Wednesday, October 31, 2012

Good Morning - 169


గెలుపే కావాలని కోరుకున్నప్పుడు, 
ఓడిపోతామనే భయాన్ని కూడా ముందుగా గెలవవాలి. 

Tuesday, October 30, 2012

Smart mobile

క్రొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. మంచిరోజు, ముహూర్తం చూసి ఆ ఫోన్ వాడటం మొదలెట్టాను. అంతా సంతోషం.. ఉంటే ఈ పోస్ట్ వ్రాసేవాడినే కాదు. అలా వాడటం మొదలెట్టానా? అంతా బాగుంది.. కానీ ఒక చిన్న పొరబాటు వల్ల కూసింత టెన్షన్. ఆ పొరబాటు కొంత నాదీ, ఆపరేటర్ దీ ఇంకొంత.

ఆ ఫోన్ లో రెండు సిమ్ములు వేయాలి. ఆ రెండు సిమ్ములూ వేసి ఆ యూనిట్ ని ఆన్ చేశాను. ఆ సిమ్ము లలో ఒకటి - ప్రైవేట్ కంపనీ సిమ్. రెండోది ప్రభుత్వరంగ సంస్థది. అలా ఆన్ చేశానో లేదో, ఈ ప్రైవేట్ కంపనీ సిమ్ దానంతట అదే నెట్ వాడుకొని సెట్టింగ్స్ ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకుంది. నాకు ఇంకో సిమ్ నుండి సెట్టింగ్స్ కావాలి. నేను వాడాలనుకున్నదీ ఆ సిమ్ నెట్ వర్క్ నే!

ఆ రెండో సిమ్ సెట్టింగ్స్ ఎన్నిసార్లు డిలీట్ చేసినా పోవటం లేదు. ఈ మొదటి సిమ్ సెట్టింగ్స్ ని ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసినా లాభం లేదు. ఈ మొదటి సిమ్ నుండి నెట్ వాడుకోవాలని నా ఆలోచన. కారణం : ఆ మొదటి సిమ్ములో బ్యాలన్స్ Rs. 4,400 ఉన్నాయి. మూడు సంవత్సరాల క్రిందట ఆ బ్యాలన్స్ Rs. 9,450 గా ఉంది. అంతగా ఉండటానికి గల కారణం - సంవత్సరానికి కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి. అప్పుడు మనం వేసుకున్న అమౌంట్ కి కొంత అదనముగా బ్యాలన్స్ వస్తుంది. సంవత్సర కాలానికి ఒకేసారి అలా బ్యాలన్స్ వేసుకుంటే - చాలా ఎక్కువగా లాభం ఉంటుంది. అందుకే నా మొబైల్ బ్యాలన్స్ అలా తొమ్మిది వేలు చిల్లరగా మిగిలిపోయింది. ఈ మూడు సంవత్సరాలుగా ఆ బ్యాలన్స్ ని ఎస్పైరీ డేట్ పొడిగించుకుంటూ వాడుతున్నాను. ఆ మొత్తాన్ని తగ్గించాలని నా ఆలోచన.

ఈ మధ్యలో రెండుసార్లు నా మొబైల్ పోయినా, బ్యాలన్స్ ఫార్వర్డ్ అయ్యింది. ఈ బ్యాలన్స్ చూసి, అందరూ నా ఫోన్ వాడి, ఉన్న బ్యాలన్స్ తగ్గిస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందని, ఇప్పుడు నేనే బ్యాలన్స్ తగ్గిద్దామని డిసైడ్ అయ్యాను.

ఇక అసలు కథలోకి వద్దాం. ఆ రెండో సిమ్ సెట్టింగ్స్ డిలీట్ అవక, మాటిమాటికీ ఆ సెట్టింగ్స్ అడిగి.. కష్టమర్ కేర్ వారితో కూడా విసిగిచ్చుకున్నాను. పాపం.! :(

పోనీ ఫార్మాట్ చేద్దామని అనుకున్నా (ఇదే చెయ్యాలి కానీ రెండో దారి ఏదైనా ఉందా అని ఆగాను) కష్టపడి అందులో ఫీడ్ చేసిన డాటా అంతా పోతుంది. ఆ ఇబ్బంది వల్లనే ఆగాను. నాకు తెలిసిన అన్ని దారులలో ప్రయత్నించినా ఇక ఏ దారీ కనిపించలేదు. ఇక ఫార్మాట్ చేయడానికి రెడీ అయ్యాను.

