Thursday, June 30, 2011

గోరింటాకు డిజైనుల సేకరణ వెనక..

నా బ్లాగ్ లో మెహందీ డిజైనులు అప్లోడ్ చెయ్యటానికి గల కారణమూ చాలా చిన్నదే!.

మా ఆవిడకి తెలిసిన బ్యూటీ పార్లర్ ఆవిడ సమ్మర్ క్రాష్ కోర్స్ ఉచితముగా నేర్పిస్తే, నేర్చుకోవటానికి వెళ్ళింది. మా ప్రక్కవాటా లోని అమ్మాయి కూడా "నేను సైతం.." అన్నట్లు మరునాడే తనూ తనతో జాయిన్ అయ్యింది. ఇది ఆంధ్రుల ప్రత్యేక లక్షణం కదా - ప్రక్కవారు ఏది చేస్తే అది మనం చెయ్యాలి అనేది. ఆ అమ్మాయికి రాకున్నా, ఆసక్తి లేకున్నా కేవలం ఈ దుగ్ధతోనే ఆ క్లాసెస్ కి జాయిన్ అయ్యింది.

క్లాసుల్లో భాగముగా చివరిలో మెహందీ క్లాసెస్ కూడా ఉన్నాయి. యాజ్ యూజువల్ గా ఆ అమ్మాయి కన్నా మా ఆవిడనే బాగా మెహంది వేస్తుంది. (తనకన్నా నేను ఇంకా బాగా వేస్తాను, అది వేరే సంగతి అనుకోండి.) ఆ కోచింగ్ క్లాస్ కి వచ్చిన ఒక ముస్లిం అమ్మాయి, ఒక మెహందీ డిజైన్ బుక్ తెచ్చి, అందరికీ చూపింది. అందరూ ఆ డిజైనులు బాగున్నాయని ఆనుకొని, అవి జిరాక్స్ చేసుకొని ఇస్తాము అని అడిగారు. ఆ అమ్మాయి కూడా ఓకే అని ఇచ్చింది. రోజుకి ఒకరివద్ద ఆ బుక్ ఉండేలా, ఆ ఒక్కరోజులో బుక్ జిరాక్స్ చేసుకొనేలా అంగీకారం కుదిరింది.

అలా ఒక్కొక్కరి వద్ద ఉన్న ఆ పుస్తకం, రేపటితో ఇక క్లాసెస్ ముగుస్తాయి అన్నప్పుడు ఆ ప్రక్క అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చింది అన్నది ఎవరికీ తెలీదు. మా ఆవిడ తనని అడిగితే, ఇంకా తీసుకోలేదు అని అబద్దం ఆడింది. ఆరోజు రాత్రి ఆ అమ్మాయి కావలసిన డిజైనుల పేజీ నంబర్లు ఒక పేపర్ మీద వ్రాసింది. వారి తమ్మునితో జెరాక్స్ తీయటానికి పంపించింది. ఇది మా అవిడ అనుకోకుండా చూసింది. ప్రక్కనే ఉండి ఇంత మోసమా! ఇవ్వను అంటే అడిగేవాడిని కాదుగా.. ఆనుకొని ఆరోజు అంతా మూడ్ ఆఫ్.

మరునాడు ఆ ముస్లిం అమ్మాయి క్లాసెస్ ముగియటంతో, ఇక రాలేదు. ఆ బుక్ ఇవ్వలేదు. ఈ ప్రక్కన ఉన్న అమ్మాయిని అవి ఇస్తే రి-జిరాక్స్ చేసుకొని ఇస్తాను అని అడిగితే, అసలు నేను ఇంకా జిరాక్స్ చేసుకోలేదు అని బుకాయింపు. తనకే అంతా రావాలని దుగ్ధ. నాకీ విషయం మరునాడు తెలిసింది.

తను నా అర్థాంగి అన్నప్పుడు తన బాధ నా బాధనే కదా. అందుకే నేనూ తనని విజేతగా నిలపాలని అనుకున్నాను. సేకరణ మొదలెట్టాను. అలా చాలా సేకరించాను. దాదాపు నాలుగు వందలకి పైగా ఉండొచ్చును. కాలక్రమేనా వాడకములోని కాస్త నిర్లక్యం, ఆజాగ్రత్త, వారూ వీరూ అడుక్కొని తీసుకపోయినవీ, ఎత్తుకపోయినవీ.. పోగా కాసిన్ని మిగిలాయి. అప్పుడే డిజిటల్ సౌలభ్యం తెలిసింది. మళ్ళీ సేకరణ మొదలయ్యింది. కానీ అప్పటిలాగా వెదకటం లేదు. దారిలో తగిలితేనే సేకరించటం - అంతే!.

ఇవన్నీ నా కోసమే అన్నట్లు దాచుకోవటం నాకు ఇష్టం అనిపించలేదు. నాలాగ ఉన్నవారు ఎందరో ఆనుకొని, అందరికీ ఉపయోగపడేలా ఇక్కడ అప్లోడ్ చెయ్యటం. అందుకే అలా పోస్ట్ చెయ్యటం. ఇదీ ఆ మెహందీ సేకరణ ఫోటోస్ వెనక ఉన్న చిన్న కథ.

Wednesday, June 29, 2011

Saturday, June 25, 2011

Youtube వీడియోల వల్ల ఆదాయం ? English Translation

గూగుల్ వాడు తెలుగు నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేషన్ సౌకర్యం ఉచితముగా, ఇస్తున్నాడు. కొన్ని పదాలు ఇంకా ఇంగ్లీష్ లోకి మారటం లేదు. ట్రాన్స్లేషన్ అయినదాన్ని యధాతతముగా మీకు ఇక్కడ కాపీ పేస్ట్ పద్ధతిలో ఇస్తున్నాను. కొన్ని పదాలు మార్చటానికి తెలుగు భాషాభిమానులు తలా ఒక చెయ్యి వెయ్యాలి.

ఇలా నీలం రంగులో ఉన్నవి ఇంకా మారాల్సినవి.

Telugu videos గారు Thursday, June 23, 2011 12:40:00 PM న అడిగిన ఒక ప్రశ్న : 

యూ-ట్యూబ్ వీడియో - నాది మీరే కాపీ చేసారు.
టీవీ ప్రోగ్రాం లు పెట్టొద్దు అనే నిబంధన చూసి ఏవీ టీవీ ప్రోగ్రామ్లు అందులో పెట్టలేదు
రాజ్ గారు మీరు వ్రాసిన పోస్ట్ చూసాను,
నాకు చిన్నా డౌట్ ?
టీవీ చానల్స్ లోని ప్రోగ్రామ్స్, టీవీ ట్యూనర్ కార్డ్ ద్వారా కాపీ చేసి youtube లో అప్లోడ్ చేస్తే ఏమైనా probelm మా, నేను యౌతుబే ద్వారా money సంపదిన్చాచు అని విన్నాను, దయ చేసి సలహా తెలప గలరు,
youtube లోని చాల తెలుగు videos టీవీ చానల్స్ లోనివే అని అంట్టునారు మా ఫ్రెండ్స్
నెట్ ద్వారా మనీ సంపాదించ వచ్చు అంటారు నిజమేనా
దయ చేసి సలహా తెలప గలరు..

