Wednesday, February 23, 2011

How to set Blog Archive - Post Headlines.

Sudha said...
పైన ఉన్న సుధ నేను కాదండీ.
మీరిచ్చిన సమాచారం చాలా ఉపయోగపడుతుంది. శ్రమ తీసుకొని చెప్పినందుకు ధన్యవాదాలు.
నాకు ఒక సహాయం కావాలి. బ్లాగ్ లో మన టపాలు వాటికి మనం పెట్టిన పేర్లతో కనిపించేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పగలరా దయచేసి...blog archive ని add చేసాక ఏం చేస్తే మన టపాలు వాటి పేర్లతో కనిపిస్తాయో అర్థం కాలేదు. వాటిని ప్రచురించిన తేదీలు మాత్రమే కనిపిస్తున్నాయి.
వీలయితే దీనిగురించి కూడా ఓ టపా....
Wednesday, February 23, 2011 12:11:00 AM ఈ అభ్యర్ధన కి సమాధానం ఇప్పుడు మీకు టపా రూపములో అందిస్తున్నాను.. 

ఇది నిజానికి చాలా చిన్న సమస్య.. ఓకే.. బ్లాగర్ యొక్క ఆర్కివ్ లో మనం పోస్ట్ చేసిన టపాల పేర్లు కాకుండా ఆ టపాలను పోస్ట్ చేసిన తేదీలు మాత్రమే కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే కాస్త చిక్కే!.. ఈ సమస్యని తొలగించుకోవటానికి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలో చూద్దాం.

ముందుగా మీరు హోం పేజి ఓపెన్ చెయ్యండి. అక్కడ కనిపిస్తున్న టూల్స్ లలో Design ని 1 నొక్కండి. నొక్కారా..?


ఇప్పుడు ఈ క్రింది పేజీలాగ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు అందులో 2 వద్ద చూపినట్లు - Blog Archive వద్ద నున్న Edit ని నొక్కండి. 


ఇప్పుడు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెయ్యల్సింది చాలా సింపుల్. 
3 వద్ద చూపినట్లుగా Hierarchy వద్ద ఓకే చెయ్యండి. 
అలాగే 4 వద్ద చూపినట్లు, Options వద్ద ఉన్న Show post titles అనే వద్ద ఉన్న గదిలో టిక్ (మౌస్ తో క్లిక్) చెయ్యండి. బహుశా మీరు ఇదే చేసి ఉండకపోవచ్చును. 
ఆతర్వాత 5 వద్ద ఉన్న SAVE ని నొక్కండి. అంతే.. మీ బ్లాగ్ ఆర్కివ్ లో తేదీలు కాకుండా టపాల శీర్షికలు వస్తాయి.



ఇంతేనండీ..

Tuesday, February 22, 2011

Social NW Sites - 18 - వీడియోలు.

నేను వ్రాసేవాటిల్లో ఇదే అతి చిన్న టపా :

1. వీడియోలు - నచ్చిన వీడియోలని ప్రోఫైల్స్ లలో ఆడ్ చేసుకుంటారు. అలా ఎన్నో (500) వీడియోలని ఆడ్ చేసుకోవచ్చును.. ఇంతకు ముందు ఈ లిమిట్ 250 వీడియోలు ఉండేది.

2. మీరు ఏదైనా వీడియో ఆడ్ చేసుకోవాలి అంటే ఆ వీడియో కి చెందిన ఫైల్ నేరుగా ఎక్కించరాదు. యు ట్యూబ్ లోనో, మరే ఇతర సైటులోని వీడియో లింక్ ఆ వీడియో అప్లికేషన్ లో పేస్ట్ చేసుకుంటే చాలు. వీడియో వచ్చేసుంది.

3. ఇది కష్టముగా ఉంటే - మీకు ఆడ్ అయిన ఫ్రెండ్స్ వారి వీడియోలు చూస్తే - అవి మీకు నచ్చితే, అక్కడ Add to my videos అని ఉంటుంది. అక్కడ నొక్కితే, మీ ప్రొఫైల్ లోకి ఆటోమేటిక్ గా ఆ వీడియో ఆడ్ అయిపోతుంది. ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదు.

4. మీకు వీడియోలు ఏవైనా బాగా నచ్చితే ఆ వీడియోలు ఆడ్ చేసుకోండి.

5. మీ ఫ్రెండ్స్ లలో మీకు నచ్చిన వీడియో లేకుంటే యూ ట్యూబ్ లో  http://www.youtube.com/ వెదకండి. దొరికాక ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మీ ప్రొఫైల్ లో వీడియో ఆడ్ అయిపోయినట్లే.

6. లేదా మీరే ఏదైనా వీడియో అక్కడ కావాలీ అంటే - మొబైల్ కేమరాతో, డిజిటల్ కేమరాతో వీడియో తీసి ఒక వీడియోలా తయారు చెయ్యండి. యు ట్యూబ్ సైట్లోకి వెళ్లి మీ అక్కౌంట్ లో సైన్ ఇన్ అయ్యి, ఆ వీడియో అప్లోడ్ చెయ్యండి. అప్పుడు మీకు ఆ వీడియో లింక్ ఒకటి వస్తుంది. దాన్ని మీ ఆల్బంలో లింక్ పేస్ట్ చేసుకుంటే - ఆ వీడియో వచ్చేస్తుంది.

7. యు ట్యూబ్ లో ఎన్నెన్నో విషయాల మీద వీడియోలు ఉన్నాయి. వాటిని మీప్రోఫిల్ లో ఉంచుకోవచ్చును. ఇప్పుడు ఆ యు ట్యూబ్ లో ఒక నిమిషానికి ముప్ఫై ఆరు గంటల నిడివి గల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఇక మీకు అన్ని వీడియోలూ అందులో దొరుకుతాయి.

8. ఇప్పుడు అలా పెట్టుకున్న వీడియోని మీ మిత్రులు, మీరూ కావలసినప్పుడల్లా చూసుకోవచ్చును.

9. ఆ వీడియోలు ఎవరూ చూడకుండా కూడా తాళం వేసుకోవచ్చును.

10. కొంతమంది పర్సనల్ వీడియోస్ ని ఇలా ప్రొఫైల్ లో పెట్టుకొని తాళం వేసుకొని, వారు మాత్రమే ఆనందించేవారు కూడా ఉన్నారు.

11. వీడియోలని బట్టి అతడు మీకు ఎంత దగ్గరి మిత్రుడు అవబోతాడో కూడా కనుక్కోవచ్చును. ఇదెలా అని మీరు అనుకున్నా నిజం ఇది. అతని లిస్టు లోని వీడియోలు ఏమిటో చూడండి. మీకు నచ్చినవి మరీ ఎక్కువగా ఉంటే - ఇద్దరి అభిరుచులూ బాగా కలసినట్లే. ఈ సంఖ్య / శాతం ఎంత పెరుగుతూ ఉంటే అంత బాగా స్నేహితులయ్యే అవకాశం ఉంది. అలా అతను మీ స్నేహితుడయ్యే (+) ప్లస్ పాయింట్స్ చూడవచ్చును.

బ్లాగ్ కి ఫాలోవర్ గా ఆడ్ & రిమూవ్ అవడం ఎలా?

vanajavanamali said...
Raj garoo.. chaalaa viluvaina vishayaalu thelusukuntunnam. thankyou very much.. nenu.. oka blog ki.. follower ga.. maaraanu.. adhi suddenga.. porabaatugaa jarigipoyindhi. nenu withdraw yelaa chesukovalo theliyadam ledhu..cheppamdi..plz!!!!!!!!!!!!


Saturday, February 19, 2011 10:46:00 PM న ఒక బ్లాగ్ వీక్షకురాలు అడిగిన సహాయానికి ఇప్పుడు మీకు చెబుతాను.

ఒక బ్లాగ్ మనకి నచ్చితే కుడివైపున క్రింద ఉన్న FALLOW  దగ్గర ఫాలోయర్ గా ఉంటాము.. అలా చెయ్యటం ఎందుకంటే ఆ బ్లాగ్ లోని విషయం మనకి నచ్చటం వల్ల మరియు అందులో అప్డేట్స్ ఏమైనా జరిగితే మనకి వెంటనే మన హోమ్ పేజిలోనే తెలియటానికి ఇలా ఫాలోవర్ గా ఆడ్ అవుతుంటాము. ఓకే.

ముందుగా ఇలా ఫాలోవార్ గా ఎలా ఆడ్ అవుతామో చూద్దాం.. :

ఆయా బ్లాగ్ లో ఎడమ వైపున పైన స్టేటస్ బార్ లో కనిపించే FALLOW మీద క్లిక్ చెయ్యాలి.  ఈ క్రింది ఫోటోలో ఎర్రని డబ్బాలో కనిపిస్తున్న 1 వద్ద నొక్కండి.


ఇప్పుడు ఆ ఫాలో మీద నొక్కగానే ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ 2 వద్ద కనిపిస్తున్న Fallow publicly ని నొక్కండి. 3 వద్ద Fallow ని నొక్కండి. 


ఇప్పుడు మీరు ఆ బ్లాగ్ ని ఫాలో అవుతున్నట్లు అని ఒక బాక్స్ వస్తుంది. దాని క్రింద ఉన్న 4 వద్ద ఉన్న close ని నొక్కండి. 


ఇప్పుడు మీరు ఆ బ్లాగ్ కి ఫాలోయర్ గా మారిపోయారు అన్నమాట. ఇప్పుడు మీరు వారి బ్లాగ్ లో ఫాలోవర్ లిస్టు లో కనిపిస్తారు. 


ఇప్పుడు మీకు అలా ఫాలోయర్ గా ఉండటం ఇష్టం లేదు అనుకుందాము.. ఏమి చెయ్యాలో చూద్దాం.

ఇప్పుడు మీరు ఏ బ్లాగ్ కి ఫాలోవర్ గా ఉండటానికి ఇష్టం లేదో ఆ బ్లాగ్ పేజీని ఓపెన్ చెయ్యండి. 1 లో చూపినట్లుగా మళ్ళీ ఆ Fallow ని నొక్కండి.


అప్పుడు ఇలా క్రింది దానిలా ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న 5 దగ్గర Stop following ని నొక్కండి.


నొక్కారా?.. ఓకే.. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.. అంతే!. మీరు ఆ బ్లాగ్ కి ఫాలోయర్ గా లేరు అన్నమాట. 


Monday, February 21, 2011

Social NW Sites - 17 - ఫొటో కామెంట్స్.

ఫోటో కామెంట్స్ - అంటే మనం పెట్టే ఫొటోస్ కి వచ్చే కామెంట్స్ అన్నమాట!. మన మిత్రులు వ్రాసే ఈ కామెంట్స్ వల్ల కాస్త సంతోషముగా ఉంటాము. నిజం చెప్పాలంటే ఈ ఫోటో కామెంట్స్ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంటాయి. అసలు ఈ ఫోటో కామెంట్స్ భలే కిక్కు ఇస్తుంటాయి కూడా.. అలాంటివి మరెన్నో రావాలని ఎదురు చూసేలా ఉంటాయి అంటే అతియోశక్తి కాదు. మీకు అలా మంచి కామెంట్స్ ఫ్రెండ్స్ ఉంటే మీరు మరీ మరీ అదృష్టవంతులు.

మీకు కామెంట్స్ వ్రాసే అభిరుచి మీకు లేకున్నా - అలాంటివి ఎప్పుడూ వ్రాయకున్నా, మీ స్నేహితులని సంతోష పెట్టే చిన్న పనిని చెయ్యటములో తప్పేమీ లేదు. మీరు ముందుగా చేస్తేనే కదా! మీకు ఎవరైనా వ్రాసేది. మీరు కయ్యాలని కవ్వించే, వివాదాస్పద కామెంట్స్ పెట్టకండి. ఎవరైనా అలా వ్రాసి ఉంటే వాటికి పొడిగింపుగా మీరు ఏమీ వ్రాయకండి. ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఇబ్బందిని ఒకటి ఇక్కడ మీకు చెబుతాను.

నేను ఒక అమ్మాయి తీసిన గుడ్డు ఫోటో కి ఒక కామెంట్ పెట్టాను. మా మధ్య ఉన్న చనువుతో అలా పెట్టాను. ఇంకో అబ్బాయి దానికి కంటిన్యూ కామెంట్ వ్రాశాడు. మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినట్లు.. అనే సామెత లాగ ఫీలయ్యిన ఆ అమ్మాయి అతన్ని క్లాస్ పీకక, నన్ను క్లాస్ పీకింది. నేను మొదట్లో కాస్త జోక్ చేస్తున్నదేమో అనుకున్నాను. కాని సీరియస్ అని చెప్పారు ఆ అమ్మాయి. నిజముగా ఇష్టం లేదా.. అని అడిగాను. ఆ అమ్మాయి కోపములో నాకు మీ స్క్రాప్స్, కామెంట్స్ ఏవీ నచ్చటం లేదు.. ఇక వ్రాయకండి.. అని అన్నారు (కోపములో). పక్కానా? ష్యూరా?.. అడిగాను.. నిజమే అన్నారు.. ఇక ఆ రాత్రి రాత్రే నేను వ్రాసిన వందకి పైగా ఉన్న కామెంట్స్, స్క్రాప్స్ అన్నీ తీసేశాను. ఆ తరవాత ఆ అమ్మాయికి ఏమీ స్క్రాప్స్ కూడా పెట్టడం లేదు. జస్ట్ బాగున్నారా? అని అనడం తప్పించి. ఈ మధ్యనే కావాలని కొన్ని ఫోటో కామెంట్స్ పెట్టాను. ఇక పెట్టడం మానుకోవాలి. ఇక్కడ నాది పొరబాటు లేదు అనడం లేదు. ఉంది. కామెంట్ పెట్టినదానికి మామూలుగా ఉన్న ఆమె అతని కామెంట్ వల్ల నన్ను అని, దూరం చేసుకోవటం బాధాకరం. అతడినే అనొచ్చుగా. మా మధ్య చనువు బాగా ఉంది అనుకున్నాను.. నిజానికి ఉంది కూడా. వేరొకరి జోక్యం వల్ల ఇలా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఎవరికీ వారు మాది సరియైనది అనుకుంటూ - స్నేహాలని పాడుచేసుకుంటుంటారు.

ఈ క్రింది ఫోటో చూడండి. ఒక మిత్రుడు పెట్టుకున్నాడు ఈ ఫోటోని. ఈ ఫోటోలోని ఏనుగు ని చూడండి.

