Wednesday, May 18, 2011

Social NW Sites - 29 - సోషల్ సైట్లలో నిజమైన మిత్రుడు ఎవరు అంటే!

సోషల్ సైట్లలో నిజమైన స్నేహితుడు కావాలీ అనుకుంటే దొరకడం కష్టమే!. చాలా తక్కువ రేషియో లో మీకు దొరకవచ్చును. పరిచయస్థులు మాత్రం మీకు బాగా ఉంటారు. కొద్దిగా ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ఉంటుంటే - మీకు నిజమైన స్నేహితులు దొరుకుతారు. ఇలా విశ్లేషించుకోవటం కాస్త కష్టమైనా పనే!. కాస్త మనుష్యుల నైజాలు, ప్రవర్తనలూ, మూడ్స్, మాటల వెనుక ఉన్న అసలు విషయాలూ.. లాంటివి గమనించటం మీకు తెలిసి ఉంటే కాస్త ఈజీగా మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోవచ్చును. స్నేహానికి బాగా విలువ ఇచ్చేవారనీ కూడా తెలుసుకోవచ్చును. ఇక్కడ నేను చెప్పే విషయాలు అందరికీ వర్తించకున్నా, ఎవరి ఆలోచనా ధోరణికి అవతలివారు తగినవారా? కాదా? అని ఎవరికీ వారు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

ఎవరికీ ఈ క్రింద చెప్పిన పాయింట్స్ అన్నీ ఉండకపోవచ్చును. కాని ఎక్కువలో ఎక్కువగా వచ్చినవారు / కనీసం సగమైనా వచ్చినవారు మీ నిజమైన స్నేహితులు అని అనుకోవచ్చును. అలా లేనప్పుడు వారు మీకు పరిచయస్థులే కాని స్నేహితులు కాలేరు - అని నా అభిప్రాయం. ఇందులో చెప్పే విషయాలు ఈ సీరీస్ లో అక్కడక్కడా చెప్పిన విషయాలు పునరుశ్చరణ చేయబడినవి. నిజానికి ఈ పోస్ట్ వ్రాయటం అన్నింటికన్నా కష్టమైనది. అయినా వ్రాస్తున్నాను మీకోసం.


1. కొందరి ప్రోఫైల్స్ చూడగానే వెంటనే ఆడ్ చేసుకోవాలీ అనిపిస్తుంది. అలా ఎందుకో బాగా గమనించండి. విశ్లేషించండి. అది ఆ ప్రొఫైల్ లో ఆర్భాటమా? అందమైన గ్రాఫిక్ డిజైనులా? అందమైన రూపమా?.. నిజానికి ఇవేవీ స్నేహానికి పరిచయం కోసమే - ఆ తరవాత స్నేహం నిలపటానికి పనికిరావు. ఈ ఆకర్షణలు తట్టుకొని మీ నూతన స్నేహితుడిని అంచనా వెయ్యటం నేర్చుకోండి. తమ అబౌట్ మీ లో తమ గురించి చెప్పేవారు మీ నిజమైన మిత్రులకుండే లక్షణాలలో ఒకటి.

2. మీ అబౌట్ మీ, మీ ప్రొఫైల్ అంతా చదివాక - అక్కడ మిమ్మల్ని అర్థం చేసుకొని, మీకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవారు. అంతేకాని అక్కడ ఏదీ చదవకుండా, గుడ్డిగా ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవారు కాదు.

3. మీ అభిప్రాయాలనీ, పద్ధతులనీ గౌరవించేవారు.

4. మిమ్మల్ని రోజూ కాకున్నా, నెలకి ఒకసారి అయినా పలకరించేవారు. అప్పటికీ మిమ్మల్ని పలకరించకుంటే మీకోసం కాసింత సమయం కేటాయించని వారై ఉంటారు. ఇలాంటివారిని వదులుకోవటం మంచిది.

5. వారు అసలుకే ఆన్ లైన్ లోకి రాకున్నంతగా బీజీ గా ఉంటే ఆ విషయం స్టేటస్ మెస్సేజ్ లో పెట్టేవారు.

6. మీ పుట్టినరోజులు మరచిపోకుండా, ఆరోజున మిమ్మల్ని తప్పకుండా పలకరించేవారు. ఆరోజు మీ స్క్రాప్ బుక్ లో ఏదో చిన్నగా కాకుండా పెద్దగా అభినందనలు చేసేవారు. ఉదాహరణకి : Hpy B'day అని కాకుండా Wish you MANY MANY HAPPY RETURNS of the DAY అని చెప్పేవారు.