Doubts that they were asked to answer: 

TV tuner card for recording of TV programs via computer. In a few years ago I built the Intex TV Tuner Company, taking my CPU in the docking well. TV programs which seem, for the record. Working with a runaway. If you have any favorite TV programs in the recording that they are, Flexible cusukovaccunu again. I needed to do some of the videos. Not seeing the TV, my system is working cesukonevadini. If the memory is hard disk to prevent spoiling. Videos can be recorded so I wanted to do best. A single, 40 - 50 MB up to a point (depending on quality) invaded.

The recording of the songs, a member of YouTube, which will upload. When the tags of the pataki - Search You can type in the details will appear in the video. When the rear of the TV program in the idi YouTube story.

Any reason behind the TV program to upload? : 


Until that time, TV programs, there is one copy and not upload. But have recently changed. Metho sambandhamaina who had rights or, in the Valle losing money either, that is to prevent piracy, Casino cesukundam ideas had more money or ... Slightly in recent vativati ​​own hakkudarulu also maintain accounts in YouTube. There are also alantivarilo TV companies.


Then the next night with them abroad to TV broadcasting, the program tracks of the songs, and other programs to - who padite before uploading them onto YouTube. Company of the TV companies that now the program on their company name and upload it to open a akkaunt.


However, if I put ratings on their programs for each channel now .. Cesestunnayi uploaded onto YouTube. Breaking the News. Far from causing the TV to the office in the, way, anywhere on the laptops due to either advanced 3G, 4G phones will allow them to upload the track to get it. Are you benefiting from that - the water mark on the video that would promote the company, copyright rights, in the global context to the channel, the programs key "hits" increased, and thus fall under the international name and fame .. If you enjoyed being in the programs. That "thing" in the video due to the increase in the economic advantages of their hits. Thus, the TRP ratings for the TV companies are adding more to the prayer.


If we upload TV program?


A program that we have deemed, for all teliyacesenduku say that we've uploaded in YouTube. He soon discovers that the content of the video hakkudarulu or TV companies, film companies, but companies would either .. YouTube objecting to them shortly. It was then that company to set up some of the staff involved. Their duty is all the same.


If they would have received a complaint from the You Tube of the water marks, the signature generated by the TV in this video is uploaded to their YouTube in a box key, and the email ID key will tell. Phalana with their video, and upload a copy to you .. This e-mail request, seen the video. Or they are taking (legal) activity is responsible for what .. It is a brief summary. We still tiseyyavaccunu tiseyyakunte themselves, or we receive Legal Notice ..


They have the power to have removed. It is then a member of the You tube is in the Rules and regulesans. They have the right to do so. The TV and the company logo, water mark of their owner to visit. Prosid I never win anything either, so you as the legal situation. Manantata the video, we tisesinde Best. Saddumanugutundi where the fight. Otherwise, the TV company, the area encompasses the world court case, rotating opika, if you have asthma tatamuttatala Dandi edurukovaccunu them. There is evidence manavaipu vikuga nose are upina vigipoyela. Gelavalem so.


If you have any computer, including its configuration, from any network, from where, when, all of the videos uploaded to YouTube in the data they contain. Case, depending on the severity of the Cyber ​​Crime Police to complain - they have all the data collected. In doing so they are easily available on the upload. Evidence of their draws. (It's a small, brief said. But it was not.)


Most of Telugu TV channels lonivena youtube videos? : 


Yes .. Most of them in Telugu TV channels. Some of the few new TV channels on their marks, water marks do not upload it. Download videos from internet, upload them to the Crop. If you object to ceppedaka hakkudarulu would remain in the tube. Anyone who takes the complaint - I mugisinatle video story.


Money can be earned via the Net is nijamena?


Yes .. True! Earn. We are happy to upload videos of our time and happy (all before, better quality video and not one complaint), "Hits" is if (in their own akkaunt ijiga, details will appear.) So that you can not sadhincaranna income in order to qualify. If you qualify for the successful, if you mail in your mail ID is the key to a firm tube, you tube akkaunt in the box key, object. It was not like the hits should be more than fifty velaki.


Then open your YouTube akkaunt, then click on the link in the e-mail, then you will have an application to law. Phil to do it. It consists of three pages. Uru with your name, adress, email ID, your mobile phone number of all feet. None nimpakapoyina server refused to accept. Terms & Conditions are here again. Click OK to accept. Repevaraina vaccevaraku any problems adding the video is not ours. If there soon! But the implications. Activities may be no longer under copyright law. India did not enforce the law does not, but abroad it is very pakadbandi. So go ahead and fill your own video as the application, the dabbulakosam edurucudoccunu. Kvalitiga the HD high definition video, but very good. An increase is expected to take care of themselves .. ranuranu Hits


Telisinadanta your prasnaki I said. 

Friday, June 24, 2011

Youtube వీడియోల వల్ల ఆదాయం ?

Telugu videos గారు Thursday, June 23, 2011 12:40:00 PM న అడిగిన ఒక ప్రశ్న : 

యూ-ట్యూబ్ వీడియో - నాది మీరే కాపీ చేసారు.
టీవీ ప్రోగ్రాం లు పెట్టొద్దు అనే నిబంధన చూసి ఏవీ టీవీ ప్రోగ్రామ్లు అందులో పెట్టలేదు
 రాజ్ గారు మీరు వ్రాసిన పోస్ట్ చూసాను,

నాకు చిన్నా డౌట్ ?

టీవీ చానల్స్ లోని ప్రోగ్రామ్స్, టీవీ ట్యూనర్ కార్డ్ ద్వారా కాపీ చేసి youtube లో అప్లోడ్ చేస్తే ఏమైనా probelm మా, నేను యౌతుబే ద్వారా money సంపదిన్చాచు అని విన్నాను, దయ చేసి సలహా తెలప గలరు,

youtube లోని చాల తెలుగు videos టీవీ చానల్స్ లోనివే అని అంట్టునారు మా ఫ్రెండ్స్

నెట్ ద్వారా మనీ సంపాదించ వచ్చు అంటారు నిజమేనా

దయ చేసి సలహా తెలప గలరు..

వారు అడిగిన సందేహానికి జవాబు :  

TV ట్యూనర్ కార్డ్ వల్ల టీవీ ప్రోగ్రామ్స్ కంప్యూటర్ ద్వారా రికార్డింగ్ చేసుకోవచ్చును. నేను కొద్ది సంవత్సరాల క్రిందట Intex కంపనీ వారి ఇన్ బిల్ట్ టీవీ ట్యూనర్ తీసుకొని, నా CPU లో డాకింగ్ చేయించాను. దానివల్ల టీవీ ప్రోగ్రాములు చూస్తూ, రికార్డింగ్ చేసుకోవచ్చును. అది అద్భుతముగా పనిచేస్తున్నది. ఇలా టీవీ లోని ప్రోగ్రామ్స్ ఏవైనా నచ్చితే అవన్నీ రికార్డింగ్ చేసుకొని, వీలున్నప్పుడు మళ్ళీ చూసుకోవచ్చును. నాకు కావాల్సిన వీడియోలు అలా కొన్ని చేసుకున్నాను. అప్పుడప్పుడూ టీవీ చూస్తూ, నా సిస్టం పని చేసుకొనేవాడిని కూడా. కాకపోతే హార్డ్ డిస్క్ మెమొరీ బాగా తినేస్తుంది. అందుకే అవసరం అనుకున్న వీడియోస్ రికార్డింగ్ చేసుకోవటం బెస్ట్. ఒక సినిమా పాట 40 - 50 MB వరకూ స్థలాన్ని (క్వాలిటీ బట్టి) ఆక్రమించుకుంటుంది.

