నా బైక్ ని సైడ్ స్టాండ్ వేసినప్పుడల్లా వంగటం మొదలెట్టింది. అంటే బాగా యాంగిల్ లో ఒక వైపు వంగినట్లు కనిపించేది. చదునుగా ఉన్న స్థలములోనే చూస్తేనే అలా బాగా వంగినట్లు కనిపించేది. ఇక కొద్ది వాలు ఉన్న స్థలములో సైడ్ స్టాండ్ వేసి, పార్క్ చేస్తే ఇక మరీ వంగినట్లు, మరోవైపునుండి ఎవరైనా కొద్దిగా నెడితే - ఆ బైక్ పడిపోయేలా తయారయ్యింది. వెళ్ళిన ప్రతిచోటా సరిగ్గా చదును ఉన్న స్థలాలని ఎక్కడ వెదకను? రాను రాను ఆ సమస్య మరీ ఎక్కువ కాసాగింది.
సైడ్ స్టాండ్ అంటే ఇదుగో ఇదే - ఇది నా బండిది కాదు.. గూగుల్ ఇమేజెస్ నుండి సేకరించాను.
ఇక లాభం లేదని మొన్న వీలు చేసుకొని మెకానిక్ దగ్గరికి నా బైక్ ని తీసుకెళ్ళాను. నా బైక్ సైడ్ స్టాండ్ కి ఉన్న సమస్య ఏమిటో చెప్పాను. అది అంతే అంట. ఆ సైడ్ స్టాండ్ యొక్క నేలని తాకే భాగానికి - ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు ఒక ఇనుప ముక్కని వెల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. అది బయట వెల్డింగ్ షాపులలో చేయించాలి అన్నాడు.
దానికి నేను అన్నాను - ఆ స్టాండ్ ని విప్పేసి, లోపల అరిగిన చోట ఒక ప్లేట్ వాచర్ వేసి బిగిస్తే - ఆ స్టాండ్ కి ఉన్న ప్లే ( కొద్దిగా అటూ ఇటూ ఊగటం / వదులుగా ఉండటం) పోతుంది కదా అన్నాను. అలా చేయటం వలన తక్కువ ఖర్చులో పని అయిపోతుందని నా ఆలోచన. కానీ ఆ మెకానిక్ అలా కుదరదు అన్నాడు. సెకండ్ ఒపీనీయన్ అన్నట్లు ఇంకో మెకానిక్ వద్ద చూపాను. అదే సమాధానం. ఇక ఆఖరుగా ముచ్చటగా మూడో మెకానిక్ ని సంప్రదిస్తే - అక్కడా అంతే! వెల్డింగ్ తప్పదు అంట. నేను చెప్పినట్లు చెయ్యటం కుదరదు అన్నారు.
పోనీ - వారు చెప్పినట్లు వెల్డింగ్ చేయిద్దామని అనుకున్నా - దానివల్ల నా బండి " లుక్ " పోతుంది. ఏదో రిపేర్ బండిలా అసహ్యముగా కనిపిస్తుంది. అదే నా బాధ. అందుకే అంతగా ప్రయత్నాలు. కానీ నా మనసుకి మాత్రం ఏదో ఎక్కడో చిన్నగా లోపం ఉంది. దాన్ని దొరకపుచ్చుకుంటే ఈ సమస్య ఖచ్చితముగా తొలగిపోతుంది అని అనిపిస్తుంది. అది చాలా రోజులుగా వెంటాడింది. ఎంతగా ఆలోచించినా సమస్యకి సమాధానం దొరకలేదు. కారణం అస్సలు ఆ స్టాండ్ అంటే ఏమిటో, దాని మెకానిజం ఏమిటో తెలీదు. చూడటానికి చాలా మామూలుగా స్టాండ్ మెకానిజం ఉన్నా కొద్దిగా క్లిష్టమైన సాంకేతికత. అస్సలు కారణం ఏమిటో తెలీదు. ముగ్గురు మెకానిక్ లూ ఒకే సమాధానం చెప్పటం వలన నిజముగానే వీలు కాదేమో అనుకున్నాను.
పోయిన ఆదివారాన కాసింత సమయం చిక్కితే, బండి శుభ్రం చేస్తున్నప్పుడు - ఈ సైడ్ స్టాండ్ సంగతి గుర్తుకవచ్చి, బాగుచేసుకోవాలనిపించింది. నాతో అయ్యేపనిలా అనిపించింది. అలాని నా మనసాక్షి చెప్పింది. ఒకసారి ఆ స్టాండ్ రిపేర్ చేస్తున్నప్పుడు కేవలం చూశాను. అది గుర్తుకు తెచ్చేసుకున్నాను.
