Tuesday, July 3, 2012

గిఫ్ట్ కవర్స్ Gift Covers - 11

గిఫ్ట్ కవర్స్ ని చెయ్యటానికి పెళ్లి పత్రికలన్నీ అనుకూలముగా ఉండవు. అలాంటన్నప్పుడు పెళ్లి పత్రిక మీద ఏదైనా బొమ్మ నచ్చితే ఎలా సులభముగా చేసుకోవచ్చో ఇప్పుడు చెబుతాను. అలాగే మనం చెయ్యాలనుకున్న కార్డ్ మీద బొమ్మ మధ్యలోకి రాకుండా ఉన్నప్పుడు ఎలా చెయ్యాలో, అసలు ఇలా గిఫ్ట్ కవర్స్ ఎలా చెయ్యాలో తెలీని వారికీ, చాలా ఈజీగా చెయ్యాలో ఇప్పుడు చెబుతాను. 

ముందుగా పెళ్ళిపత్రిక మీద డిజైన్ ని ఎన్నుకోండి. ఆ డిజైన్ చుట్టూ ఒక పెన్సిల్ తో కావలసిన సైజులో డబ్బా ఆకారములో గీతలు గీసుకోండి. అంటే ఈ క్రింది బొమ్మ లోని మాదిరిగా పసుపు రంగు డబ్బాలా పెన్సిల్ తో గీసుకోవాలి. అలా గీసుకున్న డబ్బాకి, చుట్టూరా మూడు వైపులా ఒక సెంటీమీటర్ సైజులో, తెరుచుకోవటానికి ఉండే వైపున మాత్రం రెండు సెంటీమీటర్ల పేపర్ ఎక్కువగా మిగిలి ఉండేలా కత్తిరించుకోవాలి. (ఈజీగా అర్థం అవటానికి ఈ క్రింది ఫోటోని చూడండి) 

అలాగే ఎన్నుకున్న డిజైన్ మీద కొట్టుకున్న (పసుపురంగు) డబ్బా సైజులో వేరొక పెళ్ళి కార్డ్ ని ఒక ముక్కగా కత్తిరించుకోవాలి. అది ఎలానో ఈ క్రింది ఫోటోలోనే చూడవచ్చును. 


అలా కత్తిరించుకున్న కార్డ్ అంచులని క్రింది ఫోటో లోలా లోపలకి మడుచుకోవాలి. 


ఇలా ఈ క్రింది ఫోటో లోలా మూడు వైపులా మడుచుకోవాలి. ఒకవైపు అంటే ఓపెన్ ఉంచే - రెండు సెంటీమీటర్ల ఓపెన్ వైపు మాత్రం అలాగే వదిలెయ్యండి. తేలికగా అర్థం అవటానికి క్రింది ఫోటో చూడండి. 


అలా చేశాక - ఇప్పుడు ఆ మడిచిన కార్డ్ మీద - అదే సైజులో కత్తిరించుకున్న మరో కార్డ్ ని పెట్టి, ఫెవికాల్ తో లేదా ఏదైనా సింథటిక్ గమ్ తో అతికించండి. 


ఇంకేం.. ఇక గిఫ్ట్ కవర్ రెడీ.. అందులో డబ్బులని పెట్టాక, మిగిలిన అంచుని కూడా గమ్ తో అంటించండి. ఇప్పుడు ఆ గిఫ్ట్ కవర్ ని రిబ్బన్ తో అలంకరించండి. 


అంతే! ఇప్పుడు మీకో అందమైన గిఫ్ట్ కవర్ మీ స్వంతం. ఈ పద్దతిలో మీరు ఎన్నెన్నో కవర్స్ ని తయారు చేసుకోవచ్చును. 

No comments:

Related Posts with Thumbnails