ఇలా రికార్డింగ్ చేసుకున్న సినిమా పాటలని, యు ట్యూబ్ లో సభ్యత్వం తీసుకొని, అందులోకి అప్లోడ్ చేస్తారు. ఆ పాటకి పెట్టే ట్యాగ్స్ వల్ల - సర్చ్ లో ఆ వివరాలు టైపు చెయ్యగానే ఈ వీడియో కనిపిస్తుంది. ఇదీ యు ట్యూబ్ లో పెట్టే టీవీ ప్రోగ్రాం ల వెనక ఉన్న కథ.

ఏదైనా టీవీ ప్రోగ్రాం అప్లోడ్ వెనక కారణం? :

కొంతకాలం వరకూ ఇలా టీవీ ప్రోగ్రామ్స్, కాపీ చేసి అప్లోడ్ చేస్తే ఏమీ అయ్యేది కాదు. కాని ఈమధ్య మారాయి. ఎవరికివారు మేథోసంబంధమైన హక్కుల వల్లనే గానీ, డబ్బులు కోల్పోతున్నాము అని వల్లే గానీ, పైరసీ అరికట్టడానికి అని గానీ, కాసిన్ని ఎక్కువ సొమ్ములు చేసుకుందాం అన్న ఆలోచన వల్లనే గానీ... కొద్దిగా ఈమధ్య వాటివాటి స్వంత హక్కుదారులు కూడా యు ట్యూబ్ లో అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. అలాంటివారిలో టీవీ కంపనీలు కూడా ఉన్నాయి.

టీవీల్లో వచ్చే అర్ధరాత్రి తరవాత వచ్చే విదేశాలలో ఉండే వారికోసం ప్రసారం చేసే, పాటల ప్రోగ్రాం లలో వచ్చే పాటలని, ఇతర ప్రోగ్రామ్స్ ని - ఇంతకు ముందు ఎవరు పడితే వారు యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేసేవారు. ఇప్పుడు ఆ ప్రోగ్రాం సదరు కంపనీ అయిన ఆ టీవీ కంపనీయే తమ సంస్థ పేరు మీద ఒక అక్కౌంట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాయి.

ప్రతి ఛానల్ ఇప్పుడు వారి ప్రోగ్రామ్స్ ఏమైనా కాస్త రేటింగ్స్ వస్తే చాలు.. యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేసేస్తున్నాయి. ముఖ్యముగా సంచలన వార్తలు కూడా. దీనివల్ల టీవీ కి దూరముగా ఉంది ఆఫీస్ లలో, దారిలో, ఎక్కడైనా ల్యాప్ టాప్ వల్ల గానీ, అధునాతన 3G, 4G  ఫోన్ ల వల్ల గానీ తెలుసుకోవటానికి వీలుగా ఇలా అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చెయ్యటం వల్ల లాభం ఏమిటంటే - ఆ వీడియో మీద ఉండే వాటర్ మార్క్ వల్ల ఆ సదరు సంస్థకి ప్రచారం, కాపీ రైట్ హక్కులూ, ప్రపంచ వ్యాప్తముగా ఆ ఛానల్ కి, ఆ ప్రోగ్రామ్స్ కీ "హిట్స్" పెరిగి, తద్వారా ఆ సంస్థ అంతర్జాతీయముగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి.. ఆ ప్రోగ్రామ్స్ లో సత్తా ఉండి ఉంటే. అలా "విషయం" ఉన్న వీడియో వల్ల వారికి హిట్స్ పెరిగి ఆర్థికముగా లాభాన్ని అందిస్తాయి. అందుకే ఈ మధ్య టీవీ సంస్థలు TRP రేటింగ్స్ అంటూ బాగా జపం చేస్తున్నాయి.

ఒకవేళ మనం టీవీ ప్రోగ్రాం అప్లోడ్ చేస్తే ?

ఒక ప్రోగ్రాం మనకి నచ్చి, అందరికీ తెలియచేసేందుకు మనం యు ట్యూబ్ లో అప్లోడ్ చేశామే అనుకోండి. ఆ వెంటనే ఆ విషయం తెలుసుకున్న ఆ వీడియో హక్కుదారులు అయిన టీవీ సంస్థలే గానీ, సినిమా సంస్థలే కానీ, కంపనీలే గానీ.. యు ట్యూబ్ కి అభ్యంతరం తెలుపుతూ వారిని సంప్రదిస్తారు. ఇలా చేసేందుకై సదరు సంస్థలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి డ్యూటీ అంతా ఇదే.  

ఇలా వీరి దగ్గర నుండి ఫిర్యాదు అందుకున్న తరవాత ఆ యు ట్యూబ్ వారు ఆ వాటర్ మార్కులూ, మూలాన ఉండే టీవీ సిగ్నేచర్ ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి వారి యు ట్యూబ్ లోని ఇన్ బాక్స్ కీ, మరియు మెయిల్ ID కీ ఈ విషయాన్ని తెలియచేస్తారు. అందులో ఫలానా వారి వారి వీడియోని, మీరు కాపీ చేసి అప్లోడ్ చేశారు.. ఈ మెయిల్ చూడగానే ఆ వీడియోని తీసెయ్యండి. లేదా వారు తీసుకొనే (లీగల్) చర్యలు కి బాధ్యత వహించండి.. అని క్లుప్తముగా దాని సారాంశం. అప్పటికీ మనం తీసేయ్యకుంటే వారే తీసేయ్యవచ్చును, లేదా మనం లీగల్ నోటీస్ అందుకోవచ్చును..

వారికీ తీసేసే అధికారం ఉంటుంది. ఇది ఆ యు ట్యూబ్ లో సభ్యత్వం తీసుకునే అప్పుడు వచ్చే రూల్స్ అండ్ రెగులేషన్స్ లలో ఉంటుంది. అలా వారికి హక్కు. ఇక టీవీ వారికి సంస్థ చిహ్నం, వాటర్ మార్క్ వారి స్వంతదారుని చూపిస్తాయి. ఇక మీరు లీగల్ గా ప్రొసీడ్ అయినా ఎక్కడా గెలవలేని పరిస్థితి. ఆ వీడియోని మనంతట మనం తీసేసిందే బెస్ట్. అక్కడితో ఆ గొడవ సద్దుమణుగుతుంది. లేకుంటే ప్రపంచములో ఆ టీవీ సంస్థ ఏరియాలో వేసే కోర్టు కేసులకి, తిరిగే ఓపికా, తాతముత్తాతల దండిగా ఆస్థీ ఉంటే వారిని ఎదురుకోవచ్చును. అయినా సాక్ష్యాలు మనవైపు చాలా వీకుగా, ముక్కుతో ఊపినా వీగిపోయేలా ఉంటాయి. కనుక గెలవలేం.

