మొన్న నా మిత్రుని అమ్మాయి ఫంక్షన్ కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ కి అనుకోని కారణాల వల్ల కాస్త లేటుగా వెళ్లాల్సి వచ్చింది.. అప్పటికే ఆ కార్యక్రమం ముగిసింది. అప్పటికే భోజనం చేసేసి, కాస్త రిలాక్స్డ్ గా నా మరికొందరు మిత్రులు కూర్చున్నారు. వారిని చూడగానే - వెంటనే విష్ చేసి, బండి ఓ ప్రక్కగా పార్క్ చేసి, వారిని కలిశాను.
ఆత్మీయ కరచనాలు, పలకరింపులు అయ్యాక, మాటలు నడిచాయి. చాలారోజుల తరవాత కలసిన స్నేహ బృందం. మొత్తం నలుగురు. నేను ఐదో వ్యక్తిని. మాది హైస్కూల్ చదివినప్పటి అనుబంధం. అది ఇంటర్మీడియట్ వరకు సాగింది. ఆ తరవాత విడిపోయాం అంటే - అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. గత పది పదిహేనేళ్ళుగా మాత్రం కలవటం మరీ అరుదయ్యింది. ఎవరి జీవితాన వారు బీజీ అవటం మూలాన అలా జరిగింది. (అలాని అనుకున్నాను)
మేమందరమూ ఒకే స్కూల్ లో చదవలేదు. వేరు వేరు స్కూల్స్ లలో చదివినా, మమ్మల్ని ఒక్కటిగా, స్నేహితులుగా దగ్గరకు చేసినది - క్రికెట్.
మేమంతా ఒక జట్టుగా ఆడేవాళ్ళం. సాయంత్రం కాగానే ఆడేవాళ్ళం. ఇక ఆదివారాల్లో అయితే వేరే జట్లతో మ్యాచులు. ఈ ఒక్క క్రికెట్ యే కాకుండా ఫుట్ బాల్ కూడా ఆడేవాళ్ళం. ఈ క్రికెట్ టీం లో నాది ప్రముఖ స్థానం. నేనుంటేనే మ్యాచ్ అన్నంతగా ఆడేవాడిని. హాఫ్, లెగ్ స్పిన్, ఫాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్ తో ఒక వెలుగు వెలిగాను. ఇంతగా టాలెంట్ ఉన్నా మా జట్టు మరియు నా ప్రతిభ లోకల్ వరకే పరిమితం అయ్యింది. అప్పట్లో జట్లు తక్కువే అనుకోండి.
అప్పటి ఆ ఆటల ముచ్చట్లు, మిగిలిన ఆటగాళ్ల ఆట గురించి, మాట్లాడాం. చాలారోజులకి కలిశారు కదాని చిన్ననాటి స్నేహాల్లో ఉండే చనువుతో కాసింత (కుళ్ళు) జోకులూ, ఏరా సంభోధనలూ, అప్పుడు పిలుచుకున్న నిక్ నేమ్స్, కాసింత మరీ చనువుగా మాట్లాడుకున్నాం. చాలా చాలా కాలం తరవాత కలిశారు. చెప్పుకోవడానికి బోలెడన్ని మాటలు ఉన్నాయి మా మధ్య అనిపించింది. అలా సాగిపోతున్న మా మాటలకి నేనే అడ్డుకట్ట వేస్తూ " ముందుగా ఫంక్షన్ కి పిలిచిన మిత్రున్నీ, వారి కుటుంబాన్ని పలకరించి వస్తాను.. ఇప్పటికే ఆలస్యం అయ్యింది.." అని అన్నాను.. సరే అన్నారు.
ఇప్పుడే వస్తానూ.. అంటూ ఆ మిత్రుల వద్ద తాత్కాలికముగా సెలవు తీసుకొని, నా కుటుంబముతో ఆహ్వానించిన మితృడి వద్దకి వెళ్ళాను. మరీ లేటుగా వెళ్ళాం అనుకుంటూ - నామిత్రున్ని కలిశాను. కాసింత ఆలస్యం అయ్యిందని కారణం చెప్పాను. ఫరవాలేదని తను అన్నాడు.
