Thursday, January 3, 2013

Spam comments

Mark as Spam, ఇంకొకటి Spam Box అనే పోస్ట్స్ లలో ఈ పనికిమాలిన, వృధా కామెంట్స్ గురించి చెప్పాను. అసలు ఆ కామెంట్స్ వల్ల లాభం ఏమీ ఉండదు అనీ. ఆ కామెంట్స్ పోస్ట్స్ చేస్తున్నవారికీ ఇంకా అలసట రానట్లుంది. ఇంకా అలా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. కానీ అవన్నీ ఆటోమేటిక్ గా స్పాం బాక్స్ లోకి వెళ్లిపోతున్నాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వేరే విధముగా పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

ఒక పోస్ట్ (Spam box) లో చెప్పినట్లు - 2012 జనవరి ఒకటిన ఆ స్పాం బాక్స్ మొత్తం శుభ్రం చేశాను. ఈ 2012 లో ఎన్ని స్పాం మెసేజెస్ వస్తాయో చూద్దామని. అలాగే ఆ విషయం మీకు చెబుదామని. ఇప్పుడు ఆ విషయమే చెప్పబోతున్నాను.

2012 లో నాకు వచ్చిన స్పాం కామెంట్స్ మొత్తం - 311. ఎలాంటి కామెంట్స్ యో ఈ ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి. అవన్నీ స్పాం బాక్స్ లో భద్రముగా ఉన్నాయి. అవన్నీ తీసేస్తున్నాను.. ఏమీ పనీపాట లేకుండా ఇలా జనాలని ఇబ్బంది పెట్టే ఇలాంటి చదువుకున్న అడ్డ గాడిదల్ని కోసి, ఉప్పూ, కారం వేసి రుద్దాలి.



2 comments:

Apparao said...

వర్డ్ వెరిఫికేషన్ పెట్టుకోండి
దీనివలన స్పాం కామెంట్స్ రావు.

Raj said...

కృతజ్ఞతలు అప్పారావు గారు.

అలా వెరిఫికేషన్ పెట్టుకున్నా - ఇలా వస్తున్నాయని చెప్పటానికి ఈ పోస్ట్ పెట్టాను.

Related Posts with Thumbnails