మీరు యే కంప్యూటర్ తో, దాని కాన్ఫిగరేషన్ తో సహా, యే నెట్ వర్క్ నుండి, ఎక్కడి నుండి, ఎప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేశారో ఆ డాటా అంతా ఆ యు ట్యూబ్ వారి వద్ద ఉంటుంది. కేసు తీవ్రత బట్టి సైబర్ క్రైమ్ పోలీస్ కి ఫిర్యాదు చేస్తే - వారు ఈ డాటా అంతా సేకరిస్తారు. అలా అప్లోడ్ చేసిన వారు తేలికగా దొరుకుతారు. వారి సాక్ష్యాలూ బలముగా ఉంటాయి. (ఇదంతా చిన్నగా, క్లుప్తముగా చెప్పాను. అయినా పెద్దగా అయ్యింది.)
  
youtube లోని చాల తెలుగు videos టీవీ చానల్స్ లోనివేనా? :
 
అవును.. ఎక్కువగా తెలుగు టీవీ చానల్స్ వారివే. కొంతమంది కొన్ని క్రొత్తగా వచ్చే టీవీ చానల్స్ వారి చిహ్నాలూ, వాటర్ మార్క్స్ లేనివి అప్లోడ్ చేస్తున్నారు. నెట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకొని, అందులోని భాగాలని కత్తిరించి వాటిని అప్లోడ్ చేస్తున్నారు. సదరు హక్కుదారులు అభ్యంతరం చెప్పేదాకా అలా యు ట్యూబ్ లో ఉండిపోతాయి. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే - ఇక వీడియో కథ ముగిసినట్లే.
 
నెట్ ద్వారా మనీ సంపాదించ వచ్చు అంటారు నిజమేనా 

అవును.. నిజమే! సంపాదించవచ్చును. మనం అప్లోడ్ చేసిన వీడియోలు బాగుండి, మన టైం బాగుంటే (అందరికన్నా ముందుగా, బాగా నాణ్యత వీడియో ఉండి, ఎవరూ కంప్లైంట్ చెయ్యకపోతే), "హిట్స్" బాగా ఉంటే (ఎవరి అక్కౌంట్ లలో వారికి ఈజీగా, వివరముగా కనిపిస్తాయి.) అప్పుడు మీరు ఆదాయం పొందటానికి అర్హత సాధించారన్న మాట. మీరు అర్హత సాధించారో, లేదో యు ట్యూబ్ సంస్థ నుండి ఒక మెయిల్ మీ మెయిల్ ID కీ, మీ యు ట్యూబ్ అక్కౌంట్ ఇన్ బాక్స్ కీ, వస్తుంది. బహుశా ఆ హిట్స్ యాబై వేలకి పైగా ఉండాలి అనుకుంటా.

అప్పుడు మీ యు ట్యూబ్ అక్కౌంట్ ఓపెన్ చేసి, ఆ మెయిల్ లో ఉన్న లింక్ ని నొక్కితే,  అప్పుడు మీకు ఒక అప్లికేషన్ లా వస్తుంది. అది ఫిల్ చెయ్యాలి. అలా మూడు పేజీలు  ఉంటాయి. అందులో మీ పేరూ ఊరూ, అడ్రెస్స్, మెయిల్ ID, మీ మొబైల్ ఫోన్ నెంబర్ అన్నీ అడుగుతారు. ఏ ఒక్కటి నింపకపోయినా సర్వర్ అంగీకరించదు. నియమ నిబంధనలు ఇక్కడ మళ్ళీ ఉంటాయి. ఓకే చేసి అంగీకరించాలి. రేపెవరైనా ఆ వీడియో మాది అంటూ వచ్చేవరకూ ఏ ఇబ్బందీ ఉండదు. ఒకవేళ వస్తే! ఇక చిక్కులే. కాపీరైట్ చట్టం క్రింద ఇక చర్యలు ఉండొచ్చు. ఇండియా లో చట్టం అంతగా అమలు ఉండదు కాని, విదేశాలలో మాత్రం చాలా పకడ్బందీ గా ఉంటుంది. అందుకే మీ స్వంత వీడియోలకి ఇలా అప్లికేషన్ నింపి, ఆ డబ్బులకోసం ఎదురుచూడోచ్చును. క్వాలిటీగా ఉండే HD హై డెఫినేషన్ వీడియోలు అయితే మరీ మంచిది. రానురాను వాటికే హిట్స్ పెరుగుతాయి అన్నది ఒక అంచనా..

మీ ప్రశ్నకి నాకు తెలిసినదంతా చెప్పాను.

Tuesday, June 21, 2011

Oh vanaa padithe - Merupukalalu


చిత్రం : మెరుపుకలలు (1997)
గాయకులు :సుజాత, మలేషియా వాసుదేవన్ 
సంగీతం : ఏ. ఆర్. రెహమాన్
***************
సాకీ :

ఓహ్ వానా పడితే ఆ కొండా కోనా హాయి
పల్లవి :

ఓహ్ వానా పడితే ఆ కొండా కోనా హాయి
పూలోచ్చి పలికే సంపంగి భావాలోయి..
ఓహ్ వానా పడితే ఆ కొండా కోనా హాయి
పూలోచ్చి పలికే సంపంగి భావాలోయి..
ఊ - కోయిలకే కుక్కుక్కు ఎద హోరే కాంభోజి
సంగీతమంటేనే హాయి హాయీ..
నదిలోన లేహరి లాలి పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయీ..
జగమంత సాగే గీతాలే పడుచు ఖవ్వాలి
సాగింది నాలో సస్సారి గమ పదనిస్సారీ.. // ఓహ్ వానా పడితే //

చరణం 1: 

రాతిరోచ్చిందో రాగాలే తెచ్చిందో - టిక్ టిక్ అంటాది గోడల్లో
దూర పయనంలో రైలు పరుగుల్లో ఛుక్ ఛుక్ ఛుక్ గీతాలే చలో
సంగీతిక ఈ సంగీతికా - సంగీతిక ఈ సంగీతికా
మధుర సంగీత సుధా
పాపల్ని తానే పెంచి పాడే తల్లి పాటే హాయి - మమతాను రాగాలు కదా.
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
మంగళారే మంగళారే ధోరి ధోరి భయ్యా
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
ఝాన్గలారే ఝాంగలారే ధుని రాగే దయ్యా // ఓహ్ వానా పడితే //

చరణం 2:

నీలారం అడుగుల్లో అల్లార్చే రెక్కల్లో - ఫట్ ఫట్ సంగీతాలే వినూ
గోవుళ్ళ చిందుల్లో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో వినూ
సంగీతికా ఈ సంగీతికా - సంగీతికా ఈ సంగీతికా
జీవన సంగీత సుధా
వర్షించే వాన జల్లు వర్ణాలన్నీ గానాలేలే
ధరణి చిటికేసే వినూ
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
మంగళారే మంగళారే ధోరి ధోరి భయ్యా
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
ఝంగ్ లారే ఝంగ్ లారే ధుని రాగే దయ్యా // ఓహ్ వానా పడితే // 

హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
హిల్కొరే ఏ ఏ ఏ.. 
హిల్కొరే 

Monday, June 20, 2011

Tellavaare vachhe teliyaka - Chiranjeevulu


చిత్రం : చిరంజీవులు (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : ఘంటసాల
గానం : పి.లీల
*************
పల్లవి :

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్లీ పరుండేవు లేరా.. మళ్లీ పరుండేవు లేరా
మళ్లీ పరుండేవు మసలుతూ ఉండేవు
మళ్లీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
మారాము చాలింక లేరా // తెల్లవారవచ్చె తెలియక నా సామి //


చరణం 1:

కలకలమని పక్షిగణములు చెదిరేను - కల్యాణ గుణధామ లేరా (2)
తరుణులందరు దధి చిలికే వేళాయె - దైవరాయ నిదుర లేరా (2)
దైవరాయ నిదుర లేరా

చరణం 2:

నల్లనయ్య రారా నను కన్నవాడా - బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా (2)
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా // తెల్లవారే వచ్చే తెలియక // 

Sunday, June 19, 2011

O nannaa nee manase venna - Dharmadatha





పితృ దినోత్సవ శుభాకాంక్షలతో..

