మీరున్న ఊర్లో గానీ, వేరే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికైనా పర్యాటక ప్రదేశానికి వెళ్ళినప్పుడో, ఆఫీస్ పనిమీద వేరే నగరానికి వేల్లాల్సివచ్చినప్పుడో, లేదా ఊరుకాని ఊరులో మీకు అత్యవసరముగా :
కంపనీ,
వస్తువుల తయారీ గురించి,
సేవల రంగం,
హాస్పిటల్,
సినిమా టాకీస్,
బ్యాంక్,
అన్ని విద్యాసంస్థల,
ప్రభుత్వ కార్యాలయాల,
RTC బస్ స్టాండ్,
రైల్వే స్టాండ్,
విమానాశ్రయం,
పూల గుచ్చాల విక్రేత,
టూరిస్టు గైడు,
టాక్సీ ఏజంటు,
మంచి సౌకర్యాల వసతి గృహాలు,
భీమా కార్యాలయాలు,
భీమా ఏజంట్లు,
జేవేల్లరీ షాపులూ,
సూపెర్ మార్కెట్స్,
బట్టల కొట్లూ..
వైద్యులూ,
బ్యూటిషియన్స్,
...
...
...
ఆఖరికి శ్మశాన వాటికల (లభ్యత ఉంటే)
ఇలా ఎవరిదైనా అడ్రెస్ & ఫోన్ నంబర్ కావాలా? మీరేమీ గాభరా పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు నెట్ ఓపెన్ చేసి http://www.justdial.com/ అని లాగిన్ అవ్వడమే..
మీకు భారతదేశములో 240 పైగా నగరాలలోని మీకు యే వివరాన్నైనా చిటికెలో అందిస్తుంది. ఒకవేళ మీరు నెట్ దూరముగా ఎక్కడో ఉన్నారే అనుకుందాము. వీరిని ఫోన్ లో కూడా సంప్రదించొచ్చు. అదెలాగో కూడా చెబుతాను..
(మీరు హైదరాబాద్ వాసులు అయితే 040 STD కోడ్ వాడాలి. వేరే నగరాల వారైతే ఆయా నగరాల కోడ్ వాడాలి. ఉదాహరణకి: ఢిల్లీ = 011 , ముంబై = 022, చెన్నై = 044 ఇలా..)
- ఇప్పుడు మీ మొబైల్ నుండి మీ దగ్గరలోని నగరం STD కోడ్ + 69999999 లేదా 244444444 కలిపి డయల్ చెయ్యండి. ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్ లోని, హైదరాబాద్ నగరం లోని ఆ సంస్థకి ఫోన్ చేయాలి అంటే 04024444444 నంబర్ లేదా 04069999999 కి ఫోన్ చేస్తానన్న మాట.
- కాల్ కలవగానే ఒక ఆపరేటర్ మీతో మాట్లాడుతాడు. మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాడు.
- మీకు దేని గురించి సమాచారం కావాలో దాన్ని గురించి వారికి మీరు చెప్పండి.
- వారు ఆ మనమడిగిన సమాచారం గురించి ఏమైనా డిటైల్స్ ఉన్నాయో వారి వద్ద నున్న సిస్టమ్ లో చూస్తారు.
- అలా చూసాక ఇంకా మనకి ఆ సమాచారం లోని ఇంకా డిటైల్స్ ఇంకా ఏమైనా కావాలా అడుగుతారు.
- ఆ తరవాత మీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్.. అంటే మీ పేరు, ఊరు, ఏమి చేస్తుంటారు, మీ ఫోన్ నెంబర్.. ఇలాంటివి అడుగుతారు. మీకిష్టముంటే చెప్పవచ్చు, లేకుంటే లేదు. ( నేనైతే నా పేరు రాజ్ అని.. ఇంకొన్ని విషయాలు చెప్పాను. నేనెప్పుడు ఫోన్ చేసినా "Hello Good morning RAJ.." అంటూ పలకరిస్తారు.. అంటే నా నంబర్ వారివద్ద ఫీడ్ అయి ఉంది. )
- మా సర్వీస్ వాడుకున్నందులకి ధన్యవాదాలు చెప్పి, ఆ ఇన్ఫర్మేషన్ మనకి యే ఫోన్ నంబర్ కి రావాలో ఆ ఫోన్ నంబర్ అడుతుతారు. మన మొబైల్ నంబర్ చెబితే థాంక్స్ చెప్పి.. లైన్ ని ముగిస్తారు.
- ఆ ముగించిన మరుక్షణం లోనే మనం అక్కడ చెప్పిన మొబైల్ నంబర్ కి SMS పంపిస్తారు. వారి వద్ద ఎంత సమాచారం ఉంటే అంత. అంటే ఉదాహరణకి మీరు ట్రావెల్స్ వారి గురించి అడిగితే మీరు అప్పుడు కాల్ చేసిన ఏరియాలో దగ్గరగా ఉన్న ట్రావెల్స్ ఏజంట్ల అడ్రస్ (పోస్టల్ అడ్రెస్ అంత క్లియర్ గా) + వారివి ఎన్ని ఉంటే అన్ని ఫోన్ నంబర్స్ మనకి SMS రూపములో వస్తాయి.
- ఈ సమాచారాన్ని SMS అందుకున్నందులకి మన వద్ద ఒక్క నయా పైసా కూడా చార్జ్ చేయరు. అంటే మనం వారికి చేసిన లోకల్ కాల్ మాత్రమే మనకి ఖర్చు.
- నేనీ సర్వీసుని గత పదేళ్ళ పైగా నుండీ వాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోన్ నంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటాను. అక్కడ నాకేమి అవసరం వచ్చినా వెంటనే వీరికి ఫోన్ చేసి నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ SMS ద్వారా అందుకుంటాను.
1800JUSTDAIL లేదా 1800 5878 3425 (మీకు అర్థం కావాలని విడిగా వ్రాసాను.. కాని అంతా ఒక్కటే = 180058783425 ) కి ఫోన్ చెయ్యండి.
మీరు ఏమైనా థాంక్స్ చెప్పుకోవాలని అనిపిస్తే వారితో నేను ఇంట్రడ్యూస్ చేసానని చెప్పండి.. నాకొక "తుత్తి" మిగులుతుంది.
3 comments:
Nijame! Thanks a lot..
Please put more useful topics..
సమాచారం బాగుంది.కానీ... శీర్షిక Just Dial service అని ఉండాలి.
పొరపాటు చెప్పినందులకి కృతజ్ఞతలు..
Post a Comment