ఎంత రియల్ గా ఉందో.. దానికి ట్యాగ్ లేదు.. ఇది రియల్ గా బాగుంది ఎక్కడా? అని అడిగాను. నేను వ్రాసిన కామెంట్ కి జవాబూ లేదు. ఇలా అడిగి కూడా చాలా రోజులయ్యింది కూడా.. ఇది వ్రాస్తున్నప్పుడూ కూడా చూశాను. ఇంకా రిప్లై రాయలేదు. ఆ తరవాత అతనికి ఫోటో షాప్ వర్క్ వచ్చని తెలుసుకున్నాను. అది అందులోనే చేశాడు కావచ్చు.. అందుకే రిప్లై ఇవ్వలేదేమో అని అనుకున్నాను.. లేదా మనం అక్కడికి వెళ్ళి అలా ఫోటో దిగేస్తాం, అలా ఆ క్రెడిట్ మనం కొట్టేస్తాం అని కాబోలు.. కాని ఆ ఏనుగు కాళ్ళ దగ్గర చూస్తే అది రియల్ ఫోటో అనేలా ఉంది.  ఇదంతా చెప్పటం ఎందుకూ అంటే -కామెంట్స్ లో ఇది ఎక్కడా? అని అడిగితే అది ఎక్కడో అని చెప్పాలి అని అంతే!. అలా వచ్చిన కామెంట్స్ కి రిప్లై ఇవ్వాలి అని చెబుతున్నాను. అంతే!. తెలీక అందరూ తప్పులు చేస్తారు.. (తాజాకలము : ఒక సందర్శకులు మహేష్ ముట్నూరు చెప్పారు - ఆ ఏనుగు బొమ్మ వైజాగ్ లోని పామ్ బీచ్ స్టార్ హోటల్ వద్ద అని. వారికి కృతజ్ఞతలు. )

కామెంట్స్ లో అవతలి వారిని గెలికేలా / వ్యంగ్యముగా వ్రాయటం అంత మంచిది కూడా కాదు.. మనం ఒకరిని గెలికామే అనుకోండి - అతను మనల్ని గెలికితే తట్టుకోవాలి మరియు పడాల్సి ఉంటుంది కూడా.. అలా అయితేనే వ్యంగ్యముగా కామెంట్స్ పెట్టొచ్చు. అవతలివారు టాలెంట్ ఉన్న పర్సన్ అయితే - వారు ఇచ్చే రిప్లైస్ కి తట్టుకోవటం కష్టం. ఇద్దరు ముగ్గురు ఇలా నన్ను కామెంట్స్ తో గెలికారు. నా రిప్లైస్ తో బాగానే బదులిచ్చాను. ఎందుకో అలా ఇవ్వటం నాకూ బాగా అనిపించలేదు. ఈ జనవరి ఒకటి నుండి అలాంటివి వాతల్లాగా ఉండే రిప్లైస్ కామెంట్స్ ఇవ్వటం బాగా తగ్గించేశాను. కామెంట్ కి కామెంట్ తోనూ, వ్యంగ్యానికి వ్యంగ్యముతోనూ, కామెడీకి, కామెడీగా రిప్లైస్ ఇవ్వటం రావాలి. అలా అయితే బాగుంటుంది. ఒకవేళ అర్థం కాకుంటే అక్కడే అడగాలి - మీరు అంటున్నది నాకు అర్థం కాలేదు అనీ!.

మనం ఒక్కోసారి మనకి మనం గొప్పగా ఊహించేసుకుంటాము. ఒక్కోసారి మనకు మనం చేసే తప్పులు ఏమిటో ఎదుటివారు చెప్పేదాకా అర్థం కావు కూడా!. నిజానికి నాకూ తెలీదు. చెప్పాక నేనూ నా పద్ధతి మార్చుకున్నాను. మనం అన్నింట్లో పెద్ద నైపుణ్యం కలవారం, అన్నీ తెలుసు అనుకుంటాము కాని ఎదుటి వారు చెప్పేదాకా కొన్ని తెలీకపోవచ్చును. కొన్ని విషయాలు  వేరేవారు చెబితేనే గాని తెలుసుకోలేం. అలా చెప్పినప్పుడు ఆవేశపడక అందులోని సత్యం ఎంతో నిజాయితీ గా చూసుకోవాలి. నా కంటే చిన్నవాడు చెప్పాడని ఫీలవలేదు. నిజమే చెప్పాడు కదా అని అనుకున్నాను. అతనిని కోపగించుకొని, అతన్ని రిమూవ్ చెయ్యటం వంటి పనులు అసలు చెయ్యలేదు. నేను అతని ఫొటోస్ కి కామెంట్స్ చేశాను. "ఇలా మీరు కామెంట్స్ వ్రాస్తున్నారు కదా.. నాకేమీ ఇబ్బంది లేదండీ. కాని మీరూ మీ ఫొటోస్ పెడితే కామెంట్స్ వ్రాసే అర్హత మీకు ఉందని అనుకుంటాను. అలా చెయ్యటం సంస్కారం అనుకుంటాను.." అని. నిజమే కదా.. అప్పటి నుండీ నేనూ మొదలెట్టాను. చాలామంది వారివి పెట్టరు కాని ఎదుటివారిని అనడం మాత్రం చేస్తుంటారు. అలాంటివారు ఇది తెలిశాక మారాలి. మనం అవతలివారి ఫొటోస్ కి కామెంట్స్ పెట్టడం కాదు. వారికీ అలాంటి అవకాశం ఇవ్వగలగాలి. అప్పుడే సరియైన స్నేహాన్ని మనం ఇస్తున్నట్లు లెక్క. నిజమే కదూ.. మనకి తెలీని విషయాలు ఎవరు చెప్పినా వినాలి. బాగుంటే ఆచరించాలి. దానివల్ల మనకే బాగుంటుంది. లాభం కూడానూ..

కొన్ని  సూచనలు :

1. రాజకీయాలు, సినీ తారలు, వ్యక్తులూ, రీసెంట్ జెనరల్ టాపిక్స్ సంబందించిన ఫొటోస్ కి కామెంట్స్ పెట్టకపోవటమే చాలా మంచి పని.

2. అవతలి వారికీ, మనకీ మధ్య ఉన్న స్నేహం ఎలా ఉందో చూసుకొని ఆ రేంజ్ ని దాటి కామెంట్స్ పెట్టడం అంతగా బాగోదు.

3. అవతలి వారు కాస్త సరదా వ్యక్తులే అయితే పర్వాలేదు కాని లేకుంటే హుందా కామెంట్స్ చెయ్యటమే మంచిది.

4. వేరేవారు వ్రాసిన కామెంట్స్ ని విమర్శించడమో, దానికి కొనసాగింపు వాఖ్యలు అంత మంచి పద్దతికాదు. వారిద్దరి మధ్య అవగాహన యే మేరకు ఉందో మనకు తెలీదు. మధ్యలోకి వెళ్ళితే - మనం వారికి వారిద్దరికీ దూరం కావచ్చును. లేదా వారిద్దరూ విడిపోవచ్చును. అలా విడదీసిన పాపం మనకి తగలొచ్చు.

5. మొదట్లో మనము కాస్త అనుభవం వచ్చేసేవరకూ - కామెంట్స్ సరిగా పెట్టడం రాకపోవచ్చును. ఎదురు దెబ్బలు తగులుతాయి. అంత మాత్రాన మానుకోవటం సరికాదు. ఎక్కడ పొరబాట్లు చేశామో తెలుసుకొని, సరిదిద్దుకోవటం ఉత్తములు చేసే పద్ధతి.

6. మనకి కామెంట్స్ ఎలా చెయ్యాలో తెలీనప్పుడు, ఇతరులవి ఫోటో కామెంట్స్ చూడటం వల్ల ఎలా పెట్టాలో తెలుస్తుంటాయి. అలా అనుకొని అలాగే పెట్టడడం కూడా సరికాదు.

7. ఫోటో చూడగానే మన ఊహకి వచ్చినది వెంటనే వ్రాయటం పద్ధతి కాదు. కొద్దిగా ఆలోచించాలి. అవతలివారు ఎలా ఫీలవుతారూ అనీ.

8. మనం వ్రాసేది తెలుగు లో అయినా, రోమన్ తెలుగులో అయినా, లేక ఇంగ్లీష్ కానీ, మరే భాషలో వ్రాసినా అక్షర దోషాలు లేకుండా వ్రాయగలగాలి. అప్పుడే మన భావాన్ని సరిగ్గా చెప్పగలుగుతాము. అలా వ్రాస్తేనే చూడటానికి, చదవటానికి చాలా బాగుంటుంది.

9. మనం వ్రాసే కామెంట్ భావజాలం సరళముగా, హుందాగా ఉండాలి. చీపుగా, అసహ్యముగా ఉండొద్దు. అవతలివారు ఎంత అసహ్యముగా వ్రాసినా, హుందాగానే వ్రాయాలి. అలాంటివాటికి అలా వ్రాస్తేనే ఆ కామెంట్స్ చదివినవారి / చూసినవారి దృష్టిలో ఉన్నతముగా ఉంటారు. అలా కాక మీరూ అవతలి వారిలా అసహ్యకరమైన భాషని వాడితే, మీ బ్రాండింగ్ వాల్యూ తగ్గిపోవచ్చును.

10. మరీ అభ్యంతరముగా ఉంటే అలా వ్రాసినవారికి చాట్ లోనో, ప్రైవేట్ గానో ఒక మాట చెప్పండి. వారే తీసేస్తారు. ఈ మాత్రం దానికి మీరు మధనపడటం వృధా.

11. ఎవరి ఫొటోస్ వారివి ఇష్టం. వారు ఎలాంటి ఫొటోస్ పెట్టుకొనీ. అవి వారి యొక్క నైజాన్ని తెలియచేస్తుంటాయి. అంత అభ్యంతరముగా ఉంటే చాట్ లో చెప్పండి. లేదా మెయిల్ లో, లేదా ప్రైవేట్ గా స్క్రాప్ పెట్టండి.

12. మంచి ఫొటోస్ కలెక్షన్ పెడితే వీక్షకులూ బాగా ఉంటారు. కామెంట్స్ కూడా బాగుంటాయి.

13. సెక్సీ ఫొటోస్ ని, ఆడవారిని అసహ్య భంగిమల్లో ఉండే ఫొటోస్ పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఒకవేళ పెట్టదలచుకుంటే మీకు మాత్రమే కనిపించేలా పెట్టుకోవటం మంచి పద్ధతి. అందరికీ అవి నచ్చవు. ఉన్న మిత్రులూ దూరం కావచ్చును. ఇలా ఒక అబ్బాయి మూడు నాలుగు ఫొటోస్ పెట్టాడు. నేనూ, ఇంకో నా స్నేహితురాలు అతనికి ఆడ్ అయినప్పుడు అవి లేవు. క్రొత్తగా అప్లోడ్ చేశాడు. అవి నచ్చక  మేమిద్దరమూ అతనికి దూరముగా వెళ్ళిపోవాల్సివచ్చింది. దానికి అతను పెద్దగా గొడవ చేశాడు. మధ్యలో ఇంకొకరి వత్తాసు. ఆ వయసులో అలాంటివే పెట్టుకుంటారు కదా అని. పెట్టుకోవచ్చును.. కాదనం. అవేవో పర్సనల్ గా పెట్టుకుంటే ఇంకా బాగుండేది కదా..

14. వాఖ్యలు మరీ విపరీతముగా చెయ్యకండి. వివాదాల జోలికి అసలు వెళ్ళకండి.

15. ఫొటోస్ కి ట్యాగ్స్ తప్పకుండా వ్రాయండి. అలా వ్రాస్తేనే ఆ ఫోటో లోని అర్థం ఎదుటివారికి సులభముగా అర్థం అవుతుంది.

16. కామెంట్ ని ఎలా వ్రాయాలంటే - ఒక చిన్న కిటుకు చెబుతాను. ఒక ఫోటోని చూడగానే మదిలో కలిగిన భావాన్ని, కామెంట్ రూపములోకి మార్చండి. అలా దాన్ని వెంటనే వ్రాయకుండా - అది వ్రాస్తే ఎదుటివారు ఎలా రిసీవ్ చేసుకుంటాడో, అది చూసి అతని మిత్రులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకసారి ఊహించండి. ఇది చాలా నిజాయితీగా చెయ్యండి. అలా చేస్తే ఆ కామెంట్ పెట్టాలో, వద్దో తెలుస్తుంది. అలాంటి కామెంట్ అక్కడ వేరేవారు పెడితే, మీరు ఇంకో కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. అలా ఎవరూ పెట్టకుంటే అది అక్కడ టైప్ చేశాక మళ్ళీ ఒకసారి అవతలి వ్యక్తీ, అతని మిత్రులూ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆలోచించండి. అలా చూసేవారికీ బాగా అనిపించాలి. అప్పుడు బాగా అనిపిస్తే పోస్ట్ చెయ్యండి.

17. అలా కామెంట్ ని పోస్ట్ చెయ్యటమే కాదు.. కొద్దిసేపటి తరవాత లేదా మూడు నాలుగు రోజుల వరకూ ఆ ఫోటో కామెంట్ వైపు చూడండి. ఎవరేమైనా దానికి వ్రాశారో కంటిన్యూగా వ్రాశారో, లేక ఏదైనా రిప్లై వచ్చిందా చూడండి.

18. కామెంట్స్ పెట్టినవారికి కృతజ్ఞతలు చెప్పటం మరచిపోకండి. మన దైనందిక జీవనములో ఎవరైనా కలిస్తే చిన్న విషయాలైన  - నమస్తే, మళ్ళీ కలుద్దాం, బై అని ఎలా చెప్పుకుంటామో అలాగే ఇక్కడ చెప్పటం ధర్మం అని నాకు అనిపిస్తుంది. దీనివలన రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలియచెయ్యటం, రెండోది వారి కామెంట్ ని మనం చూసాము అని తెలియజేయటానికి. ఇలా కృతజ్ఞతలు చెప్పటం మన ఆంధ్రుల్లో చాలా తక్కువ. చెబితే సొమ్మేం పోతుందో అని అనుకుంటారు.

19. ఒక కామెంట్ పెట్టడానికి సిద్దం అయ్యి, చూస్తే అప్పటికే అక్కడ ఇతరులు కామెంట్ పెట్టారు అనుకుందాం. మీరు పెట్టే కామెంట్ - వాటికి భిన్నముగా ఉంటే అసలు పెట్టకండి. అసలు ఆ ఫోటోనే చూడలేదని అనుకోండి. ఒకవేళ మీరు అలా పెట్టారు అనుకుందాం. అది మీ భావ వ్యక్తీకరణ గా ఎవరూ అనుకోరు. మన అభిప్రాయం మనం చెప్పుకోవటానికి మనకి ఈ ప్రజాస్వామిక దేశములో హక్కు ఉన్నా, వాస్తవానికి అది ఇక్కడ పని చెయ్యదు. వారందరూ మీమీద దాడి చెయ్యటం ఖాయం. అంతగా చెప్పాలీ అనుకుంటే ప్రైవేట్ గా స్క్రాప్ లో వ్రాసి పంపండి. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం.

