Monday, April 19, 2010

Word Verification in Blog

కొంతమంది  బ్లాగర్లు వారి వారి బ్లాగుల్లోకి వచ్చి కామెంట్స్ వ్రాయమంటారు. సరే అని వారి ఆహ్వానాన్ని మన్నించి వారి బ్లాగుల్లోకి వెళతాము కదా. లేదా మనమే ఇతరుల బ్లాగుల్లోకి వెళ్లుతాముగా. వారు వ్రాసినది చదివి.. తీరా కామెంట్ వ్రాసే సమయానికి 6-8 అక్షరాలుండే వర్డ్ వెరిఫికేషన్ అంటూ వస్తుంది. అలా పెట్టకండి. దానివల్ల లాభం ఏమీ లేదు. విజిటర్స్ ఇలా చదివేసి ఆహా, ఒహొ మనసులో అనుకొని, ఇది మనకి పనికొస్తుందా (?) అని ఆలోచిస్తూ వెళ్ళిపోతారు గాని కామెంట్స్ ఏమీ వ్రాయరు. అతి కొద్ది మంది మాత్రం వ్రాస్తారు. ఇలా వ్రాసేవారికి అడ్డం పడ్డట్టు ఆ వర్డ్ వెరిఫికేషన్ వస్తుంది. అదిచూసాక కామెంట్స్ వ్రాసే వారికి ఒక్కోసారి మూడ్ ఉండదు. వ్రాసేవారు సగములోనే డ్రాప్ అవుతారు. నాకైతే మరీనూ! మొన్న ఇలాగే వ్రాయబోయాను. కాని ఈ అష్టవంకర్ల పదాన్ని చూసి  రెండుసార్లు  ఫెయిల్  అయ్యాను. మూడోసారికి వ్రాసేశాను. ఎందుకో  అనీజీగా అనిపించింది. అందుకే ఇదంతా చెప్పటం. అందుకే ఎవరైనా అలా వర్డ్ వెరిఫికేషన్ పెట్టుంటే తీసేయండి. అది ఎలా అంటే:
  • ముందుగా బ్లాగ్ హోం పేజీలోకి వెళ్ళండి.
  • అందులో ఉన్న సెట్టింగ్స్ నొక్కండి.
  • ఆతర్వాత అందులో  Comments  అనే బార్ మీద నొక్కండి.
  • అప్పుడు ఓపెన్ అయ్యే పేజిలో దాదాపు సగము పేజి క్రింద మీకు ఇలా కనపడుతుంది.
  • అందులో Show word verification for comment? అని ఉంటుంది. అక్కడ NO అని ఎంచుకోండి.
  • చివరిగా Save settings 2 ని నొక్కండి అంతే! వర్డ్ వెరిఫికేషన్ తొలగిపోతుంది.
నేనూ మొదట్లో తెలీక పెట్టాను. కామెంట్స్ ఉండేటివి కావు. (నాలా ఎంతమంది ఇబ్బంది పడ్డారో!) ఎవరూ చూడటం లేదోనని నేనూ బ్లాగుని పట్టించుకోలేదు. ఆ తరవాత కొద్దిగా అప్పుడప్పుడూ వ్రాస్తుంటే.. ఒకతను "అలా వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి. ఇబ్బందిగా ఉంది" అంటే వెంటనే తీసేసాను. (భాషా రజనీ స్టైల్లో - ఈ కామెంట్స్ వ్రాసేవారు ఒక్కరు చెబితే వందమంది చెప్పినట్లే - అనుకోవాలి) అలా వ్రాస్తుంటేనే బ్లాగర్లకి సంతోషం వేసి "నాబ్లాగుని చాలామంది చూస్తున్నారు.. " అనుకుంటూ ఇంకా మంచి మంచి విషయాలు చెప్పటానికి ప్రయత్నిస్తారు. స్కూల్ పిల్లాడికి నోట్బుక్ లో "Good" అని వ్రాస్తే ఎలా పొంగిపోయి ఇంకా బాగా చదువుతాడో అలాగా అన్నమాట! ఏమైనా మంచి విమర్శలు చేయాలనిపించినప్పుడు, మీకు ఇబ్బంది అనిపిస్తే (పేరు, డిటైల్స్ తెలుస్తాయి అనుకుంటే)  పోస్ట్ బాక్స్ లో టైప్ చేసాక క్రింద Anonymous అని ఉంటుంది అది క్లిక్ చేసి పోస్ట్ చెయ్యండి. ఇదిగో ఇలా:


ఇక్కడ:
  • 1 వద్ద మీ కామెంట్ ని టైప్ చెయ్యండి. సాధారణముగా ఇంగ్లీష్ లో వస్తుంది. తెలుగులో వ్రాయాలంటే తెలుగు లిప్యంతరము లో వ్రాసి కట్ లేదా కాపీ, పేస్ట్ పద్దతిలో ఇక్కడ పెట్టాలి.
  • 2 వద్ద క్లిక్ చెయ్యండి.
  • 3 వద్ద Publish your comment ని నొక్కండి. - అంతే!
  • Email follow-up comments to వద్ద చిన్న బాక్స్ ఉందిగా, ఇది అంతగా ఉపయోగం ఉండదు. అక్కడ క్లిక్ చేస్తే, ఆ పోస్టుకి మీ తరవాత ఎవరైనా కామెంట్స్ వ్రాస్తే వారి కామెంట్స్ మీకు ఈ మెయిల్ రూపములో అందుతాయి. ఒకవేళ మీరు ఏదైనా అభ్యంతకరమైన / మెచ్చుకోలు కామెంట్ పోస్ట్ చేస్తే, ఆ కామెంట్ మీద / పోస్టు మీద ఎవరైనా ఇంకో కామెంట్ వ్రాస్తే.. అది మనకి ఈ మెయిల్ రూపములో అందుతుంది. అలా ఇది ఉపయోగపడుతుందన్నమాట. అంటే  ఆ పోస్ట్ మీద వచ్చే కామెంట్స్ అన్నీ ఆ బ్లాగర్ కి మాత్రమే కాకుండా మీకు కూడా వస్తాయి. ఇదేదో బాగుందని క్లిక్ చేసేరు.. మీ మెయిల్ బాక్స్ వీటితోనే నిండిపోవచ్చు. అయినా మన పనులన్నీ వదిలేసి ఎవరేమి వ్రాస్తున్నారా అని ఎదురుచూడటమే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త !!

2 comments:

prasad said...

hello sir who ever it might be see you wrote a spelling mistake వెడతాము its వెళతాము I feel you must remove this article

Raj said...

Thankyou.. మీ అభిప్రాయం చెప్పినందులకి కృతజ్ఞుడిని. వేరే వారికీ నచ్చకుంటే ఈ ఆర్టికల్ తీసేస్తాను.

Related Posts with Thumbnails