ముందుగా ఫోన్ లోని నంబర్స్ అన్నీ మెమొరీ కార్డ్ లోకి కాపీ చేశాను. ఆ తర్వాత ఆ మెమొరీ కార్డ్, రెండు సిమ్ములనీ తీసేసి, ఆ ఫోన్ కంపనీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కోడ్ వాడి, ఫార్మాట్ చేశాను. ఓకే అయ్యింది. ఆ తరవాత ఒక సిమ్ , మెమొరీ కార్డ్ పెట్టేసి, మళ్ళీ యధావిధిగా అన్నీ సిద్ధం చేసుకొని, వాడుతున్నాను.

ఇందులో నేను గమనించిన విషయాలు ఏమిటంటే : 

1. మీరు ఏ సిమ్ము నుండి మీ ఫోన్లో మీరు ఆన్లైన్ కి వెళ్దామని అనుకుంటున్నారో - ఆ సిమ్ ని మొదటగా 1 వ సిమ్ స్లాట్ లో పెట్టేసి, GPRS సెట్టింగ్స్ (వెంటనే రాకుంటే కష్టమర్ కేర్ వాళ్ళని అడిగి) మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి.

2. ఆ తరవాతనే రెండో సిమ్ వేసుకోవాలి.

3. ఒకవేళ రెండో సిమ్ లోని GPRS సెట్టింగ్స్ మీ మొబైల్ లో ఇన్స్టాల్ అయితే, డాటాని మెమొరీ కార్డ్ లోకి బదిలీ చేశాక, ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి, ఆ సిమ్ములూ, మెమొరీ కార్డ్ తీసేసి, (మళ్ళీ బ్యాటరీ పెట్టి) అ ఫోన్ కంపనీ రిస్టోర్ సెట్టింగ్స్ వాడి, మీరు కొన్నప్పుడు ఎలా ఆ ఫోన్ ఉంటుందో అలా చేసుకోవాలి.

4. ఆ తరవాత ఆ సిమ్ డాటా, మెమొరీ కార్డ్ లోని డాటా ఆ ఫోన్ లోకి కాపీ చేసుకోవాలి.

5. సిమ్ లోని నంబర్స్ అన్నీ ఫోన్ మెమొరీ లోకి కాపీ చేసుకోవాలి. (సిమ్ మెమొరీ, ఫోన్ మెమొరీ, మెమొరీ కార్డ్ మెమొరీ ఈ మూడు వేరు వేరు అని గుర్తుపెట్టుకోవాలి)

6. సిమ్ లలోని నంబర్స్ ని ఫోన్ మెమొరీ లోకి కాపీ చేసుకున్నాక - మీరు మీ ఫోన్ లోని కాంటాక్ట్స్ ని తెరచి చూస్తే, ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ పెట్టుకోవాలి.

7. ఇలా ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కనిపించేలా పెట్టేసుకొని, వాటిని ఒక్కొక్కటీ నంబర్ ని ఎడిట్ చేసుకోవాలి. వారి గురించిన డాటా కూడా అక్కడే పెట్టేసుకోవచ్చును. వారి డిజిటల్ ఫోటోని వారి కాంటాక్ట్ కి పెట్టేసుకుంటే, వారు ఫోన్ చేసినప్పుడు వారి ఫోటో, పేరూ కనిపించి, తేలికగా వారిని గుర్తుపడతాము. ఇలా కేవలం ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కి మాత్రమే చేయవచ్చును. సిమ్ లోని నంబర్స్ కి ఇలా చెయ్యరాదు.

8. అలాగే ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కి వారు కాల్ చేసినప్పుడు, వచ్చే రింగ్ టోన్ కి ప్రత్యేకమైన రింగ్ టోన్ ఇస్తే, వారు కాల్ చేసినప్పుడు వచ్చే రింగ్ టోన్ బట్టి, ఆ కాల్ ఎవరిదో దూరం నుండే విని గుర్తు పట్టవచ్చు.

9. మొబైల్ కంపనీ వారు కూడా రెండు సిమ్ముల నుండి ఇలా ఆన్ లైన్ వాడుకునేలా చేస్తే మరీ బాగుండేది. నా ఫోన్ కి  ఒక సిమ్ నుండి మాత్రమే ఆన్లైన్ లోకి వచ్చేలా ఉంది. ప్యాకెట్ డాటా కనెక్షన్ కేవలం ఒక సిమ్ కి మాత్రమే పనిచేస్తుంది.

