సంతోషకరమైన జీవితానికి రెండు మాటలు..
వస్తువులను వాడండి - కానీ మనుష్యులని కాదు.
మనుష్యులని ప్రేమించండి - కానీ వస్తువులని కాదు..
నిజమే కదూ... ఈరోజుల్లో మనం ఏమిచేస్తున్నాం ? మనుష్యుల కన్నా వస్తువుల మీద ప్రేమని అదీ అమితమైన ప్రేమని ప్రదర్శిస్తున్నాం.. అవి కొద్దిరోజుల జీవితకాలాన్నే కలిగియున్నా - అంతులేని మమకారాన్ని వాటిమీద చూపిస్తున్నాం.. ఫలితముగా మనుష్యుల మధ్య బంధాలు పలుచన బడుతున్నాయనిపిస్తోంది. గీతలు పడ్డా, క్రిందన పది విరిగిపోయినా, కాసేపు కనిపించకుండా పోయినా.. విలవిలలాడిపోతున్నాం. ఇదంతా ఆ వస్తువులపై ఉన్న ఆపేక్షనే. అదే మనుష్యులకి -అందునా మనవాళ్ళకి ఏమైనా అయితే - వస్తువుల పట్ల చూపినంత ఆసక్తి, ప్రేమ వారిపట్ల చూపడం లేదేమో అనిపిస్తున్నది.. ఈమధ్య జనాలు ఈ ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువుల మీద మరింతగా వ్యామోహం చూపిస్తున్నారు.
No comments:
Post a Comment