Friday, July 20, 2012

వరలక్ష్మి వ్రతం అమ్మవారి రూపు

వరలక్ష్మీవ్రతం రోజున కలశం మీద కొబ్బరికాయ పెట్టేసి, దానిపైన ఎర్రని బట్టని చుట్టి, ఆ బట్ట మీద అమ్మవారి రూపు పెడదామని మా శ్రీమతి గారి ఆలోచన. ఎలా చేద్దాం అని ఆలోచించాం.. కొన్ని అనుకున్నాము. ఆ ఎర్రని బట్ట మీద అష్టకాశీ గంధముతో అమ్మవారి రూపాన్ని వేద్దాం అనీ అందులో ఒకటి. కానీ వ్రతం అయ్యాక ఆ బట్టకి ఆ తిలకం కడిగితే పోవటం కాసింత కష్టమే! అలాని ఆ బట్ట వృధాగా పారవెయ్యనూ లేము. ఇలా కొన్నింటిని ఆలోచించాం కానీ అంతగా బాగా అనిపించలేదు.

మార్కెట్లో అమ్మవారి రూపులని వెదికాము. ఊహు నచ్చలా! కారణం ఒకటి ఉంది. ఈసారి పెట్టుకున్నాక ప్రతి వరలక్ష్మీ వ్రతం రోజున ఆ రూపు పెట్టుకొని, అలాగే ప్రతి వ్రతం రోజున కొనసాగించాలని మా ఆలోచన. అందుకే అంగడిలో బాగా వెదికాము. ఊహు!. నచ్చలేదు. ఒకటి వెండి పూత ఉన్న అమ్మవారి రూపు కనిపించింది. కానీ ప్రతి సంవత్సరం ఆ రూపాన్ని నిపుణులైన పనివారితో పాలిష్ చేసుకోవాలిట.  

అలా చేయొచ్చు కానీ, అలా చేస్తే - ఆ రూపానికి చేసిన పూజ తాలూకు ఫలం వృధా కావద్దు అనుకొని, వేరే ఆలోచించాము. అమ్మవారి అనుగ్రహమేమో - ఒక ఆలోచన వచ్చింది. వర్కవుట్ అవుతుందా అని ఆలోచించాక అదే బాగుంటుంది, అమ్మవారి రూపు ఖర్చులోనే మిక్కిలి నాణ్యమైన రూపు అవుతుంది మరియు ఇంట్లోనే మేమంతట మేముగా కుంకుడురసంతో శుభ్రపరుచుకునే వీలుగా నేనే ఆ డిజైన్ ని ఎన్నుకున్నాను. 

నిపుణులైన పనివారితో ఆ పని చేయించాను. చాలా బాగా వచ్చింది. ఇదిగో ఇలా వచ్చేసింది. 


ఇది మొత్తం వెండితో చేసినది. 18 గ్రాముల్లో తయారయ్యింది. నేటి ధరల్లో అయితే - ఒకవేయి చిల్లర. పాత పావలా మందములో ఉన్న వెండి రేకుమీద ఇలా డిజైన్ వేసి, అలా డిజైన్ గా కట్ చేయించాను. అలా కట్ చేశాక, కాసింత ఫైల్ చేయించి, వెనక వైపున ఎప్పటికప్పుడు పెట్టి, తీసుకోవటానికి ఒక స్టీల్ సేఫ్టీ పిన్ ని అమర్చాను. ఆ తరవాత పాలిష్ చేయించాను. అందుకే ఇలా దేదీప్యమానముగా మెరిసిపోతున్నది. 

ఇలా చేసినదానిని - కలశం మీద ఉన్న కొబ్బరికాయకి చుట్టిన ఎర్రని బట్టకి ఈరూపాన్ని, ఆ సేఫ్టీ పిన్ సహాయాన అమర్చాలి. అప్పుడు ఇలా కనిపిస్తుంది.  ఈ సంవత్సరమూ ఆ రూపాన్ని వాడుతాము. ఇది బాగుందని ఇంటికి వచ్చి, చూసినవారు అభినందించారు. 


6 comments:

Unknown said...

very very nice...

శ్యామలీయం said...

చాలా చక్కని ఆలోచన!

Raj said...

ప్రసీద గారూ, శ్యామలీయం - మీరిరువురికీ కృతజ్ఞతలు..

Madhurima said...

Very good idea. pasupu pachani chamantula tho ahladam gaa vundi mee pooja photo.

Raj said...

ధన్యవాదములు మధు గారూ..

Anonymous said...

Varalakshivratham jarupukutunna mahillakandariki mama air asseesulu kalagalani mana sacra korukutu. Mee. Sivaparvathi&nalavemareddy narasaraopet

Related Posts with Thumbnails