7. మీ పుట్టినరోజున మిమ్మల్ని సంతోషపెట్టేవారు. అంటే ఆరోజు మిమ్మల్ని పనికిరాని స్క్రాపులతో చీకాకు పరచని వారు.

8. మీరు చెప్పిన పుట్టినరోజు అభినందనలకి - బదులుగా ధన్యవాదములు చెప్పేవారు.

9. ఒక్క పుట్టినరోజే అని కాకుండా మీరు ఏదైనా సాధించారని - మీ ప్రొఫైల్ లో చెబితే - మనసారా అభినందనలు చెప్పేవారు.

10. మీకు ఏదైనా బాధ / ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది తొలగించే ప్రయత్నం చేసేవారు.

11. మీకు ఏది ఇష్టమో తెలుసుకొని, అది మీకు ఎప్పుడు అది అవసరమో తెలుసుకొని, అప్పుడు మీకు సమయానుసారముగా అందించేవారు.

12. మీలోని లోపాలని ఎక్కడా ఓపెన్ గా చెప్పనివారు. ఇతరులతో వాటిని అస్సలు పంచుకొననివారు.

13. మీ గురించి / మీ లోపాలని ఎవరితో చెప్పక, మీతో మాత్రమే చెప్పటానికి ఆసక్తి చూపేవారు.

14. మీమీద ఎవరైనా చెడుగా వారి స్క్రాప్ బుక్ లో వ్రాస్తే - అందరికీ పబ్లిసిటీ చెయ్యటానికి అన్నట్లు - అలాగే ఉంచక, వెంటనే వాటిని తీసేసేవారు.

15. తగిన ఆధారాలు వారి వద్దలేకున్నా, ఉన్నా ఇతరుల మీద మాట్లాడటానికి అంతగా ఇష్టపడనివారు.

16. మీకూ, మీ స్నేహితునికి గొడవ జరిగితే - మధ్యవర్తిత్వం చేసి - సమస్య తొలగించి, మళ్ళీ ఒక్కటిగా కలిపేవారు.

17. మీరు చేసే / మీలో ఉన్న గొప్ప టాలెంట్ ని నలుగురి ముందూ ప్రశంసగా చెప్పేవారు.

18. తాను ఎంత బీజీగా ఉన్ననూ, మీరు మధ్యలో చాట్ కి పోయినా, ఏదైనా డౌట్ గురించి స్క్రాప్ పెట్టినా - ఆవెంటనే - స్క్రాప్ గానీ, చాట్ గానీ చేసి మీ డౌట్ తీర్చేసేవారు. (వైజాగ్ లో ఉండే నా మిత్రుడు ముగ్గురు అమ్మాయిలతో, చాటింగ్ లో బీజీగా ఉన్నా, తన పాస్ వర్డ్ ఇచ్చి మరీ తన అక్కౌంట్ చూపించి నా చిన్ని సందేహం తీర్చాడు. అతనికి కృతజ్ఞతలు)

19. తన ఫోన్ నెంబర్ అడిగితే వెంటనే ఇచ్చేవారు. (మీరు బాగా పరిచయం అయ్యాకనే!)

20. తన డిటైల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవారు. తన గురించి తన ప్రొఫైల్ లో దాపరికం లేకుండా చెప్పేవారు.

21. బాగా పరిచయం అయ్యాక ఏదైనా వారి గురించి అడిగితే - తడుముకోకుండా సమాధానం ఇచ్చేవారు. (ఒక మిత్రుడు నాకు బాగా పరిచయం. రెండుసార్లు మా దగ్గరికి వచ్చి కలిశాడు కూడా. తనకి పాటల సీడీ కావాలంటే - కొరియర్ చెయ్యటానికి అడ్రెస్ అడిగితే - రెండు రోజుల సమయం తీసుకొని చెప్పాడు. తను ఉంటున్న అడ్రెస్ ఆ ఇంటి ఓనర్ ని అడిగి చెబుతాను అన్నాడు. తన అడ్రెస్ అంతగా తెలీకుండా ఉంటున్నాడా?)

22. "తన వివరాలు తన ప్రొఫైల్ లో పెట్టేవారు." ఉండేది ఒకదగ్గర, ఊరిపేరు మరో ఊరు పెట్టుకోకుండా ఉండేవారు.

23. తమ మారీడ్ / వైవాహిక స్థితిని ఏమీ దాచుకోనివారు.

24. ప్రొఫైల్ డీపీ గా వారి ఫోటో ఉండి, వారి ఆల్బం లోన వారి ఫొటోస్ ఉంచేవారు.

25. వారి పేరు మీదే ఈమెయిల్ ID ఉన్నవారు.