10. మీ ఫోన్ బుక్ లోని కాంటాక్ట్స్ ని వేరొక మెమొరీ కార్డ్ (1GB, 2GB సైజు మెమొరీ కార్డ్స్ ఇప్పుడు చాలా చవక) లోకి కాపీ చేసుకోండి. ప్రతినెల మొదటి తారీకున అలా మీ స్మార్ట్ ఫోన్ నుండి అలా కాపీ చేసుకుంటే - డాటా కోల్పోరు.

Saturday, October 27, 2012

Lead pencil box Key chain

ఖాళీ లెడ్ పెన్సిల్ డబ్బా తో కీ చైన్ ఎలా చేసుకోవాలో మీకు చెప్పాను కదా.. ఇప్పుడు అదే కీ చైన్ ని కొద్దిగా మార్చితే, ఇంకా ఉపయోగకరముగా ఎలా చేయొచ్చో, ఇప్పుడు మీకు చెబుతాను.

..అలా ఖాళీ లెడ్ పెన్సిల్ బాక్స్ కి రంధ్రం చేశాక, ఆ డబ్బా లోపల - ఆ లోపల సైజులో ఉండే ఒక పేపర్ తీసుకొని, దాని మీద మీ పేరూ, ఫోన్ నంబర్ వ్రాసుకొని, అందులో పెట్టేసుకోండి. ఒక వైపు మే పేరు కనిపిస్తుంది.. మరో వైపు మీ ఫోన్ నంబర్ కనిపిస్తుంది. ఎక్కడైనా పడిపోతే దొరికినవారు మీకు ఫోన్ చేస్తారు. అలా మీ తాళాలు మీకు తేలికగా దొరుకుతాయి.

ఇలా - మొన్న దసరా సెలవులకి వచ్చిన హాస్టల్ విద్యార్థుల ట్రంక్ పెట్టెలకి, కీ చైన్ గా చేసిస్తే చాలా బాగుంటుంది. హాస్టల్ లో ఎక్కడైనా పడిపోయి, తోటి విద్యార్థులకి దొరికితే, వారు తేలికగా తెచ్చిస్తారు. ఇలా నేను చేసిచ్చాను ఒకరికి. తను హాస్టల్లో అలా ఒకసారి పోగొట్టుకుంటే - తేలికగా దొరికింది. లేకుంటే తాళం బద్దలు కొట్టాల్సి వచ్చేది.

ఒకవేళ ఇలా ఇష్టం లేకుంటే ఒక ప్లాస్టిక్ బిళ్ళ మీద అలా తమ పిల్లల పేర్లూ లేదా మన పేరూ, ఫోన్ నంబర్ వ్రాసుకొని  మనం వాడే తాళం చేతుల గుత్తికి వేసుకుంటే బాగుంటుంది. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. 


Wednesday, October 24, 2012

విజయదశమి శుభాకాంక్షలు.




మీకు, మీ కుటుంబ సభ్యులకూ, స్నేహితులకీ, శ్రేయోభిలాషులకూ విజయదశమి శుభాకాంక్షలు. 

Wish you HAPPY DASARA / VIJAYA DASHAMI  

Tuesday, October 23, 2012

శమీ చెట్టు


శమీ చెట్టు.. మామూలురోజుల్లో ఈ చెట్టును అంతగా పట్టించుకోకున్నా దసరా రోజున మాత్రం, తప్పక దర్శించి, మోకరిల్లే చెట్టు ఇది. ఆకులు చింతచెట్టు ఆకులుగా ఉంటాయి. దూరాన నుండి చెట్టు కూడా అలాగే అనిపిస్తుంది. కాకపోతే చెట్టు కొమ్మలకి గులాబీ చెట్టుకి ఉండే వంపు తిరిగిన ముళ్ళు ఈ చెట్టుకీ ఉంటాయి. 

దీనినే ఆ రోజున ఎందుకు చూడాలని అంటే - మహాభారతం లో పాండవులు మాయాజూదములో కౌరవులతో ఓడిపోయి, పందెం ప్రకారం - పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేస్తారు. ఆ అజ్ఞాత వాసములో తమ ఆయుధాలని విసర్జించి (వదిలి) తమని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలి. ఎవరైనా వారిని ఆ కాలములో గుర్తుపట్టితే, మళ్ళీ పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం, ఒక యేడు అజ్ఞాతవాసం మళ్ళీ చెయ్యక తప్పదు. 

