Sunday, September 7, 2014

Good Morning - 567


Before you judge my life, my past or my character.. Walk in my shoes, walk the path I have travelled, live my sorrow, my doubts, my fear, my pain and my laughter.. Remember, everyone has a story. When you've lived my life then you can judge me. 

నన్ను అత్యంత ప్రభావం చేసిన కొటేషన్స్ లలో ఇదీ ఒకటి. 

పై కొటేషన్ ని నా సోషల్ సైట్ మిత్ర్రురాలి టైం లైన్ మీద చూశా.. ఒకసారి చదవగానే ఏదో తాకినట్లు అనుభూతి. మళ్ళీ చదివా.. వావ్!.. ఎంత అద్భుతంగా చెప్పారు అనిపించింది. ఆ కొటేషన్ ని ఇలా వెంటనే వ్రాసుకున్నాను. చిన్ని చిన్ని పదాల్లో ఎంత భావం.. అవతలివారికి మన గతం, వర్తమానం గడిచిందో చెబుతూ, వారిని ఏమీ అనకుండా సుతిమెత్తగా చెప్పినా, లాగి చెంప దెబ్బ కొట్టినట్లుగా చెప్పడం ఇందులోని భావానికే చెల్లింది. అవతలివారు మనసున్నవారు అయితే, ఇందులోని భావానికి చేష్టలుడిగి, దిమ్మరపోయి - ఏదో తప్పు చేసిన ఫీలింగ్ పొందడం ఖాయం. 

అన్ని విధాలా దెబ్బతిన్న మనిషి తనని బాధించిన ఎదుటివారిని ఏమీ అనలేక, వారు తను ప్రేమించిన వారో, అభిమానించే వారో, ఆరాధించేవారో లేక తమ కన్నా బలమైన స్థితిలో, హోదాలో ఉండి, ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఈ మాటలు అంటే - ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఎదుటివారికి మనసు అంటూ ఉంటే మాత్రం - ఎక్కడో మనసు లోలోతుల్లో దిగబడిపోతాయి. ఆతర్వాత ఎవరినేమైనా అనాలి అనుకున్నప్పుడు, వెక్కిరించాలనుకున్నప్పుడో, అవమానించాలని భావించినప్పుడో పై మాటలు చప్పున గుర్తుకవచ్చి, ఆగిపోతాడు. 

పై మాటల్ని - నాకు వచ్చీరాని తెలుగీకరణ చేస్తే - ఇలా ఉంటుంది అని అనుకుంటున్నా. 

నా జీవితాన్ని, నేనంటూ ఏమిటో, నా గతాన్ని, నా నడవడికనీ చూసి నీవు ఒక నిర్ణయానికి వచ్చేముందు - నా అడుగుల్లో అడుగు వేసి చూడు.. ( అంటే - నా వైపు నుండి చూడు ), 
నేను క్లిష్టపరిస్థితుల్లో ఏ ఏ దారుల గుండా నా జీవితాన్ని ముందుకు సాగించాన్నో గమనించు. 
నా విషాదాలల్లో, నా సందేహాలల్లో, నా భయాల్లోనూ, సంతోషాలలోనూ మరియు బాధలల్లోనూ - నాతో మమేకమై వీక్షించు. 
అప్పుడు గానీ ఒక నిర్ణయానికి రాకు. 
గుర్తించుకో - ప్రతివ్యక్తికీ ఒక కథ ఉంటుంది. 
నీవు నన్ను ఏమిటో అని నిర్ణయించుకొనే ముందు, ఒకసారి నా జీవితములోకి ప్రవేశించి, నాతో గడుపు /కలిసి అడుగువేయి.. 
అప్పుడు నేనేమిటో నీకు తెలుస్తుంది. 

సరిగ్గా తెలుగులో చెప్పలేకపోయాను అని అనుకుంటున్నాను.. అందులకు మన్నించండి. 

చాలా గొప్పగా ఉంది కదూ ఈ భావన. నాకైతే మరీ మరీ గొప్పగా నచ్చేసింది. ఇది ఏరోజైతే చూశానో - ఆరోజు నుండీ పాజిటివ్ గా చూడటం మొదలయ్యింది. ప్రతివారి కష్టాల గురించీ, వారి వైపు నుండి ఆలోచించటం మొదలయ్యింది. వారిని అర్థం చేసుకోవటం మొదలయ్యింది. వారు చేసింది ఏదైనా నాకు తప్పుగా అనిపించినా, దానివెనక కారణమేదో ఉండి ఉంటుందని అనుకొని అలా ఆలోచించటం మొదలెట్టాను. చాలా విషయాల్లో - వాటివెనక ఉన్న అసలు విషయాలను గ్రహించగలిగాను. ఫలితముగా వారిపట్ల ద్వేషం కలగాల్సింది పోయి, ఒకవిధమైన జాలి కలిగింది. అంతా నామంచికే జరుతున్నదని భావించాను. వారు వారి వారి జీవితాల్లో ఒక గొప్ప ( స్నేహ / ఆత్మీయ / మానవ ) బంధం దూరమవుతున్నారనీ, వారు నాపై ఒక ఎవరివో చెప్పుడు మాటలు విని ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చారని అర్థం చేసుకున్నాను. అలా దూరమవటం నాకు ఎంతగానో లాభించింది. ఇక్కడ వారే దూరమయ్యారా ? లేక నాకే అలా అవకాశమిచ్చారా అన్నది అప్రస్తుతం. నాజీవితం మరో మలుపు తీసుకుంది.... నన్ను అర్థం చేసుకున్న వారితో కలుపుగోలుగా ఉంటూ హాయిగా క్రొత్త బంధాలని ఏర్పరచుకున్నాను. (ఆ విషయాలని తరవాత ఎప్పుడైనా చెప్పుకుందాం)

నన్ను హేళన చేసిన వారినీ, నన్ను చూసి నవ్వుకున్న వారినీ, నన్ను సామాజికముగా బహిష్కరించాలని చూసినవారినీ, నన్ను చూసి ఫన్ చేసుకున్న వారిని, భౌతికముగా / మానసికముగా దాడి చెయ్యాలనుకున్న వారినీ, నామీద చెడుగా చెప్పి అవతలివారికి దగ్గర అవ్వాలని చూసినవారినీ, అందరూ కలిసి నన్ను టోటల్ గా జీరో కనిపించేలా చేసేయ్యాలనుకున్న వారూ, రెచ్చగొట్టి లాభం పొందాలనుకున్న వారినీ... ఆఖరికి కొందరిని నా నుండి దూరం చెయ్యాలని ప్రయత్నించి విజయం సాధించినవారినీ చూశాక - అప్పుడు ఆ పై కొటేషన్ గుర్తుకు వచ్చింది. 

కానీ అపనమ్మకం, అనుమానం, హేళన, అవమానించడం... ఇవన్నీ తాత్కాలికమైనవి. నిజమైన సత్యం ఏమిటో తెలుసుకున్నప్పుడు - అప్పుడు జీవితాన ఎంత పెద్ద తప్పు చేశామో తెలిసిపోతుంది. అప్పుడు వారికి జీవిత చరమాంకం వరకూ బాధనే తోడుగా ఉంటుంది. ఎవరి ప్రాప్తం వారిది. 

No comments:

Related Posts with Thumbnails