ఒక చిన్ని చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులని చేస్తుంది. కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులని ఇస్తుంది. కనుక మీ విలువైన జీవితాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించండి.
ఎవరైనా ఎదురుకాగానే మీ మొహాన వెలిసే ఒక చిన్ని చిరునవ్వు ఎదుటివారిని చాలా బాగా ఆకట్టుకుంటుంది. మీరు మాట్లాడేదాని కన్నా ఎక్కువగా ఇదే అవతలివారిని ఇంప్రెస్ చేస్తుంది. మీమీద ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిగించేలా చేస్తుంది. ఎదుటివారికి ఆత్మీయులుగా దగ్గరికి చేస్తుంది. కానీ - ఒక క్షణికమైన కోపం మీ మీద ఎదుటివారికి ఉన్న ఒక మంచి అభిప్రాయాన్ని తొలగిస్తుంది. మీరు ఆ అర్థం లేని కోపాన్ని అలాగే కొనసాగిస్తే మీకు వారు శత్రువులు అయ్యే ప్రమాదమూ ఉంది. శత్రువులు మన జీవితాన పెరుగుతున్న కొలదీ మన జీవితం ఎదుగుదలలో ప్రతికూలత ఎదురవుతుంది. అప్పుడు మనలో ఎంత ప్రతిభ ఉన్నా - చివరకు మామూలు వ్యక్తుల్లా ఉండిపోతాము. ఇంత ప్రమాదం ఉంది కాబట్టే - కోపాన్ని తగ్గించుకొని, మీ మొహాన కాసింత ప్రసన్న వదనముతో, , ఎక్కడైనా, ఎప్పుడైనా మీ జీవితాన్ని చిరునవ్వు మోముతో అనుభవించండి.
2 comments:
correct!
Thank you..
Post a Comment