26. మీరు ఏదైనా అనారోగ్యకారణాల వల్ల హాస్పిటల్ లో ఉంటే, ఆ విషయాన్ని ఎవరికీ షేర్ చెయ్యక తమలోనే దాచుకొని, ప్రైవేట్ గా మిమ్మల్ని మాత్రమే అడిగి, యోగక్షేమాలు తెలుసుకునేవారు.

27. మీరేదైనా మీ పర్సనల్స్ చెప్పుకుంటే, అది ఎక్కడా, ఎవ్వరితో షేర్ చెయ్యకుండా, వారిలోనే ఇంకిపోయేలా చేసుకునేవారు.

28. మీ బలహీనతల మీద ఏనాడూ అవకాశం తీసుకోకుండా ఉండేవారు.

29. మీలోని లోపాలని - అందరికీ తెలియచేయక, మీకు మాత్రమే చెప్పెడివారు.

30. మీలోని లోపాలని ప్రవైట్ గా మీకు తెలియచేసి, వాటిని ఎలా అధిగమించాలో, ఆ పద్ధతిని మీకు తెలియచేసేవారు.

31. మీరు మీ సైట్లో అందరి ముందూ చులకన అవుతున్నప్పుడు - ఎందుకు అలా అవుతున్నారో, ఎవరివల్ల అవుతున్నారో, ఎవరు ఎలా అనుకుంటున్నారో, అలా అవకుండా ఎలా ఉండాలో మీకు పర్సనల్ గా తెలియచేసేవారు.

32. మీరిద్దరి మ్యూచువల్ మీకు ఆడ్ రిక్వెస్ట్ పెడితే - వారి గురించి ఒపినీయన్ వారిని అడిగితే - క్లుప్తముగా వారి గురించి ఇంట్రో చెప్పేవారు.

33. ఎవరైనా మీమీద ఇమేజ్ డామేజి చేస్తుంటే, ముందే హెచ్చరించేవారు.

34. మీరు మీరుగా ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో - మీరు అడిగినప్పుడు మీ మీద సద్విమర్శలు, సూచనలూ చేసేవారు.

35. ఎవరో మీమీద కనీస ఆధారాలు లేకుండా ఏదో చెప్పారని నమ్మక, మీ పట్ల విశ్వాసం చూపి మీ నుండి దూరం కాకుండా ఉండేవారు.

36. మీ మిత్రుల - మీ మీద చాటుగా చేసే చర్యలు గమనించి, ముందుగా హెచ్చరించేవారు.

37. మీరేదైనా నలుగురి ముందూ, తప్పు చేస్తే - నలుగురిలో మాట్లాడక మీరోక్కరితో పర్సనల్ గా మాత్రమే మాట్లాడేవారు.

38. మీరు ఫొటోస్ పెడితే వాటికి బాగుంటే - ప్రోత్సాహకర కామెంట్స్ పెట్టేవారు.

39. మీరు వ్రాసే స్క్రాప్స్ కి - తాను ఆన్లైన్ కి వచ్చినప్పుడు - మరచిపోకుండా వాటన్నింటికీ రిప్లై ఇచ్చేవారు.

40. తమ స్క్రాపుల్లో, ప్రొఫైల్ లో, చేతల్లో నిజమైన స్నేహాన్ని చూపించే మిత్రులు.

41. ఉద్యోగం చేస్తూ, చేబదులు కోసం మిమ్మల్ని డబ్బులు అడిగేవారు కాకుండా ఉండేవారు. (ఒకరు ప్రభుత్యోగం చేస్తూ, ఒక మిత్రుని వద్ద తీసుకున్న నాలుగువేల రూపాయలని తీర్చటానికి, ఆన్ లైన్ లో - నన్ను చేబదులు అడిగారు. వారినే బాకీ తీర్చటానికి, బాగా తిప్పిన వారు - ఇక నాకు సరిగ్గా తిరిగి ఇస్తారని గ్యారంటీ ఏమిటీ?)

42. మీతో మాట్లాడినప్పుడు మీకు మర్యాద ఇస్తూ, మీతో సంభాషించేవారు. ఆఖరికి ఫోన్లో, ఎదురుగానో - మీతో వారు మాట్లాడుతున్నప్పుడు, అంతగా ఆందోళనగా కాకుండా, కూల్ గా, మృదు మధురముగా మీతో సంభాషించేవారు.

43. మీ వివరాలు ఎంతగా వారు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నప్పుడు, వారూ వారి వివరాలు వెంటనే చెప్పేవారు. (ఇలా కాకుండా మీవి మాత్రమే తెలుసుకొని, వారివి ఏమీ చెప్పనివారితో కాస్త దూరం మైంటైన్ చెయ్యటం అన్నివిధాలా శ్రేయస్కరం.)