20. అందుకే - ముందే చెప్పాను. రాజకీయాలు, సినీతారలు, వ్యక్తులూ, రీసెంట్ జెనరల్ టాపిక్స్.. ఫొటోస్, ఒకరి అభిప్రాయాల మీద అసలు కామెంట్స్ జోలికి వెళ్ళకండి. వెళ్ళారో - అక్కడ మీ భావ వ్యక్తీకరణని వేరుగా (విమర్శగా) అనుకోని, గొడవలు జరిగి, మీ స్నేహాలు దూరం కావచ్చును. అందుకే చాలావరకు స్నేహాలు ఇక్కడే దెబ్బ తింటాయి. నిజజీవితములో నా స్నేహితులు ఇద్దరూ - ఒకరు - రెవెన్యూలో సీనియర్ అసిస్టంట్ - కాంగ్రేస్, ఇంకొకరు - హైకోర్టు అడ్వకేట్ - తెలుగుదేశం అభిమానులు. ఒకరోజు - బాగా గుర్తుంది. ఒక ఆదివారం రోజున చాలా రోజులకి కలిశారు అని వాకింగ్ వెళ్ళినప్పుడు పాలిటిక్స్ మీద చర్చలు జరిగాయి. అది రాను రానూ ఎవరు గొప్ప అన్నదాని మీద చర్చ జరిగింది. అప్పటివరకూ బాగున్నవారు - ఎవరి పార్టీ వారిదే గొప్ప అనుకున్నారు. ఈ చర్చతో ఇద్దరి మొఖాలు మాడిపోయాయి. కొద్దిరోజుల వరకూ ఒకరి  పొడ వేరొకరికి గిట్టలేదు. దాదాపు ఇరవై ఏళ్ళ స్నేహం దెబ్బతింది. ఎక్కడైతే నమ్మకం పోతుందో అక్కడ స్నేహం నిలవదు. ఆరోజు ఇద్దరికీ పోయినట్లుంది. ఎదుటివారిలో తప్పులు భూతద్దం లో చూడటం మొదలెట్టారు.. ఇప్పటికీ ఇద్దరు సరిగా మాట్లాడుకోరు. ఆ పార్టీలు మాత్రం వాటి పని అవి చేసుకుంటూనే ఉన్నాయి. మధ్యలో వీరే దూరం అయ్యారు. స్నేహంలో ఎదుటివారి అభిప్రాయాలని గౌరవించాలి. అలా గౌరవించనినాడు ఆ స్నేహం నిలబడదు. టైం పాస్ స్నేహముగా మారుతుంది.

21. ఇన్నేళ్ళ (ఇరవై ఏళ్ళ) కాలాన్ని పెట్టుబడి పెట్టి - ప్రాణ స్నేహితులమని చెప్పుకొనే స్థాయి నుండి ఒకే ఒక చిన్న అభిప్రాయభేదం వల్ల దూరం చేసుకోవటం బాగుంటుందా.. వీరింటికీ వారింటికీ మధ్య జస్ట్ ఒక పది ఇండ్లు మాత్రమే అడ్డం. ఆరోజు నుండీ ఇలా చిన్నచిన్న అభిప్రాయభేదాల వల్ల స్నేహాలు దూరం చేసుకోవటం నాకు ఇష్టంలేదు. అందుకే అలా వివాదాస్పద విషయాలమీద కామెంట్స్ అసలు పెట్టను. ఆరోజు చూసిన ప్రత్యక్ష అనుభవం వల్ల అలా నిర్ణయం తీసుకున్నాను. మీరూ అలా చెయ్యరని - ఇక్కడ మీకూ చెప్పటం.

22. ఒకవేళ నేను వ్రాశాక - నా ప్రమేయం లేకున్నా - ఏదైనా గొడవ జరిగితే మాత్రం వెంటనే వారికి సారీ చెప్పేసి, ఆ కామెంట్ తీసేసి, ఇక కామెంట్స్ ఏమీ పోస్ట్ చెయ్యను.

23. నేను ఏమీ తప్పు చెయ్యని దానికి సారీ చెప్పడం ఎందుకూ అని మీకు అనిపించవచ్చును. పొరబాట్లు అందరూ చేస్తారు. చేయని వారంటూ లేరు. చేసినవారు చెప్పకున్నా, వారికి ఈగో సమస్య అడ్డం వచ్చి సారీ చెప్పక పోవచ్చును. కాని ప్రవైట్ స్క్రాప్ లో కాస్త సర్ది చెప్పితే - పొరబాటేమీ లేదు. నేను మాత్రం నా వైపునుండి స్నేహాన్ని నిలుపుకోవటానికి ఆఖరియత్నముగా చేస్తాను - అలా ఇరవై ఏళ్ళ స్నేహంలా దూరం కావద్దని. అంతే!. కాని నేనేదో తప్పు చేశాను అని కాదు. నాది తప్పయితే ఆ కామెంట్ వెంటనే తీసేసి స్క్రాప్స్ లో చెప్పేస్తాను. . పొరబాటు జరిగిందండి అనీ.

24. అందుకే ఫోటో కామెంట్స్ అనే కాదు, అన్ని కామెంట్స్ మీద కాస్త జాగ్రత్తగా ఉండమన్నది. పొరబాటు అనే మూలం మన నుండే మొదలు కాకుండా చూసుకోవటం అన్నివిధాలా శ్రేయస్కరం. మనం చేసిన కామెంట్ వల్ల ఇంతగా జరిగిందే అని బాధపడకుండా ఉండాలి అంటే పొరబాటు యొక్క మూలం - మనవద్ద నుండి మొదలు కావద్దు అనేది ముఖ్యం.

25. ఎంత జాగ్రత్తగా ఆలోచించి వ్రాసినా ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఎలా ఆ కామెంట్స్ తీసేస్తున్నామో, అలాగే మన ఫొటోస్ కి వచ్చిన ఇబ్బందికర కామెంట్స్ ని మనమే తీసేసేయ్యాలి. మరీ ఇబ్బందికరముగా ఉంటే ప్రైవేట్ లో కాస్త వారితో మాట్లాడితేసరి. ఇలా నేను పెట్టిన మూడు - నాలుగు ఫొటోస్ కి చేశాను. వారితో సంబంధాలు అప్పటికంటే ఇప్పుడు మరీ బాగున్నాయి.

26. అబ్బో! ఇన్ని గొడవలు ఉన్నాయా.. నేనిక కామెంట్స్ వ్రాయను అని డిసైడ్ అవకండీ!. జస్ట్ ఈ జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నాను. ఒకసారి మనమెక్కిన ఆటోకి ఆక్సిడెంట్ అయ్యిందని ఇక ఆటో ఎక్కకుండా ఉంటామా.? కాస్త జాగ్రత్త తీసుకొని మళ్ళీ ఆటోలు ఎక్కుతునే ఉంటాము కదా.. ఇక్కడా అంతే!.

27. కామెంట్  వ్రాసేటప్పుడు ముందుగా ఒక చుక్క నొక్కి (.) తర్వాత ఎంటర్ బటన్ నొక్కి ఆతర్వాత కామెంట్ వ్రాయండి. పబ్లిష్ అయ్యాక అప్పుడు మీ కామెంట్ మరీ అందముగా కనిపిస్తుంది.

28. ఎన్ని వివాదాలు ఏర్పడ్డా వెంటనే ఆ ఇద్దరే మాట్లాడుకుంటే - కొద్దిపాటి సమయములోనే సమస్యలు దూరం అవుతాయి. యధావిధిగా ముందటి స్నేహాన్నే కొనసాగించవచ్చును. ఇంకా నిర్లక్ష్యం చేసినా, మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చినా ఇక ఆ స్నేహం మునపటిలా కంటిన్యూ కాకపోవచ్చును. లేదా అక్కడే ఆగిపోవచ్చును. అప్పుడు ఆ స్నేహాన్ని నిలుపుకోకపోవటం వారిద్దరిదీ తప్పే అవుతుంది. 

updated on :
1st : 22- February - 2011 Morning.

Friday, February 18, 2011

Social NW Sites - 16 - ఫొటోస్.

ఈ సోషల్ సైట్లలో మరో పెద్ద అట్రాక్షన్ ఏమిటంటే - ఫొటోస్. ఫోటోగ్రఫీ అభిరుచి ఉన్నవారికి ఈ ఆప్షన్ ఒక వరం లాంటిది. మనం దిగిన ఫొటోస్, ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్, ఆయా ప్రదేశాలలో తీసిన అందమైన దృశ్యాలూ.. ఇలా అన్నీ తీసి ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చును. చాలామంది సినిమా తారల ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఇందులో కూడా కొంత స్పెషలైజేషన్ చేసినట్లు - కొంతమంది హీరోయిన్ ఫొటోస్ మాత్రమేనో, ఒకరివే మాత్రమే ఫొటోస్ పెడుతూ ఉంటారు. సాధారణముగా ఇలాంటి ఫొటోస్ పెడుతూ ఉంటే - వీరి మనస్తత్వం ఈజీగా గుర్తుపట్టొచ్చు. మీకు ఎవరైనా ఆడ్ రిక్వెస్ట్ వస్తే - వారి అక్కౌంట్ లో ఇలా కనిపిస్తే - వారు అందమైన ఊహాలోకములో విహరించేవారు, తమని ఒక ప్రత్యేక వ్యక్తిగా చూడాలని వారు కోరుకుంటున్న మనస్తత్వం అని గమనించుకోవాలి. వారితో ఇలా చెప్పినా అదేమీ కాదని అంటారు. అలాని అనిపించుకొని దూరం చేసుకొనే బదులు వారు ఇలాని గమనించనట్లే ఉండటం చాలా చాలా మంచిది. ముందే చెప్పాగా ప్రొఫైల్ చూసి ఎన్నో విషయాలు గమనించవచ్చును అనీ.

ఫొటోస్ రెండు రకాలు. ఒకటి ప్రింట్స్ (ఫిలిం) పద్దతిలో, రెండోది డిజిటల్ పద్ధతి లోనివి. పిలిం పద్ధతి లోని ఫొటోస్ డిజిటల్ కి మార్చాల్సి ఉంటుంది. అలా డిజిటల్ లోకి మార్చినవే / తీసినవే వీటిలోకి అప్లోడ్ చెయ్యాల్సివస్తుంది. ఈరోజుల్లో 10 మెగాపిక్సేల్ కెమరా మూడున్నర వేల రూపాయల్లో వచ్చేస్తున్నది.

ఫొటోస్ అప్లోడ్ చేసే ముందు -

1. ఆ ఫొటోస్ ని ఒక ఫోల్డర్ లో అప్లోడ్ చేసుకోండి.

2. ఆ ఫోల్డర్ లో అప్లోడ్ చేసిన వాటిల్లో మీరు మీ ఆన్లైన్ స్నేహితులకి ఏమేమి చూపించాలో వాటిని సెలెక్ట్ చెయ్యండి.

3. ఆ సెలెక్ట్ చేసిన వాటిని కాపీ చేసి, మై డ్యాకుమెంట్స్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, దానికి UPLOAD అని పేరు పెట్టి, అందులో పేస్ట్ చెయ్యండి. ఇలా చేస్తే - మీరు అప్లోడ్ చేసేవాటి మీద మీకు క్లారిటీ వస్తుంది.

4. అంటే - ఈ ఫోల్డర్ లోనివే మీరు అప్లోడ్ చేస్తారు అన్నమాట.

5. ఇలా చేసినవాటిని వెంటనే అప్లోడ్ చెయ్యక ముందుగా వాటిని మీ సిస్టం లోని MS ఆఫీస్ లోని Picture Manager లో ఎడిట్ చెయ్యండి.

6. వాటిలో ముందుగా క్రాప్ చెయ్యండి. ఎంతవరకు ఫోటో చూపాలో అంతే చూపగలరు.

7. ఆ తరవాత ఆ ఫోటో ని కంప్రెస్ చెయ్యండి. కంప్రెస్ ఎందుకూ అంటే - ఇండియా లో నెట్ కనెక్షన్ అంతా స్లో నెట్ స్పీడ్ కలవి. ఈ 256 kbps స్పీడులో వాటిని అప్లోడ్ చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది. 10 మెగా పిక్సెల్ కేమరాతో తీసినవే అంటే ఒక్కో ఫోటో 4 - 5 MB ఉంటుంది. ఇది అప్లోడ్ అయ్యేసరికి బాగా సమయం పడుతుంది. అలాగే డాటా వాడకం బాగా ఉంటుంది. మీరు 5 MB క్లారిటీతో ఫోటో అప్లోడ్ చేసినా అక్కడ 50 - 60 KB  ల్లోకి మారిపోతుంది. అందుకే కంప్రెస్ చెయ్యాలి. కంప్రెస్ చేస్తే ఇంకొన్ని లాభాలూ ఉన్నాయి. అవి చెప్పలేను.

8. ఆ తరవాత వాటిని ఎడిటింగ్ చెయ్యాలి. అప్పుడు డల్ గా ఉన్న ఫొటోస్ చాలా కాంతివంతముగా, చూడ ఆకర్షణీయముగా మారుతాయి. అప్పుడు మన సైట్లో పెట్టుకున్నా అందరికీ బాగా నచ్చేస్తాయి. మీరు డొక్కు డబ్బా కెమరాతో ఫోటో తీసినా, మొబైల్ తో తీసినా, ఈ ఎడిటింగ్ వల్ల ఇంకా ఆకర్షణీయముగా మార్చొచ్చు. అతి కొద్దిమంది తప్ప - ఇంకెవరూ ఇలా పాటించరు. బహుశా తెలీకపోవటమో, వారి నిరాసక్తత కారణం వల్లనో, ఎలా చెయ్యాలో తెలీకపోవటమో, తెలుసుకోవాలని ఇంటరెస్ట్ లేకపోవటమో..

9. ఆతర్వాత అప్పుడు మీ ఫోటో ఆల్బం లోకి అప్లోడ్ చెయ్యండి. మీకు ఫోటో కామెంట్స్ రూపములో అభినందనలు వస్తాయి.

ఇప్పుడు ఒక ఫోటోని ఎలా ఎడిట్ చెయ్యగలమో చూద్దాం.. సినిమా తీసిన తరవాత ఎడిటింగ్ ఎలాగో, కేకు చెయ్యగానే - ఐసింగ్ చెయ్యటం ఎందుకో, ఇదీ అంతే. ఎక్కువగా సుత్తి కొట్టను.. ఇక డైరెక్ట్ గా విషయం లోకి వద్దాం!. ఈ క్రింది ఫోటో డిజిటల్ కెమరాతో తీసినది. ఎంతగా డల్ గా ఉందో ఈ కుక్క ఫోటో చూశారా? గమనించండి.


ఇది నా మిత్రురాలు తీసిన పెట్టుకున్న ఫోటో ఇది. ఇది వారింటి పెంపుడు కుక్క ఫోటో. ఈ ఫోటో ఎడిటింగ్ గురించి చెప్పటానికి ఈజీగా ఉంటుందని ఈ ఫోటో ఎంచుకున్నాను. పై ఫోటో చూశారు కదా. ఎంతో డల్ గా ఉంది కదూ.. ఇప్పుడు ఆ ఫోటోని MS ఆఫీస్ లోని PICTURE MANAGER లో ఓపెన్ చెయ్యండి. చేశారు కదూ.. ముందుగా CROP చెయ్యండి.


ఆ డల్ గా ఉన్న భాగాన్ని ఈ క్రాప్ టూల్ ద్వారా తీసేస్తాము అన్నమాట. ఈ క్రాపింగ్ ఎందుకూ అంటే ఆ ఫోటో లోని అనవసర దృశ్యాన్ని తీసెయ్యటం అన్నమాట!.. అలా చేసి ఎక్కువగా ఉన్న SIDES మార్క్ చేసుకొని OK నొక్కటం ద్వారా తొలగించుకోవాలి. ఇప్పుడు ఆ ఫోటో ఇలా వస్తుంది..


ఇప్పుడు ఆ కుక్క దగ్గరగానూ, పెద్దదిగానూ వస్తుంది కదూ. ఆ మొదటి ఫోటో కన్నా ఈ రెండో ఫోటో చాలా బాగుంది కదూ.. మీరు మరింతగా గమనించాలంటే ఆ ఫొటోస్ మీద క్లిక్ చెయ్యండి. పెద్దగా కనిపిస్తాయి. ఇప్పుడు పైన ఉన్న AUTO CORRECT అన్న టూల్ నొక్కటముతో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. 


