Sunday, April 18, 2010

నోకియా ఫోన్ కోడ్స్

మీరు నోకియా ఫోన్ వాడుతున్నారా? అయితే కొన్ని మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ కోడ్స్ ఇప్పుడు మీకు చెబుతాను. 

1. *#0000 # అని మొబైల్ ఫోన్లో టైప్ చేస్తే ఆ  ఫోన్ మోడల్ వెర్షన్ ఏమిటో తెలుస్తుంది. అంటే ఆ మోడల్ ఎన్నో తరం లోనిది, ఆ సాఫ్ట్వేర్ ఎప్పటిదో ఆ తేదీ.. అన్నది మీకు తెలుస్తుంది.

2. *#06#  అని టైప్ చేస్తే మీ మొబైల్ తాలూకు IMIE నంబర్ తెలుస్తుంది. IMIE అంటే International Mobile Equipment Identity అని అర్థం. ప్రతి మోటారు వాహనానికి బాడీ నంబర్, చాసిస్ నంబర్ అంటూ ఎలా ఉంటుందో అలాగే మొబైల్ పరికరానికి కూడా అలాగే ఉంటుంది. ఇది ఎందుకంటే మనం చేసే ప్రతి కాల్ ఈ నంబర్ ని జత చేసుకుంటూ అవతలివారికి వెళుతుంది. ఆపరేటర్స్ కి మాత్రం తెలుస్తుంది. - మీరు మీ మొబైల్ నంబర్తో కాల్ చేసినప్పుడు, సిమ్ నంబర్తో బాటూ మొబైల్ యూనిట్  IMIE వారివద్ద  రిజిస్టర్ అవుతుంది.

3. *#92702689# ఈ నంబర్ నొక్కితే మీ మొబైల్ యూనిట్ యొక్క తయారు తేదీ, IMEI నంబరూ, రిపైర్స్ ఏమైనా ఉన్నాయో ఆ వివరాలు, ఆ మొబైల్ ని ఎన్ని గంటలు వాడామో (అంటే ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ ) ఆ వివరాలు తెలిపే లైఫ్ టైమర్ కూడా ఉంటుంది. లైఫ్ టైమర్ ని మార్చడం వీలుకాదు. కొండకచోట సాఫ్ట్వేర్ కీ తెలిసినవారు మారుస్తారు.

4. *#7370#  ఈ కోడ్ నొక్కితే మీ ఫోన్ ఫాక్టరీ సెట్టింగులలోకి వెళుతుంది. అంటే ఆ ఫోన్ తయారు చేరుసాక మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మీ సిమ్ లోని నంబర్లతో బాటూ మీ మెస్సేజ్ బాక్స్ , కాల్ డిటైల్స్ అన్నీ డెలీట్ అవుతాయి.. మీరు మార్చుకున్న సెట్టింగులన్నీ అన్నీ పోయి - మీరు కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా మారిపోతుంది.

5. 12345 ఇది కూడా పైన లాగానే పని చేస్తుంది. దీన్ని మనం సెట్టింగులలోకి వెళ్లి, restore factory settings అన్న దాంట్లోకి వెళ్ళితే కోడ్ అడుగుతుంది. ఈ నంబర్ ని నొక్కితే మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే  మారిపోతుంది.  అలాగే  కాల్  టైమర్స్ ని కూడా 00:00.00 గా చేసుకోవచ్చు. బయట ఫోన్ ఎంత దుమ్ముగా ఉన్ననూ లోపల కాల్ టైమర్స్ లాగ్ చూస్తే క్రోత్తఫోన్ లా ఏదో కొద్ది గంటలు మాత్రమే వాడాము అన్నట్లు చూపించుకోవచ్చు. దీన్ని ఇంకో రకముగా కూడా వాడొచ్చు. ఎలా అంటే: ప్రతినెల మొదటి తారీఖున ఇలా అన్నీ జీరోలు చేసుకుంటే.. నెల చివరి రోజున మనం ఎన్ని నిముషాలు డయల్ కాల్స్   చేసాము, ఎన్ని నిముషాల ఇన్కమింగ్ కాల్స్ విన్నాము, మొత్తం ఎన్ని నిముషాలపాటు చెవిదగ్గర ఉంచుకున్నమో తెలుస్తుంది.

6. *(కాల్ బటన్)3 ఈ మూడు బటన్స్ ని ఒత్తిపట్టుకొని, మీ మోబిల్ స్విచ్ ఆన్ చేస్తే మీ మొబైల్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ మళ్ళీ కొత్తగా మారుతుంది. అంటే ఫాక్టరీ సెట్టింగ్స్, ఫోన్ మెమొరీ ని పూర్తిగా క్రొత్తగా ఫార్మాట్ చేస్తుంది. ఈ పద్ధతి వైరస్ అంటిన ఫోన్లకి చాలా అనువైనది.

