Monday, May 2, 2011

Nenu - naa Rakshasi

ఇది చాలా చిన్న పాయింట్ ఉన్న సినిమా.. ఆత్మహత్యలు అనే కారణం చుట్టూ తిరిగే చిన్ని కథాంశంతో తీసిన చిత్రం ఇది. నేనూ - నా రాక్షసి అనేది దగ్గుబాటి రాణా మరియు ఇలియానా ల మధ్య జరిగిన చిన్నపాటి లవ్ స్టోరీ..

ఇలియానా యూ ట్యూబ్ లో ఒక అక్కౌంట్ కలిగి ఉండి, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి వీడియోలనీ తన అక్కౌంట్ It is My Life Boss లో పెడుతుంటుంది. ఇలా వీడియోలని అప్లోడ్ చేస్తున్నది ఎవరో తెలుసుకోవటానికి, సుబ్బరాజు ప్రయత్నిస్తుంటాడు. రాణా టేలిస్కోపిక్ గన్ తో షార్ప్ షూటర్ ప్రొఫెషనల్ కిల్లర్ గా, అమ్మ ప్రాణాలు రక్షించుకోవటానికి - ఈ హత్యలు చేస్తూ ఉంటాడు.. ఎక్కువగా సినిమా అంతా ఆత్మహత్యల మీదే కేంద్రీకృతం అవుతుంది.

ఇందులో కథ గురించి చెప్పాలి అంటే - చాలా డ్రై సబ్జెక్ట్. మన తెలుగు ప్రేక్షకులకు అంతగా కొరకుడుపడని సినిమా ఇది. జనరల్ గా ఒక సినిమా ప్రేక్షకుడికి బాగా దగ్గర అవ్వాలీ అంటే - వారి సమస్యలని, ఆ చిత్రం లోని పాత్రల వల్ల తన ప్రాబ్లం ని అందులో చూసుకుంటారు. అక్కడ ఆ పాత్రధారులు ఆ సమస్యకి ఎలాంటి ముగింపు ఇవ్వబోతున్నారూ - అన్నదాని బట్టే ఆ సినిమా ఎంత ఆకట్టుకొంటుంది.. అనేది అన్ని ప్రేక్షకులూ సాధారణముగా చేసేదే!.. ఇలా ఆత్మహత్యలు చేసుకోబోయే వారికి ఈ నచ్చుతుందేమో మరి.. మిగతావారికి అంతగా రుచించని సినిమా ఇది.
మూడో రోజుకే సీట్ నంబర్స్ ఇవ్వాలా వద్దా అని థియేటర్స్ వారు ఆలోచిస్తున్నారూ అంటేనే - ఈ సినిమా విజయం గురించి మీరే ఒక అవగాహనకి రావచ్చును. నేను వెళ్ళిన సినిమా థియేటర్ లో అలాగే జరిగింది. అయినా సగం హాలు ఖాళీ.

ఈ సినిమా కథ ఎలాగూ డ్రై అని ముందే అనుకున్నాముగా.. దానికి తోడుగా కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన VFX మిక్సింగ్స్, రాణా ప్రతీకారం విషయం - ఫైట్స్, చేసింగ్స్ కూడా ఇందులోకి తీసుకొచ్చారు. పాతకాలం నాటి ప్రతీకారం వెర్షన్ లా రాణా పార్ట్ ఉంది. ఇక అలీ, ముమైత్ ఖాన్ వెర్షన్ చాలా వల్గర్ గా - ఫ్యామిలీతో వెళ్లినవారికి - కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సుబ్బరాజు కూతురు అంతగా క్యాన్సర్ ఉన్నా మొక్కవోని ధైర్యం తో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ అమ్మాయితో అంతగా మాలిమి అయిన రాణా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.? అక్కడ కాస్త ఇన్స్పిరేషన్ గా తీస్తే - మిగతా సినిమా తేలిపోతుందని - ఆ పాత్రని కుదించేశారు. నిజమే అనిపిస్తుంది అలాని. మిగతా పాత్రల వెర్షన్స్ చెప్పుకోవటానికి ఏమీ లేదు..
 
రాణా తన పోర్షన్ వరకూ బాగా చేశారు. రాణా తన పోర్షన్ వరకూ బాగా చేశారు. ఇలియానా కి చాల రోజులకిబాగా నటించే అవకాశం వచ్చింది. ఎక్కడా నవ్వే లేని మొఖశైలి  తో నటించటం నిజముగా సాహాసమే!. తన నటనని నిరూపించుకోవటానికి ఈ పాత్ర ఒక అవకాశమే కాని, ఆ అవకాశం ని రాణా పాత్ర ఉన్న స్కోప్ వల్ల దెబ్బ తినేసింది. రాణా పోర్షన్ కి ఉన్న స్పీడు కీ, ఈ ఇలియానా పాత్ర పోర్షన్ కి ఉన్న స్లో నేస్ కీ సింక్ అవక సగటు ప్రేక్షకుడు కాస్త బోర్ గా ఫీలవుతాడు. ఎలా ఉంటుందీ అంటే - మంచి బీట్ సాంగ్ విన్నాక విషాదకర పాట వింటే ఎలా ఉంటుందో అలాని అనిపిస్తుంది. ఇక్కడే కథ దెబ్బ తిందేమో అనిపిస్తుంది.
 
అభిమన్యు సింగ్ నటనలో విశ్వ రూపం చూపించాడు. సుబ్బరాజు ఆ  CI పాత్రలో ఎక్కువగా స్కోప్ లేనందున - తన నటనా శైలిని చూపించలేకపోయాడు. కెమరా, ఎడిటింగ్, VFX  పనితనమూ బాగున్నాయి. కాని వాటి వల్లే సినిమా బాగోదుగా. సంగీతం గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. పాటలు అంతగా క్యాచీగా లేవు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం వర్క్ కూడా అంతంత మాత్రమె!.. ఆడియోగ్రఫీ వర్క్ ఎవరు చేశారో గాని చాలా బాగుంది. ఇలా టైటిల్స్ కనిపించని స్టైల్లో టైటిల్స్ వేస్తే, ఎవరు ఏది చేశారో తెలుసుకోవటం కష్టమే!. 
 
ఏదో ఉందని అనుకొని పోక, మామూలుగా ఉందని అనుకొని వేల్లినవారికి అంతగా నిరాశ కలిగించని సినిమా.. ఇది.

1 comment:

Anonymous said...

Meeru cheppinadaanitho yekibhavisthaanu kaani music matram kaadu..songs chaala baaunnay..and backgrund score super ga uni..idi undatamvalle kaasepu kurchogaligaaru:-)

Related Posts with Thumbnails