చూశారు కదూ.. ఎంత తేడా వచ్చిందో!.. ఇంకా ఓపిక ఉంటే - ఇంకా బాగా ఎడిట్ చేసుకోవచ్చును కూడా.. అదీ మీకోసం మరీ బాగా ఎడిట్ చేసి క్రింద పెట్టాను. అదీ చూడండి. క్లారిటీ ఎలా ఉంటుందో. అసలు ఇవి మీరు తీసినవి అంటే మీ మిత్రులు అసలే నమ్మరు కూడా. (పెద్దగా చేసి చూడండి. అప్పుడే తేడా ఏమిటో మీరే చూస్తారు.)


ఇలా మీ టాలెంట్ ఉపయోగించి చెయ్యవచ్చు. ఆన్ లైన్ ఫోటో ఎడిటర్స్ వాడి ఇలా కూడా చేసుకోవచ్చును. కానీ మన సిస్టం కి ఎంతో ప్రమాదకరమైన మాల్వేర్ లని ఈ JPEG ఫొటోస్ లలో చొప్పించటం అన్నింటికన్నా ఈజీ. ఇలా ఆయా సైట్లలో ఎడిట్ చేసుకున్న ఫొటోస్ లలో ఆడ్ అయ్యి,  డౌన్లోడ్ చేసుకోగానే - అలా మన సిస్టం లో తిష్ట వేస్తాయి. ఇక మన ఫోటో వివరాలూ, సిస్టం లోని ఇతర వివరాలూ ఆయా సైట్లకి రహస్యముగా చేరవేస్తాయి. ఇలా అన్ని సైట్లూ చేస్తాయనికాదు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ముందు జాగ్రత్తగా చెబుతున్నాను.

ఇక ఇలా అప్లోడ్ అయిన ఫొటోస్ మీ ఆల్బమ్స్ లలో పెట్టేసుకోండి. అప్పుడు మీ ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. మీ మిత్రుల నుండి ప్రశంసలూ బాగుంటాయి. కొన్ని విషయాలు తెలుసుకుంటే - మరెంతో ఆనందిస్తాం అన్నదానికి ఇదే ఒక చక్కని ఉదాహరణ. ఈ సోషల్ సైట్లో అప్లోడ్ చేసే ఫొటోస్ మాత్రమే కాదు.. మీ పర్సనల్ ఆల్బమ్స్ కూడా ఇలా ఎడిట్ చేసుకొని అందముగా తీర్చిదిద్దుకోవచ్చును.

జెనరల్ ఫొటోస్ అందరికీ కనిపించేసేలా పెట్టండి. 

మీ పర్సనల్ ఫొటోస్ అంటే - మీ ఇల్లూ, మీ కుటుంబ సభ్యులవీ ఒక ఆల్బం క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేసి మీరు బాగా ఎరిగినవారికే షేర్ చెయ్యండి. వారికే కాకుండా మీ బంధువులకీ, దగ్గరి వారికీ ఇలా షేర్ చెయ్యవచ్చును. ఇలా చెయ్యటం మూలాన మీ ఫొటోస్ పర్సనల్ గా ఉండిపోతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే - మీరు ఎప్పుడు అంటే అప్పుడు షేర్ చెయ్యవచ్చును, ఎప్పుడు కాదంటే అప్పుడు షేర్ తీసేయ్యవచ్చును. అంటే మన ఫొటోస్ ఎంతసేపు చూపించాలో వెసులుబాటు అంతా మన చేతిలో ఉంటుందన్న మాట!. నాకు ఆర్కుట్ లో నచ్చిన విషయాల్లో ఇది ఒకటి. 

ఈ షేరింగ్ కూడా బాగా తెలిసిన వారికి షేర్ చెయ్యటం చాలా మంచిది. చాలామందికి ఈ విషయం తెలీక - అన్నీ ఒక్క చోటే కలుపుతారు. మీకో విషయం తెలుసా.. ఒకసారి ఆన్లైన్ లో పెట్టిన ఫోటో ఇక శాశ్వతం అని గుర్తు పెట్టుకోవాలి. అది ఎవరైనా కాపీ చేసుకోవచ్చును. ఆఖరికి షేర్ చేసుకున్నవారు కూడా!. అందుకే షేర్ లో అయినా, ఎక్కడైనా కాపీ చేసుకున్నా ఇబ్బంది లేని ఫొటోస్ పెట్టడం మంచిది అని బాగా గుర్తుపెట్టుకోండి.  

ఫొటోస్ అన్నీ కుప్పగా కాకుండా ఒక్కో ఆల్బం లో ఒక హెడ్డింగ్ పెట్టి వాటికి సంబంధించిన ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. అలా చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. అన్నీ ఒక్క దగ్గర కలిపేస్తే - వారిది కాస్త ఏమీ పట్టించుకోని మనస్తత్వం అని అర్థం అని అనుకోవాలి.

ఫోటో అప్లోడ్ చెయ్యగానే కాదు.. ఆ ఫోటో క్రింద ఆ ఫోటో గురించి ట్యాగ్ లైన్ తప్పకుండా వ్రాయాలి. ఇది నిజానికి ఫోటోకి ప్రాణం. ఇలా ట్యాగ్ లైన్ వ్రాస్తేనే - ఆ ఫోటో కి అందం వస్తుంది. ఎలా వ్రాయాలో తెలీకపోతే - వేరే వారి ఆల్బమ్స్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. అప్పుడే మీ యొక్క టాలెంట్ ని పదిమందీ గుర్తిస్తారు. ఇలా ఫొటోస్ పెట్టగానే - ట్యాగ్ వ్రాయందే ఆ ఫోటోని సంపూర్ణముగా పెట్టినట్లు కాదని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణకి ఒక టూర్ కి వెళ్ళినప్పుడు దారిలో ఒక గుడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో పెట్టారు అనుకుందాము. ఆ ఫోటోకి ట్యాగ్ గా ఆ గుడి గురించిన సమాచారం పెడితే / వ్రాస్తే చూసేవారూ అనుభూతి చెందుతూ చూస్తారు. ఇలా ట్యాగ్స్ చూసేవారికి బాగా ఉపయోగ పడుతుంటాయి.

ఇప్పుడు వారు మీ ఫొటోస్ చూశాక మీకు ఫోటో కామెంట్స్ పెడతారు. చాలామంది ఫొటోస్ చూసి ఏమీ అనరు. నిజానికి కామెంట్స్ వ్రాస్తేనే బాగుంటుంది. ఒకరు చేతికి గోరింటాకు పెట్టుకొని ఫోటో తీసి చూపించారు అనుకోండి. మీరు చూసి ఊరకుంటే - నేను పెట్టుకున్న గోరింటాకు డిజైన్ బాగాలేదని వారు ఫీల్ అవుతారు. నిజానికి బాగుందే అనుకోండి. మనకి మనం అనుకోక అప్పుడు అక్కడ ఫోటో కామెంట్ గా "బాగుంది" అని వ్రాయండి. ఇంకా బాగా నచ్చిందే అనుకోండి. అలా చిన్నగా కాకుండా - కాస్త విడమరిచి చెప్పండి ఇలా - "వావ్! ఎంత బాగా పెట్టుకున్నారు.. నిజముగా మీలో ఇంత ప్రతిభ ఉందని అనుకోలేదు సుమీ!. అది చూస్తుంటే నాకూ ఇప్పుడే గోరింటాకు పెట్టించుకోవాలని ఉంది" అని వ్రాస్తే చాలు.. అవతలివారికి ఎంత సంతోషముగా ఉంటుందో..

మన మిత్రులని సంతోషపెట్టే బాధ్యత మనదే కదా!.. సోషల్ సైట్లలో తరచూ రావాలని అనిపింపచేసేది ఈ ఫొటోస్ మరియు ఫోటో కామెంట్స్. (కమ్యూనిటీలు కూడా). ఇవే లేకుంటే కేవలం స్క్రాప్స్ కోసమని వచ్చేసేవారు చాలా తక్కువ అని నా అభిప్రాయం. నిజానికి ఎదుటివారు మెచ్చుకుంటే - సంతోషపడనివారు ఎవరున్నారు ఈ రోజుల్లో!. మీరూ, నేనూ, అందరమూ అంతేగా.  సూరి బావ కళ్ళల్లో ఆనందం కోసం మొద్దు శీను అంతటి సహాయమే చేశాడే కదా.. మనం అంత చెయ్యాల్సిన అవసరం లేదు - మనస్పూర్తిగా ఒక కామెంట్ వ్రాస్తే చాలు. ఇలా అన్ని ఫొటోస్ కి కాదు. బాగున్నవాటికి మాత్రమె వ్రాసి చూడండి. అవతలి వారు మానసికముగా బాగా దగ్గర అవుతారు. మీ మధ్య స్నేహమూ చాలా బాగుంటుంది. ఇది నిజం. 

ఒకవేళ మీకు వ్రాయటం రాదే అనుకోండి - ముందే చెప్పాగా పదిమందివి చూస్తే ఇట్టే అర్థం అయిపోతాయి. కాస్త వ్యంగముగా, చలోక్తిగా, కవ్వింపుగా, హృదయాలని గిలిగింతలు పెట్టేదానిలా మీ కామెంట్స్ ఉండేలా చూసుకోండి. మీకు బాగా స్నేహితులవుతారు. "నేను ఎవరికీ ఇలా చెప్పను.. చెప్పటం రాదు. నాకు ఇలా వ్రాయటం రాదు.." అనుకుంటే - ఎవరూ మీకూ వ్రాయరు. చెక్కంగా చెక్కంగా శిల్పి అవుతాడు అనేది తెలిసుకోండి చాలు. నాకూ మొదట్లో ఈ ఫోటో కామెంట్స్ వ్రాయటం వచ్చేది కాదు. చాలా భయపడేవాడిని. పదిమందివీ చూసి స్టడీ చేశాను. ఆ ప్రేరణ వల్ల వ్రాస్తున్నాను. ఇప్పటికీ ఇంకా స్టడీ చేస్తాను.. ఇంకా బాగా ఎలా వ్రాయోచ్చో అనీ!

ఈ ఫోటో కామెంట్స్ ని మీకు మనసు బాగా లేనప్పుడు - ఏమీ తోచనప్పుడు - ఒకసారి మీ ఆల్బమ్స్ లోని ఒక్కో ఫోటో చూస్తూ వచ్చిన కామెంట్స్ చూడండి. మీకు ఎంత ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుందో - మీరే చవిచూస్తారు.

ఆ పెట్టిన కామెంట్స్ కి - వారు ఏదైనా డౌట్స్ అడిగితే - అక్కడే రిప్లై ఇవ్వండి. రిప్లై ఇవ్వటం మరచిపోకండి. మీకు ప్రశంసలు ఇచ్చినవాటికి కృతజ్ఞతలు చెప్పటం మీ ధర్మం. అంత సమయం కేటాయించి - ఫోటో చూసి - వెళ్ళిపోక - కామెంట్ చేసిన వారికి - కర్టెసీ కోసం - కనీసం కృతజ్ఞతలో, ధన్యవాదములో చెప్పటం మంచి పద్ధతి. ఫోటో కామెంట్స్ గురించి ఇంకో టపాలో చెబుతాను. 

Sunday, February 13, 2011

Social NW Sites - 15 - వారి ప్రొఫైల్ ఎలా ఉంది. తన గురించి ఎంతగా చెప్పారు.?

మనకి వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ తాలుకు ఒనర్ యొక్క  వివరాలు తెలిపేదే - ప్రొఫైల్. ఒకరకముగా స్నేహానికి పెట్టుకున్న దరఖాస్తు ఫారం లాంటిది అని అనుకోవాలి. ఉద్యోగానికి దరఖాస్తు ఫారం ఎలానో, ఇక్కడ స్నేహానికి అప్లికేషన్ ఫారం అన్నమాట. ఒక్క మీ ఇంటి, ఆఫీస్ అడ్రెస్, ఫోన్ నంబర్స్ తప్పించి (అవి + అలాంటి సున్నిత పర్సనల్ వివరాలు తప్ప) అన్నీ వ్రాసుకోవచ్చు. సాధారణముగా అన్ని ప్రోఫైల్స్ లోని వివరాలు పూర్తిగా ఉండవు. వాటిని ఎలా పూరించాలో చాలా మందికి తెలియవు. అందుకే ఆడ్ రిక్వెస్ట్ పంపే ముందే కనీసం కొన్ని ప్రోఫైల్స్ చూడండి.. అన్నాను. అప్పుడు ఎలా నింపాలో తెలుస్తుంది అని చెప్పాను. ఇలా చూడక / చెయ్యక పంపితే మన రిక్వెస్ట్స్ రిజెక్ట్ అవుతాయి. నావీ చాలా రిజెక్ట్ అయ్యాయి. చాలా చాలా బాగున్న ప్రోఫైల్స్ వారివి. ఇంకోసారి ఆడ్ రిక్వెస్ట్ పంపాలంటే అభిజ్యాతం అడ్డు వచ్చేది. అలా ఒక్కొక్క దెబ్బ నుండీ ఒక్కో పాఠం నేర్చుకున్నాను.

ఇప్పుడు వారి ప్రొఫైల్ సంగతి చూద్దాం. అలాగే మనం ఎలా ఉండాలో కూడా..

మనం ఉద్యోగానికి ఎలా తగు వివరాలతో అప్లై చేస్తామో, ఇక్కడా మన ప్రొఫైల్ అంత బాగా ఉండాలి. చూడగానే ఏదో రొటీన్ ప్రొఫైల్ చూసినట్లుగా కాక, సంథింగ్ స్పెషల్ గా ఉండాలి. అలా ఉంటేనే మీకు కాస్త (చిన్న) సెలెబ్రిటీ లా గుర్తింపు వస్తుంది. మనం ఎదుటివారిలో వేటిని ఇష్టపడతాం, వేటిని అయిష్టం చేస్తాం.. మన హాబీలు, మనకు నచ్చే విషయాలు ఇలా అన్నీ ఆ స్నేహ అప్లికేషన్ అనబడే ప్రొఫైల్ లో పూరించాలి. అవేమిటో ఇక్కడ చూద్దాం.