7. *#3370#  ఈ కోడ్ నొక్కితే రెండు సిమ్ లు వాడుతున్నట్లయితే స్వాప్ చేసుకోవచ్చు. అంటే సిమ్ 1 లో ఉన్నది సిమ్ 2 లోకి, అలాగే సిమ్ 2 లో ఉన్నది సిమ్ 1 లోకి  మారుతుందన్నమాట. ఇది అన్ని మొబైల్స్ లో ఉండదు. కొన్నింట్లోనే ఉంటుంది.

9 comments:

Anonymous said...

థాంక్ యు సార్ మొబైల్ లో తెలుగు బాష software ఎలా?ఎక్కడ నుండి డౌన్లోడ్ చేయాలి?

Raj said...

ఆ మధ్య అలా కూడా సాఫ్ట్వేర్ వచ్చింది. కాని అంతగా ఉపయోగం లేదు. చిన్న వాక్యానికే ఒక యూనిట్ అవుతున్నది. "పుట్టినరోజు శుభాకాంక్షలు" అని వ్రాస్తే చాలు ఒక యూనిట్. టైపింగ్ అంత ఈజీ గా లేదు. ఇంకోటి స్క్రీన్ రెజల్యూషన్ కూడా బాగుండాలి. సాంకేతికముగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. బాగా ఖర్చు చేసేయ్యాల్సి వస్తుంది. అంత చేసినా పెట్టిన పెట్టుబడి రావటం కష్టం.. హై ఎండ్ ఫోన్ కావాలి. అందుకే అది సక్సెస్ కాలేదు.

Bindu said...

చాలా మంచి సమచారం అందిస్తున్నారు, చాల థాంక్స్ అలాగే మెమొరి కార్డ్ లో ఉన్నవి డెలెట్ అయినప్పుడూ తిరిగి వాటిని ఎలా రికవరి చేసుకోవాలో చెప్పగలరూ, ఎందుకంటే నా మెమొరి కార్డ్ లోని కొన్ని ముక్యమైన ఫొటొస్ డెలెట్ అయ్యాయి, వాటిని ఎలా రికవరి చేసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి? దయచేసి చెప్పగలరూ........

Raj said...

తప్పక చేబుతానండీ.. దానికోసం ఒక పోస్ట్ తవరలోనే వ్రాస్తాను.. ఎదురు చూడండి. అంతవరకూ ఆ మెమొరీ కార్డ్ ని వాడకుండా అలాగే అట్టి పెట్టండి. అలాగే వాడితే, ఏదైనా అందులోకి నింపితే పాత ఫొటోస్ డిలీట్ అవుతాయి.

ఆ.సౌమ్య said...

బావుంది...కానీ మొదటి రెండు ప్రయత్నించాను. unknown application అని వచ్చిందండీ :(

Raj said...

ఆ మొదటి రెండూ తప్పకుండా వస్తాయి. ఈ ఫోన్స్ కోడ్స్ అన్ని నోకియా మాడల్లకి రావండీ.. కొన్ని మాడల్స్ కి కొన్ని కోడ్స్ ఉంటాయండీ.. ఒక్క నోకియా లోనే వందల సంఖ్యలో మాడల్స్ ఉన్నాయి. ఒక్క కోడ్ అన్ని ఫోన్స్ కీ వర్తించవు.

Bindu said...

మెమొరి కార్డ్ లో ఉన్నవి డెలెట్ అయినప్పుడూ తిరిగి వాటిని ఎలా రికవరి చేసుకోవాలో ఆ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను అన్నారు.. కాని దాని గురించి ఇంతవరకు పోస్ట్ రాయలేదు, ఇది మీకు న్యాయమేనా చెప్పండి??? ఆ పోస్ట్ కోసం ఎదిరి చుస్తున్నాను.. దయచేసి తొందరగా ఆ పోస్ట్ రాయగలరు.
ధన్యవాదములు.......

ratan said...

sir ur blog is ultimate sir really.wow i got somuch info sir.really thank ful to u.sir wat is write protection due to this prob iam not able to copy anything to my memory card

Raj said...

రతన్ గారూ.. ! మీరు చెప్పినది - కాస్త మరింత వివరముగా చెప్పండి. మీరు అంటున్నది మొబైల్ మెమొరీ కార్డ్ లేదా డిజిటల్ కెమరా లోని మెమొరీ కార్డ్?? ఫొటోస్ లేదా మ్యూజిక్ ని కాపీ చెయ్యటం రావటం లేదా.. లేక అందులోకి వెయ్యటం రావటం లేదా?

Related Posts with Thumbnails