అన్ని ఋతువుల్లో కోయిల కూయదు..
అలాగే జీవితములో అన్నిరోజులూ సంతోషముగా ఉండవు.
ఏదైనా జీవితసత్యంని నేర్చుకోవాలంటే ప్రకృతి కన్నా గురువు ఇంకెవరూ ఉండరు. ఆ ప్రకృతి మన జీవితములో ఎదురయ్యే ఎన్నెన్నో సమస్యలకీ, అడ్డంకులకీ తగిన జవాబు ఇచ్చే వాస్తవ ఉదాహరణలు ఎన్నెన్నో ఇస్తుంది. నిజానికి మనిషి ప్రకృతిని సూక్ష్మముగా పరిశీలిస్తే - ఎన్నెన్నో విషయాలు, మానసిక వికాసం, అనుభవ సారం... అన్నీ తెలుస్తాయి. అవన్నీ కనుల ముందే ఉంటాయి కానీ అందులోంచి తగిన పాఠాన్ని మనం అంత చటుక్కున పొందలేం.. ఎందుకంటే అవి సర్బ్వ సాధారణమైన విషయాలుగా తోచి, అందులో నేర్చుకోవటానికి ఏముందీ అని ప్రశ్నించే అంతటి అతి మామూలు విషయాలు అవి.
అలాగే పైన చెప్పినటువంటి ప్రకృతి ఉదాహరణ కూడా అంతే..! అన్ని ఋతువుల్లో కోయిలలు కూయవు. కొన్ని ప్రత్యేక సందర్భాలల్లో మాత్రమే అవి కూ.. అంటూ కూజితాలు చేస్తుంటాయి. అదెప్పుడూ అంటే వర్షా కాలములో గానీ, సంతాన వృద్ధిలో పాల్గొనేటప్పుడు కానీ, పిల్ల కోయిలలు ఎదిగే వేళల్లో... ఇలా కొన్ని సందర్భాలలో మాత్రమే అవి అలా కూస్తుంటాయి. ఇలా అప్పుడప్పుడు ఎలా కూస్తున్తాయో - మన జీవితాన కూడా అన్ని రోజులూ ఎప్పుడూ సంతోషంగా ఉండవని చక్కని పోలికతో చెప్పారు. అలా అన్నిరోజులూ సంతోష రముగా ఉన్నాయి అంటే వారు నిజముగా అదృష్టవంతులే అని అనుకోవాలి.
No comments:
Post a Comment