్నా, నాన్నగారు ఎలా క్లాస్ పీకుతారు అన్న విషయమే బాగా గుబులు రేపుతుంది. బాగా చదవని ప్రతీ విద్యార్థికీ ఇదొక అనుభవమే.. ఆ సమయాన వారికి - వార నాన్నగారు ఒక పోలీస్ అధికారిగా, తాము ఏదో నేరం చేసి, ఇంటరాగేషన్ చేయించుకుంటున్న ఖైదీల్లా భావిస్తుంటారు.. అదొక మరుపురాని జ్ఞాపకం. మనలో చాలామందికి అనుభవమే..
No comments:
Post a Comment