చిత్రం : ధర్మదాత (1970)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.చలపతిరావు
గానం : ఘంటసాల, జయదేవ్, పి.సుశీల
****************

పల్లవి :

ఓ నాన్నా - ఓ నాన్నా..
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా - అది ఎంతో మిన్న
ఓ నాన్నాఓనాన్నా..

చరణం 1:

ముళ్ళబాటలో - నీవు నడిచావు
పూలతోటలో - మమ్ము నడిపావు
ముళ్ళబాటలో - నీవు నడిచావు
పూలతోటలో - మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు - దాచి ఉంచావు  // ఓ నాన్న! నీ మనసే వెన్న //

చరణం 2 :

పుట్టింది అమ్మ - కడుపులోనైనా
పాలు పట్టింది - నీ చేతిలోన
పుట్టింది అమ్మ - కడుపులోనైనా 
పాలు పట్టింది - నీ చేతిలోన
ఊగింది - ఉయ్యాలలోనైనా
ఊగింది - ఉయ్యాలలోనైనా
నేను దాగింది - నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన // ఓ నాన్న! నీ మనసే వెన్న //

చరణం 3:

ఉన్ననాడు - ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి - సాచనన్నావు
ఉన్ననాడు ఏమి - దాచుకున్నావు
లేనినాడు చేయి - సాచనన్నావు
నీ రాచ గుణమే - మా మూలధనము
నీ రాచ గుణమే - మా మూలధనము
నీవే మాపాలి దైవము // ఓ నాన్న! నీ మనసే వెన్న // 

1980 v/s 2010 Storage Devices


పై ఫోటోలో చూశారు కదూ!.. 1980 సంవత్సరం లోని స్టోరేజ్ డిస్క్ కీ, 2010 సంవత్సరపు స్టోరేజ్ కార్డు కీ మధ్య ఉన్న బరువు తేడా, స్టోరేజ్ సామర్థ్యం, వాటి విలువా, సైజూ.. ఎంత తేడా!.. టెక్నాలజీ పెరిగినకొలదీ ఎంత చిన్నవిగా రూపొందుతున్నాయి..

Saturday, June 18, 2011

లేబుల్స్ లలో కేటగిరీ పెట్టడం ఎలా?

లేబుల్స్ లలో కేటగిరీ పెట్టడం : 

1. ముందుగా మీరు మీ బ్లాగ్ హొం పేజీలోకి వెళ్లి, డిజైన్ లో "లేబుల్స్" ఆడ్ చేసుకోవాలి. 

2. అలా ఆడ్ చేసుకున్నాక, ఇప్పుడు "న్యూ పోస్ట్" వ్రాస్తున్నప్పుడు, మీరు వ్రాసే గది క్రిందన ఒక గది - Lables: అని కనిపిస్తుంది. మీరు వ్రాసే టపా ఏ కేటగిరీ కి చెందుతుందో, ఆ కేటగిరి పేరుని - ( క్రొత్త కేటగిరి అయితే ) అక్కడ టైప్ చెయ్యండి. ఇంతకు ముందే ఆ కేటగిరిలో పోస్ట్ చేసి ఉంటే - ఆ ప్రక్కనే ఉన్న Show All ని నొక్కితే, ఆ వచ్చే మెనూ లో ఆ కేటగిరిని ఎన్నుకోవాలి. 

3. అంతే!.. ఇక మీ సమస్య తీరినట్లే!



Friday, June 17, 2011

Vasudhaaraa - Badrinath




చిత్రం : బద్రినాథ్ (2011) 
రచన : చంద్రబోస్ 
పాడినవారు : శ్వేతాపండిత్, యం. యం కీరవాణి. 
సంగీతం : యం. యం కీరవాణి
********************
పల్లవి :

వసుధార వసుధార..
పొంగి పొంగి పోతోంది జలధార - వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార - వైభవంగా వస్తుంది వసుధార
ఆధార నా ప్రేమకాధారం అవుతుంటే..
ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే..
వాన జల్లుతో - వంతేనేయగా
వెండి పూలతో దండ లేయగ
వయసే నదిలా, వరదై నదిలా 

వసుధార వసుధార // పొంగి పొంగి పోతోంది జలధార // 


చరణం 1:
నింగి నీలల రాగం వినగానే
మేళ వేణువు మౌనం కరిగే
నీలో నాలో అభిమనమై

నీకు నాకు అభిషేకమై
మన మానస వీధుల్లో కురిసేనే

వసుధార వసుధార // పొంగి పొంగి పోతోంది జలధార //
చరణం 2:

నీటి లేఖల భావం - చదివానే
నీటి రాతలు కావి - చెలిమే
అంతేలేని చిగురింతలై

సంతోషాల - చెమరింతలై
తడి ఆశల - అక్షతలై మెరిసేనే

వసుధార వసుధార // పొంగి పొంగి పోతోంది జలధార // 

Thursday, June 16, 2011

మన నాయకుల అవినీతి చిట్టా.

మన నాయకుల అవినీతి గురించి చిట్టా వ్రాస్తే - ఇంతలావు గ్రంధం అవుతుందేమో!.. 



Tuesday, June 14, 2011

అర్ధరూపాయి - అపరాధభావం

రెండు రూపాయలు - అపరాధ భావం లో నా అంతర్మధనం చదివారుగా.. అలాంటిదే మరొకటి కూడా చెప్పాలని అనిపిస్తున్నది. దాదాపుగా దీనిని పోలినట్లే ఉంటుంది. అదీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. అయినా ఇది కూడా కాస్త చదివిపెట్టండి.

నేను కాలేజీ చదువుతున్న రోజులవి.. ఒక ఆదివారంన మిత్రులం అంతా వేసవి సాయంత్రాన అలా వాకింగ్ వెళదామని అనుకున్నాము.. నేను, ఇంకో మిత్రుడిని తీసుకొని వారితో జాయిన్ అవటానికి బండి మీద వచ్చాను. ఆ బండి కిక్ కొట్టడములో, నా చెప్పు కాస్త తెగింది. అది గమనించుకోలేదు. బండి అలా పార్క్ చేసుకొని, అలా వారితో జాయిన్ అయ్యే సమయములో పూర్తిగా చెప్పు తెగిపోయి, వారితో జాయిన్ కాకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి. మిత్రులు వాకింగ్ కేన్సిల్ చేద్దామని అన్నారు. కాని నేను నా ఒక్కడి కోసం ఎందుకు కేన్సిల్ అనుకోని, బాగు చేయించుకొని వస్తాను అని అదే బండి మీద మోచి వారికోసం వెళ్లాను.

ఆరోజు ఆదివారం - అందునా సంధ్యాసమయం. వారం రోజుల బిజినెస్ హడావిడి నుండి కాస్త రిలీఫ్ కోసం అన్ని దుకాణాలు బంద్ అయిన సమయాన, ఎవరు ఉంటారు.. వెదకగా వెదకగా ఒక ఒక చిన్న చెప్పుల షాప్ కనిపించింది. అది ఒకప్పుడు రిపేర్ చేసే దుకాణమే.. కాని వారి వయోభారం వాళ్ళ పిల్లలకి చిన్నగా షాప్ పెట్టించారు. అందులో రిపేర్ చెయ్యరు అని తెలుసు.. కాని ఒకసారి అడిగి చూస్తే - పోలా! అనుకొని అడిగా - ఏమీ అనుకోవద్దు.. అంటూ నే వచ్చిన కారణం చెప్పాను.. అదీ నామోషీగా ఫీలయ్యి.

