Tuesday, January 26, 2010

తాళం చెవి - ఖరీదు

చాలారోజుల క్రిందట నా మిత్రునికి జరిగిన అనుభవం.

నగదు పెట్టె యొక్క తాళం చేతులు ఎక్కడో పడిపోయాయి. ఎక్కడ పడిపోయాయో అతడికి తెలీదు. తనకి నమ్మకస్తుడైన పనివాడు ఉండటముతో వెదికి, వెదికి చివరకి మారు తాళాలు చేపించి వాడటం మొదలెట్టాడు. ఆ పాత తాళాల గురించి అసలే మర్చిపోయాడు. ఆ తరవాత వాడి "పని" పట్టడం మొదలయింది.

ఆ నగదు అలమారా పెట్టెలో ఎన్నో రకాల విలువైన వస్తువులు ఉండేడివి. రోజు రోజుకూ వస్తువులు తక్కువ అవటం జరిగేది. ఏమిటాని ఎన్నిసార్లు గమనించినా ఎక్కడ లోటు అవుతుందో తెలిసేది కాదు. వంద రూపాయల బండిల్, ఐదు వందల బండిల్ ఉన్నా దాన్ని లెక్కించి పెట్టినా ఒకటి తక్కువ వచ్చేడిది. ఏమిట్రా ఇంత తక్కువగా వస్తున్నాయని అనుకున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్కువ అయ్యేడివి. ఒకసారి నేనే ప్లాన్ చెప్పాను. ఆ డ్రాయర్ కి గుండుసూది పెట్టమని చెప్పాను. అంటే ఆ డ్రాయర్ తెరిస్తే ఆ సూది పడిపోతుంది. అలా వాడు దొరికాడు. ఎలా తీసావు అంటే నీవే తాళం వేయలేదు అని తప్పించుకున్నాడు. ఇలా కాదని ఇంకోడిని మారిస్తే వాడూ అంతే! ఆ తరవాత ఇంకోడు.. వాడూ అంతే! ఇక లాభం లేదని పనివాల్లని ఉంచుకోక వాడొక్కడే ఉంటున్నాడు. తీరిగ్గా లెక్కిస్తే వాడు మూడు, మూడున్నర లక్షల దాకా అలా కోల్పోయ్యాడు. దీని రేమెడీ తరవాత దొరికింది.

ఇదే పరిస్థితిని ఫ్రెండ్స్ మధ్య చాట్ లో చెబితే మా గుంపు లోని వారిలో ఒకడు ఏమన్నాడంటే - తాళాలు పోతే వెంటనే తాళమే మార్చాలి. తాళం దొరికినా వాడేమీ చెయ్యలేడు. ఆ క్రొత్త తాళం కూడా ఆ పాత తాళం చెవికి భిన్నముగా ఉండాలి. - అని. అవును అప్పుడు అర్థమయ్యింది. క్రొత్త తాళం ఖరీదు కేవలం 40 రూపాయలనుండి 80 రూపాయల వరకూ ఉంటుంది. ఫిట్టింగ్ కి 20 వేసుకున్నా మొత్తం వంద రూపాయల్లో అయిపోతుంది. ఈ విషయం తెలీక వంద రూపాయలకోసం చూసుకుంటే మూడు, మూడున్నర లక్షలు స్వాహా అయ్యాయి. ఆ ముగ్గురూ పనివాళ్లు ఉన్నప్పుడు ఆ పాత తాళం ఉండెడిది. అందులో వారు చాలా ప్రొఫెషనల్ గా తీసినప్పుడల్లా ఏదైనా ఒకటే ఐటం తీసేవాళ్ళు. అలా అవటం వల్ల ఏమీ అనుమానం వచ్చేడిది కాదు. వంద కట్టలో ఒక్కటి తీస్తే ఎలా గుర్తించగలము. వాడిది ముందే జువెల్లరీ షాప్.. అందుకే వాడు అంతలా కోల్పోయ్యాడు.

ఇప్పుడు అనుమానం వస్తే వాడు అన్నీ మార్చేస్తున్నాడు. వాడిప్పుడు ఈ నిజాన్ని నిజజీవితము లోని చాలా విషయాలకి వాడుతున్నాడు. ఇప్పుడు చాలా సంతోషముగా ఉన్నాడు. ఒకసారి వీలు చూసుకొని ఈ మంచి విషయం చెప్పిన అతనికి చిన్న పార్టీ ఇచ్చాడు. ఎందుకంటే అతడు చెప్పిన ఆ విషయం వల్ల వీడు ఇంకేమీ కోల్పోలేదు. అలా ఎందుకు ఇవ్వాలో ఆ విషయం కూడా త్వరలో వ్రాస్తాను.

సేం టూ సేం ఇలాటిదే ఇంకో కథ! ఇలాంటిదే మాకు తెలిసిన మిత్రునికి జరిగింది. వాడి తాళాలూ ఇలాగే పోయాయి. మార్చలేదు. ఆ కిరాణా షాప్ వాడి పనోడు వీలున్నప్పుడల్లా ఐదువందల రూపాయల నోటు మాతమే తీసేవాడు. ఒకవేళ లెక్క పెట్టినా ఒక్కటే తక్కువ వచ్చేడిది. ఏదైనా కష్టమర్ కి ఇచ్చాదనుకునేవాడు కాని పనివాడి మీద అనుమానం రాలేదు. ఆ పనోడు ఆదివారం రాగానే ఐమాక్స్, షాపింగ్ కాంప్లెక్స్ ల వెంటే ఉండేవాడు. ఆ యజమాని తరపు వాళ్ళు ఐమాక్స్ కీ, షాపింగ్ కాంప్లెక్స్ లకీ వస్తే ఆ పనోడు తరచుగా కనిపించాడు. అలా ఎలా ఉంటున్నాడు వాడి జీతమే ఆరువందలు.. ఆ ఖర్చేలా వస్తున్నది అని ఆలోచిస్తే అక్కడ దొరికాడు. ఆ పనివాడి ఇంటికి వెళ్లి వాడు పడుకునే కాయర్ పరపు క్రింద చూస్తే అన్నీ ఐదువందల నోట్లే! అవన్నీ లెక్కిస్తే రెండు లక్షల ఎనభై వేలు. మొత్తం ఐదు లక్షల వరకూ దొంగిలించానని ఒప్పుకున్నాడు. మిగతావి ఖర్చు చేసాడట! ఇక్కడ యజమానిదీ అదే పొరబాటు. తాళం చేతులు పోయాయని తాళం మార్చక పోవటం.

ఒక చిన్న పొరబాటు జీవితాన్ని ఎంత దెబ్బ తీస్తుందో!

No comments:

Related Posts with Thumbnails