అందుకే ఆ అజ్ఞాతవాసాన - పాండవులు తమ ఆయుధాలని, మూటగట్టి ఈ శమీ చెట్టుమీద దాస్తారు. అలా వారి ఆయుధాలని దాచిన కారణాన - ఈ చెట్టుకి దైవత్వం అపాదించబడినది. 

దసరా రోజున ఈ చెట్టు చుట్టూ అక్షతలు తీసుకొని, ప్రదక్షిణ చేస్తూ - " శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం.." అని మననం చేసుకుంటూ.. అక్షతలు తలపై చల్లుకోవాలి. 

అందరికీ దసరా శుభాకాంక్షలు. 


Monday, October 22, 2012

బతుకమ్మ పండగ వేడుకల శుభాకాంక్షలు.



బతుకమ్మ పండగ వేడుకల శుభాకాంక్షలు. 

Sunday, October 21, 2012

Good Morning - 164


The taste of water can be enjoyed only when we are thirsty..! 
Same way, The Love of a persons will be know when we are alone. 

Friday, October 19, 2012

Good Morning - 162


నిజమే! వరుసగా విజయాల వెంట మనం ఎదగటం వల్ల జీవితములో ఉన్నత స్థానానికి చేరుకోలేము. అలా చేరుకోవచ్చును. కానీ అది సంపూర్ణమైన విజయంలా ఉండదు. ఒక్కోసారి విజయాలని త్రుటిలో చేజార్చుకుంటాం. అపుడు మనల్ని అపజయం పలకరిస్తుంది. ఆ అపజయాలవల్ల కూడా ఎదగటం నేర్చుకోవాలి. అప్పుడే అది సంపూర్ణ విజయం అనిపించుకుంటుంది. 

Monday, October 15, 2012

Good Morning - 158


గాలిపటం ఎదురు గాలి ఉన్నప్పుడే - పైకి ఎగురుతుంది. ఆ ఎదురుగాలి లేనప్పుడు ఆ పతంగి ఆకాశాన ఎంత ప్రయత్నించినా ఎగరలేదు. మనిషి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మనం చేసే పనుల వల్ల ఒక్కోసారి / చాలాసార్లు మన మీద విమర్శలు వస్తుంటాయి. అవి వస్తాయి అనుకుంటూ భయపడుతూ ఉంటే, మనం ఇక ఎదగలేము. నిజం చెప్పాలీ అంటే ఈ విమర్శలు మనకి మనం అంటే ఏమిటో, మనం ఎంతగా పరిణితి చెందామో తెలియజేస్తాయి. 

విమర్శలు చేసేవారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. వారు మన చుట్టూ ఉంటారు కూడా. వారి పని ఎప్పుడూ ఎదోటి అనడమే! వారి మాటలు వినడం మంచిదే! అదీ ఒక స్థాయి వరకే! అది ఎలా అంటే - కొన్ని విమర్శలు మంచే చేస్తాయి. అవతలి వాళ్ళు కొన్ని విషయాల్లో బాగా అనుభవం ఉండి, వారు నీవు చేసిన పనిలో, వ్యక్తిత్వం మీదనో చేసే  విమర్శలు సద్విమర్షలు గా తీసుకోవచ్చును. అదే అందులో అనుభవం లేక ఏదోఒకటి మాట్లాడుతూ, బాగా విమర్శించే వారిని పట్టించుకోవాల్సిన పనిలేదు. 

చాలామంది మనమీద పనికిరాని విమర్శలు చేస్తూనే ఉంటారు. ఒకరకముగా వారి విలువని వారే తెలియచేసుకుంటున్నారు అనుకోవాలి. ఆ పనికిమాలిన విమర్శలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారితో  అంత ఆత్మీయతని చూపించాల్సిన అవసరం లేదు.. పరిచయస్తుల వద్దనే వారికి స్థానం ఇవ్వాల్సిందే.. ఇలా విమర్శల వల్ల కొన్ని పనికివచ్చే విషయాలు ఉంటాయి. 

