Monday, January 25, 2010

SMPS problem

నా కంప్యూటర్ మైంటైన్ చేసి చాలా రోజులయ్యింది. రోజూ పైన దుమ్ము దులుపుతున్నాను గాని లోపల అసలు పట్టించుకోలేదు. అసలు ఎవరమూ పట్టించుకోము అని తెలిసి నాలాంటి వాళ్ళూ ఇంకా ఉన్నారని నాకింత కాసింత ధైర్యం వచ్చింది. నేను నా బ్లాగులో  Computer - Dust  అనే టపా (అది లింక్. నొక్కి చూడండి) వ్రాసాక, నా సిస్టాన్ని కూడా ఓ చూపు చూడాలి అనుకున్నాను. అనుకుంటూనే ఉన్నాను గాని ఎప్పటికీ వీలవటం లేదు. ఈమధ్య సిస్టం ఎందుకో మధ్యలో (కరెంట్ ఉన్నా, UPS ఉన్నా కూడా) ఆగిపోతున్నది. అంటివైరాస్ కూడా అప్డేట్ అవుతూనే ఉంది. ఇద్దరు ముగ్గురిని అడిగితే వైరస్ పట్టుకుంది ఇంకో అంటివైరాస్ ప్రోగ్రాం లోకి మార్చుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ఎందుకో ఒకసారి బయటనుండి సిస్టాన్ని చూద్దామని పరిశీలిస్తే SMPS లోని ఫ్యాను తిరగటం లేదు. చిన్న వూచతో త్రిప్పి చూసా. అది చాలా గట్టిగా జామ్ అయ్యింది. ఇక లాభం లేదని నిన్న ఆదివారం నాడు విప్పి చూడాలని, దాని సంగతేమిటి చూడాలని నిర్ణయించాను.

నిన్న నాకు వీలుకాలేదు. అయినా "నన్నూ చూడు, నా సంగతి చూడు.." అన్నట్లు మాటి మాటికీ ఆగిపోవటం మొదలెట్టింది. కనీసం పది, పన్నెండుసార్లు ఇలా ఆగిపోయున్డొచ్చు. ఇక లాభం లేదని దీన్ని ఓ పట్టు పట్టాలని డిసైడ్ అయ్యాను. CPU కు ఉన్న కనెక్షన్లన్నిటిని తొలగించి తీసేసి, విప్పాను. కొద్దిగా దుమ్ము. నయమే బాగానే మైంటైన్ చేస్తున్నానే అనుకున్నాను. మెల్లగా SMPS కూడా విప్పాను. (నేనేమీ హార్డ్ వేర్ కోర్సుల్లాంటివి ఏమీ చెయ్యలేదు). దాని లోని ఫ్యాన్ కూడా విప్పాను. విడి భాగాలన్నిటినీ శుభ్రముగా తుడిచి, జిడ్డుని కిరసనాయిలుతో తుడిచి, కాసింత నూనె దట్టించాను. ఆ తరవాత యధావిధిగా దాన్ని బిగించేసాను.. నాసిస్టం కి ఉన్న నాలుగు ఫ్యానుల్లో ఇదొక్కటే ఇబ్బంది పెట్టి ఆగిపోయేలా చేసింది. దీని వల్ల కొన్ని విషయాలు నేర్చుకున్నాను. కారణం ఏమిటో తెలుసుకున్నాను. అలా ఇబ్బంది ఏర్పడితే ఎలా ఆ ఇబ్బంది తొలగించాలో తెలుసుకున్నాను. అందులోని ఫ్యాను ని ఎలా రిపైర్ చెయ్యాలో నేర్చుకున్నాను. అలా చేసాక నన్నూ నేను సెహభాష్ అని మెచ్చుకున్నాను - ఎందుకంటే నాకేమీ తెలీదు ఎలా రిపైర్ చెయ్యాలి అయినా చేసాను గనుక.

No comments:

Related Posts with Thumbnails