చిత్రం: ఆర్య -2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రచన: వనమాలి
పాడిన వారు: కునాల్ గుంజనవాలా, మేఘ
****************
పల్లవి:
కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..
అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..
గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ..
కరిగేలోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..
అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..
చరణం 1:
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను..
నిదురను దాటీ నడిచిన ఓ కల నేను..
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను..
నా ప్రేమే నేస్తం అయ్యిందా.. ఓ
నా సగమేదో ప్రశ్నగా మారిందా.. ఓ
నేడు బంధానికి పేరుందా.. ఓ
ఉంటే విడదేసే వీలుందా ఓ.. //కరిగే లోగా ఈ క్షణం //
చరణం 2:
అడిగినవన్నీ కాదని పంచిస్తూనే..
మరు నిముషంలో అలిగే పసివాడివిలే..
నీ పెదవులపై వాడని నవ్వుల పూవే..
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ ..
నా బాధంతటి అందంగా ఉందే ఓ..
ఈ క్షణం ఈ నూరెల్లవుతాను అంటే ఓ..
మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ.. // కరిగే లోగా ఈ క్షణం //
4 comments:
ఈ మద్య వచ్చినవాటిల్లో ఈ పాట బాగ నచ్చింది. thanks for the lyrics :)
నాకు కొన్ని అర్దం కాలేదు....
"ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ.."
గాయం గమ్యం అవ్వడమంటే ఏంటి?
నీ పెదవులపై వాడని నవ్వుల పూవే.. నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి.....
ఈ లైను చాలా బాగుంది....
అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..
గడిచే నిమిషన్ గాయమై. = ఇలా ఆ పరిస్థితిలో..గడిచే ప్రతి నిముషమూ ఒక మదిలో గాయమై (భగ్న ప్రేమికులకి) ఉంటుందని ఆ రచయిత భావం కాబోలు..
నేను ఆ తర్వాతి లైను గురించి అడిగా....మీరు దాని పై లైను గురించి మాట్లాడుతున్నారు...
Post a Comment