ప్రయాణాల్లో ఒక్కోసారి అంతగా ప్రాచుర్యం పొందని ఆలయాలకు వెలుతుంటాం. వాటి ఫోటోలు అనుకోకుండా తీసుకుంటాం.. అలాగే నేనూ ఈమధ్య ఒక ఆలయానికి వెళ్లాను. ఓ చిన్న మారుమూల పల్లెటూర్లో ఉన్న శ్రీ రామ ఆలయానికి అనుకోకుండా వెళ్ళాను. వాటి విశేషాలను చూశాను. మామూలుగా ఉన్న చిన్న ఆలయం. కానీ ఏదో సంథింగ్ స్పెషల్ గా ఉన్నట్లు అనిపించింది. ఆ ఆలయ విశేషాలు ఆన్లైన్లో పెడితే, ఎవరికైనా ఎప్పుడైనా అవసరమున్నప్పుడు - ఆ విశేషాలు ఉపయోగపడతాయని అనిపించి, పెడుతున్నాను. నాకంటూ ఉన్న పోటో కలెక్షన్ ని ఇలా తీర్చుకుంటున్నాను.
తెలంగాణా లోని మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి దగ్గరలో ఉన్న సిరిసినగండ్ల అనే ఊరికి అనుకోకుండా వెళ్ళాను. అక్కడ ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సహిత వేణుగోపాల స్వామీ Sri Rukmini, Satybhama sahitha Venugopala swamy temple, Sirsingandla, Near Siddipet, Telangaana ఆలయానికి వెళ్ళాను.
చాలా పాతనైనదీ, అక్కడ ఇలా ఒక ఆలయం ఉన్నదనీ చుట్టుప్రక్కల చాలామందికి తెలీదు కూడా. క్రొత్తగా అయ్యవారు పూజారిగా రావటం మూలాన మరుగున పడ్డ ఈ ఆలయం - జీర్ణోద్ధారణ జరిగి, కొద్ది కొద్దిగా అభివృద్ధిలోకి రావటం జరిగింది. నా ఫోటో కలెక్షన్ దాహాన్ని తీర్చుకోవడానికి / దాచుకోవటానికి ఈ టపా..
ఈ ఫోటోలు అన్నీ మొబైల్ కెమరాతో తీశా. నాణ్యత లోపించినందులకు మన్నించండి. చాలా ఫోటోలు అడ్డముగా 90 డిగ్రీలలో అప్లోడ్ అయ్యాయి. కెమరాలో ఆటో రొటేషన్ మోడ్ లో పెట్టి ఫోటో తీసినందులకు అనుకుంటా.. మామూలుగా ఫోటో చూస్తే సరిగ్గానే ఉంది. అప్లోడ్ చేస్తే తిరిగి ఉంటున్నాయి. వాటిని సరి చెయ్యడం చా కష్టముగా ఉండి, ఎలా ఉన్నాయో అలాగే అప్లోడ్ చేస్తున్నాను. ఈ అసౌకర్యానికి మన్నించండి. బ్లాగుల్లో ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు - ఫోటో రొటేషన్ కీలని పెట్టాలని ఇంతకు ముందే ఒకసారి పోస్ట్ పెట్టాను కూడా.. లింక్ : http://achampetraj.blogspot.in/2015/06/we-want-rotate-keys-in-blog-tools.html
ఆలయ పూజారి
పై ఫోటో లోనిది - ఆలయానికి ఆనుకొని ఉన్న కళ్యాణ మండపం.
ఇవి చెదలు / చీమలు పెట్టిన పుట్టలు.
No comments:
Post a Comment