కర్మను ఆచరించడం వరకే నీ బాధ్యత తప్ప, కర్మఫలం నీకు అనుకూలముగా ఉండాలని కోరుకోవడానికి నువ్వు అర్హుడివి కావు.. - భగవద్గీత
మనకి ఏది అనుభవించాలని వ్రాసిపెట్టిందో, ఆ కర్మలని పాటించడం వరకే మన బాధ్యత. అంటే మన డ్యూటీ ఏంటో, ఆ స్థానములో ఉండి, ఏమి చెయ్యాలో అది చెయ్యాలి. ఆలా చేసిన పనుల వల్ల వచ్చే ఫలాన్ని మాత్రం మనకి అనుకూలముగా రావాలని, అలా వస్తే బాగుండును అని కోరుకోవడం తగని పని - శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు. మన బాధ్యతలు ఏమిటో, అవి చేస్తూనే పోవాలి. ఈమాత్రం కష్టపడి చేశాం కదా, ఆ కర్మల ఫలితం మనకి అనుకూలముగా ఉండాలని కోరుకోవడం సరికాదు. అంటే ఫలితం గురించి ఆశించక, మన విధులని చక్కగా నిర్వర్తించగలగాలి.. అన్నమాట.
No comments:
Post a Comment