(ప్రాణ) స్నేహితుడు ఎలా ఉండాలీ అంటే :
Soul mate friend 1 కి కొనసాగింపు..
స్నేహితుడు అనేవారు మీ వయస్సు వారో, మీ కాలనీ వారో అని కాదు.. స్నేహితుడుకీ, మనకీ మధ్య ఎటువంటి లింగ భేదాలు చూడవద్దు. అదొక పవిత్రమైన భావన. చేసేది ఆడస్నేహమా, మగవారి స్నేహమా అని కాదు. మీరు స్నేహానికి చూపే ఆసక్తి, చేసే పనులని, ఇచ్చే విలువని బట్టి స్నేహం అనేది నిలుస్తుంది.
స్నేహితుడు తమ వయస్సు వాడై ఉండాలని రూలేమీ లేదు. స్నేహం అనేది వయస్సు వల్ల కాస్త చనువుగా పలరించుకుంటామేమో గానీ, వయస్సు అనే విషయం మీద స్నేహం కొనసాగదు. మీ హృదయం ఎంత విశాలముగా తెరచి ఉంచారు అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక పిల్లాడికీ, నాలుగిళ్ళ అవతల ఉన్న రిటైర్మెంట్ ముసలాయనకీ స్నేహం చక్కగా కుదరవచ్చును. వారి పలకరింపులు ఆప్యాయతతో, మమతానురాగాలతో ఉంటుంది. అంటే వయస్సు అడ్డమేమీ కాదు అన్నమాట.
స్నేహం అనేది ఉన్నవారు, లేనివారు అంటూ తారతమ్యాలని పట్టించుకోదు. ఆ స్నేహములో ఏ ఒక్కరైనా ఆర్థిక సంబంధాలను ఆశించి, స్నేహం మొదలెట్టారు అనుకోండి. రెండోవారు ఆ మొదటివారి ఉద్దేశ్యము తెలుసుకోకుండా స్నేహం చేసి, ఆ స్నేహమే గొప్పనైనది, కలకాలం నిలిచి ఉండేది అని భావిస్తే - అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు.
ఎప్పుడైతే స్నేహములో డబ్బు విషయం వచ్చిందే అనుకోండి. ఆ విషయాన్ని స్నేహంలోన అస్సలుకే తీసుక రావొద్దు. ఎప్పుడైతే అలా డబ్బు ప్రస్తావన వచ్చిందే అనుకోండి. ఇక ఆ స్నేహానికి బీటలు మొదలయ్యాయి అన్నమాటే..
స్నేహితుల వద్ద ఎన్నడూ డబ్బు చేబదులు / వస్తు చేబదులు అన్నమాటే రాకూడదు. ఒకవేళ అడగాల్సి వచ్చినా, మన చుట్టుప్రక్కల వారినందరినీ అడిగాక, వారు కాదన్నాకే - చివరి ప్రయత్నముగా వీరిని అడగాలి. వీరు సాయము చేస్తే - ఆ తరవాత మీకు డబ్బు వస్తే - మొదటగా అప్పు తీర్చాల్సింది వీరికే. ముందుగా వీరి నుండి రుణ విముక్తులు అవ్వండి. ఆ తరవాతే మిగతావారి అప్పు తీర్చండి. ఆ తీర్చేది చాలా త్వరగా, వారు మనల్ని అడగక ముందే తీర్చేయ్యాలి. ఇచ్చే వారి మొత్తం కూడా అణా పైసలతో సహా ఇవ్వండి. ఇక్కడొక చిన్న సూచన : వారికివ్వాల్సిన బాకీ తో బాటూ - కొసరుగా వారికి ఏదైనా ఇష్టమైనది ఇవ్వండి. అసలు కన్నా ఈ కొసరే మీ స్నేహ బాంధవ్యాన్ని బలోపేతం చేస్తుంది.
స్నేహితుల సామాజిక వర్గాలు, హోదాల్ని స్నేహములో ఎన్నడూ చూడకండి. అలా చూసిననాడు ఇక స్నేహం వీగిపోవటానికి బీటలు పడటం మొదలయ్యిందన్న మాట. కానీ నేడు అన్నీ ఇలా చూసి మొదలయ్యేవి ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే స్నేహం దాకా రాక ముందే వీగిపోతున్నాయి. అంటే పరిచయాల వద్దే ఆగిపోతున్నాయి. ఒకవేళ దాటి ముందుకు వచ్చినా - అందులో నటన తప్ప మరేమీ ఉండటం లేదు.
మీ స్నేహితుడు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలీ అనుకోవడం మూర్ఖత్వం. వారికీ పర్సనల్ లైఫ్ అంటూ అంటూ ఉంటుంది కదా.. కాసింత వెసులుబాటు ఉన్నప్పుడు, వెసులుబాటు చేసుకొని మరీ సహాయం చేసేలా ఉండాలి.
ఏదైనా సహాయం అడగటం, అదీ తన శక్తికి తగినట్లుగా ఉండాలి. తనతో కాని పనిని అప్పగించటం అంత మంచిది కాదు. అలా చేసి, ఆ పని కానప్పుడు మనసులో ఏర్పడేనిరాశ వల్ల అవతలివారి మీద అయిష్టత మొదలవుతుంది. ఇక ఆ స్నేహం దెబ్బ తినటం మొదలవుతుంది. అందుకే స్నేహితుల నుండి సహాయం ఆశించవద్దు.
స్నేహితుల వద్ద నుండి యే సహాయం ఆశించవద్దు. మనకు తెలిసినవారి వద్ద నుండి, బయటవారి నుండి గానీ - ఆ పని కాకపోతే, చివరి ప్రయత్నముగా స్నేహితుల వద్దకి వెళ్ళాలి. ప్రతిదానికీ స్నేహితుల మీద ఆధారపడితే పైకి చెప్పరు గానీ, మీ మీద అయిష్టత పెంచుకుంటారు. అలా నెమ్మనెమ్మదిగా దూరం అవుతారు.
- మరిన్ని మరో సారి చెప్పుకుందాం..

No comments:
Post a Comment