వారిలోని కోలమొహముతో, పీలగా, నుదుట రూపాయి కాసంత కుంకుమ నుదుటిబొట్టుతో ఉన్న ముసలావిడ నన్ను చూసి నవ్వింది.. ఆ నవ్వులో ఒక అభయం ఇస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడు తను వేరేవారితో బిజినెస్ డీల్ లో ఉంది. దాన్ని వారి పిల్లలకి అప్పగించింది. నా చెప్పు చూసింది. దాన్ని స్క్రూ డ్రైవర్ లాంటి పరికరముతో సరిచేసింది. తీరా ఒక మొల కొట్టేద్దామని చూస్తే - ఆ డబ్బానే కనిపించలేదు. బాగా వెదికింది. ఆ తరవాత కూల్ గా చెప్పింది ఆవిడ - ఆ మేకుల డబ్బా ఇంటివద్దే ఆరోజు మరిచాననీ!

హబ్బా! ఈరోజు నాకు రోజు బాగాలేదు అని ఏడుపు మొహం పెట్టాను. నా బాధ గమనించిందో ఏమో.. ఉండు బిడ్డా అని మరోసారి తన డబ్బా అంతా వెదికింది. అందులోని ఉన్న సామాను అంతా బయట పెట్టి మరీ వెదికింది. నిజానికి ఆమె అంత వెదికే అవసరం ఏమీ లేదు. లేదని చెప్పేయవచ్చును కూడా. కాని ఆవిడకీ నన్ను ఖాళీగా త్రిప్పి పంపటం ఇష్టం లేదులా ఉంది. 

అన్ని డబ్బాలనీ ప్రక్కన పెట్టాక, ఆ డబ్బాలో మూలన ఒకేఒక మేకు కనిపించింది. మా అందరి మొహాల్లో సంతోషం. దాన్ని తీసి నా చెప్పు జాయింట్లో బొటనవ్రేలితో గుచ్చి, ఇనుప దిమ్మతో రెండు దెబ్బలు వేసింది. నా చెప్పు ఓకే అయ్యింది. రేపటివరకూ ఆగుతుంది. రేపు వచ్చేసి ఇంకో రెండు కొట్టించుకో అన్నదావిడ. ఆవిడ సామానులన్నీ సర్డుకుంటుండగా "ఎన్ని డబ్బులు?" అని అడిగాను. ఆవిడ అర్ధ రూపాయి అన్నారు. (అప్పట్లో ఆ అర్ధ రూపాయి అంటే చాలానే విలువ.)

నా జేబులన్నీ వెదికాను.. ఊహు.. నాతో వచ్చిన అతని వద్దా వెదికాడు.. చిత్రం.! ఇద్దరి వద్దా ఒక్క రూపాయి కూడా లేదు. అంత కష్టపడి, బాగా వెదికి మరీ మేకు కొట్టిస్తే - అడిగిన అర్థ రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితియా మాది. ఛీ ఎదవ బ్రతుకు అనుకున్నాను. రేపు తెచ్చి ఇస్తాను అన్నాను. ఆవిడా ఏమీ అనుకోలేదు.. చిరునవ్వుతో సరే బాబూ అంది.

తెల్లారి ఇస్తాను అనుకున్నానా?.. బీజీ ఉండి తన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలా రెండురోజులయ్యాక హా! ఏమిస్తాం లే! ఈ అర్ధ రూపాయీ ఇవ్వక తప్పదా.. హా! ఎగ్గోట్టేద్దాం లే.. మనమేం కొంపలు ముంచటం లేదుగా అన్న ఆలోచనా మొదలయ్యింది.

నాలుగోరోజునుండీ అంతర్మధనం మొదలయ్యింది. అంత కష్టపడి ఆవిడా మేకు కొట్టిస్తేనేగా, ఆరోజుటి వాకింగ్ లో నేను బాగా ఎంజాయ్ చేసింది. తను ఆరోజు నా వల్ల కాదు అనుకుంటే - ఆరోజు నేను పొందిన ఆనందపు తాలూకు అనుభూతి అంతా నేను పొందేవాడిని కాదుగా... పదిమందికి పైగా ఉన్న మిత్రులతో వాకింగ్ చేస్తూ, ఎన్నో విషయాలు మాట్లాడుకున్న, తెలుసుకున్న జ్ఞానం అంతా తన దయ వల్లనే కదా! అంటూ ఇలా ఎన్నెన్నో ఆలోచనలు. ఎగ్గోడదాము అన్న ఆలోచన నుండి ఎప్పుడు తిరిగి ఇచ్చేద్దాము అన్న ఆలోచన మొదలయ్యింది. ఆరోజు రాత్రి నిద్ర కూడా సరిగా పట్టలేదు. ఎప్పుడూ ఆ నవ్వుతో మాట్లాడిన ఆమె మాటలే వెంటాడేవి. నవ్వుతూ, క్షమించి మనిషిని చిత్రవధ చెయ్యొచ్చును అని ఆరోజే తెలుసుకున్నాను.

తెల్లవారిన లేవగానే ఒకసారి వారి వద్దకి ఆత్రుతతో వెళ్ళివచ్చాను. అప్పటికి ఆ వృద్ధులు రాలేదు. స్నానం, టిఫినీ అంతా కానిచ్చేసి, పదింటికి వెళ్లాను. భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారు. వారిముందు బండి ఆపి దిగాను. ఆవిడా నన్ను చూసి నవ్వింది. గుర్తుపట్టారు ఆవిడ. అదే నవ్వు. కాని వేవేల అర్థాలున్నాయి అనిపించింది నాకా క్షణంలో. అప్పటివరకూ ధైర్యముగా ఉన్న నేను ఆ నవ్వు చూసి జావ కారిపోయాను.

తల వ్రేలాడేసుకొని, తన దగ్గరికి వెళ్లి "మొన్న ఆదివారం నాడు సాయంత్రం తెగిన చెప్పు కుట్టినందుకు.. ఆ బాకీ పైసలు.." అంటూ అర్ధ రూపాయి నాణెం చేతిలో పెట్టాను. హమ్మయ్య.. గుండెల మీద అప్పటివరకూ ఉన్న టన్నుల బరువు ఏదో దిగినట్లనిపించింది. స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది.

కాని ఆవిడకి ఇదంతా గమ్మత్తుగా తోచిందేమో! లేదా నా అవస్థలు అన్నీ తెలిసిందేమో! చీర చెంగు నోటికి అడ్డం పెట్టుకొని అదే నవ్వు.. అది వెక్కిరింతో, లేక నా మీద జాలో, లేదా ఏమిటీ మనిషీ అనో!.. ఇక నేను వెనక్కి తిరిగి చూడలేక తిన్నగా బండి ఎక్కేసి, స్టార్ట్ చేసి, ఒక్క క్షణం లో మాయమయ్యాను.

వృద్ధాప్యములో ఉన్న వారిని ఎందుకో మోసం చేయ్యబుద్దికాక, ఇంత అవస్థ పడ్డాను.. ఇదంతా చదివి బాగా నవ్వుగా ఉంది కదూ..