ముందుగా స్ప్రింగ్ ని కటింగ్ ప్లేయర్ ని వాడి, బైండింగ్ వైర్ సహాయాన ని ఊడదీశాను. ఆ తరవాత బోల్ట్ ని సెట్ పానా సహాయాన విప్పేశాను. ఇప్పుడు కిరసనాయిల్ + పాత పళ్ళ బ్రష్షు + పాత బట్ట సహాయముతో వాటికి ఉన్న జిడ్డు, ఆయిల్, దుమ్ము, ధూళి.. తీసేశాను. ఇప్పుడు క్రొత్తదానిలా కనిపించింది.

ఆ తరవాత వాటన్నింటినీ పరిశీలనగా చూశాను. అప్పుడు సమస్య ఏమిటో అర్థం అయ్యింది. దాదాపు అంగుళంన్నర సైజులో ఉండే బోల్ట్ వద్ద ప్రాబ్లెం. ఆ బోల్ట్ మధ్యలో స్టాండ్ పట్టీ తాకేచోట బాగా అరిగిపోయింది. అరిగింది మహా అంటే 2 - 3 mm ఉండొచ్చును కానీ అది ఎంత ఇబ్బంది పెట్టిందో చూశారు కదా.. అది మారిస్తే సమస్య పోతుంది అనుకున్నాను. ఆరోజు ఆదివారం కనుక షాప్స్ అన్నీ బంద్.
ఇక మరుసటిరోజున ఉదయాన షాప్స్ తెరిచాక - అలాంటి బోల్ట్ ఒకటి కొనేసి, ఆ సైడ్ స్టాండ్ కి అమర్చాను. ఆ తరవాత స్ప్రింగ్ పెట్టేశాను. అంతే! క్రొత్త స్టాండ్ పనితీరు ఏ విధముగా ఉంటుందో - అచ్చు అదే విధముగా ఇదీ ఉంది. క్రొత్త స్టాండ్ యాంగిల్ లోనే స్టాండ్ ఉంటున్నది. ప్లే అంటూ ఏమీ లేదు. కేవలం ఎనిమిది రూపాయల్లో సమస్య తీరింది. నా బైక్ లుక్ కీ ఏమాత్రం తేడా రాలేదు కదా.. ఇంకా క్రొత్త లుక్ వచ్చేసింది. ముగ్గురు మెకానిక్ ల వల్ల కానిది నా వల్ల అయ్యింది. మీ బండికీ ఇలాంటి సైడ్ స్టాండ్ సమస్య ఎదురయితే - ఇలాగే చెయ్యండి.
2 comments:
నిజమే నండి, మీ పరిష్కారం భాగుంది. ఒకోసారి అలంటి బోల్టులు కూడా మార్కెట్లో దొరకవు, అలాంటప్పుడు అరిగిన చోట వెల్డింగ్ చేసి, లెత్ మిషన్ లో గ్రైన్దింగ్ చేసి వాడు కోవచ్చు ,
మనకు అందు బాటులో ఉన్న మెకానిక్ లు అందురు మొరట రకాలు (నాట్ స్కిల్స్) , గోరె దాటు రకం
మీ స్పందనకి కృతజ్ఞతలు.
అలాంటి బోల్టులు చాలానే దొరుకుతాయి. ఒకవేళ దొరకకున్నా ఎలాగూ తిరిగేది బండి మీదే కాబట్టి, వెళ్ళినచోట ఉన్న ఆటోమొబైల్ షాపుల్లో కొనుక్కోవచ్చును. ఒక్కోటి పది రూపాయలకు కొన్నా, ఇంకొకటి స్పేర్ గా కొని పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చును. అవి దొరకనప్పుడు లేత్, గ్రైండింగ్ చేసి వాడుకోవచ్చు. కానీ అలా చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. యే దారి దొరకనప్పుడే ఆ పద్ధతిని వాడాలి.
మనకు మెకానిక్ లు అందరూ అలాగే ఉన్నారు. వారే కాదు.. అన్ని రంగాల్లోనూ అలాగే ఉన్నారు. సగం సగం విద్యలే. అన్నీ తెలిసిన వారు కొందరే. కానీ వారికి అప్పటికే ఈగోలతో కళ్ళు నెత్తికి ఎక్కుతాయి.
Post a Comment