Wednesday, May 11, 2011

Kallu kalloo plassu - 100% love

చిత్రం : 100% లవ్ (2011)
రచన : చంద్రబోస్ 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అద్నాన్ సమీ, బృందం.

*********************

పల్లవి :

కళ్ళు కళ్ళూ ప్లస్సూ.. వాళ్ళూ వీళ్ళూ మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్టూ - ఇంఫ్యాచుయేషన్ // కళ్ళు కళ్ళూ //

అనుపల్లవి :
ఎడమ భుజము కుడి భుజము కలిసి - ఇక కుదిరే క్రొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది - ఎంతో సహజం.
సరలరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం // కళ్ళు కళ్ళూ //
ఇంఫ్యాచుయేషన్.. ఇంఫ్యాచుయేషన్..

చరణం 1:

దూరాలకీ మీటర్లంట - భారాలకీ కేజీలంటా
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటి గ్రేడ్ సరిపోదంట - ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే - తంటా
లేత లేత ప్రాయాలలోన - అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు యే సైన్స్ కైనా.. ఓ
పైకి విసిరినది క్రింద పడును - అని తెలిపే గ్రావిటేషన్
పైన క్రింద తలక్రిందులవుతాది - ఇంఫ్యాచుయేషన్  // కళ్ళు కళ్ళూ //

చరణం 2:

సౌత్ పోల్ అబ్బాయంటా - నార్త్ పోల్ అమ్మాయంటా
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట - ఋణావేశం అమ్మాయంటా
కలిస్తే కరెంటే పుట్టేనంటా
ప్రతి స్పర్శ ప్రశ్నేనంటా - మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంటా.. ఓ
పుస్తకాల పురుగులు రెండంట - ఈడుకోచ్చేనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంటా.. // కళ్ళు కళ్ళూ //

1 comment:

vanajavanamali said...

పాట పరిచయంకి.ధన్యవాదములు.చంద్ర బోస్ గారి పాటంటే.. ఇలా కూడా ఉంటుంది.. అని అందరికి తెలుసు.. యువతరానికి నచ్చేటట్లు.. పర భాష తో.. పద ప్రయోగాలు.. కెమిస్ట్రీ.. గణితం ..అన్నీ.. మిక్స్.. పాటకి పట్టం కట్టక ఏం చేస్తారు చెప్పండీ!.. కానీ.. ఈ రకమైన సాహిత్యం ఏ విధంగా నిలుస్తుందో.. కాలమే చెప్పాలి. అభిరుచి మారిపోతుందా? కావాలని మారుస్తున్నారా????????

Related Posts with Thumbnails