Saturday, October 13, 2012

Key chain ring with led box

పెన్సిల్ లెడ్ బాక్స్ లను ఉపయోగించి, సూదులను దాచుకున్నాము కదా.. ఇప్పుడు మీకు మరొకటి చూపిస్తాను. ఇది కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.

చూశారు కదూ! ఖాళీ పెన్సిల్ లెడ్ బాక్స్ తో కీ చైన్ చేసుకున్నాను. ఆ కీ చైన్ కి అలా చేసుకొని, హాయిగా వాడుకోవచ్చును. అలా కీ చైన్ కి ఎలా అటాచ్ చెయ్యాలీ అంటే - ఒక డ్రిల్ సహాయాన అలా కీ రింగ్ పట్టేలా డ్రిల్ బిట్ వాడి చేసుకోవచ్చును. లేదా మీరే అలా చేసుకోవచ్చును. అది ఎలా అంటే - 

ముందుగా మీకు కావలసినవి ఒక కటింగ్ ప్లేయర్, ఒక ఇనుప మేకు. కటింగ్ ప్లేయర్ లేకుంటే - తడిపిన పిండి ముద్ద.

ముందుగా మీరు సన్నని మేకుని కటింగ్ ప్లేయర్ సహాయాన లేదా తడిపిన పిండి ముద్దలో మేకుని గ్రుచ్చేసి, గ్యాస్ స్టవ్ మీద బాగా వేడి చెయ్యాలి. అది బాగా ఎర్రగా కాకున్నా సరే! కాసింత వేడయ్యాక - ఆ మేకుని, ఆ లెడ్ పెన్సిల్ బాక్స్ మూత గుండా ఈ చివర నుండి ఆ చివర వరకూ అడ్డముగా గ్రుచ్చితే, ఒక రంధ్రం పడుతుంది. ఆ రంధ్రం గుండా కీ చైన్ రింగ్ ని తోడిగిస్తే - కీ చైన్ తయారు అవుతుంది. 

Friday, October 12, 2012

బ్లాగ్ లో టపాలు మిస్ అయితే?

ప్రశ్న : నా బ్లాగ్ లో టపాలు మిస్ అయ్యాయి. కారణం ఏమిటీ? అవి మళ్ళీ కనిపించాలీ అంటే ఏమి చెయ్యాలి.? 

జవాబు : మీ బ్లాగ్ లో మిస్సయిన టపాలు - టెక్స్ట్ రూపకములో ఉన్నవియా? లేక ఇమేజెస్ రూపకముగా ఉన్నవియో మీరు తెలియచేయలేదు. 

అన్ని పోస్ట్స్ ఒకేసారి డిలీట్ అవటం నమ్మశక్యం కానిదే!.. అయిననూ కొన్నిసార్లు అలా కనిపించకపోవటానికి ఆస్కారం ఉంది. 

నాకు  తెలిసీ - అలా మీ టపాలు పోవటానికి ఈ దిగువ కారణాల్లో ఏదైనా ఉండవచ్చును. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి నేను విన్నవీ, కన్నవీనూ.. 

మీరు అప్లోడ్ చేసిన టపాలు ఇమేజెస్ అయితే మీ బ్లాగ్ హోం పేజీలో - మీరు క్రొత్త పోస్ట్ వేస్తున్నప్పుడు, ఆ బ్లాగ్ ఫోటో ఆల్బం లోని ఫొటోస్  లేదా  ఆల్బం ని (తెలీక) డిలీట్ చేసి, ఉండొచ్చును. అలా చేస్తే మీ బ్లాగ్ పోస్ట్ లలో ఫొటోస్ కనిపించవు.ఇదే కారణం అయితే - మీరు మీ బ్లాగ్ లో క్రొత్తగా ఆయా పోస్ట్ లలో ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలి. (ఇలా బ్లాగ్ స్పాట్ పోస్ట్ లలో సాధ్యం. వర్డ్ ప్రెస్ సంగతి తెలీదు) 

మీరు సిస్టం ఆన్ చేసి, ప్రక్కకి వెళ్ళిన తరుణములో - ఎవరైనా మీ బ్లాగ్ ఓపెన్ చేసి, మీ పోస్ట్స్ డిలీట్ చేసి ఉండాలి. ( మొన్నటికి మొన్న ఒక క్రికెటర్ ట్విట్టర్ ఖాతాని వారి బంధువు ఓపెన్ చేసి, " ఆ టీ-20 లో మాకంటే ఒకటీ, రెండురోజుల ఆలస్యముగా పొరుగుదేశం జట్టు ఇంటికి వెళ్ళింది.." అని పోస్ట్ చేసిన చందాన ఇక్కడా అలాగే జరిగి ఉండొచ్చును అని ఊహ )

మీ పాస్ వర్డ్ హ్యాక్ అయ్యి, ఎవరైనా మీ బ్లాగ్ ని తెరచి, డిలీట్ చెయ్యోచ్చును. 

