Wednesday, April 17, 2013

Birthday - 2013

నిన్ననే నా పుట్టినరోజు బాగా జరుపుకున్నాను. ఆ విశేషాలు ఈరోజు మీకోసం.

నిజానికి పుట్టినరోజులు జరుపుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇష్టం ఉండదు కూడా.. మనమేమి సాధించామని ఇదంతా.. అని అనిపిస్తుంది. కానీ మనవాళ్ళ సంతోషం కోసం మాత్రం తప్పదు కదా.. వద్దన్నా మరీ పట్టుబట్టి శ్రీమతి చేస్తే, తప్పదు కదా! ఆత్మీయుల సమక్షములో బుద్దిగా అలా కూర్చొని, కేకు కోసి ఒక ముక్క తినిపించి, తినిపించుకోవడం అంతా సంతోషముగా ఉంటుంది.

ఒకరోజు ముందు వరకూ - నాకు ఈసారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టం లేదు. ఇష్టమైన వారు కొద్దిమంది దూరమయ్యారు. వారి జ్ఞాపకాల వల్ల మరియు వారి విషెస్ ఉండవు అన్న కారణం వల్ల అలాని నిర్ణయం తీసుకున్నాను కానీ, నేనున్నాను అంటూ నాలోని నిర్లిప్తతని దూరం చెయ్యటానికి మా ఆవిడ పూనుకుంది. ముందురోజే తన డబ్బులని ఖర్చు చేసి, ఉన్నంతలో అన్నీ సిద్ధం చేసింది. తనకోసం అయినా మూడ్ మార్చుకొని, జరుపుకోవటానికి డిసైడ్ అయ్యాను. ముందు రోజు నాకొక డ్రెస్, జాగింగ్ షూస్, రెండు కాడ్ బరీ చాక్లెట్స్ బాక్స్ ని నా పుట్టినరోజుకి చిరుకానుకగా ఇచ్చింది. ఇవన్నీ అవసరమా? అంటే " నీలో  సంతోషం కోసం.." అని ముందరి కాళ్ళకు బంధం.. ఎదుటివారిలో సంతోషం కోసం తను చేసే ప్రయత్నానికి తలొగ్గక తప్పలేదు. తనకి ధన్యవాదములు.

ఆరోజు రాత్రే సరిగ్గా పన్నెండు గంటలకి నా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఏదో తెలీని పులకింత. మదిలో ఏదో తెలీని ఉత్సాహం. ఇక అప్పుడే ఫోన్ కాల్స్, మెస్సేజెస్ మొదలయ్యాయి. అవన్నీ అయ్యేసరికి అర్థరాత్రి ఒంటిగంట అయ్యింది.

ప్రొద్దున్నే క్రొత్త షూస్ వేసుకొని, జాగింగ్ కి వెళ్ళాం. అక్కడ ఉన్న వారందరికీ, వాకింగ్ చేస్తున్నవారికీ,  ఆడుకుంటున్న ఫుట్ బాల్ టీం వారికీ  ( దాదాపు 60+ మంది ) ఆ కాడ్ బరీ Cadbury చాకొలేట్స్ బార్స్ ఇచ్చాను. దేనికీ అడిగారు. పుట్టినరోజు సందర్భం అని చెప్పా.. ప్రతిగా వారు విష్ చేసి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. కొద్దిమంది హాయిగా తీసుకున్నారు.. కానీ ఏమీ అనలేదు. ప్చ్! పోనీలెండి. వారిదేమీ తప్పులేదు. అలా ప్రతిగా చెప్పాలి అన్న విషయం వారికి లేదేమో. వారందరికీ - ఇలా తీసుకోవటం సరిక్రొత్త అనుభవం అంట. ఈ కాన్సెప్ట్ బాగుంది. ఇక మా పుట్టినరోజునాడు ఇలా చేసుకుంటాం.. అని ఒకరిద్దరు అన్నారు.

ఆ తరవాత మా చుట్టుప్రక్కల వారికీ ఇచ్చాను. ఆతరవాత దైవ దర్శనం కోసం గుడికీ, ఆతరవాత దైనందిక కార్యక్రమాలూ.. హ్మ్. మధ్యలో నాకోసం చేసిన పాయసం, చికెన్ బిర్యానీ ఆరగింపులూ.. భుక్తాయాసముతో కునికిపాట్లూ.. మొత్తానికి మళ్ళీ రాత్రి ఒంటిగంట వరకూ చాలా బీజీ. మచ్చిన మెయిల్స్, SMS, మెస్సేజెస్ కి కృతజ్ఞతలు చెబుతూ ప్రతిజవాబు ఇచ్చాను. నా జీవితాన ఆనందకరముగా, మరపురాని అనుభూతిని ఇచ్చిన రెండో  పుట్టినరోజు ఇది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే - నిర్లిప్తత నుండి సంతోషకరమైన మధురానుభూతుల వరకూ నా ప్రయాణం సాగింది. అందరికీ ధన్యవాదములు. ప్రత్యేకముగా మా శ్రీమతికి.Related Posts with Thumbnails