వారి అమ్మాయిని కలిశాం. ఆ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక, భోజనానికి ఉపక్రమించాం. అవి అయ్యాక, మిత్రులని కలుద్దామని చూశాను. ఒకరు తప్ప మిగిలినవారు లేరు. అప్పటికే ఫంక్షన్ కి వచ్చిన దాదాపు ముప్ఫై మంది తప్ప అందరూ వెళ్ళిపోయారు. సన్నగా వర్షం పడుతున్నది అప్పుడు. హాస్చర్యం. ఏమిటీ ! ఇలా ? అనీ. వాళ్ళుంటే - మా ఫామిలీ ని పరిచయం చేద్దామని అనుకున్నాను.
మిగిలిన ఒక మిత్రుడికి పరిచయం చేసి, కాసేపు కబుర్లు అయ్యాక, అడిగాను - " వారేరీ రా!.." అనీ.. " ఇంకో ఫంక్షన్ ఉందని కార్ లో వెళ్ళిపోయారు.." అన్నాడు.
" మరి కనీసం కర్టెసీ కోసమైనా నాతో వెళుతున్నా అని చెప్పి వెళ్ళొచ్చు కదా.. నేను ఇప్పుడే వస్తాను ఆల్రెడీ ముందే చెప్పేసి, వెళ్లాను కదా.. రెండు నిమిషాల్లో చెప్పేసి, వెళ్ళిపోతే ఏమయ్యేది రా? అన్నాను. " అయినా వారు ఎలాగూ కార్ లో వెళ్ళుతున్నారు కదా! పైగా వర్షం కూడా మొదలయ్యింది కదా..! బస్ అంటే ఏదో అర్థం చేసుకోవచ్చును కదా! కానీ కాసేపు ఉండి, వెళ్ళొచ్చు కదా.. ఎలాగూ స్వంత కార్ నే కదా!.. ఇలా వచ్చేసి, ఒకమాట చెప్పేసి వెళితే బాగుండేది కదా.. నాకూ అదే దారిలో పని ఉంది. అందాక వారికి లిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటుందీ అలాగే, కాసింత మాట్లాడుకున్నాం అన్నట్లుగా కూడా ఉండేది కదా.. చాలా సంవత్సరాల తరవాత కలిసి కూడా ఏమీ మాట్లాడకుండా ఇలా వెళ్ళిపోతే నేనేమని అనుకోవాలి. వాళ్ళు మారిపోయారు - హోదా, డబ్బు, అంతస్థు, ఆస్తులు.. ఇవి చూసే మాట్లాడే పరిస్థితికి మారినట్లున్నారు. వారు అలా మారితే ఏం చేస్తాం. మనమూ దూరమవటం తప్ప.. అయినా ఫ్రెండ్షిప్ లో అవేవీ అవసరం రావు కదా.. స్నేహం ముఖ్యం కదా.. " అన్నాను.
ఇలా మాట్లాడిన మితృడిదీ అదే వరుస. ఒకసారి కనిపిస్తే - నా అకౌంట్ కి ఆడ్ రిక్వెస్ట్ పెట్టు.. అని ప్రొఫైల్ అడ్రెస్ ఇచ్చాను. టైపింగ్ లో ప్రాబ్లెం రాకూడదని టైపు చేసిచ్చా. అయినా ఇంతవరకూ రిక్వెస్ట్ లేదు.