మీరు మిస్ అయ్యాయి అని చెబుతున్న పోస్ట్ లలో అభ్యంతరకరమైన విషయం ఉండి, ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే, అలా జరగవచ్చును. 

కాపీ రైట్ ఉన్నవి మనవే అన్నట్లుగా - వేరేవారివి కాపీ చేసుకొని, అవి మన స్వంత రచనలుగా బ్లాగ్ లో పోస్ట్ చేసి ఉంటే, వచ్చిన అభ్యంతరాల విజ్ఞప్తుల మేరకి, ఆ బ్లాగ్ స్పాట్ / వర్డ్ ప్రెస్ వాళ్ళు ఆ పోస్టింగ్స్ తీసేయ్యవచ్చును. 

మరీ అరుదుగా సర్వర్ ప్రాబ్లెం కూడా అయి ఉండవచ్చును. 

పైవేవీ కాకుండా ఉన్నట్లయితే, ఆ పోస్టింగ్స్ సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే, ఆ బ్లాగ్ స్పాట్ / వర్డ్ ప్రెస్ వారిని సంప్రదించాలి. ఒక్కోసారి తప్పుడు సమాచారం మేరకి అలా మీ పోస్ట్స్ మిస్ అయి ఉండవచ్చును. ఇలా కొందరివి అప్పట్లో యాధృచ్చికంగా తొలగించబడ్డాయి. ఫిర్యాదు చేస్తే, తిరిగి మామూలుగానే వారి బ్లాగ్ లలో కనిపించాయి - అని తెలుగు బ్లాగర్స్ గ్రూప్ లో ఒకరి అభిప్రాయం చూశాను. 

అప్పటికీ పైవేవీ కాకపోతే  - ఆయా పోస్ట్స్ ని క్రొత్తగా - మీ బ్లాగ్ లో మళ్ళీ పోస్టింగ్ చేసుకోవటం తప్పదు

Thursday, October 11, 2012

Good Morning - 156


నిజమే కదూ...! ఒక ఆడపిల్ల అవసరార్థం మనల్ని (మగవారిని) ఒక సహాయం కోరిందీ అంటే, చాలా రకాలుగా ఆలోచించి, అందుకు తగిన వ్యక్తిని ఎన్నుకున్నాకే - వారిని సహాయం కోరుతుంది. అది వారు మాత్రమే చేసే సహాయం అని తీర్మానించుకుంటుంది. ఇక్కడ సాయం అనేది చాలా గుంభనంగా జరిగిపోతుంది. అది చేసిన వారికీ, తీసుకున్న వారికీ మాత్రమే తెలుస్తుంది. మూడో వ్యక్తికి మాత్రం - వాళ్ళలో ఎవరైనా చెబితే గానీ తేలీదు. ఇవి ఆర్థిక పరముగా ఉండటం చాలా, చాలా తక్కువ.

మొదట్లో నేనూ నమ్మలేదు. గత కొన్ని సంవత్సరాలుగా నేనూ అలాంటి సహాయాలు కొన్ని చేశాను. అవేమిటో ఇక్కడ, అక్కడా, ఎక్కడా చెప్పలేనివి. అవి మదిలోన దాగుండి పోయే విషయాలు. ఒకవేళ గొప్ప కోసం చెప్పుకున్నా - ఇక మళ్ళీ మనల్ని ఎవరూ అంతగా నమ్మరు. దూరముగా అట్టి, పెట్టేస్తారు. 

Wednesday, October 10, 2012

Pencil lead boxes

ఒక రంగానికి ఉపయోగపడే వస్తువులు ఇంకో రంగానికి భేషుగ్గా పని చేస్తాయని ఇదివరలో ఒకసారి చెప్పాను. ఇప్పుడు అలాంటిదే మరొకటి చెబుతాను.