ఆర్కుట్ లో ఆయితే New Orkut లో అంత మార్పులూ, ఎక్కువ వివరాలూ చేర్చరాదు.. అదే పాత ఆర్కుట్ లో బాగా వివరాలు చేర్చొచ్చు. (ఇక్కడ ఆర్కుట్ దే అని ఎందుకు చెబుతున్నాను అంటే - దాని గురించి మాత్రమే తెలుసు..ఇలా వ్రాసింది దానికోసమైనా మిగిలిన సోషల్ సైట్లకీ బాగా ఉపయోగపడుతుంది.) అందులో బయట తెలిసినా మీరు ఇబ్బంది పడనివే ఉంటాయి. అక్కడే అన్నీ పూరించటం మంచిది. అప్పుడే మీ ప్రొఫైల్ పూర్తిగా ఉంటుంది. ఇలా పూర్తిగా ఎందుకు నింపాలీ అంటే - ప్రతివారికీ మీ గురించి కాస్త ఇంట్రో ఇక్కడే ఇచ్చినట్లు ఉంటుంది - మళ్ళీ మీరు చెప్పాల్సిన అవసరం లేకుండా. మీ అభిరుచులు, మీకు ఇలాంటివి ఇష్టమో, ఇలాంటివి ఇష్టపడరో అన్నీ ఇక్కడే వ్రాసుకోవచ్చును. అది చూసి ఎవరైనా నచ్చితే మీకు ఆడ్ రిక్వెస్ట్ వస్తుంది. అవన్నీ నచ్చిన వారే మీకు ఆడ్ అవుతారు. రేపు ఏదైనా ఈ విషయాల్లో తేడా వస్తే - అప్పుడే నా ప్రొఫైల్ లో చెప్పాను ఇలా అని. అది చూశాకే ఆడ్ రిక్వెస్ట్ పెట్టాలి అని అవతలివారిని మందలించవచ్చు. అలా ఒక గొప్ప అవకాశం మన చేతిలో ఉంటుంది. అందుకే అవన్నీ ముందే వ్రాసుకోవాలి. అలా వ్రాసుకోలేకపోతే మనల్ని అవతలివారు దబాయించే అవకాశం ఉంటుంది.. మీ ప్రొఫైల్ లో అలా ఉంటే చూసి ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవాడినే కానుగా అని  అనొచ్చు. ఇలా ఒక అవకాశం మనకి ఉంటుంది. ఉద్యోగములో జాయిన్ అయ్యేటప్పుడే అప్లికేషన్ లో ఈ ఈ కండీషన్స్ ఉన్నాయి.. చూసుకోక జాయిన్ అయ్యి.. ఇప్పుడు ఇలా అంటే ఎలా? అని ఉద్యోగాలలో ఎలా అంటారో ఇక్కడా ఇలాగే ఉపయోగిస్తుంది. అందుకే పూర్తిగా ఫిల్ చెయ్యండి. ఇలా మన ప్రోఫైల్స్ కి మాత్రమే కాకుండా కమ్యూనిటీలకు కూడా వ్రాస్తారు. అవేమిటో క్రింద శాంపిల్స్ చూడండి..
పైన దాంట్లో అమ్మాయిలతో డేటింగ్ చెయ్యాలని ఉంది అని ఒక అబ్బాయి వ్రాశాడు. అది చూసుకోవాలి. అలాంటి ప్రొఫైల్స్  కి అమ్మాయిలు ఆడ్ అయితే - అతడు అమ్మాయితో కాస్త చనువుగా ఉండొచ్చు. ఎక్కడైనా తేడా వస్తే - నేను ముందే నా ప్రొఫైల్ లో చెప్పాను Dating with women అనీ - అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నోరేల్లబెట్టాల్సి ఉంటుంది.

ఇది కూడా అబ్బాయిదే - కానీ నేను చెప్పానుగా ఒక స్వలింగ సంపర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ లోని భాగం. ఇది ముందుగా పెట్టలేదు.. మధ్యలో ఇలా మార్చాడు. మధ్యలో చూసుకోకపోయేసరికి అవమానకర మాటలు (పొందుకోసం రమ్మని) చవి చూశాను. ఆడ్ అయ్యేటప్పుడే ఇలా పెట్టి ఉంటే అతనికి ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవాడిని కాదు. ఇలాంటి భయంకర ఆహ్వానం పొంది ఉండేవాడినే కాదు. మధ్య మధ్య కూడా ప్రొఫైల్ మార్చగానే ఏమి మార్చారో కూడా ఒక లుక్ వెయ్యాలి. ఇలాంటివే కాదు ఇంకా ఇంతకన్నా భయంకరమైన ప్రోఫైల్స్ కూడా ఉన్నాయి.. అందుకే ప్రొఫైల్ బాగా స్టడీ చెయ్యండి. ఇలాంటివి చాలామందికి అనుభవాలే. అందుకే మరీ మరీ చెప్పటం. - ప్రొఫైల్ ని బాగా స్టడీ చెయ్యండీ అని.

వారి ప్రొఫైల్ ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తరవాతే ఒక నిర్ణయానికి రండి. నాకు తెలిసీ - ఒకతను మనకి తగినవాడా లేదా అనేది ఇక్కడే 70 - 80% ఇక్కడే పరిశీలించవచ్చును. అతని ప్రొఫైల్ లో అతను అంటే ఏమిటో అంతా సరిగ్గా చెప్పేస్తే - ఎంపిక చాలా ఈజీగా ఉంటుంది. నిజానికి అలా ఎవరూ వ్రాయరు. చాలా తక్కువ ప్రోఫైల్స్ లలో అలా కనిపిస్తుంది. ఇక్కడే మనం ఇక ముందు ఎంత సంతోషముగా ఉండబోతున్నామో - పునాది పడుతుంది.

1. అతని ఫోటో, ఫోటో క్రింద అతని ప్రొఫైల్ పేరు చూడండి. బాగుందా..?

2. డీపీ ఫోటోకి కమ్యూనిటీ లలో ఉన్న లింకులూ  చూడండి. (ఇదేమిటో ఇప్పుడు అర్థం కాదు - "కమ్యూనిటీస్" అన్నదాంట్లో చెబుతాను.)

3. అతను ఉంటున్నది ఏమి ఊరో చూడండి. ఊరిపేరు సరిగ్గా లేనివారే మిమ్మల్ని మోసం చేసే గుణాలు ఎక్కువ. హైదరాబాద్ చుట్టుపక్కల్లో ఉంటూ కూడా హైదరాబాద్ అని పెట్టుకునేవారిని చాలామందినే చూశాను. వారి ఊరు + హైదరాబాద్ అని రెండూ వ్రాయొచ్చు కదా.. (ఉదాహరణ : చేవెళ్ల / హైదరాబాద్.) ఇలా వ్రాసుకున్న వారిని చూశాను. వారికి నా అభినందనలు.

4. క్రింది ఫోటోలో మాదిరిగా ప్రతివారి పేజీ లోని భాగం కనిపిస్తుంది.
స్క్రాప్స్ ఎన్నున్నాయో, ఫొటోస్ ఎన్ని ఉన్నాయో, అతనికి నచ్చిన వీడియోలు ఎన్ని ఉన్నాయో, అతని ఫాన్స్ ఎవరున్నారో కూడా చూడండి.

5. ఫాన్స్ అంటే వారిని నచ్చినవారు. ఆ ఫాన్స్ మీద నొక్కితే తెలుస్తుంది. వారు అతనికి ఎంత శాతం మార్కులు వేశారో అక్కడే తెలుస్తుంది. అది ఇలా క్రింది దానిలా ఉంటుంది.
ఇలా ఉన్న దాంట్లో వారికి ఎంత మంది స్నేహితులు ఉన్నారో - వారు ఎంత శాతం మార్కులు ఇచ్చారో తెలిసిపోతుంది ఇక్కడే. దాన్ని బట్టి వారి గురించి ఒక నిర్ణయానికి రావచ్చును.

6. ఇది ఇలా మార్క్స్ ఇవ్వటం అవతలి వారి మెచ్యూరిటీ, ఇష్టా ఇష్టాలమీద ఉంటుంది. అంతే కానీ దీని మీదే ఆధారపడకండి. ఎలా మార్క్స్ ఇవ్వాలో తెలీని వారు కూడా 100 % మార్క్స్ ఇవ్వొచ్చును. అందుకే అదే కొలమానంగా తీసుకోవద్దు.

7. అసలు సిసలు అయినదే ప్రొఫైల్. అందులో ఒక్కోవివరం - వారు పోస్ట్ చేసినది చూసుకుంటూ రండి. అప్పుడే తెలుస్తుంది. మీ తప్ప మీ గురించి, మీ నైజం ఎలాంటిదో ఎదుటివారికి అన్నీ తెలుస్తాయి. కాస్త విశ్లేషణ సామర్థ్యం ఉంటే అన్నీ ఇక్కడే అంచనా వెయ్యొచ్చు. 50% మార్కులు ఆ ప్రొఫైల్ కి వస్తే మీకు మంచి స్నేహితుడే దొరుకుతాడు. అలా చూడకుండా ఆడ్ చేసుకుంటే - మీ ఫ్రెండ్స్ లిస్టు సంఖ్య పెరుగుతుంది. అంతే!.

8. అబౌట్ మీ - ఇందులో అంతా మీ గురించి చెప్పుకునేదే. కానీ చాలామంది ప్రోఫైల్స్ లో అవేమీ ఉండవు. సినిమా బొమ్మలూ, వీడియోలూ, హీరోల ఫోటో ఉంటాయి. వారి గురించి చెప్పుకోరు. అలాంటి ప్రోఫైల్స్ ఉండటం చాలా తక్కువ. మీకు ఎలాంటివారు కావాలో చూసుకొని అలాంటివారిని వెదికి స్నేహం చేసుకుంటే - మీకే బాగుంటుంది. సమయమూ మిగులుతుంది.

9. ఆ ప్రోఫైల్స్ లలో చెప్పినదంతా నిజమనే నమ్మకండి. వాస్తవం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అందమైన ప్రొఫైల్ అని వెంటనే అడ్వాన్స్ అవకండి. కొంత అనుభవం వస్తే - మీరే కొద్దిగానైనా చెప్పగలరు ఎవరు ఎలాంటివారో!. ఇక్కడ ఒక నిజం చెబుతాను. వాస్తవ జీవితములో ఒక టీవీ కొనాలి అనుకుంటే ఎన్నో చూస్తాం.. వాటి ఫీచర్స్, సౌండ్, బడ్జెట్, అదనపు సౌకర్యాలు.. దానివల్ల మనకి సమకూరే సౌకర్యం.. ఇన్ని ఆలోచిస్తామే.. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇంతలా ఆలోచించక తప్పటం లేదు. టీవీ కొన్నాక ఎలా దాని ఫీచర్స్.. హడావిడి మరిచి ఎలా ఎంజాయ్ చేస్తామో ఇక్కడా - స్నేహాల్లో కూడా అలాగే వారి ప్రొఫైల్స్ ని మరిచి స్నేహం కంటిన్యూ చేస్తుంటాం. ఆ ఎంతో ఏరి కోరినా టీవీ ఇబ్బంది పెడితే - ఎంత అసహనానికి గురి అవుతామో ఇక్కడా అంతే!.. ఇంకో టీవీ కోసం వెళ్లక తప్పదు. కాకపోతే రిపైర్ చేయించగలమా లేదా? అని చూస్తాం కదా.. మాక్జిమం ప్రయత్నించి ఇంకో టీవీకి వేల్లిపోతుంటాముగా. ఈ e-స్నేహాల్లో కూడా అలాగే చెయ్యకతప్పదు - ఇది ఇంకోదానిలో మాట్లాడుకుందాం.

10. వారి వారి ప్రొఫైల్ లో బాగా గమనిస్తే - అతను ఎలాంటివారో, వారితో మనం ఎలా ఉండగలుగుతామో మీకే తెలిసిపోతుంది. కొన్ని ప్రొఫైల్ స్నేహానికి అన్నట్లు ఉంటాయి. ఇంకొన్ని దాపరికముతో ఉంటాయి. మరికొన్ని కేవలం ఫన్నీ, ఎంజాయ్మెంట్ కోసమే ఉంటాయి. మీకు ఇందులో ఎలాంటి ప్రోఫైల్స్ వారు కావాలో, ఎలాంటి ప్రొఫైల్ ఉన్నవారితో మీరు ఆనందం అనుభవించగలరు అనేది ముందే ఒక నిర్ణయానికి రండి. ఇది మీ ప్రొఫైల్ వ్రాసుకునేటప్పుడే గ ట్టి గా నిర్ణయించుకోండి. ఆ తరవాతే స్నేహితులని ఎన్నుకోండి. అలాచేస్తే మీకు మానసిక క్లేశాలు తగ్గించుకున్నవారు అవుతారు.

11. స్నేహానికి అన్నట్లు ఉన్న ప్రోఫైల్స్ లలో వివరాలు అన్నీ ఉంటాయి. వారి ఫొటోస్, వివరాలు, ఫోన్ నంబర్, చదువుకున్న కాలేజి వివరాలు, వారి అభిరుచులు, వారికి ఏమేమి ఇష్టం, ఎక్కడ ఉంటున్నారో.. ఇలా అన్నీ ఉంటాయి. ఇలాంటివారితో రిస్కులు చాలా తక్కువ. ఈగ్రూప్ లో చాలామంది జెన్యూన్ పర్సన్స్ దొరుకుతారు. వీరు ఎక్కువగా ఆ సైట్లలోకి రారు. స్క్రాప్స్ కూడా తక్కువే వ్రాస్తారు. వచ్చినా ఎక్కువగా ఇన్విజిబుల్ లో ఉంటారు. ఒక సజ్జన సాంగత్యం కోసం వీరిని ఎంచుకోవచ్చును.

12. దాపరికం ఉండే ప్రోఫైల్స్ లలో అన్నీ దాపరికమే. అంటే వారివి యే వివరాలు ఉండవు. ఎదుటివారి మీద నిఘా పెట్టడానికో, లేక ఎదుటివారు ఏమి చేస్తున్నారో తొంగి చూడటానికి వాడుకునే ప్రోఫైల్స్ ఇవి. ఇలాంటివారు ఎక్కువగా స్క్రాప్స్ వ్రాయరు - వ్రాస్తే ఎక్కడ వీరిని డిటైల్స్ అడుగుతామో అని వ్రాయకపోవచ్చును. ఎక్కువగా ఆన్ లైన్లో ఉండరు. ఉన్నా ఇన్విజిబుల్ లో ఉంటారు. కొద్దిమంది ఉంటారు. వారు మాత్రం విండో షాపింగ్ చేసినట్లుగా మిత్రుల ప్రోఫైల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా మిత్రులని ఎన్నుకున్నా ఇలాంటి ఐరావతాలు ఆడ్ అవుతూనే ఉంటారు. వీరిలో మాట్లాడేవారూ ఉంటారు. కాని వారి వివరాలు ఎక్కడా తెలీవు. అన్నీ రహస్యం. కాని మనవి మాత్రం అన్నీ లాగేస్తుంటారు.

13. ఇక మూడో గ్రూపుకి చెందినవి - ఫన్నీ, ఎంజాయ్ పర్పస్ కోసం లాగిన్ అయ్యేవారు. ఇందులో మూడు రకాలు.
  1. ఎదుటి వారినుండి వినోదం కోరేవారు.
  2. ఎదుటివారికి వినోదం ఇస్తూ, తిరిగి వినోదం అందుకునేవారు.
  3. వినోదం ఇచ్చేవారు కాని తీసుకోవటం రానివారు.
14. వీరితో ఆనందం బాగుంటుంది. నిజానికి సోషల్ సైట్లో వీరిదే సందడి. వీరు లేకుంటే బోర్ కొట్టేస్తుంది. ఎంతగా అంటే ఆ సైట్లలోకి ఇక రానంతగా. వీరితో స్నేహాలు బాగుంటాయి. తొందరగా స్నేహితులమవుతాము. బాగా కలివిడిగా ఉండిపోతాం. వారికోసమే అంతర్జాలానికి వచ్చేంతగా ఉంటాయి. రోజులు నిమిషాల్లాగా గడిచిపోతుంటాయి. సోషల్ సైట్లలో ఎక్కువగా ఇష్టపడేది వారినే. వారికీ స్నేహితులేక్కువ. బాగా అట్రాక్షన్ గా ఉంది కదూ..

15. వీరిలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వీరి ప్రొఫైల్ లో ఎక్కువగా వినోదమే లక్ష్యముగా ఉంటుంది. వీరికి - ఎక్కువగా వీరి నుండి ఆనందం కోరుకునేవారు మాత్రమే దొరుకుతారు. వీరు ఎప్పుడు నవ్విస్తారా! ఎప్పుడు నవ్వుదామా అనీ, కానీ వీరికి ఆనందం కలిగించే వారు ఉండరు. వారి అసలు వివరాలు చాలా తక్కువగా ఉంటాయి. వారితో సమానముగా టాలెంట్ ఉండి వారితో బాటు పాల్గొంటే మంచిది. బాగా తెలివితేటలూ, రిటార్టులూ, కటింగ్స్, మాటకి మాట, సబ్జెక్ట్ నాలేడ్జ్ బాగా ఉంటేనే ఇందులో ఎదురుక్కోగలం. లేకుంటే హుందాగా ఉండటం చాలా నయం. ఒకసారి చులకన అయ్యామా - చాలా కష్టం. ఇంకా అర్థం కావాలంటే కాలేజీల్లో కోతిమూక విద్యార్థుల గుంపు అంటూ ఉంటామే - వారితో స్నేహం ఎలాగో వీరితో కూడా అలాంటిదే. వీరి ప్రోఫైల్స్ లాగానే మనవీ మామూలుగానే, మన గురించి ఎటువంటి సమాచారం లేకుండా చూసుకోవటం చాలా మంచిది. అలా ఉంటేనే బాగా ఎంజాయ్ చెయ్యగలరు. మీవి అన్నీ బయట పెట్టాక అందులో పాల్గోనలేకపోతారు - అది నిజం. కొద్దిగా బెరకుగా ఉంటుంది. అందుకే మొదట్లోనే చెప్పాను. అన్నీ వివరాలు పెట్టినవారు ఎక్కువగా అల్లరి చెయ్యరు అనీ. ఏదైనా అల్లరి చేస్తే నన్ను గుర్తుపట్టి ఏదైనా అంటారేమో అనే ఫీలింగ్ అక్కడ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే - అలా చెయ్యటం తప్పదు.

16. నేను వీరితో ఉండటం వల్ల మాటల్లో చాలా పదును, తెలివితేటలూ వచ్చాయి.. వారికి కృతజ్ఞతలు. కానీ ఆ పదును అంతా అవహేళన కి వాడటం మూలాన, రియల్ లైఫ్ లో ఇబ్బందులు పడాల్సివచ్చింది. వీడితో మాట్లాడటమా.. అయ్య బాబోయ్.. అనే స్టేజికి వచ్చేశారు. ఇంటా బయటా బాగానే రిలేషన్స్ దెబ్బ తిన్నాను. కారణం చాలా సింపుల్. ఎదుటివారు మాట్లాడితే మనం పడాలి. ఈలోకములో ఇదొక విచిత్రమైన పరిస్థితి. గెలికించేదేవారు. వారి భాషలోనే సమాధానం చెబితే తట్టుకోరు. వారి కన్నా వెటకారముగా మనం మాట్లాడితే వారు అసలు భరించలేరు. సోషల్ సైట్ లైఫ్ కన్నా రియల్ లైఫ్ ముఖ్యము కదా!.. ఇక లాభం లేదని ఇటువంటివారికి కాస్త దూరముగా ఉండవలసివచ్చింది. అందుకే స్నేహితులని ఎన్నుకునే ముందు కాస్త చూసి - ఆడ్ చేసుకోండి. ప్రొఫైల్ చూసి బాగా ఒక నిర్ణయానికి రండి అని చెబుతున్నాను.

17. కొంతకాలము తరవాత మన ప్రొఫైల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకూ అలా చేసుకోవాలో చూడండి. ఒకతను నా ఒకప్పటి మిత్రుడే. ప్రొఫైల్ సరిగా లేదని, అంతా ఏదో ఏదో సెక్స్ గురించి ఉందని తీసేశాను. మళ్ళీ ఓ ఆరు నెలల తరవాత ఆడ్ రిక్వెస్ట్ పెట్టాడు. సేమ్ అదే ప్రొఫైల్. ఏమీ మారలేదు. మీరే చూడండి. ఇలాంటి ప్రొఫైల్ ఉన్నవారిని ఎలా ఆడ్ చేసుకోవాలో మీరే చెప్పండి.. ఆరు నెలల మీద అయినా అతని ప్రొఫైల్ కి ఏమైనదో కూడా చూసుకునే అంత సమయం లేదన్న మాట. లేదా అతనికి ఎవరూ చెప్పలేదన్నమాట. అలా వైరస్ వల్లనో, హాక్ అవటం మూలానో అలా జరుగుతుంది.


ఇలా ఉంటే ఎలా ఆడ్ చేసుకోగలం మీరే చెప్పండి. అందుకే అప్పుడప్పుడూ మన ప్రొఫైల్ అప్డేట్ చేస్తుండాలి. అలాగే ఒకసారి చూస్తూ ఉండాలి. ఇప్పటికీ ఆ ప్రొఫైల్ లో ఇంకా ఇలాగే ఉంది కూడా..

18. మొన్న నేను ఇలా చెప్పినందులకు ఒకరు వేరేవారితో అనిపించారు. నా ప్రొఫైల్ గురించి ఇలా వ్రాస్తావా? అని. వారి ఆడ్ రిక్వెస్ట్ ని నేను రిజెక్ట్ చేశాను. కారణం ఏమిటంటే - వారి ప్రొఫైల్ లో ఏమీ లేదు. ఆ విషయమే నా బ్లాగ్ లో చెప్పాను. దానికి ఒక గొడవ. తను కాక మధ్యలో ఉన్న - గొడవ పడ్డ - బాగా మంచి మిత్రులం స్క్రాప్స్ వ్రాసుకోనంతగా మారిపోయాం. ఇప్పుడు ఆ ఒకరు నా బ్లాగ్ చదివి, వారి ప్రొఫైల్ ని బాగా మార్చుకున్నారు. సంతోషం..!!  ఈ పనేదో అప్పుడే చేస్తే మా మధ్య గొడవలు వచ్చేవి కాదుగా.. అందరూ బాగుండేవారు కదా.. అంతా నా మంచికే అనుకుంటాను నేను. తనకి బాగా రుణపడిపోయాను నేను.

19. ప్రోఫైల్స్ కొందరికి సొంతముగా కూడా వ్రాస్కోరాదు. అందరూ తమకి ఆడ్ కావాలని వేరే వారి ప్రొఫైల్ ని తమ అబౌట్ మీ గా పెట్టేసుకున్నారు. ఇలా నాదీ, నా మిత్రులవి ఇద్దరివీ ఇలా (మక్కికి మక్కి) కాపీ చేసుకొని పెట్టుకున్నారు. ఇదే కాపీ చేసినవారు రేప్రోద్దున వారు పెట్టే - ప్రతి స్క్రాప్, ఫోటో, కామెంట్ అన్నీ కాపీ కావని గ్యారంటీ ఏమిటీ.. ?

Monday, February 7, 2011

Social NW Sites - 14 - అతని డీపీ. (Display Picture)

DP అంటే ప్రొఫైల్ కి పెట్టుకునే ఫోటో నే Display Picture అన్నమాట. ప్రొఫైల్ వ్యక్తి ఫొటోనే గానీ, ఇంకే ఇతర ఫోటో గానీ పెట్టుకోవటం అన్నమాట. చాలామంది తమ తమ ఫోటో పెట్టుకోవటం ఇష్టం ఉండదు.. ఆడవారు వారి వారి ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టుకోవటం చాలా తక్కువే అయినా చాలా మంది వారి వారి పెట్టుకోవాలనే చూస్తున్నారు. ఎందుకో తెలీదు కానీ, వారు పెట్టుకుంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. అమ్మాయిలు వారి ఫోటోని డీపీ గా పెట్టుకోవచ్చును. కాకపోతే ఒక పద్ధతి చెబుతాను. ఒక ఫోటో కి ఫిక్స్ అవ్వండి. ఆ ఫోటో పెట్టుకుంటే ఇక మార్చకండి. ఆ సైట్లో ఉన్నన్ని రోజులూ అదే కంటిన్యూ చెయ్యండి.. రోజుకొక ఫోటో మార్చటం వల్ల మీకే ఇబ్బంది. ఒక ఫోటో తోనే కడవరకూ 'లాగిన్'చేసేయ్యటం చాలా మంచిది. ఆ ఫోటో కూడా డిజిటల్ కేమరాతో తీయకండి. మొబైల్ కెమరా తో తీసిన ఫోటో పెట్టండి. మొబైల్ తోనే ఎందుకు అంటే ఆ ఫోటో రిజోల్యూషణ్ చాలా తక్కువగా ఉంటుంది. అది కాపీ చేసి మార్ఫింగ్ కి వాడినా మీకు, ఇతరులకూ అది ఈజీగా మార్ఫింగ్ అని తెలిసిపోతుంది. కారణం - ఆ ఫోటో రిజల్యూషన్. అదే డిజిటల్ కేమరాతో తీసినది పెడితే రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. మార్ఫింగ్ కి అనుకూలముగా ఉంటుంది. ఇది చిన్న విషయమే అయినా ఆడవారికి బాగా పెద్ద వరం లాంటి సూచన. అలాగే మీ ఫుల్ ఫోటో గానీ, నడుము వరకూ ఉండే ఫోటో పెట్టండి. అంతే కానీ కేవలం ముఖం మాత్రమే కనిపించేసేలా ఫోటో ఎప్పుడూ పెట్టకండి. ఎందుకంటే మార్ఫింగ్ లో ఎక్కువగా వాడేది ముఖ బాగమే! ఈ హాఫ్ లేదా ఫుల్ ఫోటో లోని మొఖాన్ని కట్ చేసి యే స్వంత పనికి వాడుకున్నా సరిగా రాదు అది. ఈ విషయాన్ని బాగా గమనించండి.

ఇక అబ్బాయిల విషయములో ఆయితే స్వంత ఫోటో పెట్టుకోవటం చాలా తక్కువ. ఎక్కువగా సినీ తారల ఫొటోస్ పెట్టుకుంటారు. అలా పెట్టుకునే ఎదుటివారు ఫలానా హీరోలా ఉంటారని ఫీల్ అవుతారు అనుకుంటారు కానీ ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు. అయినా ప్రొఫైల్ అంతా మైంటైన్ చేసేది మనమే!.. యే హీరోకి మనం ఎజంట్స్ కాము. అయినా అలాగే మైంటైన్ చేస్తుంటారు. ఇది వారి ప్రొఫైల్ కి పెద్ద మైనస్ పాయింట్. కష్టం మనది, ఫలితం వారిది అని తెలుసుకోరు.

నిజం చెప్పాలంటే ఇలా యే ఫోటో లేని / వారి స్వంత ఫోటో లేని అబ్బాయి ప్రొఫైల్ ని మీ ఫ్రెండ్ లిస్టు లో ఆడ్ చేసుకుంటే - వారు బాగా స్వేచ్చగా కామెంట్స్, స్క్రాపింగ్ చేసే అవకాశం ఉంది. గుంపులో, చీకటిలో, చాటుగా ఉండి ఎవరైనా కామెంట్స్ చెయ్యటం చాలా ఈజీ. నోటికి హద్దు లేకుండా కామెంట్స్ చెయ్యొచ్చు. రేపు ప్రొద్దున ఎంత చెత్తగా వాగినా వారు దొరకడం కష్టం.(అయినా దొరికించుకోవచ్చు. ఆ పద్ధతులు ఇప్పుడు కాదు తరవాత మాట్లాడుకుందాం) చాలా మానసిక బాధని అనుభవించక తప్పదు. ఇది నిజం. ఇది చాలామందికి అనుభవమే!. మగవాడినైన నాకూ ఇలాంటి అనుభవం జరిగింది. స్వలింగ సంపర్కి అయిన హై టేక్ సీటీ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా ఘోరముగా నాతో మాట్లాడాడు. నా స్థానము లో ఆడవారు ఉంటే ఇంకా ఎలా ఉండేదో..! అప్పటిదాకా మిత్రుల డీపీ లమీద అంతగా దృష్టి పెట్టనివాడిని - వెంటనే మేల్కొన్నాను. విరుగుడు గురించి ఆలోచించాను. అప్పుడే తట్టింది. అతని వివరాలు అన్నీ ఒక ఆల్బం లాగా చేసి పెట్టాను. ఇంకా ఎదోచేయ్యాలని అనుకున్నాను. ఒకసారి జరిగితే అనుభవం, రెండోసారి జరిగితే మన తప్పు, మూడోసారి జరిగితే మన మూర్ఖత్వం అని నాకు తెలుసు. అందుకే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను.

చీకటిలో ఉండి - యే ఆధారం కూడా లేకుండా ఉండి, చాటుగా ఉండి, మాట్లాడేవాడు ఎంతకైనా తెగించి మాట్లాడగలడు అనీ. అదే వెలుతురులో ఉండి - అంటే అన్ని వివరాలూ ప్రొఫైల్ లో ఉంటే వారితో వచ్చే చిక్కులు చాలా తక్కువ. అతన్ని ఆడ్ చేసుకునేటప్పుడు, లేదా క్రొత్తలో అలా అన్నీ సేకరించాలి. (అది ఎలాగో ముందు చెబుతాను.)

వెంటనే ఆ ఆలోచనని అమలు చేశాను. ప్రొఫైల్ ఫోటో లేని వారు, లేదా ఆల్బం లో తమ ఫొటోస్ లేనివారిని ఎందరున్నారో గుర్తించాను. "మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను. మీరు మీ ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టుకోండి. లేదా ఆల్బమ్స్ లో నాకు మాత్రమే కనిపించేలా పెట్టండి. నా ఇబ్బందిని మీరు గుర్తించే ఉంటారు. లేకుంటే నాకు జరిగిన అనుభవం వల్ల - నా ఫ్రెండ్ లిస్టు నుండి మిమ్మల్ని తీసేస్తాను" - అని వారందరికీ ప్రైవేటు గా స్క్రాప్ పెట్టాను. ఈ వారం లోగా పది మంది వరకూ వారి వారి ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టేసుకున్నారు. ఇంకొంతమంది తాటాకు బెదిరింపులు అనుకున్నారు. అప్పటికి పెట్టని వారు ఇంకో ఐదుగురు ఉన్నారు. ముందు రోజున మళ్ళీ స్క్రాప్ పెట్టాను - "వారం గడువూ అయిపోయింది. రేపు రాత్రి వరకూ పెట్టకుంటే ఎల్లుండిన ఇద్దరమూ దూరం అవుతాము. మళ్ళీ కలవలేము. జస్ట్ గుర్తు చెయ్యటానికి చెబుతున్నాను.." అని చెప్పాను.

ఒకతని దగ్గర నుండి ఒక రిప్లై ఇలా వచ్చింది. "నేను ఇప్పుడు ఉన్నది అడవి లాంటి ఏరియాలో ఉంటున్నా. ఇక్కడ సౌకర్యాలు ఏమీ ఉండవు. వీలున్నప్పుడు నేను నా ఫోటో దిగి పెడతాను" అన్నాడు. అది నిజమే అనుకుందాము. మొబైల్ కెమరా తో ఫోటో తీసి పెట్టొచ్చుగా. అయినా అడవి లాంటి ఏరియాలోనే నెట్ కనెక్షన్ ఉండి, నెట్ లోకి వస్తున్నాడంటే..  ఇక అతని మాటలు ఎలా నమ్మగలను.? తీసేశాను. నేను అతడికి మరీ అంత పువ్వు పెట్టుకున్నవాడిలా కనిపించానా?

