నాంపెల్లి గుట్ట Nampelli Gutta - వేములవాడ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరములో - కరీంనగర్ వెళ్ళే రహదారికి ప్రక్కగా ఉంటుంది. నాంపెల్లి గుట్ట ఎత్తుగా, ఆహ్లాదకరముగా ఉండి, పర్యావరణ ప్రియులకు ఒక టూరిస్ట్ స్పాట్ గా విరాజిల్లుతున్నది. ఇక్కడ ఉన్నది - ప్రధాన ఆలయం - శ్రీ లక్ష్మీ నరసింహ Sri Lakshmi Narasimha Temple ఆలయం. ఇది ఆ ఎత్తైన గుట్టమీద ఉన్నది.
ఈ క్రింది ఫోటోలో కనిపిస్తున్నదే ఆ గుట్ట మీదకు వెళ్ళే ప్రధాన రహదారి మీద ఉన్న కమాన్. దీని గుండా లోపలి వెళ్ళాలి.
కొద్ది దూరములోనే ఇలా ఒక టోల్ గేట్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ నలుగు చక్రాల వాహనానికి పది రూపాయలు రుసుము వసూలు చేస్తారు.
ఇలా కొన్ని గుట్టలు కనిపిస్తాయి.
గుట్ట మీదకు వెళ్ళటానికి ఇలా సిమెంట్ రహదారి ఉంటుంది.
అలా వెళ్ళాక దారిలో ఇలా కాళీయ మర్ధనుడి నిర్మాణం కనిపిస్తుంది.
దగ్గరకు వచ్చాక ఆ నిర్మాణం ఇలా ఉంటుంది. ( దీని విశేషాలు వేరొక టపాలో చెబుతాను )
అక్కడి నుండి నేరుగా వెళ్ళితే, ఇలా నాంపెల్లి గుట్టకి వెళతాము.
అక్కడి ప్రకృతి రమణీయత.
నాంపల్లి గుట్ట వద్ద నుండి శ్రీకృష్ణుడి కాళీయ మర్ధన విగ్రహం.
గుట్ట వద్ద నుండి వేములవాడ పట్టణం.
గుట్ట ప్రక్కనే ఉన్న నీటి కొలను..
గుట్ట మీదకి వచ్చే రహదారి.
ఇక్కడికి వచ్చాక వాహనాలు పార్క్ చేస్తారు.
ఇక - ఇక్కడి నుండి నడక మార్గాన ఆ కనిపించే మెట్ల దారి మీదుగా ఆ గుడికి వెళ్ళాలి.
ఇలా సిమెంట్ మెట్ల మీదుగా పైనున్న గుడికి వెళ్ళాలి.
ఈ సిమెంట్ మెట్లు వెయ్యక ముందు - గుట్టని తొలచి, రాత్రి మెట్లు వాడుకలో ఉండటం చూడవచ్చును.
సిమెంట్ మెట్లు.
గుట్ట మీదుగా చూస్తే - క్రిందన ఉన్న నాంపెల్లి అనే ఊరు. దూరముగా కనిపిస్తున్నది వేములవాడ పట్టణం.
దూరముగా కాళీయ మర్ధనుడి ఆలయ నిర్మాణం.
గుట్టమీదకి మెట్లు.
గుట్ట మీదున్న ఆలయం.
ఇది ఆలయానికి ముందున్న రాతి స్థంభం. దీని మీద ఒక పళ్ళెం ఉంచారు. భక్తులు ఏదైనా నాణెం చేతిలోకి తీసుకొని, మనసులో ఏదైనా కోరిక మ్రొక్కుకొని అందులోకి విసిరేస్తే, పడితే ఆ మ్రొక్కిన కోరిక నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మిక.
ఆలయ ప్రక్క భాగం.
ఆలయ వెనక భాగంలో ప్రదక్షిణాల కోసం మెట్లు.
ఆలయానికి ఆనుకొని ఉన్న చిన్నపాటి రాతి గుట్ట.
ఆలయ ఎడమ భాగం.
No comments:
Post a Comment