పిల్లలు హోం వర్క్ చేసుకోవటానికి వాడే పెన్సిల్ లెడ్ బాక్సేస్ చాలా అందముగా, సన్నగా, చూడ ముచ్చటగా ఉంటాయి. ఇందులో పెన్సిల్ లెడ్స్ వస్తాయి. పది లెడ్స్ ఉండే ఒక్కో డబ్బా మామూలుగా ఐదు రూపాయలకి వస్తుంది. ఆ లెడ్స్ విరిగితే వాడుకోవటానికి కష్టముగా ఉంటుందని, అలా సన్నని ధృడమైన పారదర్శకమైన ప్లాస్టిక్ పెట్టెలో వస్తాయి.

ఈ లెడ్స్ బాక్సేస్ లలోని లెడ్స్ అన్నీ వాడుకున్నాక, ఆ ఖాళీ బాక్స్ ని పారేయ్యటానికి అదోలా ఉంటుంది. అలాంటి బాక్స్ ని మీరు కుట్టు మిషన్ కి వాడే సూదులకూ, మామూలు సూదులకూ వాడుకోవచ్చును. చాలా ఉపయోగకరముగా కూడా ఉంటుంది.


Tuesday, October 9, 2012

Good Morning - 155


నిజమే కదూ! స్నేహితులు అన్నవారు మన కష్టకాలములోనే వారి ప్రేమని, అనురాగాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. అప్పుడే వారితో మరింతగా అనుబంధం ఏర్పడుతుంది. వారికీ క్లిష్ట పరిస్థితులు, ఆదుకొనేవారు అవసరమైనప్పుడు మనం ఆదుకోకపోతే అది స్నేహం అనిపించుకోదు.. 

Monday, October 8, 2012

Shampoo sachet holder

మీరు తలంటు స్నానం చెయ్యటానికి, షాంపూ ప్యాకెట్స్ వాడేవాళ్ళు అయితే ఈ క్రింది సూచనని ఫాలో అయిపోండి. సాధారణముగా ఈ షాంపూ సాచెట్స్ తో తలంటు కుంటున్నప్పుడు కాసింత షాంపూ వంపుకున్నాక, ఆ మిగిలిన సాచెట్ ని ఎక్కడ పెట్టాలో కాసింత ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని ఇలా తొలగించుకోవచ్చును. చూడటానికి ఫన్నీగా అనిపించినా, ఒక ఉపయోగకర విషయం ఇది.

షాంపూ బాటిల్ కన్నా షాంపూ సాచేట్స్ ని వాడితే చాలా డబ్బు పొదుపు అవుతుంది. కారణం - డబ్బా ప్యాకింగ్ మీద ఉన్న పన్నులు.  ఈ సాచెట్స్ వాడితే, షాంపూ వాడకం కూడా హద్దుల్లో ఉంటుంది అనుకొని, వాడకం కూడా ఎక్కువే.

ఈ సాచెట్స్ వాడి, మళ్ళీ అందుకోవటానికి వీలుగా ఎలా చెయ్యాలో చూద్దాం!

ముందుగా మీరొక బట్టలు ఆరేసేందుకు వాడే ఒక క్లిప్ ని తీసుకోండి. ఇది ఫ్లాట్ గా, సమతలముగా ఉండేది తీసుకోవాలి. కొద్దిగా డబల్ సైడ్ గమ్ ఉండే స్టికర్ తీసుకొని దీనికి ఒక వైపు అతికించి, సర్రిగ్గా ఉండునట్లు కత్తిరించాలి. ఆ తరవాత ఇంకో వైపున గమ్ పైన ఉన్న స్టికర్ రిలీజింగ్ పేపర్ తీసేయ్యాలి.


లేదా ఏదైనా సిలికాన్ జెల్ వల్ల గానీ, ఫేవీ క్విక్ తో గానీ అలా అతికించవచ్చును.

ఇప్పుడు మీ బాత్ రూం లో మీరు స్నానం చేసే వద్ద సిరామిక్ టైల్ మీద, ముందుగా ఆ టైల్ ని బట్టతో బాగా శుభ్రం చేసి, అతకాలి. ఇప్పుడు మీకో హెల్పింగ్ హాండ్ వచ్చినట్లే.


స్నానం మధ్యలో సాచెట్ ని ఇలా ఆ క్లిప్ కే పెట్టి ఉంచొచ్చును. చిన్న పనివల్ల మీ కార్యక్రమం క్రొత్తగా కనిపిస్తుంది. 