ఇంకో అతను వైజాగ్ లో ఉంటాడు. నా బ్లాగ్ ని రెగ్యులర్ గా చూస్తాడు. అతనేమో - బాగా సీరియస్ అయ్యాడు. ఫోటో పెట్టని వారంతా మోసగాళ్ళు అని మీ అభిప్రాయమా అని. అవన్నీ పట్టించుకోలేదు. నా ప్రాబ్లం నాది మీ ఇష్టం అన్నాను. చివరికి పెట్టి ఇలా తీసేశాడు. ఆ ఫోటో క్లారిటీ లేదు. తను నిజమే ఆయితే ఎందుకు అంత భయం?

ఇక్కడ ఒకటే సూత్రం. మన ముఖ ఫోటో చూసేవారు - వారూ తమవి చూపించటం ధర్మం. నీవి మాత్రం చూపించు, నావి చూపించను అంటే మీకెలా ఉంటుంది.? మనమేమీ అండర్ గ్రౌండ్ డాన్ - దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్.. లతో స్నేహం చెయ్యటం లేదు కదా.. అలాని మీకుంటే నిరభ్యంతరముగా ఆడ్ చేసుకొండి. ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు కూడా తన ఫోటో బయట పెట్టాడు. అదీ హీరోయిజం అంటే!.. స్నేహం అన్నాక నమ్మకం ముఖ్యం. అది లేనప్పుడు ఇక స్నేహం ఎందుకూ!! నేను పెట్టిన గడువు కాగానే వారి ప్రోఫైల్స్ ని నిర్దాక్షిణ్యముగా నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశాను. అప్పటి నుండీ జాగ్రత్తగా ఉంటున్నాను. ఇప్పుడు నిజముగా - చాలా చాలా సంతోషముగా ఉంటున్నాను. డీపీ ఫోటో లేని వారి దిక్కూ చూడటం లేదు. వెంటనే రిజెక్ట్ చేసేయ్యటమే. నేను తొలగించిన ఫ్రెండ్స్ మళ్ళీ రిక్వెస్ట్స్ పెట్టారు. మళ్ళీ అదే కథ. వారు మారరు. బ్లాక్ లిస్టు లోకి చేర్చాక తప్పలేదు. ఎందుకో పక్కా కారణం తెలిశాక కూడా అలాగే ప్రొఫైల్ ఉంచి ఆడ్ రిక్వెస్ట్ పెడితే - అంతకన్నా మించి ఏమి చెయ్యగలను?

అందుకే ప్రొఫైల్ లోనో, లోపల ఆల్బమ్స్ లోనో ఫొటోస్ తప్పనిసరిగా చూడండి. ఉంటే మీకే మంచిది అని గుర్తించండి. వెలుగులో ఉన్నవాడు ఎప్పుడూ అవాకులూ, చెవాకులూ పలకడు. అలా పలకాలి అంటే వారికి చాలా ఇబ్బందే! లేకుంటే మీరే ఇబ్బంది పడతారు. అది మాత్రం నిజం.

ఒక అమ్మాయి ప్రొఫైల్ ఫేక్ అని ఒకరు చాలా నమ్మకముగా చెప్పారు. ఆ అమ్మాయిని తీసేశాను. తనకు ఆ తీసేసిన విషయం తెలీక మామూలుగా స్క్రాప్ చేశారు. అప్పుడు నా అంతట నేనుగా చెప్పాను "మిమ్మల్ని తీసేశానూ.. మీది ఫేక్ ప్రొఫైల్ అనీ.. ఒకరు చెప్పారు. పేరు మాత్రం చెప్పను. మీరు ఫేక్ కాదని నిరూపించుకోండి అప్పుడు ఆడ్ చేసుకుంటాను.." అనీ. "ఫలానా వారు చెప్పారా అలాని..?" అన్నారు. "వారు అని కాదండీ.. నామీద కూడా ఎవరైనా మీకు చెబితే మీరూ నాలా మారరా?.." అని అన్నాను. కొన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకున్న తరవాత ఆమె బాగా ఫీల్ అయినా, వెంటనే సర్దుకొంది. నా భావాన్ని అర్థం చేసుకొంది. అమెరికాలో ఉండే మ్యూచువల్ ఫ్రెండ్ లింక్ ఇచ్చి.. అతన్ని అడగమన్నారు - తను ఏమిటో. ఆరోజే ఆ అమెరికాలో అతన్ని అడిగేశాను. పరిస్థితి వివరించాను. వారిద్దరూ ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్. అంతలోగా ఆవిడ తన ప్రొఫైల్ లో ఫోటో పెట్టేసుకున్నారు. అలా జీవితములో మొదటిసారిగా తన ఫోటో బయట పెట్టేశారుట. ఆ ఫొటోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు.. మార్చటం లేదు. ఇది చాలా మంచి పని. అందుకే ఆడవార్ని ఒక ఫోటో పెట్టుకోని దానికే ఫిక్స్ అయిపొమ్మని చెప్పింది!. నేను చెప్పక ముందే ఆవిడ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. ఆమెని నేను మనసారా అభినందిస్తున్నాను.

వాతావరణ కాలుష్య మార్పులవల్లనో, ఇంకే ఇతర మార్పుల వల్లనో కానీ మొగవారి ముఖాలు 25-30 ఏళ్లకే కాస్త పెద్ద వయస్సు వచ్చిన వారిలా కనిపిస్తున్నారు. అలాని ఫీల్ అయ్యి తరవాత ఇబ్బంది పడుతూ ఉండే బదులు ముందుగా పెట్టేసుకోవటమే బెస్ట్.
ఇప్పుడు మీకు ఒక చిన్న కిటుకు చెబుతాను. బాగా నిద్రపోయాక లేచి వెంటనే మొఖం కడిగి, తయారవుతే ఫొటోస్ బాగా అందముగా వస్తాయి. ఇది బాగా అనుభవమున్న ఫోటోగ్రాఫర్ చెప్పిన కిటుకు ఇది.

అయినా అందమైన మొఖాన్ని చూస్తూ ఫ్రెండ్షిప్ చేసేవారు - చివరికి బోల్తా పడొచ్చు. రూపం ముఖ్యం కాదు. గుణం ముఖ్యం. నా ఫ్రెండ్ చెప్పాడు - వాడు ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ (ఫోటో పెట్టలేదు) తో కొంతమందిని బాగా ఏడిపించాడుట. నన్ను మాత్రం కాదు. అతడి ధాటికి  తట్టుకోలేక కొద్దిమంది అక్కౌంట్స్ డెలీట్ చేసుకున్నారు- ట. నిజం చెప్పాడు నాతో. అందుకే అన్నీ చూశాక - ఓకే చెయ్యండి.

దిండు లాంటి మొహం, ఒక తెల్లని చుడీదార్ తో, మెడలో ఆకుపచ్చని రాళ్లున్న  హారం వేసుకున్న అమ్మాయి ఫోటో పెట్టిన ప్రోఫైల్స్ నేను నాలుగు చూశాను. ఒకే అమ్మాయి ఒకే ఫోటో తో నాలుగు ప్రోఫైల్స్ ఎందుకు పెట్టుకుంటుందో ఆలోచించండి. అందులో ఒక అమ్మాయిని తెలీక ఆడ్ చేసుకున్నాను. తను ఏమీ "వ్రాయదు." అర్ధరాత్రి పన్నెండు తరవాత "ఆవిడ" వచ్చేసి ఎప్పుడో ఒక స్క్రాప్ "వ్రాసేది." మన పేజీల్లో ఏమైనా ఓపెన్ గా ఉంటే చూసి కాపీ చేసుకోవటానికి వస్తుందేమో!..  ఇప్పుడు తీసేశాను.

ఇక వయస్సు విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.. మనం ఆడ్ చేసుకునేవారి వయస్సు ఎంత అని చూడద్దు. స్నేహం లో వయసు చూడొద్దు. అలా చూస్తే మీరు స్నేహం సరిగ్గా చేయలేరు. చాలామంది ఇక్కడే పొరబాటు చేస్తుంటారు. సీనియర్స్ తో మనకేమిట్రా అనుకుంటారు. కానీ అన్ని సీనియర్స్ ఒకేలా ఉండరు. కాలేజి లైఫ్ లో సీనియర్స్ తోడు ఉంటే ఎలా ఉంటుందో చవి చూశామే - అదింకా చిన్న పార్ట్. అంతకన్నా పెద్ద పార్ట్ అయిన జీవితములో ఎందుకు వారి సహచర్యాన్ని వద్దనుకుంటాము.? మనకన్నా సీనియర్స్ తో మాట్లాడితే వారి అనుభవాలు ఎంతగానో బాగా ఉపయోగ పడతాయి కూడా.. ఇప్పుడు నేనైతే తొమ్మిదో తరగతి చదువుతున్న ఆడపిల్ల నుండి - ఇంతే వయస్సున్న మనువలూ, మనవరాలు ఉన్న వారితోనూ స్నేహం చేస్తున్నాను. అన్ని వయస్సులవారూ ఉన్నారు.. అమ్మమ్మలూ, పెళ్ళిళ్ళకి ఎదిగిన పిల్లలున్నవారితోనూ, హై స్కూల్ లో చదువుకుంటున్న పిల్లలున్నవారితో.. బ్రహ్మచారులతో ఇలా.. ఇలా అన్ని రకాలున్నారు. ఇక్కడ స్నేహం ముఖ్యం గానీ వయస్సు ముఖ్యం కాదు. ఈ విషయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.
updated on :
1st : 8-February-2011
2nd : 9-February-2011 morning  
3rd : 11-February-2011 night

Sunday, February 6, 2011

Social NW Sites - 13 - అతని ప్రొఫైల్ పేరూ, ఊరూ డిటైల్స్. వారి ప్రత్యేకత ఏమిటీ?

వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ లింక్ నొక్కి ఆ పేజిలో ఉన్నారు కదా.. ఇప్పుడు ఆ పేజి ఓనర్ పేరు చూడండి. అలాగే ఊరు పేరు కూడా.. ఆడవారయితే ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఊరిపేరు వ్రాసుకోరు. వారి ప్రొఫైల్ పేరూ వేరుగా ఉంటుంది. వారికుండే ఇబ్బందుల వల్ల అలా పెట్టుకున్నారు అనుకుందాం. ఓకే. కానీ అలా వాడేవారు చాలా తక్కువ. చాలామంది ఆడవారు ధైర్యముగా వారి పేరూ, ఊరి పేరూ వ్రాసుకుంటున్నారు. ఇది నిజముగా హర్షించదగ్గ పరిణామం. కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఒక రకముగా ఇదే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అలాని ఎందుకో ముందు ముందు వస్తుంది. ఒక పేరు పెట్టుకొని అ పేరు మార్చకుండా ఉండిపోతే అంతగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మాటిమాటికీ పేర్లు మారుస్తుంటేనే పెద్దగా వారి మీద ఆసక్తి కలుగ చేసుకున్నట్లుగా ఉంటుంది. ఒకే పేరుకి ఫిక్స్ అయిపోతే పెద్దగా ఆసక్తి ఉండదు. అసలు సోషల్ సైట్ వాడు కూడా First name, Last name అని రెండు ఆప్షన్స్ ఇస్తాడు. ఇందులో మొదటి ఆప్షన్ ని మీ పేరుతో ఫిక్స్ అయిపోయి, రెండో లైను ని తరచూ మార్చుకోండి. బాగుంటుంది.


ఇక అబ్బాయిల విషయానికి వస్తే - ప్రొఫైల్ నేమ్ మైంటైన్ చేసేవారు సగం మంది కనిపిస్తారు అంతే!. అందులో వారి ఒరిజినల్ పేరూ ఉండదు, ఊరూ ఉండదు. ఇలాంటివారు మనల్ని ఇబ్బంది చేసే అవకాశం ఎక్కువ. ఆడవారే తమ తమ పేర్లు పెట్టుకుంటూన్నప్పుడు వీరికేం భయం. దర్జాగా పెట్టేసుకోవచ్చుగా.. కానీ పెట్టుకోరు. ఊరిపేరూ నమ్మకం తక్కువే. వారి పేరూ ఉండదు. ఆ పేరూ ఏదోదో ఉంటుంది. ఇక ఊరి పేరు ఆయితే - ఈ భూమ్మీద, మా పక్కింటివారి పక్కింట్లో, మీ హృదయాన.. అన్నట్లుగా వారి ఊరిపేరు పెడతారు. ఎందుకు అంత భయం!. ఆ ఊరికి వచ్చి మమ్మల్ని కలవమని ఇబ్బంది పెడతారు అనా? నాకు తెలిసీ నాకీ అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదు. అయినా అంత తీరిక ఎవరికీ ఉండదు. నాకు - మీరు ఇటువైపు వచ్చినపుడు వచ్చి కలవండి అని ఎన్నో ఆహ్వానాలు వచ్చాయి, ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు.. కానీ నేనే వెళ్ళలేదు. అటువైపు వెళ్ళినా కావాలని కలవలేదు.

ఇక ఈ ఊరిపేరు కూడా చాలా మందివి - ఒరిజినల్ గా ఉండేవి ఒకటి ఆయితే - పెట్టేసుకునేటివి ఇంకొకటి. వారి వారి హొం టవున్ ఒక చిన్న పల్లెటూరు ఆయితే - పేరుకి మాత్రం కాస్త గొప్పగా ఉండేందుకై - వైజాగ్, హైదరాబాద్, బెంగళూర్.. అని పెట్టుకుంటారు. నాకు అలా కొంతమంది కనిపించారు కూడా. ఒక అమ్మాయిది సంగారెడ్డి అయితే హైదరాబాద్ అని పెట్టేసుకుంటుంది. ఇక అబ్బాయిలదైతే ఎన్నో విచిత్రాలు కనిపిస్తాయి. ఇలాంటివారు అన్నీ దాచుకొని సాధించేది ఏమిటంటే - కాస్త స్వేచ్చగా భావోద్వేగాలను ప్రకటిస్తూ ఉంటారు. అవి ఒక్కొక్కసారి / చాలాసార్లు ఎదుటివారిని ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. ఎక్కడైనా తేడా వచ్చినా వారి పేరు, ఊరూ తెలియదు కదా అని వారి ధీమా. ఇక్కడ మీకు నేను ఇచ్చే గొప్ప సలహా ఏమిటంటే : ఇలాంటివారితో - ముఖ్యముగా ఆడవారు జాగ్రత్తగా స్నేహం చెయ్యటం మంచిది.

ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది మొన్న మొన్ననే రీసెంట్ గా జరిగింది. ఇది బాగా ఎడిట్ చేసి పెట్టాను. ప్రోఫైల్స్ అన్నీ లేకుంటే ఎలా మాట్లాడుతారో! చూడండి. మాటలు కూడా ఎడిట్ చేశాను. అయినా మీనింగ్ అర్థం అవుతుంది. గొడవ అసలు ఏదైనా ఉండనీ, తప్పు ఎవరిదైనా ఉండనీ, అపార్థాలు ఏ రూపము లో అయినా ఉండనీ.. కానీ ఇంత ఘోరముగా తిట్టుకోవటం అవసరమా..? నేను సంచనాలకోసం ఇక్కడ ఇది చూపటం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పటానికీ, రేపు మనకూ ఇలా కూడా జరగవచ్చనీ  చెబుతున్నాను అంతే! అంతే తప్ప వేరేగా కాదని నా మనవి.