ఈసారి కనిపిస్తే - అడిగా. లేదు రా అకౌంట్ కావాలంటే ఇప్పటికిప్పుడు నీకోసం అకౌంట్ ని పావుగంటలో క్రియేట్ చేసి ఇస్తాను.. అన్నాడు. " సరే మరి లేకుంటే పోనీలేరా!.. చాలారోజులకి కలిశాం. ఒక ఫోటో దిగుదాం.." అని మొబైల్ కెమరా ఓపెన్ చేశా. ఒక ఫోటో దిగాను. దేనికీ అన్నాడు.. నా ఫేస్ బుక్ లో నా మితృలకి పెట్టేసుకుంటాను.. అని చెప్పా. తనూ తన కెమరాతో ఫోటో తీసుకున్నాడు.
" నీకెందుకురా.." అని యధాలాపముగా అడిగా.
నా ఫేస్ బుక్ అకౌంట్ లోన పెట్టుకుంటా అన్నాడు. షాక్ అయ్యా.. ఇందాకనేమో అకౌంట్ యే లేదు అన్నవాడు - ఐదు నిముషాలు కాకముందే ఇలా అనడం హాశ్చర్యానికి గురి అయ్యాను. నామీద నాకే తెలీని జాలి కలిగింది. అతను నా చిన్నప్పటి అంటే " అ ఆ ఇ ఈ.. " ల నుండీ నా క్లాస్మేట్. కాసేపట్లో సర్దుకున్నాను. మామూలుగానే ఉండి, ఫెస్బూక్ గురించి కొన్ని విషయాలు ( తనకి ఆన్లైన్ ఎంత పరిచయం ఉందొ తెలుసుకోవాలని ) మాట్లాడాను..
" ఒక మిత్రుని భవనం xxxxxxx అనే క్లాస్మేట్ వాడి ప్రొఫైల్ కనిపించటం లేదు. అది దొరకబట్టాలి.. వాడిది ఒక్కటి దొరికితే అందరిదీ దొరికేసినట్లే.." అన్నాడు. మరి నాదీ ? అడగాలనిపించింది. కనిపించినా కనిపించనట్లే ఊరుకున్నావు అని మనసులో అనుకున్నాను. అతడి అకౌంట్ ఎలా దొరబట్టాలో నాకు తెలిసిన పద్ధతులు చెప్పాను. ఆ పద్ధతులు అతనికి తెలీవు అంట.
ఒకస్థాయికి వచ్చాక మిత్రులని ఎలా మరచిపోతారో చూడండి. దగ్గరికి రానీవ్వరు. గోరింటాకులా వాడుకోవాలని చూస్తారు అనుకున్నాను. నేను మాత్రం పాజిటివ్ గా తీసుకున్నాను. ఇంకా నమ్మేసి, అలా గుడ్డిగా స్నేహం కొనసాగించే బదులు, తనే యే మూడ్ లోనో ఉండి, అలా మాట్లాడి, నా కళ్ళు తెరిపించేశాడు అనుకొని సంతోషించాను. దేవుడు నాకు మేలే చేశాడు.
ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చాక అతడి ప్రొఫైల్ వెదికాను. దొరకలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కుదరలేదు. చప్పున గుర్తుకు వచ్చింది. అతడి ఫోన్ నెంబర్ నా సెల్ ఫోన్ లో ఫీడ్ చేసి ఇమ్మని ఫోన్ ఇచ్చినప్పుడు, తన నెంబర్ ఫీడ్ చేసి ఇచ్చాడు. అప్పుడు యే పేరు వ్రాశాడో అనుకుంటూ - ఆ ఫీడ్ చేసిన పేరు టైపు చేసి, సెర్చ్ చేస్తే దొరికింది. మొత్తం ప్రొఫైల్ - తన స్నేహితులకి మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ పెట్టుకున్నాడు. అది తన ఇష్టమే అనుకోండి. తనకి చెప్పాలని ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు దగ్గరవ్వాలని ప్రయత్నించడం..?
తరవాత కాసేపు బాధపడి - నా రొటీన్ లైఫ్ లోకి మారిపోయాను.

నిజమే కదూ..
No comments:
Post a Comment