Saturday, October 6, 2012

Wednesday, October 3, 2012

Good Morning - 150


అవును కదూ.. ఆ చిన్నప్పటి రోజులు తిరిగి వస్తే - ఎంతో బాగుండును కదూ.. దేవుడు ప్రత్యక్షమై - మీకు మీ బాల్యాన్ని తిరిగి ఇస్తున్నాను.. ఇక హాయిగా అనుభవించండి అని మనకో వరం గానీ ఇస్తే, మీరేమిటో గానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా విచ్చలవిడిగా వాడుకుంటాను. 

ఆరోజులే వేరు.. ఆ మధుర క్షణాలు మరుపురానివి. ఆస్థి, అంతస్థు, ఆడామగా, ఎక్కువా తక్కువ.. మొదలగు తారతమ్యాలు అంటూ ఏమీ కల్మషాలు పెట్టుకోకుండా, ఇప్పటిలా ప్లాస్టిక్ నవ్వులు కాకుండా, స్వచ్చమైన నవ్వులు నవ్వుతూ ఉండే ఆరోజులే వేరు. చిలిపి పనులు, గిల్లికజ్జాలూ, వెటకారాలు, నేస్తం కి ఏదైనా లేకుంటే - ముందే గమనించి అది అందివ్వటం.. చనువుగా ఒరేయ్ అనే పిలుపులూ, పిచ్చిపిచ్చి ప్రయోగాలూ చేస్తూ, ఏదైనా అర్థం కాకుంటే ప్రక్కవాడి నోట్స్ చూస్తూ పని వెల్లదీయటం, ఫ్రెండ్ ఏదైనా తెచ్చేసుకుంటే ఇద్దరు ఉంటే కాకేంగిలి (కాకి+ఎంగిలి) చెయ్యటం, నలుగురు ఉంటే చిన్న బండతో నాలుగు ముక్కలు చెయ్యటం, వచ్చిన చిన్న ముక్కలే అద్భుతమైన రుచితో ఉన్నట్లు తినేయ్యటం.. ఓహ్! అపూర్వం.. ఆరోజుల గురించి ఎంత చెప్పినా తక్కువే! 

Monday, October 1, 2012

Good Morning - 148


నిజమే! మొదట్లో ఈ భావన చప్పున అర్థం కాదు.. కానీ ఆలోచించిన కొద్దీ బాగా అర్థమవుతుంది. ఇంకా స్పష్టముగా చెప్పాలీ అంటే - ఒకసారి మన జీవితాన దుర్భర పరిస్థితులని అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు, మనకు ఏమీ, ఏవీ, ఎవరూ సహకరించకపోయినప్పుడు - ఆ పరిస్థితులు బాగా మదిలో నాటుకపోయి.. ఆతరవాత మన పరిస్థితులు బాగు అయ్యాక - అప్పటి పరిస్థితులు గుర్తుకు వచ్చినప్పుడు.. ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూసుకున్నప్పుడు - ఎంతో హాయిగా, ఒక మధుర భావనలుగా కనిపిస్తాయి. మనకి మన జీవితాన చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఏమాత్రం అధైర్యపడక - ఇవి కేవలం కొద్దిరోజులే అని ధైర్యముగా ఉండండి. అలాగే ఆ పరిస్థితులు మీకు మీ జీవన గమనములో ఎలా ఉండాలో తెలియచేసే పాఠాలని బాగా గుర్తుపెట్టుకోండి. 

నిజానికి ఈ దుర్భర పరిస్థితులు అంటూ కనీసం ఒక్కసారైనా రావాలి కూడా. అప్పుడే మన చుట్టూ ఉంటున్నవారు ఎవరో, వారి మనస్తత్వాలు ఏమిటో, ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అనీ, నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో, మనలోని లోపాలు ఏమిటో, మన బలహీనతలు ఏమిటో.. లాంటి సవాలక్ష నిజాలు ఈ దుర్భర పరిస్థితులు మనకి ఐమాక్స్ 3D సినిమా చూసినట్లుగా, చూపిస్తాయి. వాటి నుండి పాఠాలు నేర్చుకొని, భవిష్యత్తులో బాగుపడాలని ప్రయత్నించేవాడు ఉత్తముడు. 

Related Posts with Thumbnails