Sunday, January 24, 2010

కృతజ్ఞతలు

ప్రియమైన బ్లాగర సోదర, సోదరీమణులలారా,
మరియు నెటిజనులలారా..

నా బ్లాగుని అతి కొద్ది కాలములోనే చాలా మంది చూసారు.. పదివేల సందర్శకుల సంఖ్యను దాటిన సందర్భములో మీకు నా ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇదేమీ నా గొప్పగా ఫీల్ అవటం లేదు. ఆ క్రెడిటంతా మీదేనని సవినయముగా తెలియజేసుకుంటున్నాను. 

నేను ఈ రేటింగులు పొందటానికి మాత్రం ఇలా కష్టపడుతున్నానని మీరు అనుకుంటే పప్పులో, చారులో, పెరుగులో... కాలేసినట్లే. అదేమీ లేదు. ఒకరకముగా నేను ఈ బ్లాగుని నా కిష్టమైన ఫోటోలు, అనుభూతులు, అభిప్రాయాలు, పాటలు, ఇతరులకి ఎప్పుడైనా చూపించుకోవాలనుకునేవీ.. దాచుకొని మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నవి మాత్రం ఇందులో ఉంచుకుంటున్నాను. అంతే తప్ప లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లోకి గాని, గిన్నీస్ బుక్ అఫ్ లోకి గాని ఎక్కాలని మాత్రం లేదు. అసలు అలాంటి ఉద్దేశ్యాలు మాత్రం ఏమీ లేవు. అసలు మిగతా బ్లాగులతో ప్రక్కన పెట్టి పోల్చటానికి - నా బ్లాగుకి  అంత అర్హత లేదు. ఆ అర్హత రావటానికి నేను ఇంకా చాలా ప్రయత్నించాలి. మీ అందరి సహకారముతో  ప్రయత్నిస్తాను. 

ఇంకొద్ది క్రొత్త, క్రొత్త విషయాల్లో మీకు మేలు చేద్దామని ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ ఒక కొలిక్కి రావటానికి కొద్ది సమయం పడుతుంది. నా బుడి, బుడి నడకలు, తప్పటడుగులూ ఆదరిస్తారనీ ఆశిస్తున్నాను. సాంకేతికముగా నేను చాలా అల్పుడని. ఇంకా నేర్చుకున్నాక మీకు మరిన్ని టపాలు చేస్తాను.

No comments:

Related Posts with Thumbnails