నిన్న రాత్రి "ఈగ" సినిమాకి వెళ్లాను. ముందే ఒకసారి చూశాను.. ఇప్పుడు ఇంకొకరి కోసమనీ వెళ్లాను. సినిమా థియేటర్ వద్దకి వెళ్ళగానే టికెట్స్ తీసుకున్నాను. నా మోటార్ సైకిల్ ని పార్కింగ్ లో పెట్టడానికి వెళ్లాను.
అక్కడ నా మోటార్ సైకిల్ ని పార్కింగ్ చేసి, టోకెన్ తీసుకున్నాను. పార్కింగ్ అద్దె ఎంత అని అడిగి పది రూపాయల నోట్ ఇచ్చాను. అక్కడ మోటార్ సైకిల్ పార్కింగ్ ఖరీదు ఆరు రూపాయలు. నేనిచ్చిన పది రూపాయలకి చిల్లర లేదు అన్నాడు అక్కడ పనిచేస్తున్న అబ్బాయి. "సార్! మీ దగ్గర చిల్లర ఉంటే ఇవ్వండి.." అన్నాడు.
"నా దగ్గర చిల్లర అంటే ఇదే - ఈ పది రూపాయలు. అంతే గానీ కాయిన్స్ అంటూ ఏమీ లేవు.." అని చెప్పాను.
"నాదగ్గర కూడా చిల్లర లేదు సార్! ఇప్పటికే ముగ్గురికి చిల్లర ఇవ్వాలి నేను. మీరు నాలుగో వ్యక్తి.." అన్నాడు ఆ అబ్బాయి.
"ఓహ్!.. అలాగా! ఒక పని చెయ్! సినిమా ఇప్పుడే స్టార్ట్ అయినట్లుంది. మొదటి నుండీ చూడాలి. నేను మొన్న చూసినప్పుడు పావుగంట సినిమా మిస్ అయ్యాను. మేము లోపలి వెళుతున్నాము. నీ దగ్గర చిల్లర అంటూ వస్తే - ఆ మోటార్ సైకిల్ ట్యాంక్ జిప్ కవర్లో ఆ నాలుగు రూపాయలు పెట్టేసేయ్! షో అయ్యాక నీవు లేకున్నా నేను - ఆ చిల్లర అమౌంట్ ని తీసుకుంటాను.." అన్నాను.
ఆ అబ్బాయి సరే అని అన్నాడు. కానీ నాకు ఆ అబ్బాయి అలా పెడతాడు అన్న నమ్మకం ఏమాత్రం లేదు. పోనీలే! నాలుగు రూపాయలు అని అనుకున్నాను.
సినిమాని బాగా ఎంజాయ్ చేశాను. సినిమా ముగిశాక నా బండి వద్దకి వచ్చాను. నా బండి తీస్తుండగా - ఆ పార్కింగ్ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు.
"సార్! మీరు చెప్పినట్లే మీకివ్వాల్సిన చిల్లర డబ్బులు - నాలుగు రూపాయలు మీ బండి ట్యాంక్ కవర్లో పెట్టాను.." అన్నాడు.
తను చెప్పింది నిజమా అని బండి తీస్తూ, ఒకచేత్తో ట్యాంక్ కవర్ లో చేయి పెట్టాను. నిజమే! తను అన్నట్లు అందులో రెండు రెండురూపాయల కాయిన్స్ ఉన్నాయి. వాటిని తీశాను. ఆ అబ్బాయికి టిప్ గా ఇచ్చేసి ఉంచేసుకోమన్నాను.
నాలుగు రూపాయలే కదా! అని వదిలేయవచ్చును. అలా చేస్తే ఆ డబ్బులు బాగా రుచించవు. అతని డ్యూటీ ఇక సరిగా చెయ్యకపోవచ్చును కూడా. ఇలా టిప్ గా ఇస్తే - మరింత బాధ్యతగా ఉంటాడు.. అనుకొని, అతనికి టిప్ గా ఇచ్చాను. ఈ నాలుగు రూపాయలు చిన్న మొత్తం అయినా అతనికి చాలా ప్రేరణగా ఉంటుంది అనుకొని అలా చేశాను.
3 comments:
So nice of you!
good
Thank you..
Post a Comment