Monday, November 9, 2009

పాదాభివందనం

పాదాభివందనం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయింది.

సినీ రంగములో, ముఖ్యముగా పాటల రంగములో ఇది మరీను.. నిజానికి ఇలా చేయటం మంచిదేనా.. అని అడిగితే నామటుకు నేను ఏమాత్రం సమర్థించను.. నాకు తెలిసినదేమిటంటే - మనం పూజలవల్లనో, దానాల వల్లనో, చేసే ఉపకారము వల్లనో.. పొందిన పుణ్యము మనలో ఉండిపోతుంది. అది ఆ వ్యక్తి ఆత్మలో ఇమిడిపోతుంది. మీకు స్వర్గం - నరకం, పుణ్యం - పాపం అన్న మాటల్లో నమ్మకం ఉందా?.. ఉంటే మనం చనిపోయాక ఈ జన్మలో చేసిన పొరపాట్లకి "అక్కడ" ఫలితం అనుభవించాలి.. అక్కడ ఈ పుణ్యం, పాపం అవసరం అని ఏమైనా నమ్మకాలు మీకు గనుక ఉంటే పాదాభివందనములు చేయాల్సిన అవసరం లేదు.. నా ఎంపిక మాత్రం చేయవద్దనే అంటాను.

దీనివలన:
# మీ ఆత్మాభిమానాన్ని కొంత కోల్పోవాల్సివస్తుంది..

# అవతలి వారి మనసులో మీరంటే కొద్దిగా అనుమానం, చులకన ఏర్పడుతుంది. వీడేంట్రా! మరీ ఇంతగా కాళ్ళు మొక్కుతున్నాడు.. నాతో వాడికి ఏమి "పని" ఉందో? అనే అనుమానం.

# వీడొకడు.. ప్రతివాడి కాళ్ళు పట్టుకుంటాడు.. అనే చులకన భావం అవతలి వాళ్ళలో రావటం.

# గుంపులో ఉన్నప్పుడు మీరు మొక్కారని, మీ తోటివారు కూడా మేము అలా చేయకపోతే ఆ వ్యక్తి మనసులో అగౌరవ స్థానం పొందుతామేమోనని, వారూ పాదాభివందనాలు చేయటం - ఓ రివాజు లా మారుతుంది.

# అప్పటివరకూ మీరు ఏమైనా పుణ్య కార్యక్రమాలు చేసి, ఏమైనా పుణ్యం అంటూ ఏదైనా సంపాదించుకుంటే అది అవతలివారికి ఉత్తి పుణ్యానికే వారి ధారపోయటం.. అంటే కష్టం మనది.. తేలికగా కొట్టేయడం వారి వంతు.

# వారేమీ మిమ్మల్ని బలవంతముగా కాళ్ళు మొక్కించికోవటం లేదుగా.. మనంతటమనముగా ఆ పనిని చేస్తున్నాముగా.. అంటే మనంతట మనముగా అవతలి వ్యక్తికి లోంగిపోతున్నాము. ఇక ఇప్పుడు అలా చెయ్యాలో చేయవద్దో ఆలోచించుకోవటం ఇక మీ వంతు..

2 comments:

కొత్త పాళీ said...

ముందస్తుగా సినీ జీవితాల్లోనూ, అటుపైన రాజకీయ జీవితాల్లోనూ ఈ కాళ్ళకి మొక్కడం విరివిగా నడుతోంది.

Lavanya shalini said...

nenu diniki oppukonu
endukantay
pedda valla dagata ashirvadam tesukovali soo talli tandrulu
inka pedavalla dagara padabi vandanam chayadam paddathi ......

Related Posts with Thumbnails