ఇలా సబ్జెక్ట్ లోనికి వద్దాం.. ఇప్పుడు వారి ఈ డిటైల్స్ చూసి ఒక అవగాహనకి వచ్చేశారుగా. నచ్చితే - GOOD కి ఒకమార్కు, పరవాలేదు అనుకుంటే - FINE కి ఒకమార్కు, నచ్చకపోతే - WASTE కి ఒకమార్క్ వేసుకోండి.

ప్రొఫైల్ పేరు చూడటమే కాదు. ఆడ్ రిక్వెస్ట్ లో వచ్చిన మెయిల్ ID కూడా చూడండి. అందులో అనుమానాస్పదం కూడా ఉంటుంది. వారి పేరుతో మెయిల్ ID ఉంటే - నమ్మదగిన వ్యక్తే అనుకోవచ్చు.. అలా కాకుండా అదీ ఏదో పేరు మీద ఉంటే ఇక్కడ కాస్త అనుమానం పెట్టుకోవచ్చును. ఉదాహరణకి : నేను మీకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టానే అనుకోండి. ఆ రిక్వెస్ట్ తో పాటు మీకు నా మెయిల్ ID కూడా అందులో భాగముగా వస్తుంది. అందులో నా పేరు రాజ్ ఆయితే నా మెయిల్ ID raj@xyz.com అన్నట్లు కాకుండా loverboy@xyz.com అని వచ్చిందే అనుకోండి. అంతే. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈమెయిల్ లో కూడా మీకు దొరకుండా జాగ్రత్తగా ఉంటున్నారన్న మాట. ఆలా కాకుండా ఆ రాజ్ అని పేరు మీద ఇందాకే ఏదైనా మెయిల్ ID రిజిస్టర్ అయి ఉంటే వారు raaj2011@xyz.com అని ఏదో ఒక అంకెలు చేర్చి పెట్టుకోవచ్చుగా.ఎప్పుడూ ఇలా చూడకుండా అలా ఆడ్ రిక్వెస్ట్స్ ఓకే చేసుకోకండి. ఆడ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. లేకుంటే ఇబ్బంది పడతారు.. గాలికి పోయే కంపలని మీదికి తెచ్చుకోవటం అంటే - ఇలా కూడా ఉండొచ్చు.

అందుకే ముందే మేల్కోండి.. మనకి హితువు చెప్పే వారు ఈ ఇంటర్ నెట్ లో ఎవరూ ఉండరు. ఎవడి గోల వాడిదే అన్నట్లు ఉంటుంది. ఎవరూ మీ  గురించి పట్టించుకోరు.  కనీసం షేర్ చేసుకోరు. ఇంకా ఏమైనా అంటే పెద్ద నానా యాగి చేస్తారు. అంతా తెలుసుకునేసరికి నెట్ కే దూరం అయ్యే పరిస్థితి వస్తుంది..

నేను నెట్ కి వచ్చినప్పటి నుండి గమనించాను - నా మిత్రురాళ్ళు ఇలా దూరం అయ్యారు. చాలా భయంకర అనుభవాలు. అవన్నీ వారి జీవితాల్లో పీడ కలలు లాంటివి. ఒకరకముగా చెప్పాలంటే అలాంటివారికి మేలు చెయ్యాలని ఇవన్నీ వ్రాస్తున్నాను. సినిమా కబుర్లు, రాజకీయాలు, పనికి రాని చెత్త ఊసులు వ్రాసి పేజీలు  నింపొచ్చు. కనీసం ఒక్కరికైనా చేరాలనీ, వారికి ఉపయోగపడాలని, ఇదంతా చెప్పటం. ఇప్పటికే ఈ టపాలకి బాగా రెస్పాన్స్ వస్తున్నది. మిత్రుల అభినందనలు బాగానే ఉంటున్నాయి.. నిన్నటి నిన్న ఆ పైన ఫోటోలో అసహ్యముగా మాటలు పడ్డ ఆ అమ్మాయి ని ఇంటర్ నెట్ లోకి రానీయ్యకుండా బాగా కట్టడి చేశారు. బహుశా ఈ జన్మలో ఆ అమ్మాయి నెట్ కి రాలేదేమో. మామూలు చిన్న విషయాన్ని పెద్దగా చేశారు. అందులో తలా పాపం పిడికెడు. సామరస్యముగా ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. లేకుంటే మధ్యలో కలుగజేసుకునేవాడిని. ఇలాంటిదే చిన్న గొడవలో - ఒక అమ్మాయి, అబ్బాయి గొడవ పడితే - కలుగచేసుకొని - ఇక అలాంటిది మళ్ళీ కాకుండా ఆపాను. కానీ ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు ఆపుతారు అని అనుకోకండి. ఎవరూ ఆపరు. వినోదముగా చూస్తారు.

ఇక్కడ నేను చెప్పేది ఒకటే.. సోషల్ సైట్ల లోకి వచ్చే హక్కు అందరికీ ఉంది. తప్పులు మీలో ఉంచుకొని, మన చేష్టలవల్ల ఎదుటివారిని హర్ట్ చేసి , వారిని రాకుండా చేస్తే - బావుకునేది ఏముంటుందో కాస్త ఆలోచన చెయ్యండి. ఇలా ఫేక్ ప్రోఫైల్స్ వాళ్ళనీ ఆడ్ చేసుకొని, ఇంకొందరు అమాయకులు వారిని ఆడ్ చేసుకునేలా వంచించకండి. ఆడ్ చేసుకునే ముందు మ్యూచువల్ ఫ్రెండ్స్ ని అడగటం మంచిది. ఆ ఫ్రెండ్స్ కూడా వీరికి తగిన ఇన్ఫో ఇవ్వటం మంచిది. దారి తెలీనివాడికి - తెలీనప్పుడు నాకు తెలీదు అని చెప్పటం మంచిది కానీ తప్పుదారి పట్టించటం అంత సంస్కారం కాదు.

 (తాజా కలము : ఇది చదివాక అనుకుంటా.. నా మిత్రుడూ, బ్లాగర్ అయిన ఒకతను చాలారోజుల తరవాత ఈరోజు చాట్ కి వచ్చేసి - నేను అడగక ముందే తన ఇన్ఫో ఇచ్చేశారు. అతను స్క్రాప్స్ చాలా తక్కువగా చేస్తుంటాడు. అయినాయన బాధ్యతగా మళ్ళీ చెప్పారు. నా స్నేహితురాల్లో - వారూ పరిఛయం అయిన క్రోత్తల్లోనే తమ తమ ఇంట్రో ఇచ్చారు. అలా ఇవ్వటం మూలానే అనుకుంటా - బాగా క్లోజ్ స్నేహితులమయ్యాము.)

చిన్ని చిన్ని పొరబాట్లు కొందరి సహచర్యాన్ని కోల్పోయేలా చేస్తుంటాయి. మీలో ఎవరి ప్రొఫైల్ అయినా గాని ఇలా ఉంటే - మిత్రులు కానివారు కూడా మీ స్క్రాప్ బుక్ లో స్క్రాప్స్ వ్రాసేలా (ఆర్కుట్) సెట్టింగ్స్ పెట్టుకోండి. అది ఎలాగో ఈ క్రింద చూడండి. ఒకవేళ ఎవరైనా మీ మిత్రులు కాకున్నా వ్రాస్తే - మీకు మాత్రమే, మరియు ఆ వ్రాసిన వారికి మాత్రమే కనిపిస్తుంది. ఏదైనా తేడాగా వ్రాస్తే - వారిని బ్లాక్ చెయ్యండి. అది ఎలా చెయ్యాలో ముందు ముందు టపాల్లో చెబుతాను. Old orkut >; Settings > Privacy కి వెళితే ఇలా వస్తుంది.


ఇలా పెట్టుకోండి. ఒక వేళ మీ స్క్రాప్ బుక్ ఎవరూ చూడొద్దు అనుకుంటే Only friends అని పెట్టుకోండి. సరిపోతుంది. ఇప్పుడు క్రిందన ఉన్న Save changes ని నొక్కండి. ఇప్పుడు హ్యాపీయేనా? నేను ఇలా పెట్టుకున్నందుకూ, నా మిత్రులు పెట్టుకున్నందులకూ నాకు ఆరేడుగురు మిత్రులుగా ఆడ్ అయ్యారు. ఇక పెట్టుకోకుండా (ఏదైనా అడిగే వీలులేక పోయేసరికి) రిజెక్ట్ అయినవారు చాలా మందే ఉన్నారు.  

వారి ప్రత్యేకత : 
ఆ ప్రొఫైల్ అంతా చూశాక - వారిలో మీకు ఏమైనా "స్పెషల్" కనిపించాలి. అలాంటి వారిని ఆడ్ చేసుకోండి. చాలా ప్రోఫైల్స్ రొటీన్ గా ఉంటాయి. ఏమాత్రం స్పెషాలిటీ / రొటీన్ కి భిన్నముగా వారి ప్రోఫైల్స్ ఉండవు. వారిలో టాలెంట్స్ కూడా ఉండవు. ఇదిగో ఇలాంటివారే - ముందే చెప్పానుగా ఇలా ఆడ్ అయ్యి ఓ మూలన నక్కి, మనం ఏమి చేస్తుంటాము అని చూస్తూ ఉంటారు. అదో టైపు ఎంజాయ్మెంట్ వారిది - విండో షాపింగ్ మాదిరిగా. మన ఫొటోస్ చూస్తారు. స్క్రాప్స్ చూస్తారు. ఎవరితో క్లోజ్ గా ఉంటున్నామో, ఏమేమి చేస్తున్నామో.. అన్నీ చూస్తూ వారు మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంటారు. మనకి మాత్రం సంవత్సరములో  ఒక్క రిప్లై కూడా వ్రాయరు. మనం వ్రాసిన వాటికి కూడా ఏమీ రిప్లైస్ స్క్రాప్స్ ఉండవు. ఇలాంటివారు ఉన్నా లేకున్నా ఒకటే. ఇలాంటివారిని కొద్దిరోజులు చూశాక - నేనైతే నా ఫ్రెండ్స్ లిస్టు నుండి పీకేస్తుంటాను.

నాకు ఒక అమ్మాయి అలా ఆడ్ అయ్యింది. బి టెక్ చేసింది. M. Tech చెయ్యక ఇంట్లో ఉన్నది. ఎన్నిసార్లు స్క్రాప్ పెట్టినా జవాబులేదు. తను మాత్రం వేరేవారికి జవాబు ఇస్తూనే ఉంది. నాకు మాత్రం లేదు. వారి ఫ్రెండ్స్ స్క్రాప్ బుక్స్ చూస్తే ఈ విషయం అర్థం అయ్యింది. ఆ విషయం ఆమెకి చెప్పేసి, ఆమెని నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశాను. తను గోల చేసినా పట్టించుకోలేదు. ఆమెని బ్లాక్ లిస్టులో పడేశాను.

ఇలాంటివారిని ఉంచుకుంటే మన ఫ్రెండ్స్ సంఖ్య పెరుగుతుంది. కానీ నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని ఇక్కడ ఎవరూ అవార్డ్స్ ఇవ్వరు. యోగి వేమన చెప్పినట్లు - గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. అన్నట్లు అసలు సిసలు టాలెంట్స్ ఉన్న స్నేహితులు కొందరు ఉంటే చాలు. మీరు సంతోషముగా ఉండాలంటే - ఈ సూత్రాన్ని తప్పక పాటించండి. ఇక్కడికి / మిత్రుల వద్దకి వచ్చేదే రిఫ్రెష్ అవటానికి.

ఇంకో అతను - నా మిత్రురాలు ఆడ్ చేసుకోమంటే - ఆడ్ చేసుకున్నాను. ఇలా ఈ ఆడ్ చేసుకోమని అనే పదం ఎందుకు స్పెషల్ గా చెబుతున్నానూ అంటే - నాకు అతను అంతకు ముందే తెలుసు. ఎక్కడ ఉంటాడో కూడా తెలుసు. ఆడ్ రిక్వెస్ట్ పెట్టడానికి కాస్త ముందుగా తాను ఉండే ఊరి పేరు హైదరాబాద్ నుండి - వుడ్లాండ్స్ స్ట్రీట్, సింగపూర్ అని మార్చుకున్నారు. కానీ ఇండియా ఫోన్ నంబర్స్ మాత్రం అలాగే ప్రొఫైల్ లో ఉన్నాయి. అది గమనించినా, నా అనుభవం వద్దని వారించినా, ఆమె కోరికమేరకు ఏమీ అభ్యంతరం చెప్పకుండా వెంటనే ఆడ్ చేసుకున్నాను. ఒకరోజు వీలు చేసుకొని ఆ ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేశాను.. అవి రెండు నంబర్స్ +91988.... +91970... తో మొదలయ్యే పది అంకెల ఇండియా (ఆంధ్రప్రదేశ్) మొబైల్స్ ఫోన్ నంబర్స్. నాకు అప్పటికే మిత్రులని తీసెయ్యటం మొదలెట్టాను. కానీ నా మిత్రురాలి కోరిక మన్నించి ఆడ్ చేసుకున్నాను. ఆ తరవాత చాలారోజులకి అతన్ని తీసేశాను. తను చెప్పడం వల్ల ఆడ్ చేసుకున్నాను కాదా అని చెప్పి రిమూవ్ చేద్దామని చెప్పాను. అప్పుడు పెద్ద గొడవ. అయినా తన కోసం ఊరుకున్నాను. అప్పుడే తెలుసుకున్నాను. ఆడ్ చేసుకోవటం చాలా ఈజీ కానీ, రిమూవ్ చేసేటప్పుడు పెద్దగా గొడవలు కావచ్చును అని. ముందే చెప్పాగా నమ్మకం ఇక్కడ పునాది. నేను పెట్టేవన్నీ నిజమే ఉన్నప్పుడు ఎదుటివారూ అలా ఉండాలని కోరుకోవటం తప్పుకాదనుకుంటాను. పైననే స్మార్ట్ గై అని పెట్టుకుంటేనే (ఇది దానితో పోల్చితే ఇంకా చిన్న పొరబాటు) తీసేసినవాడిని. ఇక ఎలా కంటిన్యూ అవగలను.

ఇలా చేస్తే నాకు ఒక్కరూ కూడా స్నేహితులుగా మిగలకపోవచ్చును అని శాపనార్థాలు పెట్టినా సరే.. నిజానికి లేకున్నా సరే. చెప్పానుగా గంగిగోవు పాలు గరిటడైనా చాలు అనీ. పది మంది మిగిలినా చాలు. నాకున్న బీజీ లైఫ్ లోనుండి కాస్త రిలీఫ్ కోసం ఈ సోషల్ సైట్లలోకి వస్తే - ఇక్కడా ఇలా ఉండి, ఇక్కడా ఇబ్బంది / కష్టపడడం నాకు ఇష్టం లేదు.
updated on :
1st : 6 - February - 2011 night.
2nd : 8 - February - 2011 night.
3rd : 9 - February -2011 Morning
Related Posts with Thumbnails