Wednesday, June 8, 2011

రెండు రూపాయలు - అపరాధ భావం

ఈరోజు నుండీ నా మదిపొరల్లో, దాగుండిపోయిన అందమైన, తమాషా విషయాలని "జ్ఞాపకాలు" అనే లేబుల్ క్రింద కూడా మీకు అందిస్తున్నాను. వాటినీ ఆదరించి, మీ అమూల్యమైన వాఖ్యలని పోస్ట్ చెయ్యండి.

ఈరోజు నా వాహనం తీద్దామని చూస్తే - ముందు చక్రములో గాలి కాస్త తక్కువగా అనిపించింది. సరే అని నా పనులన్నీ చేసుకున్నాక, అటువైపు వెళ్ళాల్సివచ్చినప్పుడు వెళ్లాను. "బాబూ! కాస్త హవా మారో!.." అని హిందేలుగు (ఇదేదో బూతు అని అనుకోకండీ.. హిందీ + తెలుగు ని కలిపా.. అంతే!) ఆ అబ్బాయి ముస్లిం. నన్ను చూసి, గాలి కొట్టే పైపు తీసుకొని వచ్చి, చక్రాల్లో గాలి చెక్ చేస్తూ గాలిని నింపసాగాడు.

అంతలోగా అతడికి ఇవ్వాలని జేబులో చిల్లర తీశాను. మూడంటే మూడు రూపాయలు ఉన్నాయి. అతనికి నాలుగు రూపాయలు ఇవ్వాలి. ఒక రూపాయి తక్కువగా ఉంది. "మేరేపాస్ తీన్ రూపాయా హై.. ఏక్ రూపాయా కమ్ హై.. బాద్ మే దేతాహూ.." (నాదగ్గర మూడురూపాయలు మాత్రమే ఉన్నాయి. నీకిచ్చే నాలుగు రూపాయల్లో ఒక రూపాయి తక్కువగా ఉంది.. తరవాత ఇస్తానూ - అని తెలుగీకరణ) అన్నాను. నా జేబులో అన్నీ పెద్ద నోట్లే ఉన్నాయి అప్పుడు. అవి తప్ప చిల్లర ఏమీ లేదు.

"ఫరవా నై సాబ్.. కోయీ ఫరక్ నై.. ఆప్ ఇదర్ ఫిర్ ఆనేకే టైం పే దేదో.." (ఫరవాలేదు సార్. ఏమీ ఇబ్బంది లేదు. మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు ఇవ్వండి) అన్నాడు. సరే అన్నాను. టైర్లలో గాలి ఎంత ఉందో చెక్ చేసి, గాలి నింపటం పూర్తి అయ్యింది. నా డబ్బులు తీసుకుంటూ, నా వివరాలు అడిగాడు. ఆ అడగటంలో ఏదో నాగురించి తెలుసుకోవాలనీ, నన్ను ఒక చిన్నసైజు సెలెబ్రిటీలా చూశాడు. ఎందుకా అవన్నీ అనుకున్నాను. ఓపెన్ గా నా ప్రొఫైల్ చెప్పేశాను. అలా ఎందుకు అడిగాడబ్బా! అని ఆలోచించుకుంటూ బండి ఎక్కాను. అప్పుడు గుర్తుకువచ్చింది.

మూడు నాలుగు నెలల క్రిందట ఇలాగే ఒకసారి గాలి కొట్టించుకోవటానికి వెళ్లాను. ఆ అబ్బాయి వద్దకి వెళ్ళటం అదే తొలిసారి. ఎప్పుడూ వేరేవారి వద్దకి వెళుతుంటాను. ఈసారి కావాలని మార్చాను. దర్జాగా వెళ్లి ముందు చక్రములో గాలి కొట్టించాను. అతనికి డబ్బులు ఇవ్వటానికి జేబుల్లో చేయి పెడితే - ఒక్క రూపాయీ లేదు. ఎందుకా అని ఆలోచిస్తే - జస్ట్ అంతకు ముందే పాంట్ మార్చాను అనీ. హయ్యో! అనుకొని, ఆ అబ్బాయితో "సారీ! ఏమీ అనుకోవద్దు.. పాంట్ వేరేది వేసుకుని వచ్చాను. జేబుల్లో ఒక్కరూపాయి కూడా లేదు.. ఇటువైపు మళ్ళీ వచ్చినప్పుడు - మరచిపోకుండా మీకిచ్చే రెండు రూపాయలు తప్పకుండా ఇస్తాను.." అన్నాను. నా మాటల్లో నిజాయితీ చూసాడో, లేక మొదటిసారి కదా అని అనుకున్నాడేమో గానీ "సరే" అన్నాడు. కాని మనసులో తిట్టుకునే ఉంటాడు. నేను బాగా గిల్టీగా ఫీలయ్యాను. నిజాయితీగా కష్టముతో పనిచేసి, అతను చేసిన సేవకి తగిన ప్రతిఫలం ఎగ్గోట్టుతున్నాను అనే ఫీలింగ్ నాలో కలిగింది.

ఆవిషయం నన్నుచాలాసార్లు వెంటాడింది. ఆ రెండు రూపాయలు పెద్ద లెక్కలోకి రావు కానీ, హోటల్లో ఇచ్చే టిప్పుల కన్నా చాలా తక్కువ డబ్బుల మొత్తం అది. నా బండి కేసి చూసినప్పుడల్లా అదే భావం.

దాదాపు వారం రోజుల తరవాత అటుగా వెళ్లాను. కరెంట్ లేదు. చిమ్మని చీకటి. అతన్ని పిలిచాను. గాలి కొట్టడానికా అన్నట్లు ప్రెజర్ మీటర్, ఎయిర్ పైపూ పట్టుకొని వచ్చాడు. "నఖో భయ్యా.." (వద్దు సోదరా..) అని చెప్పి - నేను అతనికి ఇవ్వాల్సిన రెండు రూపాయల నాణేన్ని, అతని చేతిలో పెట్టి, ఆ రెండు రూపాయల వెనక అతని సేవ, నేను మరచిన విషయం చెప్పాను. "..ఇటువైపు రావటం వీలుకాక ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇచ్చాను.." అని ముగించాను. ఆ మాత్రం దానికి అతను బాగా కదిలిపోయినట్లున్నాడు. ఈకాలములో కూడా ఇంత నిజాయితీ మనష్యులు ఉన్నారా అనుకున్నట్లున్నాడు.

రోడ్డు మీద వచ్చే మిగతా వాహనాల వెలుతురులో నన్ను చూస్తూ, నా గురించి అడిగాడు. గిల్టీ ఫీలింగ్ తో ఉన్న నేను నా వివరాలు ఏమీ సరిగా చెప్పలేదు. చాలావారాల తరవాత ఈరోజు వెళ్లాను. నన్ను బాగా గుర్తు పెట్టుకున్నాడులా ఉన్నాడు. రూపాయి తక్కువ ఉన్నా ఏమీ అనకుండా.. ఫరవాలేదు అన్నాడు. ఈరోజు నేనూ నిజాయితీగా ఉండాలనిపించి, నాగురించి చెప్పాను.

