మనలో - అహంకారం వంటి ఎన్నో స్వతంత్ర శక్తులున్నాయి. అది సైతాన్ కి ప్రతినిధి, మనిషికి ప్రధాన శత్రువు.
అవును కదా.. అహంకారం, వదరుబోతుతనం, మదం, మాత్సర్యం, కోపం, వెటకారం, తాపం, అహంభావం.. వంటి ఎన్నెన్నో శక్తులు మనలో ఉన్నాయి. అవన్నీ చెడుకి ప్రతినిధులు. అవన్నీ మనిషికి ప్రధాన శత్రువులే. వాటిని మన మీద ప్రభావం చూపించేలా వాటికి అధికారం ఇస్తే - అవి మనల్ని నిలువునా ముంచేస్తాయి. వాటివలన మన దగ్గర ఏదో ఉన్నదాన్ని - అది పొందేదాకా మనల్ని ప్రాకులాడేవాళ్ళు తప్ప మనకంటూ ఎవరూ మిగలరు. ఫలితముగా మనం ఒంటరిగా మిగిలిపోతాం. కావున తస్మాత్ జాగ్రత్త.
No comments:
Post a Comment