Friday, September 17, 2010

మీ జీ మెయిల్ - కాంటాక్ట్స్ లిస్టు.

మీరు జీ మెయిల్ లో చాటింగ్ బాగా చేస్తుంటారా? అవుననే అంటున్నారా? ఓకే.. ఒకసారి మీ జిమెయిల్ ఎకౌంటు చూసుకున్నారా?.. ఏం అని అడుగుతున్నారా?.. ఒకసారి మీ జీమెయిల్ లోని కాంటాక్ట్స్ ని ఓపెన్ చెయ్యండి. అందులో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ  పరిశీలించండి..  మీకు తెలిసిన వాటికన్నా తెలీని మెయిల్ ID లు ఎక్కువగా ఉంటాయి. అవునా... చూసుకున్నారా.. ? ఎక్కడ చూసుకోవాలి అని అంటున్నారా? ఇదిగో ఇక్కడ -ఎర్రని రంగు వృత్తములో చూపిన దగ్గర..


అక్కడ ఉన్న అన్ని గ్రూపుల్లో ఉన్న మీ కాంటాక్ట్ లని ఒక్కసారి పరిశీలించండి. అందులో మీకు తెలిసిన వాటికన్నా తెలీని వారి ఈమెయిలు ID లు ఎక్కువగా ఉంటాయి. (ఇలా ఎందుకు ఉన్నాయి అంటే - మీరు పంపిన మెయిల్స్ వల్ల అలా మీ కాంటాక్ట్స్ లలోకి ఆ మెయిల్ ID లన్నీ ఎక్కేసాయి) మీకు ఆర్కుట్ ఖాతాయే గనుక ఉంటే అందులో మీకు మిత్రులుగా ఉన్న వారి మెయిల్ ID లన్నీ ఇందులో కూడా ఉంటాయి. అలాగే మీ జిమెయిల్ ID లో మీకు తెలిసిన మెయిల్ ID లు కూడా అందులో ఉండొచ్చు. అయితేమిటట? అని మీరు అనవచ్చును..అదే చెప్పబోతున్నాను..

అలా చెత్తగా ఉంచుకునే బదులు.. అనవసర మెయిల్ ID లన్నీ తీసేసుకోండి. అన్ని మెయిల్ ID లు ఉంచుకున్నంత మాత్రాన మీకు ఏమీ ఒరగదు. అదొక చెత్తకుండీ లాగా చెయ్యకండి. ఇది నిర్వహించేముందు ముందుగా మీ పాస్ వర్డ్ ని పటిష్టముగా ఉండేలా మార్చుకోండి. అంటే ఆ పాస్ వర్డ్ ని ఎనిమిది అక్షరాలకి పైగా ఉండేలా చూసుకోండి. అలా ఎన్ని అక్షరాలు ఉంటే అంత భద్రత ఎక్కువ అని మరచిపోకండీ..

అలా ఎందుకు చెయ్యాలో - చెబుతున్నాను. ఇప్పుడు జీ మెయిల్ వాడు క్రొత్తగా అడ్రస్ బుక్ కూడా ఇస్తున్నాడు. అది కావాలీ అంటే జీ మెయిల్ ID తప్పనిసరి. అప్పుడు మీ జీ మెయిల్ అక్కౌంట్ ఓపెన్ చేసినప్పుడు, ఆ కాంటాక్ట్ లిస్టు లోని ప్రతి మెయిల్ ID కి తగిన డిటైల్స్ మరియు ఫోటో కూడా మనం మార్చుకోవచ్చును / పెట్టుకోవచ్చును.
అలా అన్ని వివరాలు అందులో పెట్టుకున్నప్పుడు ఆ మెయిల్ ID కి పాస్ వర్డ్ కి భద్రత బాగా ఉండాలిగా!.. అందుకే అలా చెప్పాను.

అలా సెట్ చేశాక - ఆ కాంటాక్ట్స్ లోని ప్రతి మెయిల్ ID లని పరిశీలించండీ! అనవసరమైన మెయిల్ ID లను గుర్తించి ఆ మెయిల్ ID లను డెలీట్ చేసెయ్యండి. ఇప్పుడు మీ స్నేహితుల మెయిల్ ID ల మీద నొక్కండి. అప్పుడు మీకు ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ మిత్రుడి - ఆర్కుట్ ప్రొఫైల్ పేరు గానీ, స్టైల్ లెటర్స్ గానీ ఉంటే అవి తీసేసి, మామూలు పదాలలో మీరు - మీ ఫ్రెండ్ ని ఎలా గుర్తిస్తారో అలా అందులో వ్రాయండి. అలాగే ఫోటో కూడా అందులో ఎక్కించేసేయ్యండి. అలా ఎలా చెయ్యాలో ఈ క్రింది ఫోటో ఒకసారి చూడండి.   ..


పై ఫోటోలో చూపినట్లు - ఆ ఎర్రని రంగు బాణం గుర్తువద్ద చిన్న డబ్బా కనిపిస్తుందా? అది నిజానికి కనిపించదు. అది ఉన్నది అని కూడా తెలీదు. అక్కడ కర్సర్ ని పెట్టేదాకా ఆ చిన్ని డబ్బా కనిపించదు. అంటే ఆ ఫోటో ప్రక్కన పేరు ప్రక్కకి కర్సర్ తీసుకొస్తే అప్పుడు ఆ బాక్స్ కనిపిస్తుంది. అలా ఆ బాక్స్ కనిపించగానే ఆ చిన్ని బాక్స్ ని నొక్కితే అప్పుడు ఎడిట్ బాక్స్ ఇలా వస్తుంది. 


ఈ బాక్స్ లో అంతకు ముందున్న వారి పేరు తీసేసి (మార్క్ చేసేసి, బ్యాక్ స్పేస్ / డెలీట్ చేసి) మీరు క్రొత్తగా వారి పేరుని టైప్ చేసి క్రింద ఉన్న Save బటన్ ని నొక్కితే సరి. ఇక వారు ఎన్ని పేర్లు మార్చినా ఇక మీకు ఇబ్బంది ఏమీ ఉండదిక. చాట్ చేస్తున్నప్పుడు ఎవరితో చేస్తున్నామో మనకు స్పష్టముగా తెలుస్తుంది. వారు ఛాట్ పింగ్ చెయ్యగానే వెంటనే రెస్పాండ్ అవచ్చు. ఇది చాలా చిన్న విషయమే గానీ, చాలా మందికి తెలీదు. అలాగే వారి ఫోటో ఉంటే ఆ ఫోటో కూడా పెట్టేస్తే..ఇంకా బాగుంటుంది. అలాగే వారి వివరాలు కూడా అన్నీ ఫీడ్ చేసుకోవచ్చును.
Related Posts with Thumbnails