చూడటానికి సిల్లీగా, చాలా చిన్న విషయమైనా, (నిజాయితీ సేవకి తగిన డబ్బు ఇవ్వలేకపోయాను అనే) గిల్టీ ఫీలింగ్ కి (అతని ఋణం తీర్చాను అన్న) సంతృప్తికీ మధ్యన ఉన్న అంతరాన్ని చక్కగా చవిచూశాను. ఆ రెండింటి అనుభూతులు ఎలా ఉంటాయో ఈ విషయం వల్ల చక్కగా నేర్చుకున్నాను.

Tuesday, June 7, 2011

Social NW Sites - 33 - Response in sites (cartoon)

సోషల్ సైట్లలో అమ్మాయిలకి, అబ్బాయిలకి వచ్చే రెస్పాన్స్ ఇలా ఉంటుంది. హ హ్హ హ్హ.. 

ఆకుపచ్చని రంగులో హైలెట్ చేసి, చూపినవి బాగా చూడండి. అప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏమిటో మీకే అర్థం అవుతుంది.. 




Wednesday, June 1, 2011

Social NW Sites - 32 - Updates in Orkut

ఎవరైనా మన సోషల్ నెట్వర్క్ స్నేహితుడు మనకి స్నేహితుడయ్యాక, ఆన్లైన్ లోకి వస్తున్నాడా? లేడా? అని తెలుసుకోవటం మొదట్లో కాస్త చాలా కష్టముగా ఉండేది. ఇప్పుడు కొద్ది వారాల నుండి కాస్త తేలిక అయ్యింది. ఇది అన్ని సోషల్ సైట్లకి వర్తించదు. కేవలం ఆర్కుట్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇది గమనించగలరు. మిగతా సైట్ల సంగతి తెలీదు.

కొంత మంది మనకి ఆడ్ అయ్యాక, అవక ముందు ఏమేమి చూడాలో మీకు చాలా విషయాలు చెప్పాను. కొద్ది వారాల క్రిందట ఆర్కుట్ మూడో వెర్షన్ కి మారింది. అందులోని ఒక ఫీచర్ గురించియే మీకు చెప్పేది. పాత వర్షన్ -పాత ఆర్కుట్ లో మీకు ఆడ్ అయిన లేదా, మీ స్నేహితుని అప్డేట్ చూడాలంటే ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపినట్లుగా, update అనే వద్ద నొక్కేవారు.

ఇలా ఇక్కడ నొక్కాక, మీకు ఆ స్నేహితుడి వారం రోజుల అప్డేట్స్ మాత్రమే మీకు అక్కడ కనిపించేడిటివి. మీ స్నేహితుడు ఆ ఏడు రోజుల్లో ఏమీ అప్డేట్ చెయ్యకుంటే అక్కడ ఏమీ కనిపించవు (క్రింది ఫోటో చూడండి.). అంటే వారం రోజుల వరకూ ఆన్లైన్ కి రావటం లేదు అన్నా, నిజమే అనుకోవచ్చును.

కాని కాలం మారింది. మీ ఈ నూతన ఆర్కుట్ - మూడో వెర్షన్ (ప్రస్తుతపు - న్యూ ఆర్కుట్ - ఇది అందరికీ ఉంటుంది.) లోని అప్డేట్ ని నొక్కితే -  


స్నేహితుడు ఆడ్ అయ్యాక గానీ, ఆడ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు గానీ, కొద్దిరోజులుగా ఆన్లైన్ లోకి రావటం లేదు అన్నప్పుడు,

వారు ఎప్పుడెప్పుడు వారి స్టేటస్ మెస్సేజ్ మార్చారు,

వారు ఎప్పుడెప్పుడు వారి ప్రొఫైల్ నేమ్ మార్చారు,

వారు ఎప్పుడెప్పుడు ఇతరులు పంపిన టెస్టిమోనియల్స్ ఓకే చేశారు,

ఎప్పుడు ఎవరిని మిత్రులుగా చేర్చుకున్నారు,

వారి ఫొటోస్ కి ఎవరు ఎప్పుడు ఎవరు కామెంట్స్ వ్రాశారు,

ఆ స్నేహితుడు ఏ ఏ కమ్యూనిటీ లోకి ఎప్పుడు చేరాడు,

ఏమేమి ప్రొఫైల్ థీమ్స్ మార్చుకున్నారు,

ఏ ఏ వీడియోలు ఆడ్ చేసుకున్నారు,

ఏ ఏ అప్లికేషన్స్ ఆడ్ చేశారూ,

ఎప్పుడేప్పుడు వారి అబౌట్ మీ మార్చారు,

ఎప్పుడెప్పుడు వారి ఫోటో ఆల్బం లోకి ఏమి చేర్చారు (లాక్ లో ఉన్నవి కావు)

ఇలాంటి విషయాలు అన్నీకనిపిస్తాయి. వారు ఇక అబద్దం ఆడలేని పరిస్థితి. అలా ఓపెన్ చేశాక క్రిందన ఉన్న Show more updates ని నొక్కుకుంటూ వెళితే సరి. దాదాపు ఆరు నెలల దాకా వారు చేసిన అప్డేట్స్ కనిపిస్తాయి.


ఈ విషయం తెలీని నా మిత్రుని బండారం బయటపడింది. అది ఎలా అంటే - నా మిత్రున్ని - "నా స్క్రాప్ కి రిప్లై ఇవ్వలేదు ఏమిటీ.." అన్నాను.
అతను "నేను ఆన్లైన్ కి రాలేదు కనుక మీ స్క్రాప్ చూడలేదు, చూస్తే రిప్లై ఇవ్వనా.." అన్నాడు.
"అవునా..?" అని అన్నాను.
దానికి అతడు "నిజం అన్నా.." అని అన్నాడు.
"ఒక్క నిముషం.." అని చెప్పి న్యూ ఆర్కుట్ లో అతని పేజీ ఓపెన్ చేసి, అతని డీపీ క్రింద ఉన్న His updates నొక్కి చూశాను. ఆ రోజు ఒక ఫోటో అప్లోడ్ చేశాడు. ఒక టెస్టిమోనియల్ అక్సేప్ట్ చేశాడు. అది చూసి అతనితో చెప్పాను.
"కాదన్నా.. నేను రాలేదు.." అన్నాడు.
"ఓకే!.. మీరు రాలేదుగా.. సరే! నమ్మాను.. కాని - ఒక నిముషం తరవాత మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి.. అప్పుడు మీరే నమ్ముతారు" అని అన్నాను.
వెంటనే అది స్క్రీన్ షాట్ తీసి అతనికి మెయిల్ చేశాను - "చూడమని" చెప్పాను.
"చూస్తాను.. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను.. " అని అన్నవాడు - కాసేపటికే చాట్ నుండి కనీసం బై చెప్పకుండా జంప్.
ఆ తరవాత అతన్ని నమ్మటం తగ్గించాను. స్నేహం అంటేనే నమ్మకం. ఇలా అబద్దాలు ఆడేవారిని మైంటైన్ చేస్తే రేపు ఇంకెన్ని అబద్ధాలు ఆడుతాడో!. జస్ట్ మరచిపోయాను సారీ.. అని చెపితే సరిపోయేదిగా.

ఇప్పుడు - మీ స్నేహితుడు, మీతో ఎంత పారదర్శకతతో (Transperancy) స్నేహం చేస్తున్నాడో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీ స్నేహం ఏ స్థాయిలో ఉందో ఒక అంచనాకి రావచ్చును. వారు చెవిలో పెట్టే పూలని తెలివిగా తప్పించుకోవచ్చును.
Related Posts with Thumbnails