44. ప్రశంసాపూర్వక విషయాలని వారి పేర్లు చెబుతూ, విమర్షల విషయములో - ఎంత అవతలివారి పేర్లు ఏమాత్రమూ చెప్పకుండా విషయం పైపైన చెప్పేవారు. ఇలాంటివారు రేపు మీమీద ఏదైనా చెప్పాలీ అనుకుంటే, మీ పేరు చెప్పకుండా విషయం చెబుతారు.

45. మీ పుట్టినరోజు ని మరిచినా, ఆతర్వాత నిజాయితీగా అలా ఎందుకు మరిచానూ అని కారణం చెప్పి, మీకు అభినందనలు తెలియచేసేవారు.

46. చిన్ని చిన్ని బహుమతులుగా - మీకు అంతులేని ఆనందం ఇచ్చేవారు. (నా మిత్రురాలికి ఫోటో కామెంట్స్ అంటే బాగా ఇష్టం. తన ఆనందం కోసం ఆమెకి ఫోటో కామెంట్స్ పెడుతాను. అవి ఎదుటివారికి అదోలా అనిపిస్తాయి. కాని మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. కాబట్టి ఏమీ ఫీల్ అవము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము.)

నిజానికి ఈ సైట్లలో మన వేవ్ లెంత్ కి తగినట్లుగా, మన అభిరుచులకి తగినట్లుగా, మనకి నచ్చేవారు దొరకడం చాలా చాలా కష్టం. అలా దొరకడం కూడా అదృష్టం ఉండాలి. నిజానికి చాలా స్నేహాలు టైం పాస్ అన్నట్లు ఉంటాయి. ప్రేమలో, పెళ్లిల్లో మాత్రమే మంచీచెడూ చూడాలి గాని, స్నేహాల్లో మంచీ, చెడు చూడాలా అని కొందరు అనుకుంటారు. కాని మంచి స్నేహం దొరికితే - జీవితం చాలా అందముగా కనిపిస్తుంది. అది నిజం. ఎవరి అభిప్రాయం వారిది. నేనైతే అలా ఆనందంగా, ఆహ్లాదముగా, ఉల్లాసముగా ఉంటున్నాను. అలా నేను ఈ మధ్య బాగా చవి చూస్తున్నాను.

అందరూ మంచివారే కావాలీ అనుకోని ఉంటూ ఉంటే, మనకి ఇక మిత్రులు దొరకకపోవచ్చునేమో!. అసలు మనమే అవతలివారికి మంచి మిత్రులం అని అనుకోవటం లేదేమో!.. మనకి పరిచయం అయిన మిత్రులందరూ మనకి దగ్గరి మిత్రులు అవకపోవచ్చును. కొద్దిమంది మాత్రమే మీ గుండె గది దాకా రావచ్చును. అందులో బహు కొద్దిమంది మాత్రం మీ హృదయం లో స్థానాన్ని పొంది ఉంటారు. అలాంటివారిని ఎన్నడూ వదులుకోకండి. అలాంటివారు మీకు మళ్ళీ దొరకడం చాలా కష్టం. అలా వదులుకున్నప్పుడు మీ ప్రొఫైల్ మీద ఇగ్నోర్ పెట్టారంటే - ఇక వారు ఇక జన్మలో కలవకపోవచ్చును.

నేటి సమాజం లో కాస్త ఎదగాలీ అంటే - పరిచయాలు చాలా అవసరం. కాని అవి స్వలాభం కోసం అని ఉండటం మంచిది కాదు. అలాంటి  స్నేహాలు మీకు అనవసరం. అలాని వారితో శత్రుత్వం పెంచుకోవటమూ సరికాదు.

4 comments:

vanajavanamali said...

చాలా విలువైన విషయాలు..రాజ్..గారు. పాయింట్ టు పాయింట్.. చాలా చక్కగా తెలియజేసారు. మీకు..చాలా ఓపిక,ఒద్దిక.. పదుగురి సౌఖ్యం కోరే దినమే పండుగ కాదా? అని సిరివెన్నెల లిరిక్.. పదుగురి.. మంచిని కాంక్షిస్తూ.. వ్రాసే మీ..పోస్ట్ లకి..ధన్యవాదములు..మీకు అభినందనలు.

Raj said...

మీకు ధన్యవాదములు వనజ గారూ! ఏదో నాకు తోచినంతలో, ఉడుతాభక్తిగా ఇలా చెబుతున్నాను.. అంతే!.

శశి కళ said...

chaala chakkani vishayaalu chat chesevaaru thappaka telusukovaali.
sasikala

Raj said...

ధన్యవాదములు శశికళ గారూ!..

Related Posts with Thumbnails